అట్టుడుకుతున్న అల్బేనియా.. ప్రధాని రాజీనామా కోరుతూ నిరసనలు | Albania protests enter 12th day as students clash with police demand Ramas exit | Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న అల్బేనియా.. ప్రధాని రాజీనామా కోరుతూ నిరసనలు

Oct 25 2026 7:58 AM | Updated on Oct 25 2026 7:59 AM

Albania protests enter 12th day as students clash with police demand Ramas exit

తిరానా: అల్బేనియా రాజధాని తిరానాలో ప్రధాని ఎడి రామా (Edi Rama) రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రతిపక్ష మద్దతుదారులు చేపట్టిన నిరసనలు 12వ రోజుకు చేరాయి. ఆందోళనకారులు విద్యా మంత్రిత్వ శాఖ భవనంపై రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఉద్రిక్తత నెలకొంది.

కేవలం విద్యార్థులే కాకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైస్కూల్ టీచర్లు, డాక్టర్లు, ఆర్టిస్టులు, ప్రముఖ ట్రేడ్ యూనియన్లు కూడా ఈ నిరసనల్లో అధికారికంగా భాగస్వామ్యమయ్యాయి. ప్రధాని కార్యాలయం వెలుపల గుమిగూడిన ఆందోళనకారులు, చర్చల కోసం ప్రధాని ఏర్పాటు చేసిన సీట్లను దగ్ధం చేసి, తమ నిరసనను తెలిపారు.

1990లలో కమ్యూనిజం పతనం తర్వాత బాల్కన్ దేశం నుండి 1.5 మిలియన్ల మందికి పైగా ప్రజలు వలస వెళ్లగా, ప్రస్తుతం అక్కడి జనాభా 2.3 మిలియన్లకు పడిపోయింది. పన్నుకు ముందు సగటు నెలసరి జీతం 930 యూరోలు ($1,026) గా ఉన్న ఈ దేశంలో, యువత విదేశాలకు వెళ్లకుండా స్వదేశంలోనే ఉపాధి అవకాశాలు, మంచి భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నారు.

ఈ నిరసనల వెనుక ఉన్న నిరుద్యోగం, విద్యా రంగంలోని సమస్యలు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రధాని ఎడి రామా మాత్రం ఈ అశాంతి వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ప్రధాని తన పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌తో నిరసనకారులు ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తున్నారు.

ఇదీ చదవండి: నేహా బోరా ఉదంతం: పీస్ బాండ్‌పై సంతకం చేయకుంటే జైలుకేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement