కాఠ్మాండు: నేపాల్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. భూమికి 73 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో 27.671 ఉత్తర అక్షాంశం, 87.987 తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో బుధవారం రాత్రి 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాత్రి 9.50 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. జుబ్బల్, రోహ్రూ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇండోనేషియా ఉపాధ్యక్షుని హఠాత్తు రాజీనామా.. ఇంతకీ ఏం జరిగింది?


