
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
బీహార్ సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వె ల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.
సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.
हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।
BJP – 101
JDU – 101
LJP (R) – 29
RLM – 06
HAM – 06
एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।
बिहार है तैयार,
फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025
జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లు
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లు
హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం): 6 సీట్లు
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం): 6 సీట్లు
కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇదీ చదవండి:
బీహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!