
పాట్నా: కేంద్రంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడిందంటూ గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ.. బిహార్‌లో ఓట్ అధికార్ యాత్ర చేపట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగింపును వ్యతిరేకిస్తూ రాహుల్.. ఓట్ అధికార్ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర ప్రస్తుతం బీహార్‌లోని నవాడా జిల్లాలో కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఓ పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. ర్యాలీలో జనాన్ని నియంత్రిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కాలు కారు కింద చిక్కుకుపోయింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలైతే రాహుల్ కనీసం అతన్ని కారు కిందకు దిగి పలకరించలేదని విమర్శలు గుప్పించింది. ఈ ప్రమాద వీడియోను షేర్ చేస్తూ రాహుల్‌పై విరుచుకు పడింది.
Voter Adhikar Yatra ❎
Crush Janta Yatra ✅✅
Rahul Gandhi’s car crushed a police constable who was critically injured.
Dynast did not even get down to check on him pic.twitter.com/cTx7ynXmCC— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) August 19, 2025
గత 40 గంటలుగా రాహుల్ బీహార్‌లో చేస్తున్న యాత్రలో ఒక్క నిజంగా మాట్లాడటం లేదని బీజేపీ ధ్వజమెత్తింది. ఎలక్షన్ కమిషన్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్న రాహుల్.. ఓట్ చోరీ అంశానికి సంబంధించి ఆధారాలు చూపెట్టాలని డిమాండ్ చేసింది. ప్రజల విశ్వాసాన్ని రాహుల్ గాయపరుస్తున్నాని మండిపడింది. ఒక విషయాన్ని నిజమని నమ్మాలంటే ఆధారాలు ఉండాలి కదా అని బీహార్ బీజేపీ ప్రశ్నించింది.