ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై రఫేల్‌ మెరీన్‌!  | Rafale Marine fighter jet successfully landed on aircraft carrier INS Vikrant | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై రఫేల్‌ మెరీన్‌! 

Oct 31 2026 6:22 AM | Updated on Oct 31 2026 6:22 AM

Rafale Marine fighter jet successfully landed on aircraft carrier INS Vikrant

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ తయారీ యుద్ధ విమానం రఫేల్‌ నావికా దళ రకం (రఫేల్‌ మెరీన్‌) గురువారం మొట్టమొదటిసారి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై విజయవంతంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ యుద్ధ విమానం ఇప్పటికే వైమానిక దళంలో సేవలందిస్తోంది. అయితే నావికా దళంలోనూ దీన్ని వినియోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం గోవాలో రఫేల్‌ మెరీన్‌ను పరీక్షిస్తున్నారు. తద్వారా దీనికి ఏవైనా మార్పులు/చేర్పులు అవసరమా? అన్నది తెలుసుకోనున్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై పనిచేసేందుకు ఇది అనువుగా ఉందా? లేదా? అన్న పరిశీలన కూడా సాగుతోంది. 

యుద్ధనౌకను సమీపించే సమయంలో విమానం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? విపరీతమైన వేగంతో ల్యాండ్‌ అయ్యే విమానాన్ని సకాలంలో నిలుపుదల చేయగలమా? లేదా? వంటి అంశాలను పరీక్షిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో యుద్ధ విమానాన్ని ఆపేందుకు షార్ట్‌ టేకాఫ్‌ బట్‌ అరెస్టెడ్‌ రికవరీ (స్టోబార్‌) అన్న వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా యుద్ధ నౌక ముందుభాగంలో స్కీ–జంప్‌ ర్యాంప్‌ (టేకాఫ్‌ కోసం).. వెనుకభాగంలో విమానాన్ని నిలిపేందుకు వల లాంటి అరెస్టర్‌ ఉంటాయి. రఫేల్‌ మెరీన్‌లోనూ టేకాఫ్, అరెస్టర్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం ఈ యుద్ధవిమాన తన తొలి ప్రయత్నంలోనే ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ల్యాండ్‌ కాగలిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement