న్యూఢిల్లీ: ఈనెల 31న సెనెగల్ రాజధాని డకర్‌లో మొదలయ్యే యూత్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 17 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల మంతెన శ్రేష్ట్ రాజు ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) వ్యక్తిగత జంపింగ్ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. బెంగళూరులోని సర్జ్ స్టేబుల్స్ సెంటర్‌లో శ్రేష్ట్ రాజు శిక్షణ తీసుకుంటున్నాడు. నవంబర్ 13వ తేదీ వరకు జరిగే యూత్ ఒలింపిక్స్‌లో 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. 207 దేశాల నుంచి 2,700 మందికిపైగా క్రీడాకారులు పతకాల కోసం పోటీపడతారు.


