సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువులో తనకు భూమి లేదని క్లారిటీ ఇచ్చారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తాను ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ ప్రభుత్వానికి, హైడ్రాకు సవాల్ విసిరారు. పోలీసులు నమోదు చేసిన కేసుపై లీగల్‌గా ముందుకు వెళ్లనున్నట్టు చెప్పుకొచ్చారు.
దుర్గం చెరువులో ఐదు ఎకరాల భూమి ఆక్రమణపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం. నాపై కక్షతో కేసు పెట్టారు. హైకోర్టులో యాక్షన్ పెడితే రెండేకరాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని TDR ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నాపై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు.
అక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదు. అక్కడ ప్రైవేట్ బస్సులు పార్కింగ్ చేస్తారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. అక్కడ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయి. ఎవ్వరూ పర్సనల్ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదులో హైడ్రా పేరు మాత్రమే కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసుపై లీగల్ పోరాటం చేస్తాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను.. పోలీసులకు సహకరిస్తాను. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం. బేషరుతుగా కేసు విత్ డ్రా చేయకపోతే.. ఎఫ్‌టీఎల్‌లో ఇండ్లు కట్టారు. ఆ ఇళ్లు ముందు ధర్నా చేస్తాం’ అని హెచ్చరించారు.


