విషాదం నింపిన పారాగ్లైడింగ్ టూరిస్ట్‌ దుర్మరణం | Bulgarian Tourist Dies In Himachal Paragliding Crash Another Rescued | Sakshi
Sakshi News home page

విషాదం నింపిన పారాగ్లైడింగ్ : టూరిస్ట్‌ దుర్మరణం

Oct 26 2026 6:55 PM | Updated on Oct 26 2026 7:01 PM

Bulgarian Tourist Dies In Himachal Paragliding Crash Another Rescued

హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపింది. భారత పర్యటనకు వచ్చిన ఒక  విదేశీయుడు ధర్మశాలలో జరిగిన పారాగ్లైడింగ్ ప్రమాదంలో ఒక విదేశీ పర్యాటకుడు మరణించగా, మరో విదేశీయుడు గాయపడిన  ఘటన ఆందోళన రేకెత్తించింది.

మృతుడిని బల్గేరియా పౌరుడైన మాక్సిమ్ వాలెంటినోవిచ్ గావ్రిలిచెంకో  (Maxim Valentinovich Gavrilichenko)గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని కూడా బల్గేరియా పౌరుడే, స్టీఫెన్ ఆంటోనీగా గుర్తించారు. గావ్రిలిచెంకో అక్టోబర్ 7న టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చినట్టు తెలుస్తొంది.  ధర్మశాలలోని ఖనైరా సమీపంలో ఉన్న 'రైజింగ్ స్టార్ పీక్' వద్ద  ఆదిత్యవారం ఉదయం 11 గంటలకు వీరు బిర్ బిల్లింగ్ (Bir Billing) నుండి సోలో పారాగ్లైడింగ్ (Solo Paragliding) ద్వారా టేకాఫ్ అయ్యారు. సుమారు 2,700 మీటర్ల ఎత్తులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈదురు గాలుల వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. గావ్రిలిచెంకో వేగంగా నేలను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందగా, స్టీఫెన్ ఆంటోనీ ప్రాణాలతో బయటపడ్డారు.

ఇదీ చదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగం పందెంలో కవితకు ఓటమి

  సమాచారం అందుకున్న జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఇతర బృందాలు ఆదివారం రాత్రి 9 గంటలకు సహాయక చర్యలు ప్రారంభించాయి.అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలలో, కమ్యూనికేషన్ మరియు ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడం ద్వారా రాత్రంతా ఈ ఆపరేషన్ కొనసాగించి, సోమవారం ఉదయం 10 గంటలకు పూర్తి చేశారు. స్టీఫెన్ ఆంటోనీకి అవసరమైన సహాయం అందించి, హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఎయిర్‌లిఫ్ట్ చేశారు.ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement