న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు విధించిన 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గెలిచి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
డారిల్ మిచెల్ మెరుపు అర్ధ శతకం
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి రెండు టీ20లు గెలిచిన భారత్.. వెల్లింగ్‌టన్ వేదికగా మంగళవారం నాటి మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు సాధించింది.
న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ (2) విఫలం కాగా.. ఫిన్ అలెన్ (25 బంతుల్లో 40) మెరుగ్గా రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డారిల్ మిచెల్ మెరుపు అర్ధ శతకం (52 బంతుల్లో 89 నాటౌట్)తో అదరగొట్టగా.. ఆఖర్లో బేవాన్ జేకబ్స్ (23 బంతుల్లో 39 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
15 BALLS. HALF-CENTURY. ZERO BRAKES. 💥 Abhishek Sharma is taking the game away from New Zealand at a ridiculous pace! Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
అభిషేక్ విధ్వంసకర సెంచరీ, వైభవ్ ధనాధన్
ఇక కివీస్ విధించిన 199 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా అదరగొట్టింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.
ABHISHEK SHARMA, YOU ABSOLUTE MENACE! 🤯 A 35-ball hundred. Let that sink in! 💯 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/OvOMf1rIsy
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
ఈ క్రమంలో 35 బంతుల్లోనే అభిషేక్ శర్మ శతక్కొట్టాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ తొమ్మిది ఫోర్లు, పదకొండు సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు. అయితే, కైలీ జెమీషన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
హాఫ్ సెంచరీ మిస్
మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 19 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 45 పరుగులు చేశాడు. అయితే, మాథ్యూ ఫిషర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో హాఫ్ సెంచరీ చేయకుండానే వైభవ్ వెనుదిరగాల్సి వచ్చింది.
Vaibhav Sooryavanshi is putting on a show Wellington won’t forget anytime soon! 💥 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/0qZoxvrNRY
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
అభిషేక్, వైభవ్ అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా పవర్ ప్లే (ఆరు ఓవర్లు)లోనే ఏకంగా 118 పరుగులు రాబట్టింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 43 బంతుల్లోనే ఏకంగా 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో సగం ఇన్నింగ్స్ ముగిసే సరికే టీమిండియా విజయానికి చేరువ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ (13 బంతుల్లో 18), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) నిరాశపరిచారు. విజయానికి నాలుగు పరుగులు అవసరమైన వేళ జెమీషన్ బౌలింగ్‌లో సంజూ బౌల్డ్ కాగా.. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (1 నాటౌట్)కు తోడుగా వచ్చిన నమన్ ధీర్ (4 నాటౌట్) ఫోర్ బాది విజయ లాంఛనం పూర్తి చేశాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్.. అభిషేక్ రికార్డు బ్రేక్


