స్టేజ్‌ 4 నోటి కేన్సర్‌ నుంచి 80 కేజీల బరువు ఎత్తే వరకు..! ఆ కొడుకు ప్రేమే.. | Success Story: How This 57-YO Rebuilt Her Body After Cancer | Sakshi
Sakshi News home page

స్టేజ్‌ 4 నోటి కేన్సర్‌ నుంచి 80 కేజీల బరువు ఎత్తే వరకు..! ఆ కొడుకు ప్రేమే..

Oct 21 2026 4:14 PM | Updated on Oct 21 2026 5:13 PM

 Success Story: How This 57-YO Rebuilt Her Body After Cancer

అనారోగ్యం భయపెట్టించి కుంగదీసినా..నేనున్నాను అంటూ అండగా నిలిస్తే మత్యువుని సైతం ఎదరించగలరు అనేందుకు ఈ అమ్మ కథే ఉదాహరణ. ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు తలవంచి అప్పుడప్పుడూ వచ్చే బాధను దాచిపెట్టింది. అదికాస్తా తీవ్ర రూపం దాల్చి కేన్సర్‌ మహమ్మారి అని తేలింది. కానీ ఆ అమ్మ మనోధైర్యం కోల్పోకుండా కొండంత మద్దతు, ధైర్యం అందించాడు కొడుకు. ఆ అమ్మకే తండ్రిలా మారి సేవలందించి ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా మార్చాడు. ఎందరో కేన్సర్‌ పేషెంట్లో ఆశాభావం రెకెత్తించేలా అమ్మను స్ఫూర్తి నిలిచేలా చేశాడు. 

ఆ ధీర వనితే జావిత్రి శాక్య. అప్పుడప్పుడు కింద దవడలో విపరీతమైన నొప్పి వచ్చేదామెకు. ఐతే ఇంట్లో ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎవరికీ చెప్పలేదు. అలా ఆమె ఐదేళ్లపాటు ఆ బాధను తనలోనే దిగమింగుకుంది. 2024లో ఆమె పరిస్థితి విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు స్టేజ్‌ 4 నోటి కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారించారు. అప్పటి నుంచి జావిత్రి కేన్సర్‌ చికిత్సలతో అనునిత్యం పెద్దపోరాటమే చేయాల్సి వచ్చింది. 

చివరికీ ప్రాణాలను నిలపడం కోసం కింద దవడ తొలగించారు. ఆ తర్వాత మొత్తం ద్రవ ఆహారంతోనే ప్రాణాన్ని నిలబెట్టాల్సి వచ్చింది. ఆ క్రమంలో కాలి పిక్క కండరాన్ని కూడా కోల్పోయింది. అలా ఆమె మంచానికే పరిమితమై..నిటారుగా కూర్చోవడమే కష్టమైంది. కానీ ఆ కఠిన సమయంలో కుమారుడు మనీష్‌ అండగా నిలబడటమే కాదు..ఈ పరిస్థితిని ఎలాగైన ఎదుర్కోవాలని ఇరువురు స్ట్రాంగ్‌గా డిసైడయ్యారు. ఇదివరకటిలా చురుగ్గా మారడం అంత సులభంకాలేదు జావిత్రికి. చాలా సహనంతో ఒక చిన్న అడుగుతో మొదలపెట్టి వ్యాయామాలు చేసే వరకు తీసుకొచ్చాడు. 

అలాగే ఆమె కోలుకునేలా మంచి పౌష్టికాహారం అందించాడు. ప్రొషెనల్‌గా సింగర్‌ అయినా మనీష్‌ తన వృత్తిని పక్కనపెట్టి అమ్మని కంటికిరెప్పలా కాచుకున్నాడు. అలా ఆమెలో చురుగ్గా మారి జిమ్‌లో బరువులు ఎత్తేలా చేశాడు. చివరికి 80 కేజీల డెడ్‌లిప్ట్‌ ఎత్తే రేంజ్‌కు చేరుకుంది. చెప్పాలంటే ఇప్పుడు ఫిట్‌నెస్‌కి మారుపేరుగా నిలిచేలా చేశాడు. అంతేగాదు తన అమ్మ కథ ఎందరో కేన్సర్‌ పేషంట్లకు కనువిప్పు కలిగి ఆశాభావం రేకెత్తించేలా స్ఫూర్తిదాయకంగా మార్చాడు. 

ఒక రకంగా ఈ వ్యాధి ఆ అమ్మ కొడుకుల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. పైగా ఆ అమ్మ అతడికి కూతురులా మారిపోయింది. తండ్రిగా బాగోగులు చూసుకుంటూ గురువలా శారీరక శిక్షణ ఇస్తూ..ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా మార్చాడు. అంతేగాదు తనకు వచ్చినట్లు దవడ నొప్పి లేదా మరేదైనా సుదీర్ఘకాలం వస్తుంటే  నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తోంది జావిత్రి.

 

ఇదీ చదవండి: నలుగురు భార్యలు, 58 మంది పిల్లలు..కానీ ఆ ఇంట్లో..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement