కాంస్య పతక బౌట్‌లో లలిత్‌ పరాజయం | Indian wrestler Lalit faced disappointment in the bronze medal bout | Sakshi
Sakshi News home page

కాంస్య పతక బౌట్‌లో లలిత్‌ పరాజయం

Oct 26 2026 4:21 AM | Updated on Oct 26 2026 4:21 AM

Indian wrestler Lalit faced disappointment in the bronze medal bout

అస్తానా (కజకిస్తాన్‌): ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో భారత 13 ఏళ్ల పతక నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది. ఆదివారం 55 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో భారత రెజ్లర్‌ లలిత్‌కు నిరాశ ఎదురైంది. లలిత్‌ 0–9తో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో ఇస్కార్‌ కుర్బయెవ్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. గ్రీకో రోమన్‌ స్టయిల్‌ నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ పాయింట్ల ఆధిక్యం సాధించిన రెజ్లర్‌ను టెక్నికల్‌ సుపీరియారిటీ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. 

లలిత్‌తో జరిగిన బౌట్‌లో కుర్బయెవ్‌ మూడు నిమిషాల నిడివి గల తొలి రౌండ్‌లో 87 సెకన్లకే తొమ్మిది పాయింట్ల ఆధిక్యం సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో భారత్‌కు ఇప్పటి వరకు ఒక్క పతకమే లభించింది. 2013లో సందీప్‌ తులసి యాదవ్‌ 66 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్య పతకం అందించాడు. ఆదివారం జరిగిన ఇతర బౌట్‌లలో భారత రెజ్లర్లు జోగిందర్‌ రాఠి (130 కేజీలు), కరణ్‌జీత్‌ (72 కేజీలు), నితేశ్‌ (97 కేజీలు) తొలి రౌండ్‌లలోనే ఓడిపోయారు. భారత రెజ్లర్లను ఓడించిన వారు ఫైనల్‌కు చేరుకోకపోవడంతో కాంస్య పతక పోరుకు అర్హత పొందే అవకాశం కూడా లేకుండాపోయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement