ముంబై: ప్రముఖ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ ‘బిగ్ బాస్ 20’(హిందీ) హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. దీనితో ఈ రియాలిటీ షోలో ఆమె ఏడు వారాల పాటు సాగిన ప్రయాణం ముగిసింది. ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్‌కు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి అతిథి హోస్ట్‌గా విచ్చేశారు. రెండు లైఫ్‌లైన్‌లను కోల్పోయిన మేరీ కోమ్ ఎలిమినేషన్‌ను ఆయన ప్రకటించారు.
షో నుండి బయటకు వస్తూ మేరీ కోమ్ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇన్ని రోజులు ఆడగలిగానని, ఎంతో అనుభవం సంపాదించానని ఆమె తెలిపారు. ఇప్పుటు హౌస్‌లోని అందరూ తనను మిస్ అవుతారని అనుకుంటున్నానని, మిగతా కంటెస్టెంట్లు మంచిగా ఆడి తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాకుండా, సరదాగా ‘రింగ్‌లో అయితే నేను ఎవరినీ వదిలిపెట్టను’ అని చమత్కరించారు.
మేరీ కోమ్ ఎలిమినేషన్ హౌస్‌లోని తోటి కంటెస్టెంట్లను భావోద్వేగానికి గురిచేసింది. ఆమె వీడ్కోలు సమయంలో ఆమ్రపాలి దూబే కంటతడి పెట్టుకున్నారు. అందరూ కలిసి ఏకకంఠంతో ‘యూ ఆర్ ఎ ఛాంపియన్’ పాటను పాడుతూ ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. దీంతో మేరీ ముఖంలో చిరునవ్వు విరిసింది. బాక్సింగ్ రింగ్‌లో తన విజయాలతో గుర్తింపు పొందిన మేరీ కోమ్, 'బిగ్ బాస్ 20' లోనూ అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచారు. కిచెన్ విశేషాలు, తోటి కంటెస్టెంట్లతో కలిసి చేసిన వర్కౌట్లు, సరదా సంభాషణలతో ఆమె ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ ‘బిగ్ బాస్ 20’ షో సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఈ షో రాత్రి 9 గంటలకు జియోహాట్‌స్టార్‌లో , రాత్రి 10:30 గంటలకు కలర్స్ ఛానెల్‌లో ప్రసారమవుతోంది.
ఇదీ చదవండి: సెర్బియా విద్యార్థి ఉద్యమం.. 14 ఏళ్ల పూచిక్ పాలన అంతం!


