సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు పులివెందులలోనే ఉండి ప్రజదర్బార్ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రేపు(మంగళవారం) పులివెందుల చేరుకున్నారు. ఈ క్రమంలో పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్‌లో పాల్గొంటారు. అలాగే, ఎల్లుండి(బుధవారం) వేంపల్లి మండలం నందిపల్లికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నందిపల్లిలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌కు వైఎస్ జగన్ హాజరు అవతారు.


