breaking news
Vote Chori
-
Rahul Vs EC: ఈసీకి రాహుల్ ఐదు ప్రశ్నలు
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు. ఎక్స్ వేదికగా ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం బీజేపీతో చేతులు కలిపి, దేశంలో ఎన్నికలను ప్రభావితం చేస్తోందంటూ నిన్న (గురువారం) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పని చేస్తోందంటూ.. ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా నకిలీ ఓటర్లను చేరుస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఐదు ప్రశ్నలతో ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ‘‘డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?. సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?. నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025కాగా, ఇవాళ (శుక్రవారం) బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. -
ఓట్ల దొంగతనానికి ఆధారాలు ఇదిగో..: రాహుల్ గాంధీ
ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.భారత రాజ్యాంగం విశిష్టమైనది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్, బసవన్న, పూలే, నారాయణ గురు ఆలోచనలు మన రాజ్యాంగంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి మేం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వ్యక్తి.. ఒక ఓటు అనేది రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన హక్కు. అలాంటిది బీజేపీ, మోదీ ఆ హక్కు ఇచ్చిన రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టారు. ఓటర్ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది అని రాహుల్ అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో మా సర్వే ప్రకారం.. 15 నుంచి 16 సీట్లు గెలుస్తుందని అంచనా వేశాం. కానీ, 9 మాత్రమే గెలిచాం. ఆ ఫలితాలను విశ్లేషించినప్పుడు.. నిజంగానే మేం ఓడిపోయామా? అనిపించింది. వెంటనే ఓటర్ల సాఫ్ట్ కాపీని ఇవ్వమని ఈసీని కోరాం. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఎన్నికల వీడియోలు కావాలని కోరినా.. రూల్స్ మారిపోయాయంటూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. లోక్‌సభ ఎన్నికల తరవాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. అక్కడ మా మహఘట్‌బంధన్ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని గుర్తించాం. వీళ్లెవరూ లోక్‌సభ ఎన్నికలకు ఓటేయలేదు. ఇండియా కూటమికి ఓటు షేర్ ఎక్కడా తగ్గలేదు. కానీ, కొత్తగా చేరిన ఓటర్లు బీజేపీకి ఓటేశారు. అలా బీజేపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో నెగ్గింది. అక్కడే ఏదో తప్పు జరిగిందని గుర్తించాం. नरेंद्र मोदी वोट चोरी करके प्रधानमंत्री बने हैं चुनाव आयोग हमें डेटा दे, हम साबित कर देंगे pic.twitter.com/WUBm97WR4g— Congress (@INCIndia) August 8, 2025బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పార్లమెంట్ ఫలితం.. అందునా మహదేవపుర సెగ్మెంట్ నుంచే మేం మా పరిశోధన మొదలుపెట్టాం. మహదేవపురలో 6.5 లక్షల ఓట్లు ఉంటే.. 1,00,250 ఓట్లు చోరీకి గురయ్యాయి. అంటే.. సగటున ఆరు ఓట్లలో ఒకటి చోరీకి గురైందన్నమాట. అలా లోక్‌సభ ఎన్నికల్లో ఈసీ బీజేపీ కలిసి మోసం చేశాయని నిరూపించగలిగాం. బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 ఫేక్ ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఆయన లెక్క ప్రకారం ఫేక్ ఓట్లు ఇలా ఉన్నాయి• 11,965 డూప్లికేట్ ఓటర్లు• 40,009 ఫేక్/చెల్లని చిరునామాలు• 10,452 ఓటర్లు ఒకే చిరునామాలో నమోదు• 4,132 చెల్లని ఫోటోలు• 33,692 మంది Form 6 ద్వారా అనుమానాస్పదంగా ఓటర్లుగా నమోదుమహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. కర్ణాటకలోనూ ఫేక్ ఓట్లు నమోదయ్యాయి. ఒకే ఇంటిపై 40కిపైగా ఓట్లు నమోదు అయ్యాయి. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్సైట్ మూసేసింది. ఎన్నికల సంఘం బీజేపీతో కలిసి ఎన్నికల మోసానికి పాల్పడింది. ఓట్ల దొంగతనం తీవ్రమైన నేరం. ఆ నేరం జరిగింది అనడానికి కర్ణాటక డేటానే ఆధారం. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు ఇవ్వకుండా ఈసీ నేరాన్ని దాచిపెడుతోంది. ఈ ఓట్ల దొంగతనంను దేశవ్యాప్తంగా బయటపెట్టేందుకు కాంగ్రెస్ ఉద్యమం ప్రారంభించబోతోంది.నన్ను అఫిడవిట్ ఇవ్వమని, ప్రమాణం చేయమని ఈసీ అడుగుతోంది. కానీ నేను పార్లమెంట్లో రాజ్యాంగం మీద ఇప్పటికే ప్రమాణం చేశాను. ఎన్నికల సంఘం బీజేపీకి గనుక పని చేయకపోతే.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఎన్నికల వీడియోలు, డిజిటల్ ఓటర్ లిస్టులు మాకు అందించాలి’’ అని రాహుల్‌గాంధీ ఈసీకి సవాల్ విసిరారు. -
తెరపైకి కర్ణాటక ‘ఓట్ చోరీ’ స్టింగ్ ఆపరేషన్!
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా.. ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్‌ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్‌లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు. ఇదెలా జరిగిందంటే.. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్‌లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్‌డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్‌కు ఇచ్చేవారు. ఈ సీఎస్సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం. మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura. We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data. Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025 -
మా వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయ్.. ఓట్ చోరీపై రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారుకొన్ని ఓటర్ ఐడీ కార్డ్‌లలో ఇంటి నెంబర్ జీరో ఉందినాలుగు పోలింగ్ బూత్‌లలో ఒకరి పేరు ఎలా వస్తుందిఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైందికర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాంసింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయిఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయిబెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చిందిబెంగళూరు సెంట్రల్ మహదేవ్పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాంమహదేవ్పూర్లో లక్ష ఓట్ల చోరీ జరిగిందిమహదేవ్ పూర్లో ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయిమహదేవ్పూర్లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చిందిమహదేవ్పూర్లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయిఅలాంటి ఓట్లు వేలల్లోనే..బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలికర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయిఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందిఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయిఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయిసింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయిఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయిమహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలుమహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయిమహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందిజనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయిపోలింగ్నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగిందిపోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయిఅంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయిఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాంహర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయిమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయిప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోందిఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయిఅంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయికాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదుబీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది.