మోదీ ప్లాన్‌..షా ఆచరణ..జ్ఞానేశ్‌ అమలు  | Narendra Modi, Shah, CEC will pay price for vote chori slams Rahul Gandhi | Sakshi
Sakshi News home page

మోదీ ప్లాన్‌..షా ఆచరణ..జ్ఞానేశ్‌ అమలు

Oct 19 2026 6:07 AM | Updated on Oct 19 2026 6:07 AM

Narendra Modi, Shah, CEC will pay price for vote chori slams Rahul Gandhi

రాహుల్‌ గాంధీ విమర్శ

మార్గోవా: ప్రధాని మోదీ తెరవెనుక ఉంటూ ఓట్ల చోరీ కుట్రకు పథక రచన చేస్తే, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆచరించారని, దానిని సీఈసీ జ్ఞానేశ్‌ అమల్లో పెట్టారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఓట్‌ చోరీకి పాల్పడిన ఈ ముగ్గురు చట్టం ముందు దోషులుగా నిలబడి తగు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ గోవాలో చేపట్టిన మూడు రోజుల గోయ్‌ రఖోన్‌ యాత్ర ముగింపు కార్యక్రమం ఆదివారం మార్గోవాలో జరిగింది.

 ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో కలిసి రెండు కిలోమీటర్ల మేర నడిచి తర్వాత రాహుల్‌ మాట్లాడారు. ప్రభుత్వ కాంట్రాక్టులను కొందరు సన్నిహిత పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేస్తూ వారి నుంచి నిధులు దండుకుంటున్నారని కేంద్రాన్ని విమర్శించారు. ‘మీరేం కంగారుపడకండి. గోవా గురించి మీరు చూసుకోండి. ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ, అమిత్‌ షాల విషయం మేం చూసుకుంటాం. వాళ్లకు సమయం దగ్గరపడింది’అని కార్యకర్తలతో అన్నారు. 

ఇది బహిష్కరణ వ్యవస్థ 
దేశంలో విద్యా వ్యవస్థ సక్రమంగా లేదని రాహుల్‌  ఆక్షేపించారు. లక్షలాది మంది యువతను విద్యకు దూరం చేసే వ్యవస్థ నేడు అమల్లో ఉందని విమర్శించారు. ఇది విద్యా వ్యవస్థ కాదని, బహిష్కరణ వ్యవస్థ అని తప్పుపట్టారు. ఇటీవల విద్యార్థుల బృందంతో తాను జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ ఆదివారం  ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టుచేశారు. డబ్బు, అధికారం లేకపోయినా, ఇంగ్లీష్‌ రాకపోయినా ఇప్పుడున్న వ్యవస్థ రెండో ఆలోచన లేకుండా యువతను బయటకు గెంటేస్తుందని పేర్కొన్నారు. దీనిని విద్యా వ్యవస్థ అని ఎలా పిలవాలని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement