ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెళ్లైన నాలుగు నెలలకే ఒక నవ వధువు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన సోమవారం ఉదయం సుమారు 10:50 గంటలకు ఝాన్సీలోని రిషభ్ హోటల్‌లో జరిగింది. 47 సెకన్ల సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరణించిన మహిళను ముస్కాన్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇది హత్య అని ఆరోపిస్తుండగా, పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, పోస్ట్‌మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.
ఈ సీసీటీవీ క్లిప్‌లో దృశ్యాల ప్రకారం 28 ఏళ్ల ముస్కాన్, భర్త నిలేష్‌తో సహా ముగ్గురు వ్యక్తులు హోటల్ కారిడార్ గుండా నడుచుకుంటూ గది వైపు వెళ్లడం కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు గదిలోకి వెళ్లగా, వెనుక వస్తున్న ముస్కాన్ గది తలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా కిందపడిపోయింది. దానితో ఆమె భర్త వచ్చి ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బంది సాయంతో ఆటోలో ఆసుపత్రికి, అక్కడ నుండి జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ముందై పెళ్లైంది : కుటుంబ సభ్యుల ఆరోపణలు
అయితే దీనిపైముస్కాన్ తండ్రి రామ్‌జీ లాల్ అహిర్వార్ తన కుమార్తెను ఆమె భర్తే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న తన బిడ్డకు వివాహమైందని, అయితే నిలేష్‌కి ఇదివరకే పెళ్లయిందనే విషయం తమకు తెలిసిందని తండ్రి చెప్పారు. ఆ మొదటి భార్య ఇండోర్‌లో ఉంటుందని, ఆమెతో పోలుస్తూ తరచూ ముస్కాన్‌ను మానసికంగా వేధించేవాడని వాపోయారు. అంతేకాదు అక్టోబర్ 23 రాత్రి ఝాన్సీకి వచ్చిన నిలేష్, మరుసటి రోజు ముస్కాన్‌ను అత్తగారింటికి తీసుకెళ్తున్నానని చెప్పి, అత్తగారింటికి తీసుకెళ్లకుండా, నీలేష్ ఆమెను 'రిషభ్ హోటల్'కు తీసుకెళ్లాడని అహిర్వార్ ఆరోపించారు. అక్టోబర్ 23 నుండి అక్టోబర్ 24 వరకు హోటల్‌లో గది బుక్ చేసినట్టు తమకు తెలిసిందన్నారు. కాగా ముస్కాన్ పుట్టింటి వారు ఝాన్సీలో ఉండగా, ఆమె అత్తగారి ఇల్లు మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఉంది.
A newlywed bride, just 4 months into her marriage, collapses and dies within seconds at a hotel in Jhansi, UP. Her family alleges foul play and questions why her husband brought her to a hotel instead of the relative’s house he had reportedly mentioned. A CCTV clip can raise questions, but it cannot establish the cause of death on its own. The real questions are: What happened in those few seconds? What does the post-mortem reveal? And will the investigation uncover the truth, regardless of who is involved? A daughter was sent off with dreams of a new life. Her family deserves answers, not silence. #Jhansi https://t.co/LNecWErCeL
— Pinki (@PinkiPragya) October 26, 2026
ముస్కాన్ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో, పోలీసులు నీలేష్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. సిప్రి బజార్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్పీ (సిటీ) ప్రీతి సింగ్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: బుర్రకథకు పట్టాభిషేకం


