వైభవ్ సూర్యవంశీ- అభిషేక్ శర్మ (PC: BCCI X)
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అభిషేక్ పరుగుల వరద పారించగా.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో అతడికి సహకారం అందించాడు.
సరికొత్త ప్రపంచ రికార్డు
ఈ ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది.
కాగా వెల్లింగ్‌టన్ వేదికగా మంగళవారం నాటి మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది.
15 బంతుల్లోనే అర్ధ శతకం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ కూడా ధనాధన్ దంచికొట్టాడు. పవర్ ప్లే అంటే.. ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి అభిషేక్ 20 బంతుల్లో 67, వైభవ్ 17 బంతుల్లో 44 పరుగులు సాధించారు.
15 BALLS. HALF-CENTURY. ZERO BRAKES. 💥 Abhishek Sharma is taking the game away from New Zealand at a ridiculous pace! Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు
ఈ క్రమంలో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు సాధించింది. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు.
ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు.
ABHISHEK SHARMA, YOU ABSOLUTE MENACE! 🤯 A 35-ball hundred. Let that sink in! 💯 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/OvOMf1rIsy
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
వైభవ్ కూడా అదుర్స్
మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 45 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 43 బంతుల్లో 133 పరుగుల జోడించారు.
ఓపెనర్ల అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఈ మ్యాచ్‌లో కేవలం 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. శతక వీరుడు అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో పవర్ ప్లేలో వందకు పైగా పరుగులు సాధించిన జట్లు
👉భారత్- 2026లో వెల్లింగ్‌టన్ వేదికగా న్యూజిలాండ్ మీద 118/0
👉రొమేనియా- 2021లో సోఫియా వేదికగా సెర్బియా మీద 116/0 (5.4 ఓవర్లలోనే)
👉ఆస్ట్రేలియా- 2024లో ఎడిన్‌బర్గ్ వేదికగా స్కాట్లాండ్ మీద 113/1
👉జింబాబ్వే- 2024లో నైరోబి వేదికగా గాంబియా మీద 103/1
👉సౌతాఫ్రికా- 2023లో సెంచూరియన్ వేదికగా వెస్టిండీస్ మీద 102/0
👉ఇంగ్లండ్- 2025లో ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా సౌతాఫ్రికా మీద 100/0
👉భారత్- 2026లో ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్ మీద 100/0
#TeamIndia take an unassailable 3-0 lead in the five-match series! 💙 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/57kiddW9ez
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
ఇవీ చదవండి: అభిషేక్ విధ్వంసకర సెంచరీ, వైభవ్ ధనాధన్.. సిరీస్ భారత్ కైవసం
చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్.. అభిషేక్ రికార్డు బ్రేక్


