సెంచరీలతో కదంతొక్కన ముషీర్‌, రఘువంశీ | Ranji Trophy: Raghuvanshi, Musheer hundreds put Mumbai in commanding position against Haryana | Sakshi
Sakshi News home page

సెంచరీలతో కదంతొక్కన ముషీర్‌, రఘువంశీ

Oct 26 2026 8:23 PM | Updated on Oct 26 2026 8:51 PM

Ranji Trophy: Raghuvanshi, Musheer hundreds put Mumbai in commanding position against Haryana

రంజీ ట్రోఫీ 2026-27లో ముంబై యువ బ్యాటర్లు అంగ్‌క్రిష్ రఘువంశీ, ముషీర్ ఖాన్ అద్భుత శతకాలతో కదంతొక్కారు. హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజే సెంచరీలు పూర్తి చేస్తున్నారు. ఓపెనర్‌గా వచ్చిన రఘువంశీ 114, వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్‌ 109 పరుగులు చేసి ఔటయ్యారు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రఘువంశీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇదే తొలి శతకం కాగా.. ముషీర్‌ ఈ ఎడిషన్‌లో వరుసగా రెండు అర్ద సెంచరీల తర్వాత సెంచరీ చేశాడు.

ముషీర్‌, రఘువంశీ శతక్కొట్టుడుతో ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 290 పరుగులు చేసింది. కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (29*), ముషీర్‌ అన్న సర్ఫరాజ్ ఖాన్ (21*) క్రీజులో ఉన్నారు. దివ్యాంశ్‌ సక్సేనా 10 పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. హర్యానా బౌలర్లలో అమన్‌ కుమార్‌, అనూజ్‌ తక్రాల్‌, సమంత్‌ జాఖర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఇదీ చదవండి: భీకర ఫామ్‌లో బదోని.. డబుల్‌ సెంచరీ తర్వాత సెంచరీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement