1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగం పందెంలో కవితకు ఓటమి | Barefoot Saree Runner Kavita Misses Selection Despite Clearing 1600m Race | Sakshi
Sakshi News home page

1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగం పందెంలో కవితకు ఓటమి

Oct 26 2026 6:24 PM | Updated on Oct 26 2026 6:51 PM

Barefoot Saree Runner Kavita Misses Selection Despite Clearing 1600m Race

హోంగార్డ్‌ ఉద్యోగం కోసం చీర కట్టుకుని, చెప్పులు లేకుండా పరిగెత్తి సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకున్న జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు బిడ్డల తల్లి కవితకు  నిరాశ ఎదురైంది.  ప్రభుత్వం ఉద్యోగాన్ని  సాధించాలన్న కోరికతో 1,600 మీటర్ల పరుగు పందాన్ని కేవలం 8 నిమిషాల 57 సెకన్లలోనే పూర్తి చేసినప్పటికీ ఆమె ఆశయం నెరవేరలేదు. నిర్ణీత సమయం (10 నిమిషాలు) కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ ఆ తర్వాతి రౌండ్‌లో విఫలం కావడంతో ఆమె ఉద్యోగ కల నెరవేరలేదు.

హైజంప్‌లో వైఫల్యం
రన్నింగ్ షూస్  లేకుండా, చెప్పులు లేకుండానే, అత్యంత ధైర్యంతో సాంప్రదాయ చీర కట్టుకుని,పరుగు పందెంలోనిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేసి రన్నింగ్ టెస్ట్ క్లియర్ చేశారు కవిత. కానీ హైజంప్ (High Jump) విఫలమైనారు.మూడు అవకాశాలిచ్చినప్పటికీ అవసరమైన ఎత్తును దాటలేకపోవడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ నియామక పరీక్షలో పాల్గొనడానికి మొత్తం 930 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: పెళ్లైన నాలుగు నెలలకే హోటల్‌ గదిలో అనంతలోకాలకు : భర్త పనేనా?
ఇటీవల సిద్ధో-కన్హు జిల్లా మైదానంలో 'అంకిత్ రన్నింగ్ అకాడమీ' నిర్వహించిన ట్రయల్ రన్‌లో కవిత  వెలుగులోకి వచ్చారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కనీస సదుపాయాలు లేపోయినా ఉత్త కాళ్లతోనే పరుగు పందెంలో పాల్గొన్న ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె రాత్రికి రాత్రే  వైరల్‌గా మారారు.భర్త మరణంతో ఇద్దరు పిల్లలను, వృద్ధులైన అత్తమామలను పోషించే బాధ్యత ఆమెపై పడింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం సాధించి, ఆర్థికంగా స్వతంత్రురాలిని కావాలని, తన కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశించి ఆమె ఈ నియామక పరీక్షకు హాజరైంది. ఆమె కథ వైరల్ కావడంతో చాలామంది ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు; దీనివల్ల ఆమె తన శిక్షణను కొనసాగించే అవకాశం లభించింది.

ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్‌ స్పెషాల్టీ ఇదే!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement