భువీ కీలక నిర్ణయం | Bhuvneshwar Kumar Confirms Commitment To Domestic Tournaments After NZ T20Is | Sakshi
Sakshi News home page

భువీ కీలక నిర్ణయం

Oct 27 2026 8:06 PM | Updated on Oct 27 2026 8:10 PM

Bhuvneshwar Kumar Confirms Commitment To Domestic Tournaments After NZ T20Is

source: X

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి, ప్రస్తుత న్యూజిలాండ్‌ పర్యటనలో దారుణంగా విఫలమవుతున్న భువనేశ్వర్‌ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు దేశవాళీ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్‌తో మూడో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం లభిస్తున్న అవకాశాలతో సంతోషంగా ఉన్నాను. ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడతాను. విజయ్ హజారే ట్రోఫీ అయినా, ముస్తాక్ అలీ టోర్నీ అయినా ఆడేందుకు ఎదురుచూస్తున్నానని అన్నాడు.

ఇదే సందర్భంగా భువీ న్యూజిలాండ్‌ సిరీస్‌లో బ్యాటర్ల ఆధిపత్యంపై స్పందించాడు. బ్యాటర్ల ఆధిపత్యం పెరిగినప్పటికీ బౌలర్లకు ఆటపై నియంత్రణ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

కాగా, ప్రస్తుత న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో భువీ ఘోరంగా విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒకే వికెట్ తీశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ 40కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో ఇవాళ జరిగిన మూడో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం​ సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగా.. భారత్‌ 13.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్‌ శర్మ (38 బంతుల్లో 113; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

ఇదీ చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement