నొప్పితో విలవిల్లాడిన తిలక్ (PC: Sonyliv/x)
న్యూజిలాండ్‌తో మూడో టీ20 సందర్భంగా టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ.. అతడు మైదానం వీడగా... కుమార్ కుశాగ్రా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి రెండు టీ20లలో శ్రేయస్ అయ్యర్ సేన విజయం సాధించింది.
ఓడిపోయే మ్యాచ్‌లో గెలిపించాడు
ఇక రెండో టీ20లో తిలక్ వర్మ (26 బంతుల్లో 51 నాటౌట్) అద్భుత రీతిలో రాణించి ఓడిపోయే మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. వెల్లింగ్‌టన్ వేదికగా మంగళవారం నాటి మూడో టీ20లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Arshdeep Singh back at it, delivering an early breakthrough right on cue! 🎯 Watch the HERO VIDA India Tour of New Zealand, 3rd T20I, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/nYbwogUfHV
— Sony Sports Network (@SonySportsNetwk) October 27, 2026
మోకాలికి బలంగా తాకిన బంతి
ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగగా.. రెండో ఓవర్ రెండో బంతికే అర్ష్‌దీప్ సింగ్.. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (2)ను అవుట్ చేశాడు. ఇదిలా ఉంటే.. మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బంతితో రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్‌లో రెండో బంతికి ఫిన్ అలెన్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
ఎక్స్ ట్రా కవర్ దిశగా అలెన్ బంతిని బాదగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ మోకాలికి బలంగా తాకింది. దీంతో తిలక్ నొప్పితో విలవిల్లాడుతూ కుంటుకుంటూ మైదానం వీడాడు. అతడి స్థానంలో కుమార్ కుశాగ్రా మైదానంలోకి వచ్చాడు. అయితే, కాసేపటికే తిలక్ వర్మ నొప్పి నుంచి ఉపశమనం పొంది మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో అభిమానులతో పాటు భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది.
https://t.co/fKlEjqcEFW
— crictalk (@crictalk7) October 27, 2026
మూడో టీ20కి భారత తుదిజట్టు
సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
న్యూజిలాండ్ తుదిజట్టు
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జేకబ్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాథ్యూ ఫిషర్, కైల్ జేమిసన్, ఆడమ్ మిల్నే, జేకబ్ డఫీ.
చదవండి: IND vs NZ: భారత జట్టుకు ఊహించని షాక్!.. గెలిచే మ్యాచ్ చేజారింది


