ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే! | Asin Raising 9 Year Old Daughter Away From Screens Reveals Rahul Sharma | Sakshi
Sakshi News home page

ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!

Oct 26 2026 4:47 PM | Updated on Oct 26 2026 4:55 PM

Asin Raising 9 Year Old Daughter Away From Screens Reveals Rahul Sharma

ప్రముఖ   హీరోయిన్‌  అసిన్‌ (అసిన్ తోట్టుంకల్) గురించి తెలుగు సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నేడు (అక్టోబర్ 26న)  41వ వసంతంలోకి అడుగు పెట్టారు.  అలాగే అక్టోబర్ 23న ఆమె కుమార్తెకు తొమ్మిదేళ్లు నిండాయి. సౌత్‌తోపాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా  గుర్తింపు తెచ్చుకున్నారామె. కరియర్‌పీక్‌లో ఉండగానే  2016లో  మైక్రోమాక్స్ (Micromax) సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ( (Rahul Sharma)ను వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత  యాక్టింగ్‌ దూరమయ్యారు. తాజాగా అసిన్‌ రాహుల్‌ దంపతుల  ఏకైక కుమార్తె అరిన్ రేన్‌  శర్మ కు సంబంధించిన అంశం నెట్టింట వైరల్‌గా మారింది.  

భార్య అసిన్‌పై రాహుల్ శర్మ ప్రశంసలు!
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉటంకించిన ప్రకారం, జూలై 2025లో మైగవ్ ఇండియా  (MyGov India)కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాహుల్ శర్మ తన భార్య అసిన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తమ పాపం పెంపకానికి సంబంధించిన  కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు.  అసిన్‌ను పెళ్లి చేసుకోవడమే నా జీవితంలో జరిగిన అత్యంత ముఖ్యమైన విషయమనీ, తన జీవితంలోని ప్రతి దశలో ఆమె తనకు  ఎంతో  అండగా నిలిచిందని చెప్పారు. అలాగే  ఎలాంటి కష్టం వచ్చినా 'ఏమీ పర్వాలేదు.. ముందుకు సాగు' అని ధైర్యం చెప్తుందని తెలిపారు.  జీవిత భాగస్వామి మనల్ని వెనక్కి లాగేలా కాకుండా, పైకి లేపేలా ఉండాలి.  తనకు అసిన్  అలాంటి పార్టనరే. తన జీవితంలో ఆమె పాత్రను మాటల్లో చెప్పలేనని ఆమెపై  ప్రశంసలు కురిపించారు.

   12 భాషలలో నైపుణ్యం:   నో  స్క్రీన్ టైమ్ అలాగే తమ కుమార్తె అరిన్  ఏడేళ్ల  వయస్సులోనే (ఈ ఏడాది ఆమెకు 9 ఏళ్లు వచ్చాయి) కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ తో సహా దాదాపు 12 భాషల్లో మాట్లాడుతుందనీ,  స్టడీస్‌లో  టాప్‌లో  ఉందని రాహుల్‌ సంతోషాంగా చెప్పుకొచ్చారు. అరిన్‌కు ఇప్పటివరకు టీవీ గానీ, మొబైల్ ఫోన్లు గానీ ఇవ్వలేదు. కేవలం పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉండేలా అసిన్‌ జాగ్రత్త పడిందన్నారు. బహుశా అరిన్ పాఠశాలలో ఉన్న పుస్తకాల కంటే తమ ఇంట్లోనే ఎక్కువ పుస్తకాలు ఉంటాయని  పేర్కొన్నారు. అరిన్ 2వ తరగతి చదువుతున్నప్పటికీ, ఇంట్లో 8, 9 తరగతుల పుస్తకాలు అందుబాటులో ఉంచడంతోపాటు,ఇపుడే 10వ తరగతి బోర్డు పరీక్షలు కూడా రాయించేయవచ్చని రాహుల్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇలాంటి పెంపకం  అసిన్ వల్లే సాధ్యమైందన్నారు.

జపాన్‌లో 9వ పుట్టినరోజు వేడుకలు
అరిన్ రేన్, అక్టోబర్ 23న తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. జపాన్‌లో జరుపుకున్న పుట్టినరోజు వేడుకల ఫోటోలను అసిన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా, అరిన్ కిమోనో దుస్తుల్లో కనిపించింది. అక్కడ ఆమె జపనీస్ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు, నింజా విన్యాసాలను కూడా నేర్చుకుంది. అంతేకాకుండా, సుమో రెజ్లర్లతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.

కాగా 2020లో తన కుమార్తె మూడవ పుట్టినరోజు సందర్భంగా, ఆమె పేరు వెనుక ఉన్న అర్థాన్ని అసిన్ వెల్లడించారు 'అరిన్ రేన్' (Arin Rayn) అనే పేరును ఆమె తల్లిదండ్రుల పేర్లైన రాహుల్ ,అసిన్ పేర్ల కలయికతో రూపొందించారు. 'రేన్' (Rayn) అనే పదాన్ని 'రా-ఇన్' (Ra-in) అని పలకాలని. ఈ పేరు చిన్నగా, సరళంగా, లింగ భేదం లేనిదిగా (gender-neutral) ఉంటుందని  స్వయంగా అసిల్‌ వెల్లడించారు. అంతేకాకుండా, ఈ పేరు మతం, కులం లేదా పితృస్వామ్య భావనలకు అతీతంగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు కాగా .గజిని,  శివమణి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ మనసు దోచుకున్న అసిన్ చివరిసారిగా 2015లో వచ్చిన 'ఆల్ ఈజ్ వెల్' (All Is Well) కనిపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement