న్యూజిలాండ్‌తో టెస్టు.. విజయం దిశగా భారత్‌ | IndiaA Team-Inch Close-To-Get-Win-1st-Unofficial Test Vs NZA | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో టెస్టు.. విజయం దిశగా భారత్‌

Oct 27 2026 8:03 AM | Updated on Oct 27 2026 8:21 AM

IndiaA Team-Inch Close-To-Get-Win-1st-Unofficial Test Vs NZA

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఇండియ-ఏ జట్టు విజయానికి చేరువలో ఉంది. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 33 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ కర్టిస్ హీఫె (51), క్రిస్టియన్‌ క్లార్క్‌ (1) క్రీజులో ఉన్నారు. అకిబ్ నబీ మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ, అన్షుల్‌ కంబోజ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 516 పరుగులకు ఆలౌటయ్యింది. 8 వికెట్ల న‌ష్టానికి 488 ప‌రుగుల క్రితం రోజు స్కోరుతో ఆఖరి రోజు ఆట మొదలుపెట్టిన భారత్ మరో 28 పరుగులు జత చేసింది. సుందర్ (52) వెంటనే ఔటవ్వగా, చివర్లో ఆకాశ్ దీప్ (17 బంతుల్లో 25 నాటౌట్, ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులతో భారత్ 500 పరుగుల మార్క్‌ను దాటింది.

వర్షం ముప్పు పొంచి ఉండడంతో మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే తొలి సెషన్‌లో ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ప్రస్తుతం రెండో సెషన్ నడుస్తుండగా, మరో సెషన్ మిగిలి ఉంది. మరి భారత బౌలర్లు విజృంభించి కివీస్‌ను ఆలౌట్ చేసి విజయాన్ని అందుకుంటారా లేక మ్యాచ్ డ్రాగా ముగుస్తుందా అన్నది చూడాలి. 

ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. అయితే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ (199), సాయి సుదర్శన్ (91), యశ్ రాథోడ్ (66), సుందర్ (52) రాణించడంతో భారత-ఏ జట్టు కివీస్ ముంగిట భారీ టార్గెట్‌ను ఉంచగలిగింది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement