మాడ్రిడ్: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఇళ్ల సమస్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో, ఏటా జరిగే సంప్రదాయ మాడ్రిడ్ ఫెస్టివల్ మార్గం ఈసారి మారిపోయింది. పశువులను కొత్త మేత ప్రదేశాలకు తరలించే ప్రాచీన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాల్లో వేల సంఖ్యలో గొర్రెలు, మేకలను తోలుకొస్తుంటారు.
దీనిని తిలకించేందుకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో స్థానికులతోపాటు పర్యాటకులు ఆదివారం వచ్చారు. మేకలు, గొర్రెలు ప్యూర్టా డెల్ సోల్ మీదుగా వీధుల్లో సాగాల్సి ఉంది. అయితే, ఇక్కడ ఇళ్ల సంక్షోభంపై నిరసనలు జరుగుతున్నాయి. దీంతో, అధికారులు వేరే మార్గంలో పశువులను తరలించారు. 1994 నుంచి మాడ్రిడ్‌లో ట్రాన్స్‌హ్యూమేన్స్ ఫెస్టివల్ పేరిట ఈ వేడుక జరుగుతోంది.
రూటు మారిన జీవాల ఉత్సవం
Oct 26 2026 2:29 AM | Updated on Oct 26 2026 2:29 AM
Advertisement


