Photo Credit: Twitter
జింబాబ్వేతో మొదలైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్ శుభారంభం చేసింది. రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (30 పరుగులు, 2 వికెట్లు)తో తొలి టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 37 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఫ్గన్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 19.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది.
66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆఫ్గన్‌ను షాహిదుల్లా కమల్ (46), అహ్మద్ అహ్మద్‌జయ్ (52) ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 29 బంతుల్లో 57 పరుగులు జోడించడంతో అఫ్గానిస్తాన్ 150 పరుగుల మార్క్‌ను దాటింది. ఆఖర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 30 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు) జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోయడంతో ఆఫ్గన్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో నాలుగు సిక్సర్లు బాదడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.
జింబాబ్వే బౌలర్లలో నైమూరి 4 వికెట్లు తీయగా, బ్రాడ్ ఎవన్స్, ఎర్నెస్ట్ మసుకు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. రెయాన్ బర్ల్ (32), ఇన్నోసెంట్ కాయా (24) పర్వాలేదనిపించారు. ఆఫ్గన్ బౌలర్లలో ఫజల్లా ఫరుకీ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్, అజ్మతుల్లా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రేపు జరగనుంది.
6️⃣. 6️⃣. 6️⃣. 6️⃣! 💥🔥 Just Rashid Khan things! 🦁 #AfghanAtalan | #AFGvZIM | #GloriousNationVictoriousTeam https://t.co/WeuDMWF0Mu
— Afghanistan Cricket Board (@ACBofficials) October 27, 2026
ఇదీ చదవండి:


