9 టు 6 ఉద్యోగం కాదని.. కంటెంట్‌ క్రియేషన్‌తో రూ. 2.5 లక్షలు!కానీ.. | Man Quits 9 To 6 Job Now Earns Rs 2 Lakh A Month Goes Viral | Sakshi
Sakshi News home page

9 టు 6 ఉద్యోగం కాదని.. కంటెంట్‌ క్రియేషన్‌తో రూ. 2.5 లక్షలు! కానీ..

Oct 22 2026 11:14 AM | Updated on Oct 22 2026 11:14 AM

Man Quits 9 To 6 Job Now Earns Rs 2 Lakh A Month Goes Viral

ఇటీవల చాలామంది కంటెంట్‌ క్రియేటర్లుగా మారి ఎక్కువ మొత్తంలో సంపాదించడం మొదలుపెట్టారు. అయితే అందరూ క్లిక్‌ అయ్యినట్లు కొందరికీ సాధ్యం కాకపోవచ్చు. అంతలా వ్యూస్‌ సంపాదించుకోలేకపోవచ్చు. స్థిరమైన ఉద్యోగాన్ని వదులుకుని మరి కంటెంట్‌ క్రియేటర్లుగా మారే వాళ్లు తప్పక ఈ విషయాలు గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడతారని చెబుతున్నాడు ఈ కంటెంట్‌ క్రియేటర్‌ శుభ్‌ శారంగ్‌. అంతేగాదు ఈ ఆర్థిక పాఠాలు గుర్తించుకుని మరి దిగండి అని పిలుపున్నాడు. 

ముంబైకి చెందిన కంటెంట్‌ క్రియేటర్‌ శుభ్‌ శారంగ్ ఒకప్పుడు కార్పొరేట్‌ ఉద్యోగం చేస్తుండేవాడు. అలా జాబ్‌ చేస్తూనే విరామ సమయంలో మంచి కంటెంట్‌ని క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌  చేస్తుండేవాడు. ఇలా ఒకవైపు ఉద్యోగం ఇంకోవైపు కంటెంట్‌ క్రియేటర్‌గా పని చేస్తుండటంతో కంటినిండా నిద్ర లేక ఆఫీస్‌లో నిద్రపోతుండేవాడు. పోనీ ఉద్యోగం వదిలేద్దామంటే..స్థిరమైన ఆదాయాన్ని కోల్పోయి ఇబ్బంది పడతానేమో అన్న భయంతో రిస్క్‌ తీసుకునేవాడు కాదు. 

ఒకరోజు తన కంటెంట్‌కి ఊహించని విధంగా ఎక్కువ ‍వ్యూస్‌ రావడం, లక్షకు పైగా ఆదాయం వచ్చింది. దాంతో తనపై తనకు నమ్మకం పెరిగి ధైర్యంగా ఉద్యోగానికి ఉద్వాసన పలికాడు. ఎందుకంటే ఎప్పుడు పదివేలకు మించి రాని వ్యూస్‌ అనూహ్యంగా లక్షల్లో వ్యూస్‌, ఫాలోవర్లు రావడం మొదలైంది. ఆ నేపథ్యంలోనే ధీమాగా ఉద్యోగం వదిలేసి పూర్తికాల కంటెంట్‌ క్రియేటర్‌గా పనిచేస్తూ..హాయిగా నెలకు రూ. 2.5 లక్షలుపైనే ఆర్జించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం నాకు ఎలాంటి మెంటల్‌ టెన్షన్‌లు లేవు. 

నెలవారి ఈఎంఐలు గురించి ఎలాంటి చింత లేకుండా ధైర్యంగా లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నా అంటున్నాడు. అయితే తనలా అంతపెద్ద రిస్క్‌ మాత్రం తీసుకోవద్దని కూడా హెచ్చరిస్తున్నాడు శారంగ్‌. ఎందుకంటే ఈ రంగంలో స్థిరమైన ఆదాయం ఉండదు. ఒక్కోసారి కంటెంట్‌ బాగా క్లిక్‌ అయితే పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఒక్కోసారి మొత్తానికి పడిపోవచ్చు లేదా రెండు లేదా మూడు నెలల వరకు ఎలాంటి ఆదాయం రాకపోవచ్చు. 

అందుకే ఇలాంటి రంగంలోకి వచ్చే వాళ్లు కనీసం 12 నెలలకు సరిపడా పొదుపు ఉండి ఉంటేనే ధైర్యంగా స్థిరమైన ఆదాయాన్ని పొందే ఉద్యోగాన్ని వదలేయండి..లేదంటే రిస్క్‌ మాత్రం చేయొద్దంటూ ఆర్థిక పాఠాలు చెబుతున్నాడు. తను లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ.. ఇందులో ఉండే లోటుపాట్లు కూడా ముందుగా బేరీజు వేసుకుని మాత్రమే అడుగుపెట్టండంటూ హితవు పలకడం విశేషం.

 

ఇదీ చదవండి: స్టేజ్‌ 4 నోటి కేన్సర్‌ నుంచి 80 కేజీల బరువు ఎత్తే వరకు..! ఆ కొడుకు ప్రేమే..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement