శాఖపట్నం: నగరంలో నూతన సంవత్సరోత్సాహం ఉప్పొంగింది. 2025 జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కోటి ఆశలతో 2026కు నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆర్.కె.బీచ్ గురువారం సందర్శకులతో కిటకిటలాడింది. సాగరతీరం సంతోషాల సంగమంగా మారింది. చిన్నారుల కేరింతలు, యువత కేకలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అలల సాక్షిగా సెల్ఫీలు దిగుతూ యువత సందడి చేసింది.
చిన్నారులు, యువత ఉల్లాసంగా గడుపుతూ, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
నవ్వులు, ఆనందాల మధ్య కొత్త ఏడాది జోష్ స్పష్టంగా కనిపించింది.


