NZ Vs IND 3rd T20 Updates:
తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ మెరిశాడు. 2 పరుగులు చేసిన ఓపెనర్ టిమ్ సీఫెర్ట్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమయ్యింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ శ్రేయస్ తెలిపాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌కు మూడు మార్పులతో బరిలోకి దిగింది. మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, లోకీ ఫెర్గూసన్ స్థానాల్లో మాథ్యూ ఫిషర్, కైల్ జేమిసన్, ఆడమ్ మిల్నే తుది జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
టీమిండియా: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాథ్యూ ఫిషర్, కైల్ జేమిసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ
2-0తో ఆధిక్యంలో భారత్
వరుసగా తొలి రెండు టీ20ల్లో టీమిండియా 226, 181 పరుగుల లక్ష్యాలను ఛేదించి 2–0తో పైచేయి సాధించింది. మూడో మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శించి సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకోవాలని చూస్తోంది. గత రెండు సిరీస్‌లలో భారత్ 5–0, 1–0తో విజయం సాధించింది.
మ్యాచ్ జరిగి 20 ఏళ్లు..
మరోవైపు స్వదేశంలో తిరుగులేని జట్టుగా కనిపించే కివీస్ సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడింది. ఈ మ్యాచ్‌లోనైనా ఆ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందా అనేది చూడాలి. ‘ప్రపంచంలో అత్యంత వేగంగా గాలులు వీచే’ నగరంగా గుర్తింపు ఉన్న వెలింగ్టన్‌లో రాత్రి పూట (స్థానిక సమయం 8 గంటలు) చలితో గాలి మరింత ప్రభావం చూపిస్తుంది.
దీనిని అధిగమించి పరుగులు సాధించడం, బౌలింగ్ చేయడం భారత్‌కు పెద్ద సవాల్. మ్యాచ్ వేదిక అయిన హెన్రీ స్టేడియంలో పిచ్ ఇరు వైపుల బౌండరీలు బాగా చిన్నవే అయినా భారీ స్కోర్లు తక్కువే నమోదయ్యాయి. ఈ మైదానంలో పురుషుల అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరిగి 20 ఏళ్లు దాటింది.
ఇదీ చదవండి:


