శ్రేయస్ అయ్యర్ (PC: BCCI/Sonysports)
న్యూజిలాండ్ గడ్డ మీద టీమిండియా సత్తా చాటింది. వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం నాటి మూడో టీ20లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో కివీస్‌తో మూడో టీ20లో గెలుపు అనంతరం భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశారని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్థాయి విధ్వంసాన్ని తానెప్పుడూ చూడలేదని కొనియాడాడు.
అత్యద్భుతం.. సంజూ, నేను ఆశ్చర్యపోయాం
ఈ మేరకు.. ‘‘వాళ్లిద్దరు (అభిషేక్, వైభవ్) షాట్లు ఆడుతుంటే కన్నులపండుగలా అనిపించింది. నిజంగా అత్యద్భుతం. సంజూ, నేను బ్యాటింగ్‌కు వెళ్లినపుడు సీమ్ ఎక్కువగానే ఉంది. బంతి స్వింగ్ అవుతోంది. అయినా సరే.. వీళ్లిద్దరు ఇంత బాగా ఎలా బ్యాటింగ్ చేశారా? అని ఆశ్చర్యపోయాము.
మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంతకంటే ఇంకేం చెప్పగలము. ఐదు ఓవర్లలోనే వంద పరుగులు రాబట్టడం.. వాహ్.. అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్‌ను నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఇదొక గొప్ప విషయం.
విదేశీ గడ్డ మీద ఆడుతున్నపుడు దూకుడుగా ఉండాల్సిందే. పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌలర్లు వైవిధ్యం ప్రదర్శించగలరు. అప్పుడు బ్యాటింగ్ చేయడం సవాలుగా మారుతుంది.
Nothing's going right for the Kiwis! 😬 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/M6nXv026Hp
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
మా బౌలర్లు కూడా బాగానే కష్టపడ్డారు
ఏదేమైనా అభిషేక్, వైభవ్ అద్భుతంగా ఆడారు. మంచు కూడా ప్రభావం చూపింది. మా బౌలర్లు కూడా బాగానే కష్టపడ్డారు. ఎక్కువగా యార్కర్లు వేయమనే చెప్పాను. ఎలాగైనా కివీస్ బ్యాటర్లను కట్టడి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాము.
రన్‌రేటును తొమ్మిది నుంచి ఎనిమిదికి తగ్గించడంలో సఫలమయ్యాము. 200 పరుగులలోపే వారిని కట్టడి చేయగలిగాము. మిగతా రెండు మ్యాచ్‌లలోనూ మేము ఇలాగే ఆడి గెలుస్తామని ఆశిస్తున్నా’’ అని శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు.
43 బంతుల్లో 133 పరుగుల భాగస్వామ్యం
కాగా భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం (38 బంతుల్లో 113) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ మెరుపు (19 బంతుల్లో 45) ఇన్నింగ్స్ ఆడి.. విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 43 బంతుల్లో 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈమ్యాచ్‌లో సంజూ 18 పరుగులు చేయగా.. శ్రేయస్ ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు.
Call it clinical. Call it classic. Call it Team India. 💙 Watch the HERO VIDA India Tour of New Zealand, 4th T20I, 30th Oct, 11:30am onwards, LIVE on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/SzfMSaegiy
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
ఇవీ చదవండి: చెలరేగిన అభిషేక్- వైభవ్.. టీమిండియా ప్రపంచ రికార్డు
చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్.. అభిషేక్ రికార్డు బ్రేక్


