ai ఫోటో
మంచిర్యాల జిల్లా: వినాయక నిమజ్జనోత్సవంలో భర్త మరో మహిళతో కలిసి నృత్యం చేయడాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీసుస్టేషన్ పరిధి దొడ్డిగూడలో చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దొడ్డిగూడ పక్కనే ఉన్న సోనాపూర్‌లో ఈ నెల 23న రాత్రి వినాయక నిమజ్జనోత్సవం జరిగింది.
దొడ్డిగూడకు చెందిన రాయిసిడాం సంధ్య (23) భర్త జంగు మద్యంమత్తులో మరో యువతితో కలిసి నృత్యం చేశాడు. ఇది చూసిన సంధ్య తట్టుకోలేక పోయింది. 24న ఉదయం జంగు సోనాపూర్‌లోని వినాయక మండపం తీసేయడానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. చికిత్స పొందుతూ సంధ్య శుక్రవారం ఉదయం చనిపోయింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


