రెప్పపాటులో కూలిన భవనం.. న్యూయార్క్‌లో కలకలం! | New York City Building Collapse Brooklyn | Sakshi
Sakshi News home page

రెప్పపాటులో కూలిన భవనం.. న్యూయార్క్‌లో కలకలం!

Nov 12 2026 1:01 PM | Updated on Nov 12 2026 1:01 PM

New York City Building Collapse Brooklyn

న్యూయార్క్‌: ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన అమెరికాలోని న్యూయార్క్‌ నగరం బ్రూక్లిన్‌లో బుధవారం జరిగింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోవడంతో భారీగా సహాయక చర్యలు చేపట్టారు.

ఫ్లాట్‌బుష్‌ అవెన్యూలోని మూడు అంతస్తుల భవనం బుధవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో పక్కనే ఉన్న నిర్మాణ స్థలంలోకి కూలిపోయింది. దీంతో భవనంలో ఉన్నవారితో పాటు నిర్మాణ ప్రాంతంలోని పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న 250 మందికి పైగా సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సహాయక చర్యలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని న్యూయార్క్‌ అగ్నిమాపక విభాగం కమిషనర్‌ లిలియన్‌ బోన్సిగ్నో తెలిపారు. సిబ్బంది నిరంతరాయంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పారు.

న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక సిబ్బందిని అభినందించారు. కాగా, 1930లో నిర్మించిన ఈ భవనం ఒకవైపు పూర్తిగా కూలిపోవడంతో లోపలి గదులు, అల్మారాలు బయటకు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: 'మంత్రాల' నెపంతో ఆ గ్రామంలో వరుస మరణాల కలకలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement