చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌.. ర‌గ్బీలో చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌ | India-Women's Rugby Team Made History-Beat-NZ-17-0-U20 Tourney | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌.. ర‌గ్బీలో చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌

Oct 28 2026 12:09 PM | Updated on Oct 28 2026 12:35 PM

India-Women's Rugby Team Made History-Beat-NZ-17-0-U20 Tourney

PC: X (Twitter)

ర‌గ్బీ ఆట‌కు మారుపేరైన న్యూజిలాండ్‌కు భార‌త్ ఊహించ‌ని షాక్ ఇచ్చింది. మ‌న అమ్మాయిల బృందం 17-0తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి చ‌రిత్ర సృష్టించింది. బీహార్‌లోని రాజ్‌గిరి స్పోర్ట్స్ క్లాంపెక్స్‌లో జ‌రిగిన భార‌త అండ‌ర్‌-20 మ‌హిళ‌ల ర‌గ్బీ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. 

భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య వందేళ్ల క్రీడా సంబంధాల‌ను పుర‌స్క‌రించుకొని రెండు దేశాల మ‌ధ్య పురుషుల‌, మ‌హిళ‌ల విభాగాల్లో అండ‌ర్‌-20 ర‌గ్బీ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చారిత్రక మ్యాచ్‌లో ర‌గ్బీ మాజీ చాంపియ‌న్స్ అయిన న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భార‌త్‌కు ఇది పెద్ద ఘ‌న‌త‌గా అభివ‌ర్ణించొచ్చు. 


PC: X (Twitter)

మ్యాచ్ విష‌యానికొస్తే.. ఆట తొలి అర్థ‌భాగంలోనే 12 పాయింట్లు సాధించిన భార‌త్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం సంపాదించింది. ఆ త‌ర్వాత కూడా చివ‌రి విజిల్ వ‌ర‌కు త‌మ ఆధిక్యాన్ని నిలుపుకుంది. భారత్ తరఫున 15వ నంబర్ జెర్సీ ధ‌రించిన ప్లేయ‌ర్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. న్యూజిలాండ్ లాంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టును త‌మ అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఒక్క పాయింట్ రాకుండా నిలువ‌రించగ‌లిగింది. 


PC: X (Twitter)

అయితే భార‌త పురుషుల ర‌గ్బీ జ‌ట్టు మాత్రం 0-32 తేడాతో న్యూజిలాండ్ చేతిలో దారుణ ప‌రాజయాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఈ ఈవెంట్ భారత్, న్యూజిలాండ్‌ల మధ్య క్రీడా సంబంధాలను కూడా బలోపేతం చేసింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement