లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. 91వ మైలురాయి వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఆయన కాన్వాయ్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, భద్రతా సిబ్బందితో సహా పలువురికి గాయాలయ్యాయి.
VIDEO | Lucknow: Congress workers gather at Chaudhary Charan Singh Airport in Lucknow to welcome party MP Rahul Gandhi ahead of the Sultanpur court's verdict in the defamation case against him today. (Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/eVeqM55U9N
— Press Trust of India (@PTI_News) October 26, 2026
2018 నాటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పట్లోని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సోమవారం తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి నుండి రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పటికీ ఆయన కోర్టు కార్యకలాపాలకు హాజరయ్యేందుకు ముందుకు సాగారు.


