డిస్పూర్: అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ఆయన కేబినెట్ మంత్రులకు సంబంధించిన ఒక వినూత్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. రాజకీయ నాయకులను ఎప్పుడూ సీరియస్‌గా చూసే ప్రజలకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)సృష్టించిన సంచలన వీడియో సరికొత్త వినోదాన్ని పంచుతోంది.
ఈ వీడియోలో సీఎం హిమంత బిస్వ శర్మతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులంతా కలిసి సౌత్ కొరియన్ ప్రముఖ గాయకుడు పీఎస్‌వై పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ పాటకు డ్యాన్స్ చేయడం విశేషం. ఈ పాటలోని అత్యంత పాపులర్ అయిన హార్స్-రైడింగ్ (గుర్రంపై కూర్చున్నట్లుగా చేసే) సిగ్నేచర్ స్టెప్పులను నాయకులు వేస్తున్నట్లుగా ఏఐ ద్వారా తీర్చిదిద్దారు.
Assam Chief Minister Himanta Biswa Sarma and his cabinet ministers surprised internet users by sharing a fun AI-generated Gangnam Style dance video online. The hilarious clip, featuring playful face-swapping and energetic moves, went viral across social media, showcasing a lighter, more entertaining side of state political leadership right now. More on https://t.co/Yz2reD0jdz
— NDTV (@ndtv) October 25, 2026
అసలు నిజ జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రముఖ రాజకీయ నాయకులు ఇలా పాశ్చాత్య పాప్ సాంగ్‌కు చిందులు వేయడం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సరదా క్లిప్ సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ అయి లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఒక దశాబ్దం క్రితం ప్రపంచాన్ని ఊపేసిన 'గంగ్నమ్ స్టైల్' పాట విభిన్న నృత్యరీతులతో యూట్యూబ్‌లో ఏకంగా ఒక బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. నాటి ఆ గ్లోబల్ సెన్సేషన్‌ను ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సహాయంతో మన దేశంలోని నాయకులకు అపాదించి సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. విభిన్నమైన కంటెంట్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ముందుండే ఇలాంటి సృజనాత్మక ప్రయోగాలు రాబోయే రోజుల్లో నెటిజన్లను మరింతగా అలరించడం ఖాయమని ఈ వైరల్ వీడియో మరోసారి నిరూపించింది.
ఇదీ చదవండి: ఏఐతో చావు నాటకం.. మేకను చంపి తప్పించుకున్న హంతకుడు!


