షాదాబ్‌ రికార్డు సెంచరీ.. వన్డేల్లో స్థానాల వారీగా అత్యధిక స్కోర్లు | Highest Individual Score In ODIs By Batting Position | Sakshi
Sakshi News home page

షాదాబ్‌ రికార్డు సెంచరీ.. వన్డేల్లో స్థానాల వారీగా అత్యధిక స్కోర్లు

Oct 26 2026 5:44 PM | Updated on Oct 26 2026 5:51 PM

Highest Individual Score In ODIs By Batting Position

source: X

ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన వన్డేలో పాకిస్తాన్‌ ఎనిమిదో నంబర్‌ ఆటగాడు షాదాబ్‌ ఖాన్‌ రికార్డు శతకం (113 నాటౌట్‌) బాదిన విషయం తెలిసిందే. వన్డేల్లో ఎనిమిదో స్థానంలో ఏ బ్యాటర్‌ అయినా చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే. షాదాబ్‌ రికార్డు సెంచరీ నేపథ్యంలో వన్డేల్లో బ్యాటింగ్‌ స్థానాల వారీగా అత్యధిక వ్యక్తిగత స్కోర్ల వివరాలను పరిశీలిద్దాం.

1: మార్టిన్ గప్టిల్ – 237* (న్యూజిలాండ్)
2: రోహిత్ శర్మ – 264 (భారత్)
3: చార్లెస్ కోవెంట్రీ – 194* (జింబాబ్వే)
4: హ్యారీ బ్రూక్ – 202 (ఇంగ్లండ్)
5: హెన్రిచ్ క్లాసెన్ – 174 (దక్షిణాఫ్రికా)
6: గ్లెన్ మ్యాక్స్‌వెల్ – 201* (ఆస్ట్రేలియా)
7: ల్యూక్ రాంచీ – 170* (న్యూజిలాండ్)
8: షాదాబ్ ఖాన్ – 113* (పాకిస్థాన్)
9: ఆండ్రీ రస్సెల్ – 92* (వెస్టిండీస్)
10: రవి రాంపాల్ – 86* (వెస్టిండీస్)
11: మహమ్మద్ ఆమిర్ – 58 (పాకిస్థాన్)

వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్ శర్మ పేరిట ఉంది. 2014లో శ్రీలంకపై ఆయన 264 పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాదాబ్‌ ఖాన్‌ రికార్డు సెంచరీ సాధించడంతో పాక్‌ చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షాదాబ్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 96 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. చివరి వికెట్‌కు హారిస్ రవూఫ్‌తో కలిసి అజేయమైన 89 పరుగులు జోడించి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ మరో 17 బంతులు మిగిలుండగా, చేతిలో ఒకే వికెట్‌ మిగిలుండగా ఛేదించింది. గెలవడం అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్‌ను షాదాబ్‌ ఖాన్‌ ఒంటిచేత్తో గెలిపించాడు. 

ఇదీ చదవండి: పాక్ ప్లేయ‌ర్ వీరంగం.. గ్రౌండ్‌లోనే బ్యాట్ చూపిస్తూ పైపైకి! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement