చాలామందికి ఒక మారథాన్ పూర్తి చేయడమే జీవితకాల ఘనతగా ఉంటుంది. అలాంటిది న్యూయార్క్‌కి చెందిన ఈ మహిళ ఎన్ని మారథాన్‌లు పూర్తి చేసిందో తెలిస్తే కంగుతింటారు. అది కూడా గర్భవతిగా ఉన్నప్పుడే పూర్తి చేయడం విశేషం. ఎవరా ఉక్కుమహిళ..?,ఎలా అన్ని మారథాన్‌లు పూర్తి చేసిందంటే..
ఆ మహిళే 38 ఏళ్ల డీర్ట్రే కీన్. న్యూయార్క్‌కు చెందిన ఈ మహిళకు గతేడాది వివాహమైంది. తన భర్త బ్రియాన్‌తో కలిసి కుటుంబాన్ని ప్రారంభించే యోచనలో కూడా ఉందామె. నర్సు ప్రాక్టీషనర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ అయిన కీన్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ ఏడు వరల్డ్ మారథాన్‌లను ఒకే ఏడాదిలో పూర్తి చేసిన ఘనతను దక్కించుకుంది. ఆమె తన చివర మారథాన్ రేసుని ఎనిమిదో నెలలో ఉండగా చేయడం విశేషం.
ఆమె న్యూయార్క్ సిటీ మారథాన్‌ను ఎనిమిదో నెలలో ఉండగా పూర్తి చేసింది. సగటున మైలుకు తొమ్మిది నిమిషాల 26 సెకన్ల వేగంతో పూర్తి చేసింది. ఆమె 2025లో ఇదే మారథాన్‌ను జస్ట్ మూడు గంటల్లో పూర్తి చేసింది. ఇదేలా సాధ్యమైందని కీన్‌ని ప్రశ్నిస్తే మాతర్రం..తన శరీరంపై తనకు అవగాహన ఉందని, వైద్యుల సలహాలు సూచనల మేరకే ఈ ధైర్యం చేశానని అంటోంది.
నిజానికి కీన్ ఏడు వరల్డ్ మారథాన్‌లు పూర్తి చేయాలనే ఐర్లాండ్‌లో ఒక ట్రైల్ మారథాన్, రెండు అల్ట్రామారథాన్‌లు అలాగే ఒక ఐరన్ మ్యాన్ కోసం నమోదు చేసుకుంది. ఏప్రిల్ తన పరుగు వేగం మాములు కన్నా తక్కువుగా ఉండటంతో ప్రెగ్నెంట్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. అయినా సరే తగ్గేదేలే అంటూ..ముందుకు సాగింది.
ఇక ఈ సాహసానికి వైద్యులు సైతం మద్దతిచ్చి..అనుమతివ్వడంతో ఈ ఏడు మారథాన్‌లు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది కీన్. ఇక ఈ మారథాన్‌లు పూర్తి చేయడానికి తన దివంగత తండ్రే స్పూర్తే అని అంటోంది. ఎందుకంటే ఆయన కేన్సర్ సోకినప్పటికీ..సర్జరీకి ముందు రోజు తన చివరి న్యూయార్క్ సిటీ మారథాన్ పూర్తి చేశారని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: 25 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంగా..అదే గ్రేస్! షిఫాన్ గౌనులో కరీనా బ్యూటీఫుల్ లుక్


