తిరువనంతపురం : మైనర్ బాలికతో స్నేహం విషయంలో తలెత్తిన వివాదం ఓ టీనేజీ బాలుడి ప్రాణం తీసింది. స్నేహితులే అత్యంత క్రూరంగా బాలుడిని హత్య చేసిన ఘటన కేరళంలో కలకలం రేపుతోంది.
పోలీసుల ప్రాథమిక విచారణ వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల అభిరామ్ ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి కుటుంబ సభ్యులకు తెలిపి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, సోమవారం ఉదయం తిరువనంతపురం పాంగప్పారలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో గోనెసంచిలో విగతజీవుడిగా కనిపించాడు.

స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అభిరామ్.. అనుమానిత మైనర్ నిందితుల మధ్య ఓ అమ్మాయితో స్నేహం విషయంలో మనస్పర్ధలు తలెత్తినట్లు తేలింది. ఇదే విషయమై మాట్లాడేందుకు తిరువనంతపురం పాంగప్పార ప్రాంతానికి రమ్మనమని బాధితుడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు మెసేజ్ చేశారు.
ఇన్ స్టా మెసేజ్‌తో అభిరామ్ పాంప్పార వెళ్లాడు. అక్కడ అక్కడ సదరు బాలికతో అభిరామ్‌కు ఉన్న స్నేహంపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆపై హత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.
ముందుగా అభిరామ్‌ను గొంతు నులిమి హత్య చేసిన నిందితులు.. అనంతరం మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి, ఆ నిర్మానుష్య ప్రదేశంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 17, 19 సంవత్సరాల వయసున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నవంబర్ 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్నేహితుడు పిలిచాడని చెప్పి తన కుమారుడు ఇంటి నుండి బయలుదేరాడని బాధితుడి తండ్రి తెలిపారు. ఆ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు అతడిని సంప్రదించగా, త్వరలోనే తిరిగి వస్తానని చెప్పాడు. అయితే, చెప్పిన సమయానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ ఫోన్ చేశారు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు గుర్తించారు.
అభిరామ్ అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శ్రీకార్యం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఇటీవలి కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌ను పరిశీలించారు. అందులో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అతడిని పాంగప్పారకు రప్పించినట్లు ప్రాథమికంగా తేలింది.
కజక్కూట్టం అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అభిరామ్ ఇన్ స్టాకు ఎవరు మెసేజ్ చేశారు? అతడిని ఎవరు సంప్రదించారు? అనే విషయాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు హత్య తర్వాత మృతదేహాన్ని దాచిపెట్టడానికి ఎవరైనా సహాయం చేశారా అని నిర్ధా రించేందుకు అదుపులో ఉన్న మైననర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


