నలుగురు భార్యలు, 58 మంది పిల్లలు..కానీ ఆ ఇంట్లో..! | Afghan Man With 58 Children Continues To Expand Family Despite Poverty | Sakshi
Sakshi News home page

నలుగురు భార్యలు, 58 మంది పిల్లలు..కానీ ఆ ఇంట్లో..!

Oct 21 2026 2:12 PM | Updated on Oct 21 2026 2:24 PM

Afghan Man With 58 Children Continues To Expand Family Despite Poverty

రోజు గడవడమే కష్టం అనేంత కటిక దారిద్య్యం. కానీ కుటుంబాన్ని విస్తరిస్తున్నాడు. కనీసం వాళ్ల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితి కానీ..బిడ్డలను కనడం మాత్రం ఆగడం లేదు. కనీసం వారిలో తన బిడ్డ పేరేంటో కూడా ఆ తండ్రికి సరిగా తెలియదు. ఇంతకీ ఎవరా ఆ మహానుభావుడంటే..

అతడే అఫ్ఘనిస్తాన్‌కి చెందిన మొహమ్మద్‌ సాదిక్‌. అతడికి 70 మందికి పైగా పిల్లలు ఉన్నారు. అయితే వారిలో కేవలం 58 మంది మాత్రమే బతికి ఉన్నారు. అతడి చిన్న బిడ్డకు కేవలం మూడు నెలల వయసు. కుటుంబం పెద్దది గానీ..ఆర్థికపరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. ఇంటికి సరైన తలుపులు కూడా లేని మట్టి ఇంట్లో ఉంటున్నారు వారంతా. ప

లుచని తెరలు..అవేమంత అంతగా రక్షణ ఇ‍వ్వవు కూడా. వంట కోసం కనీసం కట్టెలు కొనే స్థోమత కూడా లేదు. కాగితాలను మంటపెట్టి వండుకు తినాల్సిందే. చిన్నారులకు కనీసం చెప్పులు కూడా కొనలేదని పరిస్థితి. ఇక ఆ తండ్రి మొహ్మద్‌ ఒక కార్ల విక్రయ కేంద్రంలో పనిచేస్తుంటాడు. ఒక్కో కారు అమ్మితే అతడికి రూ. 1400లు వస్తాయి. ఇదే అతడి కుటుంబానికి ఏకైక ఆదాయం. 

ప్రస్తుతం అతడు తన పిల్లలకు ఒక్క పూట కూడా కడుపునిండా భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. సంతానం ఎక్కువ కావడంతో ఎవ్వరిపేర్లు గుర్తుండవని అంటున్నాడు మొహ్మద్‌. తాను కుటుంబ భాద్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యానని కన్నీళ్లుపెట్టుకుంటున్నాడు. ఇక 70 మంది సంతానంలో 58 మందే బతికి ఉండటానికి కారణం కూడా వివరించాడు. తన నలుగురు భార్యలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారని, వాళ్లకు పాలివ్వడం, పెంచడంలో అంత అనుభవం లేకపోవడం వల్ల మరణించారని తెలిపాడు. 

తన పిల్లలు కొందరు క్షయ, తట్టు వ్యాధులతో చనిపోయినట్లు పేర్కొన్నాడు. అతడు తాను కనీసం భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉంటానని తెలిసి ఉంటే ఇంతమందిని కనేవాడిని కాదని వాపోతున్నాడు. మరి ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కుటుంబాన్ని విస్తరించడం ఎందుకు ఆపడం లేదు అనేది తెలియాల్సి ఉంది. 

కాగా, ఆ తండ్రి పరిస్థితి అప్ఘాన్‌ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం..దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు, పైగా బాల్య వివాహాలు పెరుగుతున్నట్లు సమాచారం. 2023 నాటి యూనిసెఫ్ గణాంకాల ప్రకారం, 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల నాలుగు మిలియన్లకు పైగా మహిళలు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: చిన్న వయసు నుంచే డబ్బు విలువ నేర్పించాలి: వీరేంద్ర సెహ్వాగ్‌ పేరెంటింగ్‌ టిప్స్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement