సాక్షి, కోనసీమ: జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల నేపథ్యంలో నిర్వహించిన ట్రయల్ రన్‌లో ఆయన పాల్గొనగా.. ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయారు. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన సురక్షితంగా ఒడ్డును చేరారు.
ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పడవ పోటీలు సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్‌లో కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ నడిపారు. అయితే కాస్త దూరం వెళ్లాక అది అదుపు తప్పి ఒక్కసారిగా ఆయన, వెనకాల ఉన్న వ్యక్తి నీళ్లలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో ఇద్దరూ నీట మునగలేదు. వెంటనే గజ ఈతగాళ్లు, ఇతర సిబ్బంది స్పందించి ఆయన్ని బయటకు తీశారు.


