ఖాళీ చేతులతో... | Indian wrestlers are set to return empty handed from the wrestling championship | Sakshi
Sakshi News home page

ఖాళీ చేతులతో...

Oct 27 2026 2:45 AM | Updated on Oct 27 2026 2:45 AM

Indian wrestlers are set to return empty handed from the wrestling championship

అస్తానా (కజకిస్తాన్‌): ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల గ్రీకో రోమన్‌ స్టయిల్‌ రెజ్లర్లు ఖాళీ చేతులతో తిరిగి రానున్నారు. ఈ మెగా టోర్నీలో భారత్‌ నుంచి పది మంది గ్రీకో రోమన్‌ రెజ్లర్లు పోటీపడగా... లలిత్‌ సెహ్రావత్‌ (55 కేజీలు) మినహా మిగతా తొమ్మిది మంది తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సోమవారం బరిలోకి దిగిన సునీల్‌ కుమార్‌ (87 కేజీలు), సాహిల్‌ (63 కేజీలు), సచిన్‌ సెహ్రావత్‌ (67 కేజీలు) నిరాశ పరిచారు.

ఇటీవల ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన సునీల్‌ కుమార్‌ 0–9తో ముకుబు (నార్వే) చేతిలో, సాహిల్‌ 0–7తో ఎడ్మండ్‌ అర్మెన్‌ నజార్యన్‌ (బల్గేరియా) చేతిలో, సచిన్‌ 5–6తో హాన్‌జే చుంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. నేటి నుంచి మహిళల ఫ్రీస్టయిల్‌ బౌట్‌లు మొదలవుతాయి. భారత్‌ నుంచి నీలమ్‌ (50 కేజీలు), రజ్నిత (65 కేజీలు), కాజల్‌ (76 కేజీలు), నేహా శర్మ (57 కేజీలు) ఈరోజు బరిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement