అమృతకు రజతం | Indian wrestler Amruta Pujari won a silver medal at the wrestling championship | Sakshi
Sakshi News home page

అమృతకు రజతం

Oct 18 2026 2:37 AM | Updated on Oct 18 2026 2:37 AM

Indian wrestler Amruta Pujari won a silver medal at the wrestling championship

లాస్‌ వేగస్‌: ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ అమృత పూజారి రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల ఫ్రీస్టయిల్‌ 72 కేజీల ఫైనల్లో శనివారం అమృత 0–6తో ఇరీనా జబ్లోట్‌స్కా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడిపోయింది. మహిళల 59 కేజీల విభాగంలో కోమల్‌కు కాంస్యం దక్కగా... ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్‌ రెండు పతకాలు సాధించినట్లైంది. 

భారత మరో రెజ్లర్‌ స్వీటీ 53 కేజీల కాంస్య పతక పోరులో టెక్నికల్‌ సుపీరియారిటీ (0–11)తో ఉక్రెయిన్‌ రెజ్లర్‌ అనస్తాసియా పోల్‌స్కా చేతిలో ఓడింది. అంతకుముందు రెపిచేజ్‌లో స్వీటి 11–10తో జియాటాంగ్‌ జెంగ్‌ (చైనా)పై గెలిచి కాంస్య పతక పోరుకు చేరింది. వైష్ణవి పాటిల్‌ రెపిచేజ్‌లో 2–4తో హరుకా కొబారు (జపాన్‌) చేతిలో ఓడింది. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్లంతా నిరాశ పరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement