ఐదో ఆసియా పారా క్రీడలు శనివారం జపాన్‌లోని నగోయాలో లాంఛనంగా ముగిశాయి. 207 స్వర్ణాలు సహా మొత్తం 435 పతకాలు గెలిచిన చైనా అగ్ర స్థానంలో నిలవగా...భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. ఈ ఈవెంట్ ముగింపు ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెండేసి స్వర్ణ పతకాలు గెలుచుకున్న అథ్లెట్ నిషాద్ కుమార్, షూటర్ మోనా అగర్వాల్ భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు.


