జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు | Jammu And Kashmir Earthquake, 3.1 Magnitude Tremor Hits Kishtwar At Midnight, No Damage Reported And Check More Details | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు

Nov 3 2026 11:02 AM | Updated on Nov 3 2026 11:21 AM

jammu kashmir Earthquake of 3 1 magnitude

కిష్త్వార్: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రాత్రి 11:56 గంటల సమయంలో భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్‌సీఎస్) వెల్లడించింది.

భూకంప కేంద్రం భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిష్త్వార్ జిల్లాలో 33.292 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.892 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని వెల్లడించారు. 

ఇదీ చదవండి: గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ఒకరు మృతి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement