బెంగళూరు: 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నిక ల్లో అలంద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోప లు నిజమేనని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తెలిపింది. ఓటర్ల పేర్లను తొలగించే కుంభకోణంతో కనీసం ఆరుగురికి సంబంధమున్నట్లు గుర్తించింది.
ఇక, వీరికి ఓ డేటా సెంటర్‌తో సంబంధాలున్నాయని, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ ద్వారా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారని సిట్‌కు సారథ్యం వహించిన సీఐడీ అద నపు డీజీ బీకే సింగ్ చెప్పారు. పేర్లను తొలగించాలంటూ అందిన మొత్తం 6,994 అభ్యర్థన ల్లో ఏవో కొన్ని మినహా చాలామటుకు బోగస్ వేనని గుర్తించామన్నారు. అలంద్‌లో ఓటర్ల తొలగింపునకు కుట్ర జరిగింది వాస్తవమని చెప్పారు. మొత్తం 30 మంది వరకు ప్రశ్నించి, అనుమానితులుగా ఆరుగురిని నిర్ధారించామని, వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని వివరించారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిపామన్నారు.
ఇందులో అప్పట్లో అలంద్‌లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన సుభాష్ గుత్తేదార్, ఆయన ఇద్దరు కుమారుల ఇళ్లు కూడా ఉన్నాయన్నారు. సోదాల సమయంలో సుభాష్ ఇంటికి సమీపంలో కాలిపోయిన ఓటరు జాబితాలు బయటపడినట్లు ఆయన వెల్లడించారు. అయితే, దీపావళి సందర్భంగా తమ సిబ్బంది వృథా వస్తువులను తొలగించే క్రమంలో పనికి రాని ఓటరు జాబితాలను సైతం కాల్చేశారని సుభాష్ గుత్తేదార్ వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదన్నా రు.
ఇలా ఉండగా, అలంద్ నియోజకవర్గం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సొంత జిల్లా కలబురిగి పరిధిలోనిదే కావడం గమనార్హం. అలంద్‌లో ఓట్ చోరీ జరిగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ ఇటీవల చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు కోసం కర్నా టకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. కాగా, అలంద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే గురువారం ఆరోపించారు. వాటిపైనా సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉందన్నారు. ఈ ముఠా ఓటుకు రూ.80 చొప్పున వసూలు చేసిందన్నారు. ఇదంతా బీజేపీ నేతలు పాల్పడిన కుంభకోణమేనన్నారు. బాధ్యులను కటకటా ల్లోకి నెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పట్లో చీఫ్ ఎలక్టోరల్ అధికారి అడ్డుకోవడం వల్లే ఓట్ల తొలగింపు కుంభకోణానికి బ్రేకులు పడ్డాయని అలంద్‌లో 10వేల ఓట్ల తేడాతో గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత బీఆర్ పాటిల్ తెలిపారు.


