
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఓటర్లను బెదిరించి మరీ యధేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకుంటూ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో.. జమ్మలమడుగు నుంచి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు వేయిస్తున్న వైనం బయటపడింది.
వాళ్లలో పొన్నతోటకు చెందిన టీడీపీ రైతు కార్యదర్శి.. జమ్మలమడుగు మార్కెట్‌యార్డ్ వైఎస్ చైర్మన్ మల్లికార్జున్ కూడా దొంగ ఓటు వేశారు.


జమ్మలమడుగు అనంతగిరి, గూడంచెరువు పంచాయతీ గ్రామ పంచాయితీ గ్రామ టీడీపీ లీడర్ బాలఉగ్రం కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో దొంగ ఓటేశాడు.
ఆ జాబితాను పరిశీలిస్తే.. కర్మలవారిపల్లె సచ్పంచ్ పుల్లారెడ్డి, గూడెంచెరువుకు చెందిన పాతకుంట శివారెడ్డి, చిన్న దండ్లూరుకు చెందిన రామచంద్రయ్య, కలవటలకు చెందిన రాజన్న, కంబళదిన్నెకి చెందిన కుళాయి, భీమగుండం వాసి రాజగోపాల్, నవాబుపేటకు చెందిన మర్రి ప్రకాశం.. సన్నపురెడ్డి రామస్వామి రెడ్డి.. ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి ఉన్నారు. వీళ్‌లందరినీ గుర్తించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫొటోలతో సహా వివరాలను బయటపెడుతున్నాయి.
