శబరిమల యాత్రికులకు రూ.2 లక్షల జీవిత బీమా  | Rs 2 lakh life insurance for Sabarimala pilgrims Says Travancore Devaswom Board | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రికులకు  రూ.2 లక్షల జీవిత బీమా 

Oct 31 2026 6:34 AM | Updated on Oct 31 2026 6:34 AM

Rs 2 lakh life insurance for Sabarimala pilgrims Says Travancore Devaswom Board

ప్రకటించిన ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు

తిరువనంతపురం: కేరళంలోని ప్రఖ్యాత శబరిమల ఆలయ యాత్రికులకు మొట్టమొదటిసారిగా జీవిత బీమా సౌకర్యం అందుబాటులో రానుంది. ఆలయ సందర్శన సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబీకులకు రూ.2 లక్షల బీమా సొమ్మును అందజేస్తామని ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు(టీడీబీ)అధ్యక్షుడు జయకుమార్‌ శుక్రవారం ప్రకటించారు. నవంబర్‌ 17వ తేదీ నుంచి మండల–మకరవిలక్కు సీజన్‌ ప్రారంభం కానుండగా శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

భారత జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)సౌజన్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శబరిమల యాత్రికులకు గతంలో ప్రమాద బీమా మాత్రమే ఉండేదని, జీవిత బీమా కవరేజీని అందుబాటులోకి తేవడం ఇదే మొదటిసారని చెప్పారు. ఈ సీజన్‌కు గాను ప్రీమియం కింద సుమారు రూ.కోటి మొత్తాన్ని టీడీబీ తన వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి చెల్లిస్తుందని వివరించారు. వర్చువల్‌ క్యూ బుకింగ్‌ సమయంలోనే యాత్రికుల పేరుతోపాటు నామినీ, వారితో గల సంబంధం వివరాలను నమోదు చేస్తామని జయకుమార్‌ చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement