భారత్‌ 13 బంగ్లాదేశ్‌ 0 | India open campaign with a 13-0 win over Bangladesh In Asian Champions Trophy | Sakshi
Sakshi News home page

భారత్‌ 13 బంగ్లాదేశ్‌ 0

Oct 28 2026 5:42 AM | Updated on Oct 28 2026 5:42 AM

India open campaign with a 13-0 win over Bangladesh In Asian Champions Trophy

జలంధర్‌: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో భారత జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్‌ టీమిండియా 13–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున మన్‌దీప్‌ సింగ్‌ (3వ, 10వ, 54వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేశాడు. 

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (2వ, 44వ ని.లో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (43, 44వ ని.లో), వైస్‌ కెపె్టన్‌ హార్దిక్‌ సింగ్‌ (60వ, 60వ నిమిషంలో) రెండు గోల్స్‌ చొప్పున చేశారు. శిలానంద్‌ లాక్రా (15వ ని.లో), అభిషేక్‌ (18వ ని.లో), నీలకంఠ శర్మ (26వ ని.లో), జుగ్‌రాజ్‌ సింగ్‌ (46వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. భారత జట్టు తమకు లభించిన ఎనిమిది పెనాల్టీ కార్నర్‌లలో ఐదింటిని గోల్స్‌గా మలిచింది. తొలి రోజు జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మలేసియా 5–4తో చైనాపై, జపాన్‌ 3–2తో దక్షిణ కొరియాపై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో మలేసియాతో కొరియా; బంగ్లాదేశ్‌తో జపాన్‌; చైనాతో భారత్‌ తలపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement