breaking news
Bihar Assembly Election 2025
-
పీకే యూ టర్న్? ప్రియాంకను కలిసి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో కాంగ్రెస్‌తో చర్చలు విఫలమై, తీవ్ర విభేదాలు తలెత్తిన మూడేళ్ల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే తాజాగా ఇరు పార్టీల మధ్య మొదలైన మంతనాలు ఎటువైపునకు దారి తీస్తాయో.. పీకే తాజా వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.బిహార్ వైఫల్యంతో పునరాలోచన?బిహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ పేలవమైన ప్రదర్శన కనబరచడం ఈ భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి, కాంగ్రెస్ కీలక భాగస్వామిగా ఉన్న మహాకూటమికి వ్యతిరేకంగా పోటీకి దిగిన జన్ సురాజ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోటీ చేసిన మొత్తం 238 మంది అభ్యర్థులలో 236 మంది (99.16%) తమ డిపాజిట్లను కోల్పోయారు. ఈ ఫలితాలు పీకే ఎన్నికల వ్యూహాలపై, అతని రాజకీయ ప్రస్థానంపై పలు ప్రశ్నలు లేవనెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ కూడా బిహార్‌లో ఘోరంగా విఫలమైంది. 61 స్థానాల్లో పోటీ చేసి, కేవలం ఆరింటిని మాత్రమే గెలుచుకుంది. ఇది ఆ పార్టీ 2020 ఎన్నికల్లో గెలిచిన 19 స్థానాల కంటే చాలా తక్కువ.నిన్నమొన్నటి వరకూ విమర్శించి..2022లో చర్చలు విఫలమైనప్పటి నుండి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై నిరంతరం విమర్శనాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓట్ చోరీ’ ప్రచారం రాష్ట్రంలో ఎన్నికల సమస్య కాదని వాదించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)గురించి పీకే చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇలా నిరంతర విమర్శల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అకస్మాత్తుగా కాంగ్రెస్ కీలక మహిళా నేత ప్రియాంకా గాంధీని కలవడం రాజకీయంగా కొత్త సమీకరణలకు దారితీయవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.2022లో ఎలా బెడిసికొట్టింది?రాజకీయ వ్యూహకర్తగా, నేతగా గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్‌కు గతంలో మంచి అనుబంధం ఉంది. 2021లో జేడీయూ నుండి బహిష్కరణ వేటు పడిన తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌ను పునరుద్ధరించే ప్రతిపాదనతో గాంధీ కుటుంబాన్ని సంప్రదించారు. ఇందుకోసం ఆయన 2022, ఏప్రిల్‌లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఒక వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాటు చేసిన ‘అధికార సాధికార బృందం’ (ఈఏజీ)లో చేరాలనే ప్రతిపాదనను పీకే తిరస్కరించడంతో నాటి చర్చలు అకస్మాత్తుగా ముగిశాయి.అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కోరడంతో..ఇదే తరుణంలో కాంగ్రెస్ నిర్దిష్ట బాధ్యతతో ఈఏజీలో భాగంగా పార్టీలో చేరాలంటూ పీకేని ఆహ్వానించింది. దీనికి పీకే వెంటనే స్పందించారు. ఈఏజీలో చేరి, ఎన్నికల బాధ్యత తీసుకోవాలనే కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించారు. పార్టీలోని నిర్మాణాత్మక సమస్యలను పలు సంస్కరణల ద్వారా పరిష్కరించడానికి నాయకత్వం, సామూహిక సంకల్పం అవసరమని నాడు పీకే ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన తనకు అధిక స్వేచ్ఛ, ప్రాధాన్యత కావాలని కోరారు. అయితే బయటి వ్యక్తి చెప్పినట్లు పార్టీలో నిర్మాణాత్మక మార్పులు చేయడానికి సీనియర్ నాయకత్వం విముఖత చూపిందని తెలుస్తోంది.ఇరు పార్టీలకు అవసరమై..ఇప్పుడు మూడేళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశం మళ్లీ కాంగ్రెస్- పీకే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సంకేతమా? అనేది అందరిలో పలు సందేహాలను లేవనెత్తుతోంది. బిహార్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌కు కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీతో తిరిగి కలిసి పనిచేయాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చని పలువురు అంటున్నారు. అలాగే వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్, భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకత్వం కోసం పీకేను తిరిగి సంప్రదించి ఉండవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ఒకప్పుడు తీవ్ర విభేదాలు తలెత్తిన నేతల మధ్య జరిగిన తాజా భేటీ.. రాబోయే రాజకీయ సమీకరణలపై తప్పక ప్రభావం చూపనుంది.ఇది కూడా చదవండి: తరలిపోనున్న ‘తీహార్’.. ఎక్కడకి? ఎందుకు? -
Bihar: బీఎల్ఓల మరణాలకు‘సర్’ కారణమా?
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా, అంతకుముందు జరిగిన సమ్మరీ రివిజన్ (సర్) ప్రక్రియ వివాదాలు మరో రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. రాబోయే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్రం సన్నద్ధమవుతున్న తరుణంలో ఇవి ఆటంకాలు సృష్టిస్తున్నాయి. ‘రివిజన్’ప్రక్రయ సమయంలో బిహార్ వ్యాప్తంగా 16 మంది బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) వరుస మరణాలు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.గతంలో రాష్ట్రంలో జరిగిన సమ్మరీ రివిజన్ (సర్) ప్రక్రియ సమయంలో అధిక పనిభారం, ఒత్తిడి కారణంగానే పలువురు బీఎల్ఓలు మరణించారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషాద ఘటనలు అట్టడుగు స్థాయిలో పనిచేసే పోల్ సిబ్బంది భద్రత, పని పరిస్థితులపై తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. దీంతో పలువురు ఎన్నికల కమిషన్, పాలక యంత్రాంగాల జవాబుదారీతనంపై ప్రశ్నలను లేవదీస్తున్నారు.ఈ మరణాలపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తూ, ఇవి వ్యవస్థాగత వైఫల్యానికి చిహ్నాలుగా అభివర్ణించాయి. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), పాలక యంత్రాంగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని ఆరోపించాయి. కాంగ్రెస్ నేతలు ఇందుకు బాధ్యులైనవారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశం న్యాయవ్యవస్థకు కూడా చేరింది. హైకోర్టు ఈ సమస్యపై స్పందిస్తూ ఇది పరిపాలనా అధికార పరిధికి సంబంధించినదని పేర్కొంటూ దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఈ ఉదంతం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. కాగా ఎన్నికల సందర్భంలో బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకం. అర్హత కలిగిన ప్రతి గ్రామస్థుడిని లెక్కించేలా ఓటరు నమోదు, ఓటర్ల జాబితాల తయారీకి వారు వెన్నెముకగా నిలుస్తారు. ఈ నేపధ్యంలో వారి మరణాలు పోల్ సిబ్బందిలో నైతికత తగ్గుతుందనే భయాలను రేకెత్తిస్తున్నాయి. అట్టడుగు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పంచాయతీ ఎన్నికలపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపనుందనే మాట వినిపిస్తోంది.ఈ అంశంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పందించింది. బీఎల్ఓ మరణాలను పని ఒత్తిడితో ముడిపెట్టడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, దీనిపై పూర్తి వివరాలు కోరుతూ అన్ని రాష్ట్రాలలోని ముఖ్య ఎన్నికల అధికారుల (సీఈఓ) నుండి నివేదికలను అత్యవసరంగా కోరింది. బిహార్‌లో ‘సర్’ ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తయినప్పటికీ, పని ఒత్తిడిపై ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని ఈసీ అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ వివాదంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ఈసీ సీనియర్ అధికారులు హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: 360 డిగ్రీల్లో శబరిమల దర్శనం.. చూసి తీరాల్సిందే! -
ఓట్ల పర్యాటకాన్ని ఆపేయాలి!
బిహార్‌లో పేరు నమోదు చేయించుకుని అక్కడ ఓటు వేసేందుకు ఢిల్లీ, హరియాణా లాంటి రాష్ట్రాల నుంచి వేలాది ఓటర్లు తరలివెళ్లినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఢిల్లీ జాబితా నుంచి తన పేరు కొట్టేయించుకుని, బిహార్‌లో నమోదు చేసుకున్నారంటూ ఇందుకు ఉదాహరణగా మార్మోగింది. ఇది నిజ మైతే, ఇది చట్టవిరుద్ధమైన ఆచారం.మీ ‘సాధారణ నివాస స్థలం’ ఏదో అక్కడే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలి. భారత ఎన్నికల చట్టాలు ఈ విష యాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి. మీ ఇల్లు, సొంతూరి మీద మీ ప్రేమ... ఇవేవీ ఓటు హక్కు పొందడానికి అర్హతలు కావు. మీరు వాస్తవంగా నివసిస్తున్న చోటు మాత్రమే మీ సాధారణ నివాసం అవుతుంది.సాధారణ నివాసమే ప్రాతిపదికప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 19 ప్రకారం, ఒక వ్యక్తికి తను ‘సాధారణ నివాసి’గా ఉన్న నియోజక వర్గంలో మాత్రమే ఓటరుగా నమోదు చేయించుకోవడానికి అర్హత ఉంటుంది. 17, 18 సెక్షన్లు మరో రెండు నిబంధనలను జత చేశాయి. మీరు ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నమోదు కాలేరు. ఒకే నియోజకవర్గంలోనూ ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదు అయ్యే వీల్లేదు. ఈ రెండు నిబంధనలూ మార్చడానికి వీల్లేనివి (నాన్–నెగోషియబుల్). ‘సాధారణ నివాసి’ అంటే ఏమిటో సెక్షన్ 20 వివరిస్తుంది. సొంత ఆస్తి ఉన్నంత మాత్రాన ఒక ప్రదేశంలో సాధారణ నివాసి కాలేరని ఇది స్పష్టం చేస్తోంది. సాధారణ నివాసం అనేది వాస్తవ ఆధారితంగా ఉంటుంది. నిరంతరం అక్కడే ఉంటున్నారా, లేదా అన్నది ప్రధానం అంటే, మీరు స్వతహాగా అక్కడ ఉంటారు, మున్ముందు కూడా అక్కడే ఉండాలనుకుంటారు. తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నా నివాస హోదా మారదు. చివరిగా, మార్పులు చేర్పులకు సంబంధించి ఏవి తప్పుడు ప్రకటనలు అవుతాయో సెక్షన్ 31 చెబుతోంది.కొత్త ప్రాంతంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వేరే చోట అప్పటికే తన పేరు నమోదై ఉన్నదనే వాస్తవం దాచిపెట్టడం క్రిమినల్ నేరం. దీనికి ఏడాది వరకు జైలు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే వీలుంది. పని నిమిత్తమో, పర్యటనల నిమిత్తమో వేరే ప్రదేశానికి వెళ్లి తాత్కాలికంగా చిరునామాలో లేనంత మాత్రాన అక్కడి ఓటు హక్కు పోదు. అది కొన్ని వారాలు లేనందున పోయేదీ కాదు, పోలింగ్ ముందు అక్కడకు రాగానే వచ్చేదీ కాదు! ఆరు నెలల వ్యవధిని సాధారణ నివాసం కింద భారత ఎన్నికల సంఘం పరిగణిస్తుంది.వ్యూహాత్మక తరలింపులను ఆపాలి!ఓటర్లను బస్సుల్లో తరలించి వలస వెళ్లిన వారంటూ వారి పేర్లను జాబితాల్లో నమోదు చేయడం, తర్వాత ఢిల్లీ లేదా హరి యాణాలో మళ్లీ నమోదు చేయించాలని ప్లాన్ చేయడం ప్రజా ప్రాతి నిధ్యాన్ని పక్కదారి పట్టించడమే! ఆ ప్రాంతంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి సరఫరా, రోడ్లు, పోలీసు వ్యవస్థలను వినియో గించుకునే సాధారణ నివాసుల అభిమతం నియోజకవర్గ ప్రాతి నిధ్యంలో ప్రతిబింబిస్తుందని రాజ్యాంగం తలుస్తోంది. జరుగుతున్న ఈ తరలింపుల ప్రహసనం అందుకు భిన్నం.వాస్తవంగా వలస వెళ్లిన కార్మికుల, విద్యార్థుల ఓట్ల నమోదును కష్టతరం చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పుడు చేయ వలసిందల్లా నిజమైన వలసల నుంచి వ్యూహాత్మక తరలింపులను వేరు చేయాలి. ఈ దిశగా అనుసరించదగిన అయిదు మార్గాలు: (1) నోటీసు ఇచ్చి విచారణ జరిపిన తర్వాత ఒక వ్యక్తి ఆ ప్రదేశంలో సాధారణ నివాసం ఉండటం లేదని తేలితే ఆ వ్యక్తి పేరు జాబితా నుంచి తొలగించడానికి చట్టం ఇప్పటికే వీలు కల్పిస్తోంది. ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఇరుగు పొరుగువారి ప్రకటనలను తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. ఇంట్లో ఉంటున్నదీ లేనిదీ ధ్రువీకరించాలి. సంతకం చేసి నివేదికలు సమ ర్పించాలి. ఈఆర్ఓలు ప్రతి కేసుపై దృష్టి సారించాలి.(2) క్రాస్–స్టేట్ డూప్లికేషన్ నివారణ: వేరొక రాష్ట్ర ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న వ్యక్తుల నుంచి వచ్చే ఫారం6 దరఖాస్తులను ఆటోమేటిక్‌గా గుర్తించేట్లు ఈఆర్ఓ–నెట్లో తగు ఏర్పాట్లు ఉండాలి. అటువంటి అభ్యర్థనల్ని ఆమోదించే ముందు గట్టి రుజువులు (ఇటీవలి అద్దె ఒప్పందాలు, ఉపాధి/విద్య సర్టిఫి కెట్లు, యుటిలిటీ బిల్లులు) తీసుకోవాలి.(3) నేర నిరోధకత: తెలిసీ తప్పుడు ప్రకటన (‘‘నేను మరె క్కడా నమోదు కాలేదు’’) చేస్తూ ఫారమ్ 6ను దాఖలు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం నేరం. వేళ్ల సంఖ్యలో కేసులు ఎంపిక చేసి కఠిన శిక్షలు పడేట్లు చేస్తే, అవే వేలాది హెచ్చ రికలుగా పని చేస్తాయి. లక్ష్యం సామూహిక శిక్ష కాదు, ఉద్దేశ పూర్వకంగా తప్పుదారి పట్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలియజెప్పడం!(4) ఎన్నికల అనంతరం ఆడిటింగ్: పోలింగ్ అనంతరం మూడు నెలలు గడిచాక, సున్నిత ప్రాంతాలలో ‘కొత్త ఓటర్ల‘శాంపిల్ తీసుకుని విశ్లేషించాలి. వారిలో చాలా మంది సంబంధిత ప్రాంతంలో ఎప్పుడూ లేరని తేలితే అది చర్య తీసుకోదగిన సాక్ష్యం అవుతుంది. (5) నిజమైన వలసదారుకు రక్షణ: పేదలు, నిజంగా నివా సాలు మారేవారు, వేరే ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండేవారు తమకు అందుబాటులో ఉండే పత్రాల ద్వారా తమ ఓటు నమోదు చేయించుకోవడాన్ని సులభతరం చేయాలి. బీఎల్ఓ నిర్ధారించిన స్వీయ ధ్రువీకరణ నివాస పత్రం, యజమాని లేదా సంస్థ ఇచ్చే ధ్రువీకరణ పత్రం వంటి వాటిని అంగీకరించాలి. చివరి మాటవిస్తృత చర్చకు దారితీసిన ప్రొఫెసర్ మాటేమిటి? అతడు నిజంగా ఢిల్లీలో సాధారణ నివాసం ఉండకుండా బిహార్‌కు వెళ్లి అక్కడే వాస్తవంగా నివసిస్తూ ఉంటే, బిహార్‌లో అతడి ఓటు హక్కు నమోదు చట్టబద్ధమైనదే. అయితే, అది ఢిల్లీలో తొలగించబడి ఉండాలి. నివాసం మార్చకుండా, ఢిల్లీ జాబితాలో పేరు కొట్టేయించుకుని, బిహార్‌లో ఓటు వేయడానికి అక్కడ నమోదు చేసుకుని ఉంటే, తర్వాత ఢిల్లీ ఓటరుగా మళ్లీ నమోదు చేయించుకోవాలని ప్లాన్ చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలి. రూల్ ఒక చిన్న వాక్యంగా చెప్పగలిగినంత సరళమైనది.మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు వేయండి. మీ తాత ముత్తాతల ఇల్లు తాళం పడిన చోట కాదు! మీ పార్టీ మిమ్మల్ని ఒక వారం పాటు ఉండమని కోరుకున్న చోట కాదు!! పోలింగ్ రోజున సుఖప్రదంగా ఉండే చోట కాదు!! సాధారణ నివాసం అనేది ఆఖరికి విద్యార్థులు, సీజనల్ కార్మికులు, నిరాశ్రయులకు కూడా ఓటరుగా నమోదు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఎన్నికల ‘పర్యాటకం’ ఎప్పటికీ మంచి ప్రజాస్వామ్యం కాదు. ఇలాంటి పర్యాటకానికి ద్వారాలు మూసేయాలి.ఎస్.వై. ఖురేషి వ్యాసకర్త కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ -
బిహార్ ఫలితాలపై పీకే సంచలన వ్యాఖ్యలు..
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అయితే, రిగ్గింగ్‌కు సంబంధించిన ఆధారాలు లేవని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.బిహార్ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. తాజాగా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఓటమి చాలా బాధిస్తోంది. ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు నాకు సరిపోలడం లేదు. ప్రాథమికంగా, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. రిగ్గింగ్ జరిగినట్టు అర్థమవుతోంది. అయితే, దానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు అని అనుకోవచ్చు. ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయి. జన్ సురాజ్ యాత్రలో మా టీమ్ సేకరించిన అభిప్రాయంతో ఓటింగ్ సరిపోలడం లేదు. ఏదో తప్పు జరిగిందని నాకు తెలుస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి బిహార్‌లోని వేలాది మంది మహిళా ఓటర్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బిహార్‌లో 50వేల మంది మహిళలకు 10వేలు ఇవ్వడం కూడా ఫలితాలపై ప్రభావం చూపించిందన్నారు. అలాగే, ఎన్నికల ప్రచారం చివరి నాటికి మా పార్టీ గెలిచే స్థితిలో లేదనే కారణంగా కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో లాలూ జంగిల్ రాజ్ సర్కార్ రావద్దనే కారణంతో ఎన్డీయేకు మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చారు.ఇక, బిహార్ ఎన్నికల్లో 243 సీట్లలో 238 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ.. పెద్దగా విజయం సాధించలేదు. ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలుచుకోలేదు. కేవలం 2 నుండి 3 శాతం ఓట్లను మాత్రమే గెలుచుకుంది. ఆయన పార్టీ అభ్యర్థులలో ఎక్కువ మంది డిపాజిట్లు కూడా కోల్పోయారు.#Exclusive | Jan Suraaj Party chief @PrashantKishor hints at EVM manipulation, says "...wo dikh raha hai kuch toh hua hai. Kya hua hain wo hume pata nahi hai, lekin ye add nahi ho raha." #PrashantKishor #BiharElections2025 @PreetiChoudhry pic.twitter.com/656AuWTGTx— IndiaToday (@IndiaToday) November 23, 2025 -
10వ సారి నితీష్.. అత్యధిక పర్యాయాల సీఎంలు వీరే
పట్నా: నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా మారారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఆయన ప్రమాణం చేశారు. సీఎం నితీష్ మాదిరిగానే అత్యధిక పర్యాయాలు సీఎంలు అయిన ప్రముఖులు వీరే..నితీష్ కుమార్ (బిహార్): 10ప్రతాప్‌సింగ్ రాణే (గోవా): 7జే జయలలిత (తమిళనాడు): 6గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్): 6యశ్వంత్ సింగ్ పర్మార్ (హిమాచల్ ప్రదేశ్): 5ఎం కరుణానిధి (తమిళనాడు): 5ప్రకాష్ సింగ్ బాదల్ (పంజాబ్): 5నారాయణ్ దత్ తివారీ (ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్): 5జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్): 5సేనయాంగ్బా చుబతోషి జమీర్ (నాగాలాండ్): 5రిషాంగ్ కీషింగ్ (మణిపూర్): 5ఫరూక్ అబ్దుల్లా (జమ్ముకశ్మీర్): 5వీరభద్ర సింగ్ (హిమాచల్ ప్రదేశ్): 5లాల్ థన్హావ్లా (మిజోరం): 5ఓం ప్రకాష్ చౌతాలా (హర్యానా): 5డోన్వా డెత్వెల్సన్ లాపాంగ్ (మేఘాలయ): 5పవన్ కుమార్ చామ్లింగ్ (సిక్కిం): 5నవీన్ పట్నాయక్ (ఒడిశా): 5నీఫియు రియో (నాగాలాండ్): 5పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్): 5బిధాన్ చంద్ర రాయ్ (పశ్చిమ బెంగాల్): 4మోహన్ లాల్ సుఖాడియా (రాజస్థాన్): 4చంద్ర భాను గుప్తా (ఉత్తర ప్రదేశ్): 4బన్సీ లాల్ (హర్యానా): 4విలియమ్సన్ ఎ సంగ్మా (మేఘాలయ): 4కె కరుణాకరన్ (కేరళ): 4శరద్ పవార్ (మహారాష్ట్ర): 4భజన్ లాల్ బిష్ణోయ్ (హర్యానా): 4బ్రింగ్టన్ బుహై లింగ్డో (మేఘాలయ): 4నందమూరి తారక రామారావు (ఆంధ్రప్రదేశ్): 4మాయావతి (ఉత్తరప్రదేశ్): 4మాణిక్ సర్కార్ (త్రిపుర): 4మనోహర్ పారికర్ (గోవా): 4ఎన్ రంగసామి (పుదుచ్చేరి): 4నరేంద్ర మోదీ (గుజరాత్): 4శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్): 4బీఎస్ యడియూరప్ప (కర్ణాటక): 4హేమంత్ సోరెన్ (జార్ఖండ్): 4 -
నితీష్ ప్రమాణం వేళ.. ‘పీకే’ మౌనవ్రతం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేసి, రికార్డు సృష్టించిన వేళ.. రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒక రోజుపాటు ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారు. ఆయన ఈరోజు పశ్చిమ చంపారన్‌లోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో ఈ దీక్షను చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విఫలం కావడానికి తానే పూర్లి బాధ్యత వహిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.ఆయన ఈ మౌనవ్రతానికి ముందు పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘బీహార్ ప్రజలు దేని ఆధారంగా ఓటు వేయాలి? కొత్త వ్యవస్థను ఎందుకు సృష్టించాలి? అనే దాని గురించి వారికి వివరించడంలో విఫలమయ్యాను. ఈ వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నాను. ఎన్నికల రాజకీయాలలో తమ తొలి అరంగేట్రం నిరాశపరిచినప్పటికీ, బిహార్‌ను మెరుగుపరచాలనే తన సంకల్పాన్ని నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని’ అన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ భారీ విజయంతో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. 2005, 2010, 2015లో కూడా నితీష్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.ఇది కూడా చదవండి: బిహార్ సీఎంగా నితీష్.. మంత్రులుగా 26 మంది ప్రమాణం -
పదోసారి బిహార్ సీఎంగా నితీశ్!... మంత్రులుగా 26 మంది ప్రమాణం!
పట్నా: జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్ గురువారం పట్నాలోని గాంధీ మైదానంలో రికార్డు స్థాయిలో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. #WATCH | Bihar: Visuals from Gandhi Maidan in Patna, where the swearing-in ceremony of the NDA government in Bihar will take place today. pic.twitter.com/Tiobm83gxp— ANI (@ANI) November 20, 2025సీఎం నితీష్ కుమార్‌తో పాటు జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి, శ్రావణ్ కుమార్, లేషి సింగ్, మొహ్మద్ జమాఖాన్, బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ సింగ్, రామనిషాద్, నితిన్ నబీన్, అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, లఖేంద్ర కుమార్ రోషన్, నారాయణ ప్రసాద్, శ్రేయసి సింగ్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీనికిముందు నితీష్ ఎన్డీఏ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నుంచి అనుమతి తీసుకున్నారు.మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు..సామ్రాట్ చౌదరి (బీజేపీ)విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ)దిలీప్ జైస్వాల్ (బీజేపీ)మంగళ్ పాండే (బీజేపీ)విజయ్ కుమార్ చౌదరి (జేడీయూ)బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ)శ్రావణ్ కుమార్ (జేడీయూ)అశోక్ చౌదరి (జేడీయూ)లేషి సింగ్ (జేడీయూ)మదన్ సాహ్ని (జేడీయూ)సునీల్ కుమార్ (జేడీయూ)రామ్ కృపాల్ యాదవ్ (బీజేపీ)సంతోష్ సుమన్ (బీజేపీ)నితిన్ నబిన్ (బీజేపీ)మహ్మద్ జమా ఖాన్ (జేడీయూ)సంజయ్ సింగ్ టైగర్ (బీజేపీ)అరుణ్ శంకర్ ప్రసాద్ (బీజేపీ)సురేంద్ర మెహతా (బీజేపీ)నారాయణ ప్రసాద్ (బీజేపీ)రామ నిషాద్ (బీజేపీ)లఖేంద్ర కుమార్ రోషన్ (బీజేపీ)ప్రమోద్ కుమార్ (బీజేపీ)సంజయ్ కుమార్ (బీజేపీ)సంజయ్ కుమార్ సింగ్ (బీజేపీ)దీపక్ ప్రకాష్ (బీజేపీ)ఈ జాబితాలో బీజేపీకి చెందిన వారు 14 మంది , జేడీయూ నుంచి ఎనిమిది, చిరాగ్ పార్టీ నుంచి ఇద్దరు, ముస్లిం ఒకరు మొత్తం 26 మంది మంత్రులు ఉన్నారు. VIDEO | Md Zama Khan, Sanjay Singh Tiger, Arun Shankar Prasad, Surendra Mehta, Narayan Prasad, and Rama Nishad take oath as Bihar Ministers at Patna’s Gandhi Maidan.#Biharcabinet (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aF8Bzsm7UR— Press Trust of India (@PTI_News) November 20, 2025 కొత్త మంత్రివర్గ ఏర్పాటులో భాగంగా బీజేపీ, జేడీయూలు అత్యధిక మంత్రి పదవులను పొందాయి. నవంబర్ 26 నుండి మూడు రోజుల పాటు నూతన ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికవుతారు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత కొత్త మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. Nitish Kumar takes oath as the Bihar Chief Minister for the 10th time at Patna's historic Gandhi Maidan pic.twitter.com/zaR6uuKcQ5— ANI (@ANI) November 20, 2025 -
వీడిన ఉత్కంఠ.. బిహార్ సీఎం ఎవరంటే?
పాట్నా: ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో బిహార్ సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడింది. రేపు బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధిపతి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా బిజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాణస్వీకార వేడుక పాట్నాలోని గాంధీ మైదానంలో ఉదయం 11.30 నిమిషాలకు జరగనుంది. అయితే, బిహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై.. ఎన్డీఏ కూటమి నేతలు ఆధిక్యంలో ఉండగా రాష్ట్రానికి తదుపరి సీఎం ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది ఆ సమయంలో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమారేనంటూ జేడీయూ ట్వీట్ చేసింది. కొద్ది సేపటికి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. దీంతో మహరాష్ట్ర తరహా పాలిటిక్స్‌ను కమలం పెద్దలు బిహార్‌లో అప్లయి చేస్తున్నారనే ఊహాగానాలు కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి నేతలు బిహార్ సీఎంగా నితీష్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. నితీష్ కుమార్ తదపరి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమైంది. రేపే నితీష్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ప్రభుత్వం అంగరంగవైభవం ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. -
ఎన్డీఏ పక్షనేతగా నేడు నితీశ్ ఎన్నిక
పట్నా: బిహార్ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతంచేసుకున్న ఎన్డీఏ కూటమి పార్టీలు సీఎం నితీశ్‌కుమార్‌ను బుధవారం తమ ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకోను న్నాయి. నవంబర్ 20న పదోసారి సీఎంగా నితీశ్ ప్రమాణం చేయబోతుండటంతో ఒకరోజు ముందే ఆయన అధికార పక్షనేతగా ఎంపిక ఖరారైంది. బుధవారం ఉదయం 11 గంటలకు పట్నాలో జేడీ(యూ) శాసనసభాపక్ష పార్టీ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో నితీశ్‌ను తమ పక్షనేతగా ఎన్నికోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ పక్షనేత హోదాలో మధ్యాహ్నం 3.30గంటలకు బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహహ్మద్ ఖాన్‌ను కలిసి నితీశ్ తన రాజీనామా లేఖను అందజేయనున్నారు.కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని తెలియజేస్తూ సంబంధిత లేఖను గవర్నర్‌కు నితీశ్ అందజేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి బుధవారంతో ముగియనుంది. పట్నాలో చారిత్రక గాంధీ మైదాన్‌లో 20న జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవంలో నితీశ్‌తోపాటు తామూ ప్రమాణంచేస్తామంటూ మంత్రుల బెర్తుల కోసం పైరవీలు హఠాత్తుగా ఊపందుకున్నాయి. కూటమి పార్టీల మధ్య దీనిపై మల్లగుల్లాలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 14 మందిని కేబినెట్లోకి తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ముఖ్య నేతలు ఆశిస్తున్నారు.అయితే తమ నేతకే స్పీకర్ పదవి దక్కాలని బీజేపీ, జేడీ(యూ) రాష్ట్రనేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జేడీ(యూ) తరఫున విజయ్ చౌదరి, బీజేపీ తరఫున ప్రేమ్ కుమార్ స్పీకర్ పీఠంపై కన్నేశారు. బీజేపీ, జేడీయూల నుంచి తలో ఐదారుగురు కొత్త వాళ్లకు కేబినెట్లో స్థానం కల్పించాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. మాహ్నర్ నుంచి గెలిచిన జేడీయూ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహాను కేబినెట్లోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రులందరికీ అవకాశం ఇవ్వాలని జేడీయూ భావిస్తుండగా కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని బీజేపీ వాదిస్తోంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ(ఆర్వీ) నుంచి ముగ్గురికి, జితన్ రాం మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం నుంచి ఒకరికి అవకాశం దక్కవచ్చు.ఆర్ఎల్ఎం పార్టీ నేతలకూ మంత్రి పదవి వరించే వీలుంది. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, పలువురు మంత్రులు, ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ అమృత్ కుమార్ గాంధీ మైదాన్‌లో మంగళవారం ప్రమాణస్వీకార కార్యక్రమ ఏర్పా ట్లను దగ్గరుండి సమీక్షించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన నున్నారు. వీవీఐపీల తాకిడి ఎక్కువ ఉండటంతో గాంధీమైదాన్ చుట్టూతా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షా లను నాశనం చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముసుగులో ఎన్నికల కమిషన్(ఈసీ) కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి నిరసనగా డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ చేపడతామని ప్రకటించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న సమయంలో ఈసీ వైఖరి తీవ్ర నిరుత్సాహం కలిగించిందని పేర్కొంది. లక్షిత ఓట్లను తొలగించే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగిందని ఆరోపించింది. కేంద్రంలోని బీజేపీ ఛత్రం కింద పనిచేయడం లేదని ఈసీ తక్షణమే నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమావేశమైంది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో మంగళవారంజరిగిన ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఎస్ఐఆర్ జరిగే 12 రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభా పక్షాల నేతలు, పార్టీ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేందుకు ఈసీ ప్రయత్నించడం, దేశ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ‘మేం జనంలోకి వెళతాం. డిసెంబర్ మొదటి వారంలో రాంలీలా మైదాన్‌లో లక్షలాది మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపడతాం.ఈసీ బండారాన్ని బట్టబయలు చేస్తాం’అని వేణుగోపాల్ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిష్పాక్షికంగా ఓటరు జాబితాను రూపొందించాల్సిన ఈసీ..రాజకీయ పక్షాలపై పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అసలైన ఓటర్లను తొలగించేందుకే ఈ ప్రక్రియను ఈసీ హడావుడిగా చేపడుతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయంగా, సంస్థాగతంగా, న్యాయపరంగా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు.ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుతాంఎన్నికల ప్రక్రియ సమగ్రతను పరిరక్షించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఎక్స్‌లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం తగ్గిపోగా, ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో ఈసీ వైఖరి మరింత నిరుత్సాహపూరితంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నట్లు, ఏ రాజకీయ పార్టీకి లోబడి పనిచేయడం లేదని తక్షణం ఈసీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆశ్చర్యం కలిగించని పరాభవం
‘సొంత గుడిసె వేసుకోలేనోడు ఊరంతటికీ వేస్తాడా’ అని ఆఫ్రికాలో ఒక సామెత ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరాభవంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఆ ఫలి తాలు ‘ఆశ్చర్యకరంగా’ ఉన్నాయన్నారు. కానీ అంతకన్నా భిన్నంగా ఉంటేనే ఆశ్చర్య పోవాలి. అక్కడ ఆ పార్టీ 2020లో 70 సీట్లకు పోటీ చేసి, కేవలం 19 గెల వగా... ఈసారి 61కి గానూ 6 స్థానాలు గెలిచింది. మహాగఠ్‌బంధన్ మొత్తంగానే ఓడినప్పటికీ, ఆ కూటమిలోని జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అయినందున దాని గురించి ప్రత్యేకంగా చర్చించటం అవసరమవుతున్నది. రెండేళ్ల క్రితం సగం దేశంలో ‘భారత్ జోడోయాత్ర’ జరిపిన రాహుల్ గాంధీ ఇపుడు బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సాగించి, దేశమంతటా ప్రజా స్వామ్య ప్రియులలో కనీసం కొందరికి కొన్ని ఆశలు కల్పించారు. కానీ, 2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ 21 సంవత్సరాలలో ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగింది ఏమీ లేదు.నాయకత్వానికి సవాలురాహుల్ గాంధీ రాజకీయ ప్రవేశం చేసిన 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటంలో తన పాత్ర ఏమీ లేదు. అంతకుముందటి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన ‘ఇండియా షైనింగ్’ ప్రచారాన్ని ప్రజలు మెచ్చనందున బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఓడిపో యింది. తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ కూటమి రెండవ సారి 2009లో అధికారానికి రావటంలో కొన్ని సంక్షేమ పథకాలు, ఆర్థిక పరిస్థితి పెరుగుదల పాత్ర వహించాయి. ఆ వెనుక 2014లో కాంగ్రెస్ ఓటమిలోనూ రాహుల్ బాధ్యత లేదు. వివిధ కుంభకోణాల వల్ల అది జరిగింది. ఆ విధంగా గుర్తించవలసిందేమంటే, రాహుల్‌కి నాయకత్వ పరీక్ష అంటూ మొదలైంది 2014 నుంచి! అప్పటినుంచి గత 11 సంవత్సరాలుగా ఆయన ఏమి చేశారన్నది ప్రశ్న.వాస్తవానికి అంతకుముందు కూడా రాహుల్ గాంధీ కొన్ని పరి మితమైన పరీక్షలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్‌కు మొదటినుంచీ ఉత్తర ప్రదేశ్ ప్రధాన కార్యక్షేత్రం, బలమైన కేంద్రం. అక్కడ రైతుల పార్టీలు, దళితుల పార్టీలు, సోషలిస్టు పార్టీలు బలపడి వివిధ సామాజిక వర్గాలు దూరమైనందువల్లనే కాంగ్రెస్‌కు పునాది లేకుండా పోయిందని తనకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్లు బోధపరచటంతో, వారి సూచనల ప్రకారం యూపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ గాంధీ నడుం కట్టారు. సోదరి ప్రియాంక ఆయనకు తోడయ్యారు. ఆ రాష్ట్రాన్ని నేడు గెలిస్తే రేపు దేశాన్నంతా గెలవగలమన్నది ఆయన నిర్ణయించుకున్న లక్ష్యం. అందుకు తల్లి దీవెనలు కూడా పొందారు. కానీ, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ బలోపేతం అనే మొదటి పరిమిత పరీక్షలో ఆయన విఫల మయ్యారు. రెండవ పరిమిత పరీక్ష 2007లో పార్టీ ప్రధాన కార్య దర్శిగా నియమితుడై, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు ఇన్ఛార్జ్ కావటం రూపంలో ఎదురైంది. అందుకు సంబంధించి మొదట తగినంత హడావిడి చేసిన ఆయన, ఆ సంస్థలను పునర్ని ర్మించలేకపోయారు.వైఫల్యాలపై అధ్యయనం శూన్యంఇటువంటి పదేళ్ల పరిమిత వైఫల్యాల నేపథ్యం నుంచి, 2014 వచ్చేసరికి రాహుల్ గాంధీపై పార్టీ బాధ్యతలు పూర్తిగా వచ్చి పడ్డాయి. అప్పటికి కాంగ్రెస్ కేంద్రంలో, పలు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా గాంధీ తన సమర్థతను పలు సందర్భా లలో రుజువు చేసిన దశ గడచిపోయింది. పార్టీ సాంకేతికంగా చీల లేదు గానీ పలువురు సీనియర్లు బీజేపీలో చేరటమో, మృతి చెంద టమో, వార్ధక్యం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించ టమో మొదలైంది. పార్టీ నుంచి వివిధ సామాజిక వర్గాలు దూరం కావటం రాహుల్ రాజకీయ ప్రవేశం కన్నా చాలా కాలం క్రితం నుంచే మొదలు కాగా, ఈసరికి బాగా వేగం పుంజుకున్నది. పార్టీ మరికొన్ని రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. సోనియా తరచు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిణామాలన్నింటి జమిలి స్థితి... ఆయన తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవలసి రావటం. పార్టీ నాయకులకు ఒకప్పుడు ఉండిన సలహాదారులు, సహాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు హేమాహేమీలు కాగా, ఈ దశ వచ్చేసరికి దాదాపు అందరూ పనికిరానివాళ్లు, స్వార్థపరులు వచ్చి చేరారు. రాహుల్ గాంధీకి అది మరొక పెద్ద కొరతగా మారింది.ఇటువంటివి చెప్పుకొన్నప్పుడు రాహుల్‌పై కొంత సానుభూతి కలగవచ్చు. కానీ అటువంటి అవసరమేమీ లేదు. ఆ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి. పైన చెప్పుకొన్నట్లు 2004–14 మధ్య పదేళ్ల కాలంలో ప్రతికూల పరిస్థితులు పరిమితమే అయి, తన పరీక్షలు కూడా పరిమితమే అయి, తన మాటకు పార్టీలో ఎంత మాత్రం ఎదురు లేకుండా ఉండినప్పటికీ, ఆయన తన నాయకత్వ సమర్థతను రుజువు చేసుకోలేక పోయారు. పార్టీ పరిస్థితి క్రమంగా క్షీణిస్తూనే పోయింది. పార్టీ ఆయా వర్గాలకు ఎటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల వల్ల; అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆచరణ వైఫల్యాల వల్ల దూరమవుతూ వస్తున్నది? ఆ పరిస్థితి మారాలంటే ఏమేమి చేయాలి? అనే అధ్యయనాలు, ప్రణాళి కలు ఆయనకు ఎప్పుడూ లేకపోయాయి. మౌలికంగా అవి ఉండి ఉంటే, 2014లో కాంగ్రెస్ ఓడి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి ఎదురైనప్పుడు, ఇతరత్రా పైన పేర్కొన్న లోటుపాట్లు ఉండినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం ‘సొంత గుడిసె’ వేసేందుకు సమ కట్టగల స్థితిలో ఉండేవారు.యూపీఏ ఉన్నట్టేనా?అది రాహుల్ గాంధీలో మౌలికంగా లేనందువల్లనే 2014 నుంచి ఇప్పటివరకు ‘సొంత గుడిసె’ వేయలేక పోవటమే గాక, ‘ఊరంతటికీ వేసే ప్రయత్నాలు’ సహజంగానే నెరవేరటం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ వరుసగా మూడవసారి ఓడిపోయింది. కేవలం మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకొన్నది. యూపీఏ కూటమి గత లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలను సాధించి కూడా కేవలం తన వల్ల అంతలోనే గందరగోళంగా మారింది. దాని అజెండా ఏమిటో అర్థం కావటం లేదనీ, ఎన్నికల తర్వాత తిరిగి ఒక్క సమా వేశమైనా జరగలేదనీ, ఇక తమకు దానితో నిమిత్తం లేదనీ, ఒంట రిగా పోటీ చేయగలమనీ, రాహుల్ అధికారంతో వ్యవహరిస్తున్నా రనీ కొందరు భాగస్వాములు ప్రకటించగా... అసలు ఆ కూటమి అన్నదే ఇక లేదని సీపీఎం నాయకుడు ప్రకాశ్ కారత్ వంటివాడు స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ నుంచి స్పందనలు లేక పోగా, కొందరిని బయటకు పంపేట్లు తానే వ్యవహరించారు. కొత్తగా ఒక్క పార్టీ అయినా దగ్గరకు రాలేదు. అట్టహాసపు యాత్ర లేవో చేస్తున్నా, ఆ నినాదాలు ఒక స్థాయిలో మంచివే అయినా, సాధారణ ప్రజల సమస్యలకు, వాటికి సంబంధం ఉండటం లేదు. ఈ విధమైన 21 సంవత్సరాల (2004–25) నేపథ్యాన్ని, 11 సంవత్సరాల (2014–25) నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, రాహుల్ గాంధీ ‘సొంత గుడిసె’ను గానీ, ‘ఊరికి గుడిసె’ను గానీ వేయలేక పోవటంలో ఆశ్చర్యం లేదు; హరియాణా, మహారాష్ట్ర,ఢిల్లీతో మొదలైన పరాభవం ఇపుడు బిహార్‌లోనూ కొనసాVýæడంలో ఆశ్చర్యపడేది ఏమీలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నేను చెప్పేది విను,.. నువ్వే ఉండాలి..!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఎమ్మెల్యే తేజస్వి యాదవ్‌ను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. నిన్న( సోమవారం) జరిగిన పార్టీ శాసన సభ్యుల సమావేశంలో ఈ మేరకు ఏకగీవ్రంగా తేజస్విని ఎంపిక చేశారు. అయితే తేజస్వి యాదవ్‌ను శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే క్రమంలో హైడ్రామానే నడిచిందట. ఆ పదవిని తీసుకోవడానికి తేజస్వి తొలుత ఒప్పుకోలేదట. తనకు ఆ పదవి వద్దని, తాను ఎమ్మెల్యేగా సేవ చేస్తానంటూ అలకబూనారట. అయితే దీనిపై తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ బుజ్జగింపులకు దిగడంతో ఎట్టకేలకు తేజస్వి ఒప్పుకున్నారట. శాసనసభ ప్రతిపక్ష నేతగా కచ్చితంగా తేజస్వినే ఉండాలని నచ్చచెప్పారట లాలూ. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రతిపక్ష నేత పదవిని వద్దనడం సబబు కాదని లాలూ.. తేజస్విని ఒప్పించారట. దాంతో ఎట్టకేలకు తేజస్వి యాదవ్ దిగివచ్చి సరేనన్నారట. దాంతో సోమవారం జరిగిన ఆర్జేడీ పార్టీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది.ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు లాలూ ప్రసాద్ యాదవ్ సందేశాన్ని కూడా ఇచ్చారు. తమ కుటుంబ సమస్యలపై పార్టీ కార్యకర్తలు దృష్టి సారించకుండా, పార్టీ ఎదుగుదల, మెరుగుదల కోసం పాటు పడాలని సూచించారు. తమ కుటుంబంలో సమస్యను తాను చూసుకుంటనని, కార్యక్తరలు ఎవరూ దీనిపై చింతించాల్సిన అవసరం లేదని ధైర్యం నింపే యత్నం చేశారు.ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 25 సీట్లను మాత్రమే గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లను గెలుచుకున్న ఈ పార్టీ.. ఇప్పటి ఎన్నికల్లో మాత్రం ఘోరంగా చతికిలబడింది. కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు పార్టీలు మహాకఠ్ బంధన్‌గా ఏర్పడి పోటీకి దిగినా ఎన్డీఏకు అడ్డుకోలేకపోయాయి. ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో గెలిచి బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇదీ చదవండి:నేనున్నా.. చూసుకుంటా: లాలూ ప్రసాద్ యాదవ్ -
Bihar: ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’.. కొత్త ఎమ్మెల్యేలకు పండుగే!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు నూతన సర్కారు నుంచి బంపర్ బహుమతి అందుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన 243 మంది ఎమ్మెల్యేల కోసం పట్నాలోని దరోగా రాయ్ పాత్లో నిర్మించిన 181 అధునాతన డ్యూప్లెక్స్‌ల నిర్మాణం పూర్తయ్యింది. అంతకుముందు ఉన్న 62 బంగ్లాలకు అదనంగా నిర్మించిన ఈ నివాసాలు మొత్తం 44 ఎకరాల క్యాంపస్‌లో విస్తరించి ఉన్నాయి. ఈ నూతన భవనాలను చూసినవారంతా ఇవి ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’అని అంటున్నారు.ప్రతి యూనిట్ సుమారు 3,693–3,700 చదరపు అడుగుల విస్తీర్ణంతో 4BHK ఫార్మాట్లో ఈ ఇళ్లను నిర్మించారు. వాటిలో విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి డ్యూప్లెక్స్ లేఅవుట్ ఎంతో ప్లానింగ్‌తో కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్మెల్యేలకు అవసరమైన గెస్ట్ రూమ్, పీఏ రూమ్, ఆఫీస్ రూమ్,కిచెన్ ఉన్నాయి. మొదటి అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్తో సహా మూడు గదులు, మొత్తం ఆరు టాయిలెట్లు ఉన్నాయి. అన్ని గదులలో ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హాస్టల్, క్యాంటీన్, కమ్యూనిటీ సెంటర్ తదితర అదనపు సౌకర్యాలను క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు.ఈ కొత్త కాంప్లెక్స్ పర్యావరణ అనుకూలతలతో నిర్మితమయ్యింది. భవన నిర్మాణంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. వర్షపునీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, మురుగునీటిని శుద్ధి చేసి, తోటల పెంపకానికి తిరిగి ఉపయోగించే ప్రక్రియను అమలు చేస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయడానికి ఎల్ఈడీ వీధి దీపాలను వినియోగిస్తున్నారు. క్యాంపస్‌లో పచ్చదనాన్ని పెంపొందించడానికి పచ్చని చెట్లను పెద్ద ఎత్తున నాటారు. ఈ అత్యాధునిక సౌకర్యాలు, పర్యావరణ అనుకూల చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి డ్యూప్లెక్స్పై దానిని కేటాయించిన ఎమ్మెల్యే పేరు, నియోజకవర్గ సంఖ్యను రాశారు. తద్వారా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలతో మరింత సమర్థవంతంగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఇది కూడా చదవండి: సాయుధపోరుతో మొదలై.. ‘హిడ్మా’ జీవితం సాగిందిలా.. -
బిహార్ ‘ఫలితం’పై వివాదం.. మేనల్లుడు హత్య
గుణ: బీహార్ ఎన్నికల ఫలితాలపై సరదాగా మొదలైన చర్చ చివరికి రక్తపాతానికి దారి తీసింది. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల వయస్సున్న శంకర్ మాంఝీ తన సొంత మామల చేతిలో హత్యకు గురయ్యాడు. బీహార్‌లోని శివహార్ జిల్లాకు చెందిన శంకర్ బతుకుదెరువు కోసం గుణకు వచ్చి, కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న తన మేనమామలు రాజేష్ మాంఝీ (25), తూఫానీ మాంఝీ (27)లతో పాటు ఉంటున్నాడు.. ఈ ముగ్గురు మధ్య మొదలైన రాజకీయ వాదన చివరికి విషాదానికి దారితీసింది.రాత్రివేళ మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురూ బిహార్ ఎన్నికల ఫలితాల గురించి వాదించుకోవడం మొదలుపెట్టారు. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనూప్ భార్గవ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించిన వివరాల ప్రకారం శంకర్.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి మద్దతుదారుడు. అతని మామలు రాజేష్, తూఫానీలు జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ) పార్టీకి మద్దతు ఇచ్చారు. పార్టీలపరమైన అభిమానం వారిని ఉన్మాదులను చేసింది. మాటల యుద్ధం కాస్తా శారీరక ఘర్షణకు దారితీసింది.రాజేష్, తూఫానీలు, శంకర్‌ను దారుణంగా కొట్టి, కనీస కనికరం లేకుండా, అతనిని పక్కనే ఉన్న బురద గుమ్మి దగ్గరకు లాక్కెళ్లారు. తరువాత అతనిని నేలకేసి కొట్టి, ఊపిరాడకుండా చేసి, బరదలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన శంకర్‌ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. శంకర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చేలోగానే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంట్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ భార్గవ నేతృత్వంలో రాజేష్ మాంఝీ, తూఫానీ మాంఝీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ తమ మేనల్లుడిని తామే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. నిందితులపై పోలీసులు హత్య కేసు (సెక్షన్ 302) నమోదు చేశారు. ఈ ఘటనతో గుణలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఇది కూడా చదవండి: ‘మిషన్ బెంగాల్’: బూత్ స్థాయి నుంచే ‘మమత’పై బీజేపీ దాడి? -
‘మిషన్ బెంగాల్’: బూత్ స్థాయి నుంచే ‘మమత’పై బీజేపీ దాడి?
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఎ) ఘన విజయం సాధించిన తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటను బద్దలు కొట్టడానికి ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నదని ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ తన అభినందన ప్రసంగంలో బిహార్ నుండి పారే గంగా నది మాదిరిగానే, బీజేపీ విజయం బెంగాల్‌కు కూడా విస్తరిస్తుందని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా బెంగాల్‌తో సహా మరికొన్ని రాష్ట్రాలలో సొంత ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడే బీజేపీ ఎదుగుదల పరిపూర్ణమవుతుందని గతంలోనే పేర్కొన్నారు.సంస్థాగత బలోపేతంపశ్చిమ బెంగాల్లో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తోంది. బెంగాల్‌లోని మొత్తం 91,000 బూత్‌లలో, బీజేపీ ఇప్పటికే సుమారు 70,000 బూత్‌లలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇది బూత్-స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పునాదిగా పనిచేస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్, ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు అప్పగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.‘రివిజన్’ పూర్తయ్యాక..బెంగాల్లో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కసరత్తు పూర్తయ్యే వరకు వేచివుండాలని బీజేపీ యోచిస్తోంది. బీహార్‌లో మాదిరిగానే పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో మరణించిన ఓటర్ల తొలగింపు జరుగుతుందని బీజేపీ భావిస్తోంది. గతంలో వామపక్షాలు శాస్త్రీయ రిగ్గింగ్ ద్వారా జాబితాలోని ఉన్న చనిపోయిన ఓటర్ల తరపున తమ కార్యకర్తలతో ఓటు వేయించి ఎన్నికలను గెలిచేవారని, అయితే ఎస్ఐఆర్ తర్వాత ఇది గణనీయంగా తగ్గుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక బీజేపీ నేతలు బూత్ స్థాయి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.తృణమూల్ ఉచ్చులో పడకుండా..రాష్ట్రంలోని బీజేపీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడం, రాష్ట్ర యూనిట్లో క్రమశిక్షణను కాపాడటం ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ ముందుకు సాగుతోంది. రాష్ట్ర నేతలను అనవసరమైన వాక్చాతుర్యాన్ని మానుకోవాలని, ప్రజలను ఆక్టటుకునేందుకు సొంత కథనాలను సృష్టించే తృణమూల్ ఉచ్చులో పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. సీనియర్ నేతలు మాత్రమే నాయకత్వం వహించేలా ప్రచారాన్ని సాగించి, ఐక్యతా సందేశాన్ని పంపాలని పార్టీ యోచిస్తోంది. సమిష్టి నాయకత్వం, ప్రధాని మోదీ పనితీరుపై మాత్రమే ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిందని సమాచారం.క్షీణిస్తున్న శాంతిభద్రతలను హైలెట్ చేస్తూ..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లేవనెత్తాలనుకుంటున్న అతిపెద్ద సమస్య మహిళల భద్రత. మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, మహిళలపై రోజూ దారుణాలు జరుగుతున్నాయని, ఆర్జీ కర్ ఘటన, దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని ప్రధాన సమస్యలుగా బీజేపీ నేతలు హైలైట్ చేయనున్నారు. పరిశ్రమలు లేకపోవడం వల్ల ఉపాధి లేమి, వలసలు పేదరికం, ఆర్థిక అస్థిరత మొదలైనవాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ యోచిస్తోంది. టీఎంసీ అందిస్తున్న ‘లక్ష్మీ భండార్’ పథకానికి బదులుగా పశ్చిమ బెంగాల్‌లోని 1.5 కోట్ల మహిళలకు మహిళల ఉపాధికి రూ. 10,000 అందించాలని ఎన్డీఏ నిర్ణయించిందని తెలుస్తోంది.టార్గెట్ ‘160’పశ్చిమ బెంగాల్లో బీజేపీ తన ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఇక్కడి వంశవాద రాజకీయాలు, అవినీతిని లక్ష్యంగా చేసుకోనుంది. ముస్లింలను సంతృప్తి పరచడం లాంటి ఆరోపణలతో టీఎంసీని ఇరుకున పెట్టడం బీజేపీ దగ్గరున్న మరొక వ్యూహంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏదో ఒక సమయంలో బీజేపీ నేతలు గెలిచిన 120 అసెంబ్లీ సీట్లు ఇప్పటికే ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సీట్లతో పాటు అదనంగా మరో 40 నుంచి 50 సీట్లపై కేంద్రీకరించి 160 సీట్ల లక్ష్యాన్ని సాధించడానికి బీజేపీ కృషి చేస్తోందని సమాచారం. ఇది కూడా చదవండి: ‘చనిపోలేదు.. ఇప్పుడే పుట్టింది’.. ‘జన్ సురాజ్’పై పోస్ట్‌మార్టం -
సీఎంగా పదోసారి
పట్నా: అన్ని వర్గాల ఓటర్ల ఆశీస్సులు పొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రికార్డుస్థాయిలో పదోసారి సీఎంగా ప్రమాణంచేయబోతున్నారు. ఈ ప్రక్రియకు సోమవారం తొలి అడుగు పడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటులోభాగంగా పట్నాలో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను నితీశ్ కలిసి తన రాజీనామా లేఖను అందించారు. బుధవారం మళ్లీ కలిసి తనకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల జాబితాను అందజేయనున్నారు. నవంబర్ 19వ తేదీన నితీశ్‌ను అధికార పక్ష నేతగా ఎన్నుకోబోతున్నట్లు జనతాదళ్(యునైటెడ్) పార్టీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. పట్నాలో నవంబర్ 20వ తేదీన గాంధీమైదాన్‌లో జరిగిన భారీ ప్రమాణస్వీకారోత్సవంలో నితీశ్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణంచేయబోతున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే వేదికపై మరి కొందమంది నేతలు సైతం కేబినెట్ మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు. ప్రధాని మోదీ, పలువురు ఎన్డీఏ కూటమి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ప్రమాణస్వీకార కార్య క్రమానికి విచ్చేయ నున్నారు. కేబినెట్ మంత్రులుగా తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ, జేడీయూసహా ఎన్డీఏలోని కీలక భాగస్వామ్య పార్టీల ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. లాబీయింగ్ బెడద హఠాత్తుగా పెరిగిందని జేడీయూ వర్గాలు తెలిపాయి. తొలిరోజు నితీశ్‌తోపాటు ఐదారు మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేసే అవకాశముంది. కొత్త కేబినెట్లో మహ్నార్ నియోజకవర్గంలో గెలిచిన జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ సింగ్ కుష్వాహా చేరే వీలుంది. లోక్‌జనశక్తి(ఆర్వీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, హెచ్ఏఎంఎస్ చీఫ్ జితన్ రాం మాంఝీ, ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహాల కేబినెట్ బెర్త్ ఖరారైందని తెలుస్తోంది. ఎల్జేపీ(ఆర్వీ)కి మూడు, హెచ్ఏఎంఎస్, ఆర్ఎల్ఎంకు చెరొకటి మంత్రి పదవి దక్కొచ్చు. బీజేపీ నుంచి 16, జేడీయూ నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణంచేసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రీయలోక్‌దళ్(ఆర్జేడీ), కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీల మహాగఠ్‌బంధన్ తరఫున బిహార్ అసెంబ్లీలో విపక్షనేతగా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ చెప్పారు. ఎన్డీఏ కూటమి తర్వాత రాష్ట్రంలో ఆర్జేడీ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 25 చోట్ల గెలిచింది. ఫలితాల్లో ప్రజల మనోగతం ప్రతిబింబించట్లేదని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. దీంతో ఈవీఎంలలో అవకతవకల అంశాన్ని కోర్టులో సవాల్‌చేసే వీలుంది. -
ఇక ‘1800’పై బీజేపీ గురి!
బీజేపీ.. ఇటీవల బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు 202 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, అందులో బీజేపీ 89 సీట్లతో దుమ్ములేపింది. ఇక మరో ఎన్డీఏ పక్షం జేడీయూ 85 సీట్లను సాధించి.. బీజేపీ కంటే వెనుకబడింది. దాంతో బిహార్‌లో బీజేపీ ప్రతిష్ట మరింత పెరిగింది. ఇదిలా ఉంచితే, 2004 నాటికి బీజేపీ ఓవరాల్ ఎమ్మెల్యేల సంఖ్య 1035 ఉండగా, నేటికి ఆ సంఖ్య మరింత ముందుకెళ్లింది. 2025 నాటికి బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 1654గా ఉంది. ఈ విషయాన్నే బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ హైలైట్ చేశారు. సోమవారం(నవంబర్ 17వ తేదీ) దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎలా తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకెళుతుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు. తాము ప్రస్తుతానికి సాధించిన సంఖ్య ఏదైతే ఉందో అది బీజేపీ రాజకీయ చరిత్రలో అత్యధికమన్నారు. మున్ముందు కూడా తమ పార్టీ వికాసం ఇలానే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారాయన. రాబోయే రెండేళ్లలో తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 1800కు చేరుతుందనే ధీమా వ్యక్తం చేశారు మాలవీయ. -
‘చనిపోలేదు.. ఇప్పుడే పుట్టింది’.. ‘జన్ సురాజ్’పై పోస్ట్‌మార్టం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్డీఏ ప్రభుత్వం మరోమారు కొలువుదీరబోతోంది. అయితే ఇంతలో ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన పార్టీలు తమను తాము విశ్లేషించుకోవడం మొదలుపెట్టాయి. ఈ కోవలోనిదే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’.గణాంకాలతో సమాధానంబీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినప్పటికీ ‘జన్ సురాజ్’ తన రాజకీయ పయనానికి శుభారంభం పలికిందని ‘ఇండియా టుడే’ తన విశ్లేషణలో పేర్కొంది. అత్యంత క్లిష్టమైన బిహార్ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ఈ పార్టీ చనిపోయిందంటూ అంటున్నవారికి, ఎన్నికల గణాంకాలు గట్టి సమాధానం ఇస్తున్నాయని వివరించింది. సున్నా సీట్లు గెలుచుకున్నప్పటికీ, పార్టీ సాధించిన బలమైన 3.4% ఓట్ల వాటాను విశ్లేషకులు ఒక ముఖ్యమైన పునాదిగా చూస్తున్నారు. ఇది బీహార్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న బీఎస్పీ, ఏఐఎంఐఎం, మరో మూడు వామపక్ష పార్టీల సంయుక్త ఓట్ల వాటా కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలు సంప్రదాయ రాజకీయాలను ధిక్కరిస్తూ, ప్రజా సమస్యలపై ప్రచారం చేసిన ప్రశాంత్ కిషోర్ ప్రయత్నానికి కనీస ఆమోదం లభించిందని స్పష్టం చేస్తున్నాయి.‘కాంస్య పతక విజేత’గా..జన్ సురాజ్ అరంగేట్రాన్ని లోతుగా పరిశీలిస్తే, పార్టీ ప్రభావం కేవలం ఓట్ల వాటాకే పరిమితం కాలేదని తెలుస్తోంది. పార్టీ పోటీ చేసిన 238 స్థానాల్లో దాదాపు 54% అంటే 129 నియోజకవర్గాల్లో ఇది మూడవ స్థానంలో నిలిచి ‘కాంస్య పతక విజేత’గా అవతరించింది. సరన్ జిల్లాలోని మార్హౌరా అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి 58,190 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. సగటున ప్రతి సీటుకు 7,000 కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. అయితే 238 మంది అభ్యర్థులలో 236 మంది డిపాజిట్లు కోల్పోయారనేది నిజమే అయినా, చన్పాటియా, సహర్సా తదితర 33 నియోజకవర్గాల్లో ‘జన్ సురాజ్’ ఓట్ల సంఖ్య ఎన్డీఏ లేదా మహాఘట్బంధన్ గెలుపు ఆధిక్యాన్ని మించిపోయి, ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందనడంలో సందేహం లేదని ‘ఇండియా టుడే’ పేర్కొంది.ఆదర్శవాద రాజకీయం..మరోవైపు ప్రశాంత్ కిషోర్ అనుసరించిన ఆదర్శవాద రాజకీయ విధానం సీట్ల రూపంలోకి మారకపోయినా, ఈ అంశాలు ప్రజలకు చేరాయి. రాష్టంలోని నిరుద్యోగం, వలసలు, విద్య, ఆరోగ్యం తదితర సమస్యలపై ప్రశాంత్ కిశోర్ దృష్టి సారించారు. అంతేకాకుండా నేర చరిత్ర లేని అధికారులు, విద్యావేత్తలు, వైద్యులు, సామాన్యులను అభ్యర్థులుగా నిలబెట్టిన ఏకైక పార్టీగా ‘జన్ సురాజ్’ నిలిచింది. కులం, మతం తదితర అంశాల అధారంగా ఓటింగ్ జరిగే రాష్ట్రంలో కొత్త పార్టీ తన మొదటి ప్రయత్నంలో విజయాన్ని సాధించలేకపోయింది.వెబ్సైట్లో దక్కిని స్థానం?అయితే ఎన్నికల సంఘం (ఈసీఐ)వెబ్సైట్లో జన్ సురాజ్ సాధించిన 3.4% ఓట్ల వాటాను ప్రత్యేకంగా చూపించకపోవడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 0.3% ఓట్లు సాధించిన పార్టీల పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ, జన్ సురాజ్ మాత్రం ‘ఇతరులు’ వర్గంలోకి నెట్టివేయడం ఆశ్చర్యం కలిగించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ చర్య సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. జన్ సురాజ్ పార్టీ మొత్తం 16.77 లక్షలకు పైగా ఓట్లను సాధించింది. ఇది బీహార్‌లోని ఓటర్లలో గణనీయమైన సంఖ్య.రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపుఈ ఎన్నికల అగ్నిపరీక్ష ‘జన్ సురాజ్’ రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది. పాదయాత్రలు, వివిధ సమస్యాత్మక అంశాల ఆధారిత ప్రచారం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు సాధించడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. సంప్రదాయ రాజకీయ శక్తుల ఓటు బ్యాంకును చీల్చగల సామర్థ్యాన్ని పార్టీ ప్రదర్శించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ చూపిన తొలి ప్రదర్శన.. భవిష్యత్తులో బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ యూటర్న్.. ఎప్స్టీన్ ఫైల్స్‌పై కొత్త ప్రకటన -
Bihar: 20న సీఎంగా నితీష్ ప్రమాణం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని భావిస్తున్నారు. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంలతో కూడిన నూతన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి పట్నాలోని గాంధీ మైదానం వేదికకానుంది.జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నవంబర్ 20 (గురువారం)న బిహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించనున్నారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ఎన్డీఏ అగ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారన్నారు.ఈ కార్యక్రమం కోసం గాంధీ మైదాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నవంబర్ 17 నుండి 20 వరకు గాంధీ మైదాన్‌ను సాధారణ ప్రజల సందర్శనకు మూసివేయనున్నారు. కాగా మిత్రపక్షాల మధ్య క్యాబినెట్ పదవుల పంపిణీకి ఫార్ములాను ఖరారు చేసినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. జెడీయూ,బీజేపీతో పాటు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జెపీ (ఆర్వీ), మాంఝీ నేతృత్వంలోని హెచ్ఎఎంఎస్, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎంలు నూతన ప్రభుత్వంలో చేరనున్నాయి. రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఎల్జేపీ (ఆర్వీ)కి మూడు బెర్తులు లభించే అవకాశం ఉంది. హెచ్ఎఎంఎస్, ఆర్ఎల్ఎంలకు ఒక్కొక్క బెర్తు లభించనున్నదని సమాచారం. -
మంత్రి పదవులకు ‘ఫార్ములా’
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సొంతం చేసుకున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. నూతన మంత్రివర్గం కూర్పుపై బీజేపీ, జేడీ(యూ)తోపాటు కూటమి పక్షాల మధ్య తొలి దశ చర్చలు ఇప్పటికే ముగిశాయి. మంత్రి పదవుల పంపకంపై ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఒక ఫార్ములాపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున తీసుకోవడమే ఈ ఫార్ములా సారాంశం. ఈ లెక్కన ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లు సాధించింది కాబట్టి ఫార్ములా ప్రకారం ఆ పారీ్టకి 14 మంత్రి పదవులు లభిస్తాయి. జనతాదళ్(యునైటెడ్)కు సైతం ఇదే సూత్రానికి అనుగుణంగా మంత్రి పదవులు కేటాయిస్తారు. ఎలాంటి గందరగోళానికి, వివాదానికి తావులేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే పక్షాలు నిర్ణయానికి వచ్చాయి. ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించాలన్న దానిపై మరోసారి చర్చించబోతున్నారు ఢిల్లీలో నేడు కీలక సమావేశం జేడీ(యూ) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌కుమార్ ఝా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు పూర్తి చేసుకొని ఆదివారం పట్నాకు తిరిగివచ్చారు. ఆయన సోమవారం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోబోతున్నారు. జేడీ (యూ) శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుపై చర్చిస్తారు. సోమవారమే ఈ సమావేశం జరుగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ఎన్డీయే పక్ష నాయకుడిని ఎన్నుకొనే ప్రక్రియను ఈ నెల 18వ తేదీలోగా పూర్తిగా చేయాలని నిర్ణయానికొచ్చారు. ఎన్డీయేలోని చిన్న పారీ్టలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నాయి. హిందుస్తానీ అవామీ మోర్చా నాయకుడు జితన్‌రామ్ మాంఝీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. రా్రïÙ్టయ లోక్‌మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లోక్‌జనశక్తి పార్టీ(రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ సైతం బీజేపీ అధిష్టానంతో చర్చలకు సిద్ధమయ్యారు. మంత్రి పదవుల పంపకం విషయంలో ఎన్డీయే పక్షాల మధ్య కీలక భేటీ సోమవారం జరగనున్నట్లు సమాచారం. నేడు బిహార్ కేబినెట్ భేటీ బిహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను ఎన్నికల సంఘం బిహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వరలో సోమవారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రస్తుత 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమరి్పస్తారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎన్డీయే ప్రకటిస్తుంది. తమను ఆహా్వనించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేస్తుంది. తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ కుమారే? బిహార్ నూతన సీఎంతోపాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కోసం పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎన్డీయే వర్గాలు వెల్లడించాయి. మోదీ షెడ్యూల్‌ను బట్టి తేదీని ఖరారు చేస్తామని తెలిపాయి. బిహార్ సర్కార్ ప్రమాణ స్వీకారానికి మోదీపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యమంత్రి నితీశ్ ప్రమా ణ స్వీకారం చేస్తారని జేడీ(యూ) నేతలు స్పష్టంచేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎం ఎవరన్నదానిపై ఊహాగానాలకు ఇంకా తెరపడలేదు. నితీశ్ కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారా? లేక బీజేపీ నాయకుడే సీఎం అవుతారా? అనేది అతి త్వరలో తేలిపోనుంది. 18 మంది మంత్రుల ప్రమాణం? సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో ముఖ్యమంత్రితోపాటు 18 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో మొత్తం నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరికి మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే పార్టీ నుంచి రాంకృపాల్ యాదవ్, మంగళ్ పాండే కూడా రేసులో ఉన్నారు. లోక్ జనశక్తి(రామ్‌విలాస్), రా్రïÙ్టయ లోక్‌మోర్చా కూడా బిహార్ కేబినెట్లో చేరబోతున్నాయి. ఈసారి మంత్రివర్గంలో 30 నుంచి 32 మంది ఉండవచ్చని తెలుస్తోంది. జేడీ(యూ), బీజేపీల నుంచి సమాన సంఖ్యలో మంత్రులు కానున్నారు. చిరాగ్ పాశ్వాన్ పారీ్టకి మూడు మంత్రి పదవులు, జితన్‌రామ్ మాంఝీ, ఉపేంద్ర కుషా్వహా పార్టీల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశం ఉంది. మొత్తం 36 మంది మంత్రులు ఉండవచ్చు. -
‘నాన్నకు కిడ్నీ ఇచ్చి చెడ్డదాన్నయ్యాను!’
పాట్నా: గోరుచుట్టుపై రోకటి పోటులా అన్న చందంగా తయారైంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాభవంతో సతమతమవుతున్న లాలూకు ఇప్పుడు కుటుంబ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లాలూ కుమార్తె, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తేజస్వీ ఆయన సహాయకులే నన్ను బయటకు పంపారు. అసభ్యకరంగా తిట్టారు. చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు. నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడను. నన్ను అనాథను చేశారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తరువాత ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ (ఆర్జేడీ) ఇలా ఎందుకు ఓడిపోయింది? అని. ఈ పరాజయానికి కారణం ఎవరు? కానీ మీరు సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లు తీస్తే చాలు.. వెంటనే ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. అవమానిస్తారు, దుర్భాషలాడతారు. నన్ను కూడా అలాగే చేశారు. నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు. నాకంటూ కుటుంబం లేదు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ అడగండి. వాళ్లందరూ ఒక్కటై.. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు’ అని సింగపూర్ వెళుతూ పాట్నా ఎయిర్‌పోర్టులో మీడియా ఎదుట వాపోయారు. కుటంబంలో కిడ్నీ చిచ్చు 2022లో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రోహిణీ ఆచార్య కిడ్నీ దానం చేశారు. రోహిణీ వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే ఆరోపణలు,పుకార్లు లాలూ కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై రోహిణీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘నా తండ్రికి కిడ్నీ దానం చేసి నేను చెడ్డదాన్నయ్యాను. నా అనుకున్న నా వాళ్లే నాపై దూర్భషలాడారు. నా మురికి కిడ్నీని నాన్నకు మార్పిడి చేయించానని, ప్రతి ఫలంగా కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎంపీ టికెట్‌ను తీసుకున్నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను పాపం చేశాను. నా భర్త, నా ముగ్గురు పిల్లల కంటే నా తండ్రే నాకు ఎక్కువ అనుకున్నా. అందుకే నా తండ్రికి కిడ్నీ దానం చేయాల్సి వస్తే నా భర్తను,పిల్లల్ని,నా అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా దేవుడు, నా తండ్రి లాలూని కాపాడుకోవడానికి కిడ్నీ ఇచ్చాను. అలలాంటి ఇప్పుడు వాళ్లకు నేను చెడ్డదాన్నయ్యాను’ అని ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. కాగా లాలూ కుటుంబంలో తాజాగా పరిణామాలు బిహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రోహిణి ఆచార్య ఆరోపణలు, ఆమె కుటుంబంతో విభేదాలు, పార్టీ పరాజయం ఇవన్నీ కలిపి ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. রোহিনী আচার্যকে ত্যাজ্য করার অভিযোগ যাদব পরিবারের বিরুদ্ধে | Rohini Acharya#rjd #rjdnews #biharelection2025 #biharelectionresults #biharnews #laluprasadyadav #tejashwiyadav #eisamay #eisamayonline pic.twitter.com/fvSRBJsjU6— Ei Samay (@Ei_Samay) November 16, 2025 -
ప్రజాధనం దుర్వినియోగం
పట్నా: ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకువశ్నిచ్చిన రూ.14 వేల కోట్లను బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడానికి బదులుగా సీఎం నితీశ్ ప్రభుత్వం దారి మళ్లించిందని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేసి, వారిని మశ్నిచ్చిక చేసుకునేందుకు వాడుకుందని విమర్శించారు. ఇది కశ్నిచ్చితంగా ప్రజాధనాన్ని దురి్వనియోగం చేయడమేనన్నారు. ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాల్పడిన అనైతిక చర్యగా ఆయన అభివరి్ణంచారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించడం తెల్సిందే. ఈ ఫలితాలను ప్రభావితం చేసిన అంశాల్లో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయడం కీలకంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ‘ఎన్నికల ఫలితాలను కొనుగోలు చేశారు. జూన్ 21వ తేదీ నుంచి పోలింగ్ జరిగే వరకు అధికారపక్షం ఏకంగా రూ.40 వేల కోట్లను ఖర్చుపెట్టింది. ప్రజాధనాన్ని ప్రజల ఓట్లను కొనేందుకు వాడుకుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి కేవలం గంట ముందుగా మహిళల బ్యాంకు అకౌంట్లకు డబ్బును బదిలీ చేసింది. ఇందుకు ప్రపంచబ్యాంకు నిధులను వాడినట్లు మాకు తెల్సింది’అని జన్‌సురాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ తెలిపారు. ఖజానా ఉన్న డబ్బంతా ఎన్నికల్లో గెలవడానికే నితీశ్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు మిగిలింది ఖాళీ ఖజానాయేనని ఆ పార్టీ ప్రతినిధి పవన్ వర్మ తెలిపారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.4.06 లక్షల కోట్లకు చేరుకోగా రోజుకు రూ.63 కోట్ల చొప్పున వడ్డీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు. -
జంగిల్‌రాజ్ భయంతో మా ఓటర్లు ఎన్డీయేకి ఓటేశారు: ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయిన మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఎన్డీయే గెలుపుపై తనదైన విశ్లేషణ చేశారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాగఠ్ బంధన్ అధికారంలోకి వచ్చిన పక్షంలో జంగిల్ రాజ్ మళ్లీ వస్తుందనే భయంతో తమ పార్టీ ఓటర్లు కొందరు ఎన్డీయే పక్షాల అభ్యర్థులకు ఓటు వేశారని వివరించారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో సీమాంచల్ ప్రాంతంలోని ఓట్లన్నీ ఒకే పక్షానికి గంపగుత్తగా పడ్డాయని ఆ పార్టీ నేత ఉదయ్ సింగ్ చెప్పారు. వీరిద్దరూ శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. జంగిల్ రాజ్ ఉందని తాను చెప్పలేనన్న ప్రశాంత్ కిశోర్..తమ పార్టీ ఓటర్లు మాత్రం ఆ భయం వల్లే ఎన్డీయేకు ఓటేశార న్నారు. కాంగ్రెస్‌తోగానీ, మహాగఠ్ బంధన్‌లోని ఏ ఇతర పార్టీతోనూ లేని ఇబ్బంది ఆర్జేడీతో ఉన్నట్లుగా ప్రజలు భావించారని తెలిపారు. ముస్లిం వర్గం తమను ఇంకా పూర్తిగా నమ్మలే దంటూ ఆయన..దీర్ఘకాలంలో వారి మద్దతుల భిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.40 వేల కోట్లను ఎన్డీయే ప్రభుత్వం వెదజల్లిందన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తెచ్చిన రూ.14 వేల కోట్లను సైతం ఉచితాల మళ్లించారని ఆరోపించారు. -
‘ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్’ను తిరస్కరించారు
సూరత్: ముస్లింలీగ్–మావోయిస్టు కాంగ్రెస్ గా మారిన కాంగ్రెస్ పార్టీని బిహార్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నా రు. కులవాదం అనే విషాన్ని చిమ్మిన ప్రతిపక్షా నికి కర్రుకాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం బిహారీలు నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. బిహార్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్డీయే విజయం సాధించినందుకు బిహారీలు మోదీని ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) చర్యలను చూసి ఆ పార్టీలోని సీనియర్ నాయకులు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు దశాబ్దకాలంగా ఎన్నికల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారు. కాంగ్రెస్‌ను కాపాడుకోవడం ఇక కష్టమేనని పార్టీ నాయకులే అంటున్నారని గుర్తుచేశారు. దాదాపు 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలని చెప్పారు. అక్రమాలను అడ్డుకోవడానికే వక్ఫ్ చట్టం బిహార్‌లో ఎన్డీయే ఘన విజయానికి ఎం.వై.(మహిళలు, యువత) అంశమే కారణమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. నేరాలు చేసి, జైలుకు వెళ్లి బయటకు వచ్చిన కొందరు నేతలు కుల రాజకీయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆరాటపడ్డారని విమర్శించారు. వారి ఆటలు సాగలేదని, జనం వారి కుట్రలను తిప్పికొట్టారని ప్రశంసించారు. దేశానికి ఇదొక శుభసూచకమని పేర్కొన్నారు. బిహార్‌లో అన్ని వర్గాల ప్రజలూ ఎన్డీయేకు అండగా నిలిచారని తెలిపారు. అధికార, విపక్ష కూటముల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. బిహార్‌లో 38 నియెజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉండగా, అందులో 34 స్థానాలు ఎన్డీయే గెల్చుకుందని వివరించారు. దళితులు విపక్షాన్ని తిరస్కరించారని చెప్పారు. బిహార్‌లో భూములను, ఇళ్లను చట్టవిరుద్ధంగా ఆక్రమించి అవి వక్ఫ్ ఆస్తులు అంటున్నారని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామాలు వక్ఫ్ ఆస్తులు ఎలా అవుతాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే వక్ఫ్ చట్టం తీసుకొచ్చామని వివరించారు. అధికారంలోకి వస్తే వక్ఫ్ చట్టాన్ని అమలు కానివ్వబోమని ప్రతిపక్షాలు ప్రకటించాయని, అయినా బిహార్ ఓటర్లు పట్టించుకోలేదని అన్నారు. బిహార్‌లో ఓటమికి కారణాలు చెప్పలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై నిందలు వేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి నిందలతో ఎక్కువ రోజులు కార్యకర్తలను మభ్యపెట్టలేరని హితవు పలికారు. -
ఓట్లు వచ్చినా సీట్లు రాలే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్‌పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి. 2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్‌విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్‌బంధన్‌కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే.. ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్‌రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్
-
రాజకీయాలకు గుడ్‌బై!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య ప్రకటించారు. అంతేకాదు, తమ కుటుంబంతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో రోహిణి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నా సోదరుడు తేజస్వీ యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్ ఆలం సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పంతా నాపైనే వేసుకుంటున్నా’అని ఆమె శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి, లాలు సారథ్యంలోని ఆర్జేడీలో గతంలో క్రియాశీలకంగా ఉన్నారు. जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025లాలూ తనయ అయిన రోహిణి ఆచార్య డాక్టర్ కూడా. తన భర్త, పిల్లలతో సింగపూర్‌లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సరన్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఓడారు.ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్‌తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్ అతిజోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్ అధికార్ యాత్రలోనూ సంజయ్ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని సరన్ నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఈమె ఎక్స్‌లో తండ్రి లాలూ, సోదరుడు తేజస్వీ యాదవ్‌లను అన్‌ఫాలో చేశారు. మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు, కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు లాలూ ప్రకటించడం తెల్సిందే. భార్యతో విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగా ఓ మహిళతో అతడు సంబంధం నడుపుతుండటం లాలూకు నచ్చలేదు. అయితే, ఈ నిర్ణయంపై రోహిణి అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో సొంతంగా పార్టీ ప్రకటించిన తేజ్ ప్రతాప్.. పార్టీ అభ్యర్థులను కూడా బరిలోకి దించారు. కానీ, స్వయంగా ఓటమి పాలైన తేజ్ ప్రతాప్, ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయారు. ఈ పరిణామాల నడుమ శనివారం ఆమె ఈ మేరకు ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా భావిస్తున్నారు. కుటుంబంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లుగా చెబుతున్నారు. తండ్రి లాలూకు రోహిణి 2022లో తన కిడ్నీని దానం చేశారు. రోహిణి వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే పుకార్లు, ఆరోపణలే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు చెబుతున్నారు. -
బీజేపీ సంచలన నిర్ణయం.. కేంద్ర మాజీ మంత్రిపై వేటు
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీహార్‌లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుగుబాటు నేతలపై బీజేపీ దృష్టి సారించింది.బీహార్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఆర్.కే. సింగ్ సహా ముగ్గురు నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా ముగ్గురు నేతలకు బీజేపీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని నోటీసులో బీజేపీ పేర్కొంది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగానే శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఆర్కే సింగ్.. మోదీ సర్కార్‌పై విద్యుత్ మంత్రిగా, మాజీ కేంద్ర హోం కార్యదర్శిగా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించారు. -
ఘోర పరాభవంపై ఆర్జేడీ ఫస్ట్ రియాక్షన్
పట్నా: బిహార్ ఘోర ఎన్నికల ఘోర పరాభవంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ స్పందించింది. రాజకీయ ప్రయాణంలో ఓటమి అనేది ఒక భాగమేనని.. అలాగే ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియగా అభివర్ణించింది.‘‘ప్రజాసేవ అనేది అంతం లేని ప్రయాణం. ఇందులో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు సహజం. విజయం దక్కిందని అహంకారం ఉండదు. అలాగే.. ఓటమితో కుంగిపోం. రాష్ట్రీయ జనతా దళ్ అనేది పేదల పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. పేదల మధ్య వారి గొంతును ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది’’ అని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ పేరిట సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ పోస్ట్ చేసింది.जनसेवा एक अनवरत प्रक्रिया है, एक अंतहीन यात्रा है!इसमें उतार चढ़ाव आना तय है। हार में विषाद नहीं, जीत में अहंकार नहीं!राष्ट्रीय जनता दल गरीबों की पार्टी है, गरीबों के बीच उनकी आवाज़ बुलंद करते रहेगी!@yadavtejashwi @laluprasadrjd— Rashtriya Janata Dal (@RJDforIndia) November 15, 2025బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 202 సీట్లతో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరలించగా.. మిత్రపక్షం జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 19 స్థానాలు నెగ్గి.. అత్యధిక స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. ఇక.. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమిలోని ఆర్జేడీ (RJD) 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ.. ఈ ఎన్నికల్లో 25 స్థానాలకు పడిపోవడం గమనార్హం. 2010 తర్వాత ఆ పార్టీకి ఘోర పరాభవం ఇదే. మిత్రపక్షం కాంగ్రెస్ సైతం 61 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది(గత ఎన్నికల్లో 19 స్థానాలు నెగ్గింది). మహా కూటమిలో గేమ్ చేంజర్ అవుతుందని భావించిన వీఐపీ పార్టీ 0 స్థానాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. సీపీఐ, సీపీఎం వామపక్షాలు 3 స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తంగా విపక్ష కూటమి 34 స్థానాలను మాత్రమే పరిమితమైంది. -
Bihar: గుండెపోటుతో ‘జన్ సురాజ్’ అభ్యర్థి మృతి
పట్నా: బిహార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజునే జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ)కి చెందిన అభ్యర్థి చంద్ర శేఖర్ సింగ్ గుండెపోటుతో మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది.. తరారి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన సింగ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.కుర్మురి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడైన చంద్ర శేఖర్ సింగ్, రాజకీయ నేపథ్యం లేకపోయినా సమాజంలో పేరు ప్రఖ్యాతులున్నాయి. దీంతో ఆయన ప్రశాంత్ కిషోర్ స్ఫూర్తితో జన్ సురాజ్ పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రచారంలో ఉన్నప్పుడే ఆయనకు మొదటిసారి అక్టోబర్ 31న గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాల రోజున ఆయనకు రెండవసారి వచ్చిన గుండెపోటు ప్రాణాంతకమైంది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం ఆయన తరారి నియోజకవర్గంలో 2,271 ఓట్లను సాధించారు. ఈ స్థానంలో బీజేపీకి చెందిన విశాల్ ప్రశాంత్ విజయం సాధించారు. సింగ్ మరణ వార్తతో ఆయన స్వగ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 'గేమ్-ఛేంజర్'గా ప్రవేశించినప్పటికీ, 243 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ పార్టీ ఇతర పార్టీల కంటే అత్యధికంగా 238 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రాష్ట్రంలోని నిరుద్యోగం, వలసలు, పారిశ్రామిక అభివృద్ధి లేమి తదితర కీలక అంశాలపై ప్రచారం నిర్వహించినా, అది ఓటర్లలో ప్రభావం చూపలేకపోయింది. పలువురు జేఎస్పీ అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయారు.ఇది కూడా చదవండి: ‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్ షాక్ -
‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్ షాక్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం (మజ్లిస్) పార్టీ బిహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. సీమాంచల్ ప్రాంతంలోని 29 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఈ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది. కేవలం ఆరు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీతో దాదాపు సమానమైన విజయాన్ని నమోదు చేసింది.బిహార్ అసెంబ్టీ ఎన్నికల్లో మజ్లిస్ రెండు శాతం ఓట్లను దక్కించుకుంది. ఇది ఆ పార్టీకి పెరుగుతున్న ఆదరణను సూచిస్తుంది. దేశవ్యాప్తంగా ముస్లింలకు ప్రతినిధిగా తన పార్టీని విస్తరించాలని ఓవైసీ ప్రయత్నిస్తుండగా, బిహార్ లాంటి రాష్ట్రాలలో ఆయనకు ఆదరణ లభిస్తోంది. 2015 బిహార్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన మజ్లిస్, కిషన్‌గంజ్‌లో ఒక స్థానం గెలిచింది. అయితే అదే సమయంలో ప్రధానంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి పడే ముస్లిం ఓట్లను పెద్దఎత్తున చీల్చింది.2020లో ఈ బలం మరింత పెరిగి ఏకంగా ఐదు సీట్లు గెలుచుకుంది. దీంతో ముస్లిం ఓటును విభజించడం ద్వారా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకుని, పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చిందన్న విమర్శలు మజ్లిస్‌పై వచ్చాయి. దీంతో కాంగ్రెస్, ఆర్జేడీలు మజ్లిస్‌పై కినుక వహించాయి. కాగా బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలనే లక్ష్యంతో ఓవైసీ, ఈసారి బీహార్‌లోని ఇండియా కూటమిలో భాగస్వామి కావడానికి ప్రయత్నించారు. అయితే, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ మజ్లిస్‌ను కూటమిలోకి చేర్చుకోవడానికి నిరాకరించారు.దీంతో మజ్లిస్ ఒంటరిగా 29 స్థానాల్లో పోటీ చేసి మళ్లీ ఐదు సీట్లు గెలుచుకుంది. అలాగే ఓట్ల శాతాన్ని రెండుకు పెంచుకోవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి తీవ్ర నష్టం కలిగించింది. ముస్లిం ఓట్ల విభజన కారణంగా కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 30 కంటే ఎక్కువ స్థానాలు కోల్పోయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ కంటే ఏఐఎంఐఎంకు ఎక్కువ మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇది కూడా చదవండి: Bihar Election: డబుల్ షాక్‌లో ‘బిహార్ సింగం’ -
Bihar Election: డబుల్ షాక్‌లో ‘బిహార్ సింగం’
పట్నా: తన ధైర్యసాహసాలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో బిహార్ ప్రజల హృదయాలను గెలుచుకుని 'సింఘం'గా పేరు తెచ్చుకున్న మాజీ ఐపీఎస్ అధికారి శివ్‌దీప్ డబ్ల్యూ లాండేకు రాజకీయ అరంగేట్రం కలసిరాలేదు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అరారియా, జమాల్పూర్ రెండు స్థానాల నుండి పోటీ చేసిన లాండే రాజకీయాల్లోకి అడుగుపెడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే స్థానిక ప్రజల్లో ఆయనకున్న ప్రజాదరణను ఎన్నిక విజయంగా ఆయన మలచుకోలేకపోయారు. ఈ డబుల్ ఓటమితో ఆయన రాజకీయ ఆశలకు మొదటి అడుగులోనే బ్రేక్ పడింది.జమాల్పూర్ నియోజకవర్గంలో లాండేపై జేడీయూ అభ్యర్థి నచికేత మండల్ 96,683 ఓట్లతో విజయం సాధించారు. మండల్ తన సమీప ప్రత్యర్థి అయిన ఐఐపీ నేత నరేంద్ర కుమార్‌పై 36,228 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. అరారియాలో కూడా లాండేకు ఇదే ఫలితం పునరావృతమైంది. ఈ స్థానాన్ని ఐఎన్‌సీ అభ్యర్థి అబిదుర్ రెహమాన్ 91,529 ఓట్లతో కైవసం చేసుకున్నారు. ఆయన జేడీయూకి చెందిన షగుఫ్తా అజీమ్‌ను 12,741 ఓట్ల తేడాతో ఓడించారు. 49 ఏళ్ల లాండే ఈ రెండు స్థానాల్లోనూ బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులతో తలపడి విఫలమయ్యారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం లాండేపై ఎటుంవంటి క్రిమినల్ కేసులు లేవు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతని మొత్తం ఆస్తులు విలువ రూ. 20.4 కోట్లు. అప్పులు రూ. 2.7 కోట్లు ఉన్నాయి.243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్డీఏ మొత్తం 202 స్థానాలను గెలుచుకుని 200 సీట్ల మార్కును అధిగమించింది. మహాఘట్బంధన్ (ఎంజీబీ) కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయోత్సవాలను జరుపుకుంటూ బీహార్ ప్రజలు అద్భుతమైన ఆదేశం ఇచ్చినందుకు వారిని ప్రశంసించారు. ఈ విజయం ప్రజాస్వామ్యాన్ని, భారత ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు.ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
‘మిషన్ త్రిశూల్’తో ఎన్డీఏ విజయం?
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమికి నిర్ణయాత్మక విజయం అందించడంలో ఆర్ఎస్ఎస్ అనుసరించిన ‘మిషన్ త్రిశూల్’ అమోఘంగా దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తన పనితీరుతో ఎన్డీఏకు నిశ్శబ్ద ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది.బీహార్ ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ‘మిషన్ త్రిశూల్’ చేపట్టారు. 2025, ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రచారంలో బీహార్ అంతటా 50 వేల నుండి 60 వేల సమావేశాలను నిర్వహించారు. అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో 200 నుంచి 300 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో కేవలం రాజకీయ ప్రచారం చేయడమే కాకుండా, లోతైన సర్వేలు, ఓటర్ల సమీకరణపై దృష్టి సారించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, బజరంగ్ దళ్, వీహెచ్‌పీ, మజ్దూర్ సంఘ్ తదితర సంస్థలు ఈ సమన్వయ ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాయి.మూడు దశల త్రిశూల్ వ్యూహం‘మిషన్ త్రిశూల్’ ప్రధానంగా మూడు దశల వ్యూహంగా రూపొందింది. ఇది సంప్రదాయ ఎన్నికల ప్రచారాలకు భిన్నంగా సాగింది.అసంతృప్త ఓటర్లను గుర్తించడం ఆర్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు.. అట్టడుగు స్థాయిలో సర్వేలు నిర్వహించి, స్థానిక సమస్యలైన నిరుద్యోగం, అభివృద్ధి కుంటుబాటు, మౌలిక సదుపాయాలలో లోపాలు, స్థానిక పాలన అంతరాల విషయంలో నిరాశ చెందిన ఓటర్లను గుర్తించారు. వారి ఫిర్యాదులను డాక్యుమెంట్ చేసి, పరిష్కార మార్గాలను బీజేపీ వేదికగా ప్రచారం చేశారు.స్థానిక,జాతీయ సమస్యలపై దృష్టిఈ మిషన్‌లో జీవనోపాధి, ఉద్యోగ కల్పన, వ్యవసాయ సంక్షోభం, కుల ఆధారిత రిజర్వేషన్ల వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఈ సమస్యలను బీజేపీకి చెందిన విస్తృత జాతీయవాదం, అభివృద్ధి కథనాలతో సమర్థవంతంగా అనుసంధానించారు. తద్వారా స్థానిక, జాతీయ దృష్టికోణాల మధ్య సమతుల్యత సాధించారు.గుర్తింపు ఆధారిత విధానంఈ వ్యూహంలోని అత్యంత కీలకమైనది ‘గుర్తింపు ఆధారిత విధానం’.. జాతీయవాద గొడుగు కింద ఉన్న వివిధ హిందూ సమూహాలను ఏకం చేయడం దీని లక్ష్యం. ఇది ముస్లిం-యాదవ్ (ఎంవై) వంటి సంప్రదాయ ప్రత్యర్థి ఓటు సమూహాలలో మార్పులను సృష్టించి, ఎన్డీఏకి మద్దతు పెంచడంలో కీలక పాత్ర పోషించింది. స్వచ్ఛంద సేవకులు ప్రతి బూత్‌ను విశ్లేషించి, చివరి నిమిషంలో ఓటర్ల సమీకరణ ప్రయత్నాలను తీవ్రం చేశారు. ఇది ఓటింగ్ సరళిని స్పష్టంగా మార్చింది.తదుపరి లక్ష్యం.. పశ్చిమ బెంగాల్ 2026బీహార్‌లో ‘మిషన్ త్రిశూల్’ సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆర్ఎస్ఎస్ తన తదుపరి లక్ష్యంగా 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎంచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాన్ని పదునుపెట్టే పనిలో పడింది. పశ్చిమ బెంగాల్లో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతల సమస్యలు, ఆర్థిక స్తబ్దత తదితర అంశాలను ప్రధానంగా హైలైట్ చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రణాళిక వేస్తోంది. అలాగే మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో హిందూ ఏకీకరణను బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున మతపరమైన కార్యక్రమాలు, ‘ఘర్ వాపసీ’ వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. బీహార్‌లో విజయానికి దోహదపడిన ఈ నిశ్శబ్ద సైద్ధాంతిక విస్తరణ వ్యూహాన్ని ఆర్ఎస్ఎస్ మరిన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు అమలు చేయనున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’ -
అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..
-
Bihar Election: ఈ ఐదుగురు.. ‘ఉత్కంఠ విజయులు’
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రహసనంలో ఐదుగురు అభ్యర్థులు అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది ఓట్ల లెక్కింపు సమయంలో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆ అభ్యర్థులు వీరే..1. రాధా చరణ్ సాహ్ (జేడీయూ)సందేశ్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత స్వల్ప తేడాతో విజయం సాధించిన రికార్డును నమోదు చేసింది. జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సాహ్ తన ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన దిపు సింగ్‌ను కేవలం 27 ఓట్ల తేడాతో ఓడించారు. సాహ్ 80,598 ఓట్లు (43.99%) సాధించగా, సింగ్ 80,571 ఓట్లు (43.97%) దక్కించుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల తుది రౌండ్ లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఓటును అత్యంత జాగ్రత్తగా లెక్కించారు.2. సతీష్ కుమార్ సింగ్ యాదవ్ (బీఎస్పీ)రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు. యాదవ్ 72,689 ఓట్లు (37.29%) సాధించగా, సింగ్ 72,659 ఓట్లు (37.29%) పొందారు. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇది బీఎస్పీకి బీహార్‌లో ఏకైక విజయంగా నిలిచింది. ఇది ఆ పార్టీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఈ ఫలితం ఆఖరి వరకు ఉత్కంఠను రేకెత్తించింది.3. మహేష్ పాస్వాన్ (బీజేపీ)అగియాన్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేసిన బీజేపీపీ అభ్యర్థి మహేష్ పాస్వాన్, సీపీఐ(ఎంఎల్)కు చెందిన శివ ప్రకాష్ రంజన్‌పై కేవలం 95 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. పాస్వాన్ 69,412 ఓట్లు (45.2%) పొందగా, రంజన్ 69,317 ఓట్లు (45.14%) సాధించారు. ఈ నియోజకవర్గంలో వామపక్ష పార్టీ అభ్యర్థి నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ స్థానంలో లెక్కింపు పారదర్శకంగా ఉన్నప్పటికీ, స్వల్ప తేడా కారణంగా తుది ప్రకటన కోసం కొంత సమయం పట్టింది.4. ఫైసల్ రెహమాన్ (ఆర్జేడీ)ఢాకా నియోజక వర్గం ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ రెహమాన్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన పవన్ కుమార్ జైస్వాల్‌ను 178 ఓట్ల తేడాతో ఓడించగలిగారు. రెహమాన్ 1,12,727 ఓట్లు (45.72%) సాధించగా, జైస్వాల్ 1,12,549 ఓట్లు (45.64%) పొందారు. స్వల్ప తేడా ఉన్నప్పటికీ, మహాకూటమి తరపున ఆర్జేడీకి ఈ విజయం ముఖ్యమైనదిగా మారింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు దాదాపు సమాన సంఖ్యలో ఓట్లను పొందడం చర్చనీయాంశంగా మారింది,5. మనోజ్ బిశ్వాస్ (కాంగ్రెస్)ఫోర్బ్స్గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ బిశ్వాస్ బీజేపీకి చెందిన విద్యా సాగర్ కేషారీని 221 ఓట్ల స్వల్ప తేడాతో ఓడించారు. బిశ్వాస్ 120,114 ఓట్లు (47.77%) సాధించగా, కేషారీ 1,19,893 ఓట్లు (47.68%) పొందారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఉత్కంఠభరిత విజయాలలో ఒకటి. ఇది కూడా చదవండి: Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి -
బిహార్‌లో కాంగ్రెస్ కనుమరుగు!!
న్యూఢిల్లీ: సరిగ్గా 40 ఏళ్ల క్రితం బిహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కుపైగా స్థానాల్లో విజయపతాక ఎగరేసింది. శుక్రవారం వెలువడిన ఎన్నికల్లో కేవలం ఆరు చోట్ల గెలిచింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 1952 ఎన్నికల్లో 41.38 శాతం ఓట్లను ఒడిసిపట్టిన కాంగ్రెస్ ప్రభ 1990వ దశకం నుంచి తగ్గుతూ వస్తోంది. ఈసారి 50కిపైగా స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్.. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)ల స్థాయికి పడిపోయింది. ఎంఐఎం, హెచ్ఏఎంలు చెరో 5 చోట్ల గెలిచాయి. 15 ఏళ్ల క్రితంతో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు షేరు కాస్తంత పెరిగింది. 2010లో పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 8.17 శాతం ఓట్లు పడితే ఈసారి కాస్తంత ఎక్కువగా 8.75 శాతం ఓట్లు పడ్డాయి. తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకోవడం, కీలక నేతల మధ్య సమన్వయం పెంచడం, ఓడిన స్థానాల్లో తిరిగి పట్టుసాధించి విజయం సాధించే క్రమంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. 1985లో వందకుపైగా సీట్లు గెలిచిన పార్టీ తర్వాత 1990లో కేవలం 71 స్థానాలకు పరిమితమైంది. అప్పటి నుంచి గెలుపు కోత మొదలైంది. 1995లో 29 చోట్ల, 2000లో 23 చోట్ల గెలిచింది. ఇక 2005లో పదంటే పది చోట్ల విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలను చూస్తే హెచ్ఏఎం(సెక్యులర్) నేత చేతిలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌కుమార్ సైతం ఓడిపోయారు. ‘కుటుంబ’నియోజకవర్గంలో హెచ్ఏఎం అభ్యర్థి లలన్‌రామ్ .. రాజేశ్ కంటే 21,525 ఓట్లు ఎక్కువ సాధించారు. రాహుల్‌గాంధీ తలకెత్తుకున్న ఓటు చోరీ నినాదం బిహార్‌లో ఏమాత్రం పనిచేయలేదు. రాహల్ చేసిన ఓటర్ అధికార్ యాత్ర, ఓటర్లజాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై విమర్శలు, ప్రజాస్వామ్యాన్ని జెన్ జెడ్ యువతరం కాపాడాలన్న పిలుపులకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందనాలేదు. గతంతో పోలిస్తే బిహార్‌లో మౌలికవసతుల అభివృద్ధి వేగంగా జరగడంతో ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గుచూపడంతో కాంగ్రెస్ ఓటమి రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యరి్థని నిలపలేకపోవడం, ఉన్న కొన్ని ఓట్లను కొత్తగా వచ్చిన జనసురాజ్ పార్టీ చీల్చడంతో మరికొన్ని స్థానాలు కాంగ్రెస్ చేతుల్లోంచి జారిపోయాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం విప్లవాత్మకంగా సంస్థాగత సంస్కరణలకు తెగించకపోతే అధికారాలను కోల్పోయే పరంపర కొనసాగుతుందని రాజకీయ పండితులు విశ్లేíÙంచారు. -
అందర్నీ గెలిపించి.. స్వరాష్ట్రంలో చతికిలపడి..
పట్నా: ఢిల్లీ, ప శ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను సునాయాసంగా గెలుపుబాటలో నడిపించి అధికార పీఠాలపై కూర్చోబెట్టిన ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ తీరా స్వరాష్ట్రం బిహార్‌లో సొంతంగా పార్టీ పెట్టి కూడా కనీసం ఒక్క స్థానంలో గెలవలేక ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఇలాంటి ఫలితాలను ముందే ఊహించిన ప్రశాంత్ ఇటీవల ఈ అంశంపై మాట్లాడటం విశేషం. ‘‘గెలిస్తే మహా ప్రభంజనం సృష్టిస్తాం. ఎవ్వరూ ఊహించనన్ని సీట్లు గెల్చుకుంటా. లేదంటే అత్యంత ఘోరంగా ఓడిపోతాం’’అని అన్నారు. రెండో మాట అచ్చంగా శుక్రవారం నిజమైంది. ఆయన స్థాపించిన జన సురాజ్ పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీచేసి కనీసం ఒక్కచోట కూడా గెలుపుబోణీ కొట్టలేకపోయింది. చాలా చోట్ల పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. పాదయాత్రతో మొదలెట్టి.. 2022 అక్టోబర్ రెండో తేదీన చంపారన్‌లో ప్రశాంత్ పాదయాత్ర మొదలెట్టి వందల కిలోమీటర్లు నడిచారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. సమస్యలను తీర్చుతానని హామీ ఇచ్చారు. ఛాయ్ పే చర్చా అంటూ ప్రధాని మోదీకి కొత్త నినాదం ఇచి్చన ప్రశాంత్ తదనంతర కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్, ప శ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, బిహార్‌లో నితీశ్ కుమార్, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేలకు ఎన్నికల వ్యూహకర్తగా ఉండి ఆయా రాష్ట్రాల్లో వాళ్ల పార్టీలను గెలిపించారు. అదే వ్యూహంతో బిహార్‌లోనూ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ అనూహ్యంగా చతికిలపడ్డారు. శుక్రవారం విడుదలైన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో జన సురాజ్‌పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. నితీశ్‌తో పొసగక సొంత పార్టీ.. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ–ప్యాక్) పేరిట ఎన్నికల వ్యూహాలు, సిద్ధాంతాలు, పథకాలను రచించే సంస్థను కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ స్థాపించారు. ఇతర రాష్ట్రాల్లో వ్యూహకర్తగా విజయం సాధించాక స్వరాష్ట్రంలో అడుగుపెట్టారు. 2015లో నితీశ్‌కుమార్‌ను గెలిపించి నితీశ్ సర్కార్‌లో కేబినెట్ మంత్రి హోదాకు సమానంగా ప్రభుత్వసలహాదారు పదవిలో ప్రశాంత్ కొనసాగారు. మూడేళ్ల తర్వాత జేడీయూలో చేరి ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో నితీశ్, ప్రశాంత్ మధ్య తీవ్రవిభేదాలు పొడచూపాయి. దీంతో ప్రశాంత్‌ను జేడీయూ నుంచి బహిష్కరించారు. ఈ అక్కసుతోనే సొంత పార్టీ పెట్టాడని బిహారీలు ఇంకా నమ్ముతున్నారు. పేలవ కేడర్, కొత్త అభ్యర్థులు ఎలాంటి నేరచరిత్రలేని అభ్యర్థులను రంగంలోకి దింపానని ప్రశాంత్ ఘనంగా ప్రకటించారు. కానీ ఏ రాష్ట్రంలోనైనా కాస్తంత ఛరిష్మా ఉన్న నేతలే ఎక్కువ ఓట్లను కొల్లగొట్టగలరని రాజకీయ చరిత్ర చెబుతోంది. కొన్ని నెలల క్రితమే స్థాపించిన జన సురాజ్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోకి చొచ్చుకుపోలేదు. దీంతో పార్టీకి పెద్దగా కేడర్, కార్యకర్తల బలం లేదు. ఇవన్నీ పార్టీ విజయావకాశాలను బాగా దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిహార్‌లో మార్పు తెస్తానని వాగ్దానంతో ఎన్నికల పద్మవ్యూహంలో దిగిన ప్రశాంత్ తొలి ప్రయత్నంలో జనం చావుదెబ్బ తీశారు. -
తేజస్వీ ఆశ.. అడియాస
పట్నా: తండ్రి నుంచి కుమారులకు ఆస్తిపాస్తులు వారసత్వంగా వస్తుంటాయి. కానీ బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు తండ్రి పరిపాలనాకాలం నాటి ఆటవికపాలన తాలూకు మాయని మచ్చలు అలాగే అంటుకుపోయాయి. జంగిల్‌రాజ్‌గా పేరుమోసిన లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనాకాలంనాటి చేదు జ్ఞాపకాలు చివరకు తేజస్వీయాదవ్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఆటవికపాలనకు ఆవాహన పలికినట్లేనని ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారం బాగా పనిచేసి అది చివరకు మహాగఠ్‌బంధన్ కూటమికి ఓట్లు రాలకుండా చేసింది. దీంతో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కల కలగానే మిగిలిపోయింది. స్నేహితుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీతో కలిసి చేసిన జంట భారీ ర్యాలీలు సైతం జనాల మనసులను మార్చలేకపోయాయి. బిహార్ కీలకనేత కుమారునిగా రాజకీయ అరంగేట్రం అత్యంత సులభంగా జరిగినా ఎన్నికల రణరంగంలో గెలవడం అంతతేలికకాదని తేజస్వీకి శుక్రవారం నాటి ఫలితాలు రుచిచూపించాయి. మహాగఠ్‌బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యరి్థగా తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించినప్పుడే కూటమిలోని కొందరు నేతలకు ఈ నిర్ణయం రుచించలేదు. సీఎం అభ్యర్థికి వ్యక్తిగత కరిష్మా తోడవ్వాల్సిందిపోయి కుటుంబ అప్రతిష్ట ఈయన గెలుపునకు అవరోధంగా మారొచ్చనే అనుమానాలకు ఆనాడే బీజాలు పడ్డాయి. ఇవి ఇప్పుడు నిజమయ్యాయని కొందరు రాజకీయనేతలు విశ్లేíÙస్తున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై.. ఎన్నికల్లో కొత్త ఇన్నింగ్స్ రాష్ట్రవాళీ క్రికెటర్ అయిన తేజస్వీ పదేళ్ల క్రితం తనకిష్టమైన ఆటకు స్వస్తిపలికారు. తన అసలైన రాజకీయ వారసుడు తేజస్వీ అని భావించిన మరుక్షణమే లాలూ ఈయనతో రాజకీయరంగ ప్రవేశం చేయించారు. మిత్రధర్మం పాటించి కాలంలో జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు నితీశ్ సర్కార్‌లో తేజస్వీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కేంద్రంలో యూపీఏ–1 పరిపాలనాకాలంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చాడనే కేసులో తేజస్వీ పేరు సైతం జతకూడడంతో తేజస్వీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచిత్రంగా ఆ అవకతవకల నాటికి తేజస్వీ ఇంకా టీనేజీ పిల్లాడు కావడం గమనార్హం. అయితే తర్వాత తేజస్వీ రాజకీయాల్లో అడుగుపెట్టడం 2020 బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఏకంగా 75 సీట్లు సాధించంతో ఈయన పేరు మార్మోగిపోయింది. ఆ హవాను తాజా ఎన్నికల్లో తేజస్వీ కొనసాగించలేకపోయారు. ఆర్జేడీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి వస్తే జంగిల్‌రాజ్ పునరావృతమవుతుందన్న బీజేపీ ప్రచారాన్ని తేజస్వీ బలంగా తిప్పికొట్టలేకపోయారు. -
టైగర్ అభీ జిందాహై!
పట్నా: ‘టైగర్ అభీ జిందా హై’(పులి ఇంకా సజీవంగానే ఉంది) బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఇది. జేడీ(యూ) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఈ టైటిల్ సరిగ్గా వర్తిస్తుంది. ‘నేను అలసిపోలేదు. రిటైర్ అవ్వాలనే మూడ్‌లోనూ లేను’అన్న పదాలకు నితీశ్‌కుమార్ నిలువుటద్దంలా కనిపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సీట్లను ప్రస్తుతం దాదాపు రెట్టింపు చేసుకున్న నితీశ్, ఆ రాష్ట్ర రాజకీయాల్లో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు. వదంతులను పటాపంచలు చేస్తూ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మొ దలు నితీశ్ కుమార్ పలు అంశాల్లో తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇందులో ఒకటి ‘ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది’అన్న అంశంకాగా, ‘ఆయన ఆరోగ్యం సరిగా లేదు’అన్నది మరొకటి. ఈ రెండు అంశాలను ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షం ఉధృతంగా ప్రజల్లోకి తీసుకునివెళ్లింది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన సమర్థంగా ఎదుర్కొన్న ట్లు తాజా ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. పథకాల ప్రకటనలో దూకుడు అత్యంత కీలకమైన ఈ ఎన్నికలకు ముందుగా, 75 ఏళ్ల నితీశ్ దూకుడుగా పథకాలు ప్రకటించారు. సామాజిక భద్రతా పెన్షన్లు పెంచడం, జీవికా –ఆశా– ఆంగన్వాడీ సిబ్బందికి భత్యాలు ఇవ్వడం ఇందులో కొన్ని. అంతేకాదు ఎంతో ప్రచారం పొందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ యోజన’కింద కోటి మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జమ చేసి ప్రజాకర్షక పథకాల్లో దూసుకుపోయారు. అయితే ఈ ‘‘ఫ్రీబీలు’’ప్రభావాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ముందుగానే గమనించారు. ఆయన మాజీ డిప్యూటీ తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) ప్రభుత్వం ‘కాపీక్యాట్’గా మారిందని విమర్శించారు. నితీశ్‌కు గతంలో సహాయకునిగా వ్యవహరించిన పవన్ వర్మ ‘ఈ పథకాల ద్వారా ఓటర్లను లంచం ఇస్తున్నారు’అని విమర్శించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం పవన్ వర్శ.. జేడీయూ సుప్రీమోకు ఒకప్పడు సన్నిహితునిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన సురాజ్ పార్టీలో (జేఎస్పీ) ఉన్నారు. ఇక రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారన్న విమర్శలు సరేసరి. తొణకని, బెణకని నైజం అయితే రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ కాలం సీఎం గా పనిచేసిన నితీశ్ కుమార్ మాత్రం విమర్శలు, ఆరోపణలకు ఏమాత్రం కంగారు పడలేదు. బీజేపీ తనపై ‘మహారాష్ట్ర శిండే విధానం’అవలంబించబోతుందన్న ప్రత్యర్థుల మాటలకూ విలువ ఇవ్వలేదు. మహారాష్ట్రలో శివసేనను అధిగమించి బీజేపీ అధికారం చేపట్టిన తరహాలోనే, నితీశ్‌కూ బీజీపీ రాజకీయంగా భంగం కలిగిస్తుందన్న అర్థంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలకూ ఆయన విలువ ఇవ్వలేదు. అయితే ఈ విమర్శలకు ఆయన ఎందుకు తొణకడంలేదన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభలో స్వతంత్ర మెజారిటీ లేనందున.. బీజేపీ కేంద్రంలో అధికారంలో నిలవడానికి జేడీయూ మద్దతుపైనే ఆధారపడి ఉందన్న నిజం బహుశా ఆయన దృష్టిలో ఉండవచ్చన్నది ఇందులో ఒకటి. ఇక ఈ సందర్భంలో బీజేపీ విషయానికి వస్తే, రాష్ట్రంలో మోదీ 14 భారీ సభలు, ఒక రోడ్‌షో నిర్వహించారు. అయితే నితీశ్ కుమార్‌తో సమస్తీపూర్‌లో జరిగిన తొలి ఎన్నికల సభ మినహా వీరిరువురూ ఒకే వేదికపై ఎక్కడా కనిపించలేదు. అయినా, ‘నితీశ్ బాబు చేసిన మంచి పనిని గుర్తుంచుకోండి’అని ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రతి సభలో పేర్కొన్నారు. రాజకీయ ప్రస్థానం.. → బిహార్‌లోని బఖ్తియార్పూర్లో 1951లో జ న్మించిన కుమార్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. → విద్యుత్ శాఖలో వచి్చన ఉద్యోగాన్ని వదిలి జెపీ ఉద్యమం కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. → జనతా పార్టీలో చేరి 1977లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు. 1985లో తొలి విజయాన్ని సాధించారు. → దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తరచూ పక్షం–విపక్షం మారుతూ వచ్చారన్న విమర్శలతో ‘పల్టూ రాం’ (పల్టీ రాం) అన్న బిరుదు కూడా సంపాదించారు. -
గఠ్బంధన్ను ముంచిన ‘ఎం’ ఫ్యాక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమిపై ఓట్ల చోరీ విమ ర్శనాస్త్రం సంధించి, బిహార్ యువత, మహిళలు, ముస్లింలు, మల్లాలుసహా ప్రతి వర్గంపై హామీల వరద పారించిన మహాగఠ్‌బంధన్ కూటమి గెలు పుపై పెట్టుకున్న గంపెడాశలు గంగపాలయ్యాయి. ముఖ్యంగా ‘ఎం ఫ్యాక్టర్’గా పిలిచే మహిళలు, ముస్లింలు, మల్లాలు తమకు ఓట్ల పోరులో తోడుగా నిలబడి విజయకేతనం ఎగరేస్తా రనుకుంటే అధికార కూటమికి విజయపతాకం కట్టబెట్టి విపక్ష కూటమి కంగుతినేలాచేశారు. కుటుంబానికో ప్రభు త్వ ఉద్యోగం, వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకణ ఇలా అన్ని వర్గాలపై హామీల వర్షం కురిపించిన మహాగఠ్‌బంధన్ కూటమి బిహారీల మనసుల్ని గెల్చుకోలేకపోయింది. ఎన్నికలకు ఆరు నెలల నుంచి ముందునుంచి సీట్ల పంపకాలపై చర్చలు మొదలైనా అవి అధికార ఎన్డీఏతో పోలిస్తే వేగంగా తేలలేదు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దు బాటు సరిగా కుదర్లేదు. కొన్ని స్థానాల్లో విపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపడంలో ఘోరంగా విఫల మయ్యాయి. కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు పోటా పోటీగా ఒకే స్థానంలో పోటీకి దిగి ఇద్దరూ ఓడిపో యారు. ఓట్లు కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య చీలిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సీఎం అభ్యర్థిని చాలా ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార పర్వంలో కాంగ్రెస్, ఆర్జేడీ అగ్రనేతల సమన్యయ లోపం సైతం కూటమి విజయావకాశాలను దెబ్బతీశాయి. తమ ఎన్నికల హామీతో అండగా ఉంటారనుకున్న మహి ళలు హఠాత్తుగా చేయివ్వగా, తమతో కలిసివస్తార నుకు న్న ముస్లింలు ఇరువర్గాల వైపు చీలిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపినా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) పార్టీ చీఫ్ ముఖేశ్ సహానీ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆ పార్టీకి చెందిన మల్లా వర్గపు ఓటర్లు సైతం విపక్షకూటమి వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా ఎన్నో కారణాలు విపక్షాలను విజయతీరాలకు చేర్చకుండా మధ్య లోనే ముంచేశాయి. అండగా నిలవని ముస్లింలు..బిహార్‌లో 10 కోట్ల జనాభాలో 1.75 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే జనాభాలో 17.7 శాతమున్న ముస్లింలు కేవలం మహాగఠ్‌బంధన్‌కు ఓటేయకుండా అధికారకూటమి వైపూ మొగ్గుచూపారు. దీంతో ఓట్లు భారీగా చీలిపోయి మహాగఠ్‌బంధన్ విజయావకాశాలు పూర్తిగా నశించాయి. 243 స్థానాలకుగాను 87 స్థానాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. అందుకే 20 చోట్ల మహాగఠ్‌బంధన్ ముస్లింలకు సీట్లిచ్చింది. అయినాసరే ఇక్కడ మొత్తంగా గెల్చింది ఐదు సీట్లే. ముస్లింలకు 14 శాతం జనాభా ఉన్న యాదవులు కలిస్తే ఓటు బ్యాంక్ 32 శాతానికి పెరిగి తమకు బాగా కలిసి వస్తుందని మహాగఠ్‌బంధన్ వేసిన లెక్కలు తారుమార య్యాయి. దళిత, ఆదివాసీలు కలిసొస్తే కనీసం 40 శాతం ఓట్లు వస్తాయని కాంగ్రెస్ భావించింది. వాస్తవంలో కాంగ్రెస్‌కు కేవలం 8 శాతం, ఆర్జేడీకి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా చాలా స్థానాల్లో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. అనేక చోట్ల బీఎస్పీకి 4 నుంచి 6 శాతం ఓట్లు వచ్చింది. కొత్తగా ఏర్పడిన జనసురాజ్ పార్టీ మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బతీసింది. విపక్షాలు పోటీ చేసిన స్థానాల్లో ముస్లిం ఓట్లు జనసురాజ్ పార్టీ చీల్చింది. సీమాంచల్‌లో 11 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం 5 స్థానాలు గెలిచింది. 60 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 6 చోట్ల మాత్రమే గెలిచింది. అధిక శాతం ఉన్న ముస్లింలను కాదని, మల్లా వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం సైతం ముస్లింలకు కోపం తెప్పించింది. దర్భంగా, మధుబని, సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు భారీగా చీలిపోయాయి. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముఖేశ్ సహానీకి చెందిన మల్లా వర్గం ఓటర్లు మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్‌పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామడి, షెయోహర్, కిషన్‌గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్ జిల్లాలలో ఎక్కువ. ఆయా జిల్లాల్లో గెలుపుపై విపక్షకూటమి గంపెడాశలు పెట్టుకుంటే కేవలం 18 చోట్ల గెలిచింది. వీఐపీ పార్టీ మల్లాలు అధికంగా ఉన్న 15 చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్లా ఓడింది.పెరిగిన ఓట్ల శాతం శరాఘాతమే..మహిళా ఓటర్లు తమ వెంటే ఉన్నా రని కూటమి తొలినుంచీ భావిస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 66.91 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇందులో మహిళా ఓటర్లలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. ఓటేసిన మహిళలే రాష్ట్రంలో అధికంగా గెలుపోటములను నిర్దేశించారని తేటతెల్లమైంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 1.5 కోట్ల మంది మహిళల ఖాతాల్లో నితీశ్ ప్రభుత్వం ఏకంగా ఒకేసారి రూ.10,000 నగదు జమచేయడంతో వాళ్లంతా అధికార పార్టీకే కొమ్ముకాశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఉచిత సైకిల్ పథకం వంటివి ఎన్డీఏకు కలిసొచ్చాయి. ఇవి విపక్షాలకు ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన మహి ళలకు ఏటా రూ. 30వేల ఆర్ధిక సాయం, జీవికా దీదీల ఉద్యో గాల క్రమబద్ధీకరణ, రూ. 30 వేల గౌరవవేతనం, ‘మా’ (ఇల్లు, వంట సరుకులు, ఆదాయం) పథకం ప్రతి మహిళకు భరోసా ఇస్తామని హామీ ఇచ్చినా మహిళలు విపక్షాల మాటలను నమ్మలేదు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు ఆటవికంగా పరిపాలించారంటూ ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారాన్ని జనం గుర్తుంచుకుని ఆర్జేడీ మాటలను విశ్వసించడం మానేశారు. కాంగ్రెస్ వరస వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాత వ్యూహాలనే అమలు చేయడం సైతం విజయపథంలో దూసుకుపోకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. -
Bihar: ముఖ్యమంత్రి ఎవరు?
పట్నా: బిహార్‌లో ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ సీఎంగా కొనసాగుతారా? లేక మరో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. మళ్లీ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ సోషల్ మీడియాలో జేడీ(యూ) పోస్టు చేసింది. కొద్దిసేపటికే దాన్ని తొలగించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నితీశ్‌ను మరోసారి సీఎంను చేయడం బీజేపీకి ఇష్టంలేదని ప్రచారం సాగుతోంది. నితీశ్‌ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లి, బీజేపీ నాయకుడినే గద్దెనెక్కిస్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి తమ కూటమి గెలిస్తే నితీశ్ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచి్చంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీశ్ సైతం మళ్లీ కుర్చి ఎక్కాలని ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం రాజధాని పటా్నలో భారీగా పోస్టర్లు, బోర్డులు వెలిశాయి. ‘‘25 నుంచి 30.. మళ్లీ నితీశ్’’ అంటూ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం బిహార్ ఎన్నికల్లో బీజేపీ తన బలం చాటుకుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ)పై ఆధారపడాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోయింది. జేడీ(యూ)ను పక్కనపెట్టి, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)తో పొత్తు కొనసాగిస్తే బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం తేలికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం జేడీ(యూ) అండతో మనుగడ సాగిస్తోంది. కాబట్టి జేడీ(యూ) స్నేహాన్ని వదులుకొనే సాహసం చేయకపోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో మహారాష్ట్ర తరహా ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో శివసేన(షిండే) నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెల్చుకున్న బీజేపీ చివరకు తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎంగా కిరీటం అప్పగించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సమీకరణాలు కలిసొస్తే ఆయన బిహార్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. బిహార్ ఎన్డీయేలో పెద్దన్న జేడీ(యూ). ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జేడీ (యూ)తో సమానంగా సీట్లు పంచుకుంది. రెండు పక్షాలు 101 సీట్ల చొప్పున తీసుకున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు నెగ్గి, జేడీ(యూ)పై స్పష్టమైన ఆధిపత్యం సాధించింది. ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. -
బెంగాల్లోనూ ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తాం
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కార్యకర్తల కష్టంతోనే గెలుపు దక్కిందని అన్నారు. బిహార్‌లో సుపరిపాలన కొనసాగిస్తామని, ఇకపై ప శ్చిమ బెంగాల్లో ‘జంగిల్‌రాజ్’ను అంతం చేస్తామని ప్రతినబూనారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావం పూరించారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమర భేరీ మోగించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవంలో పాల్గొన్నారు. నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంగా నది బిహార్ గుండా బెంగాల్లోకి ప్రవహిస్తోందని చెప్పారు. బిహార్ విజయం ఇక బెంగాల్లో విజయానికి దారిని ఏర్పర్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అది ముస్లింలీగీ మావోవాదీ కాంగ్రెస్(ఎంఎంసీ)గా మారిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ త్వరలో ముక్కలుచెక్కలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు వారు మునిగిపోవడంతోపాటు నమ్ముకున్నవారిని కూడా ముంచేస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ మెడలో మిథిలా పెయింటింగ్‌లతో కూడిన గమ్చా(కండువా) ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తద్వారా బిహార్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చాటిచెప్పారు. కొత్తగా ఎం.వై. ఫార్ములా బిహార్ విజయం కొత్తగా ఎం.వై.(మహిళలు, యువత) అనే ఫార్ములాను ఇచ్చిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. జంగిల్‌రాజ్ మనుషుల మతపరమైన ఎం.వై.(ముస్లిం–యాదవ్) ఫార్ములాను ఈ విజయం మట్టిలో కలిపేసిందని అన్నారు. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే గొప్ప గౌరవాన్ని భారత్‌కు ఇచి్చన గడ్డ బిహార్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే మట్టికరిపిస్తామన్న సందేశాన్ని ఇదే గడ్డ ఇచి్చందన్నారు. బిహార్‌లో ఎన్డీయే విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన మహోన్నత విజయమని అభివరి్ణంచారు. అసత్యాలు ఓడిపోతాయని, ప్రజల విశ్వాసమే గెలుస్తుందని బిహార్ నిరూపించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పారీ్టకి మన దేశం పట్ల సానుకూల దృక్పథం గానీ, దార్శనికత గానీ లేవని మండిపడ్డారు. అదొక పరాన్నజీవి, మోయలేని భారం, నష్టదాయకం అంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలను హెచ్చరించారు. ఈసీ పట్ల ప్రజల విశ్వాసం బలోపేతం ఎన్డీయే ప్రభంజనంతో బిహార్‌లో నూతన శకం ఆరంభమైందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. రాబోయే ఐదేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బిహార్ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలతో ఎన్నికల సంఘం పట్ల ప్రజల విశ్వాసం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కృషితో ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వ ప్రతిభను నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఎన్డీయే పక్షాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్ఐఆర్ను యువత స్వాగతించారు నేడు దేశంలో అత్యధికంగా యువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ కూడా ఉందని మోదీ వెల్లడించారు. ఇక్కడి యువతలో అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. వారి ఆశలు, ఆకాంక్షలు, కలలు జంగిల్‌రాజ్ మనుషుల కమ్యూనల్ ఎం.వై.ఫార్ములాను సర్వనాశనం చేశాయని వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనను యువత స్వాగతించారని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు వారు మద్దతిచి్చనట్లు ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. జంగిల్‌రాజ్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో విచ్చలవిడిగా హింసాకాండ జరిగేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘం కృషి వల్ల అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కొనియాడారు. బిహార్ విజయం పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీ కార్యకర్తలకు కొత్త శక్తిని ఇచి్చందని స్పష్టంచేశారు. -
అభివృద్ధి, సంక్షేమానికే పట్టం
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జాతీయ ప్రజా స్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి విజయ ఢంకా మోగించింది. ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయం దక్కించుకుంది. ఈస్థాయి ప్రభంజనాన్ని కూటమి పెద్దలు కూడా అంచనా వేయలేకపోయారు. 243 స్థానాలకు గాను 160 వరకు సీట్లు రావొచ్చని భావించగా, ఏకంగా 200కుపైగా సీట్లను ఎన్డీయే తన ఖాతాలో వేసుకుంది. ఈ అపూర్వమైన గెలుపు వెనుక బహుళ కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక పరిస్థితులు, పదునైన ఎన్నికల మేనేజ్మెంట్ వంటివి ఎన్డీయేకు కలిసొచ్చాయి. అధికార కూటమి విజయానికి దోహదపడిన కొన్ని కీలక అంశాలు ఏమిటంటే.. మహిళలు–ఈబీసీ సమ్మేళనం ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఉత్సాహంగా ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేయడం గమనార్హం. వారు ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు అండగా నిలిచారు. సరిగ్గా ఎన్నికల ముందు పలు మహిళా సంక్షేమ పథకాలను నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. జీవికా దీదీ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) మహిళలకు కూడా సాయం అందజేసింది. రాష్ట్రంలోని 3.51 కోట్ల మహిళా ఓటర్లలో దాదాపు 40 శాతం మందిని ఇది నేరుగా ప్రభావితం చేసింది. మహిళా సాధికారతపై నితీశ్ కుమార్ చాలా రోజులుగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ఫలితంగా ఎన్డీయే పట్ల మహిళా ఓటర్లు ఆకర్శితులయ్యారు. వారి ఆదరణ ఓట్ల రూపంలో బీజేపీ కూటమికి బదిలీ అయ్యింది. కులాల సమీకరణాలు వేర్వేరు కులాలను తమకు అనుకూలంగా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఎన్డీయే సఫలమైంది. అగ్రవర్ణాల ఓటర్లు సంప్రదాయకంగా బీజేపీ వెన్నంటే నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆ ఆనవాయితీ యథాతథంగా కొనసాగింది. మరోవైపు ఓబీసీలు, ఈబీసీలతోపాటు దళితుల్లో గణనీయమైన ఓ వర్గం ఎన్డీయేకు మద్దతు పలకడం విశేషం. కులాల లెక్కలపై విపక్ష మహాగఠ్‌బంధన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. భిన్న సామాజిక వర్గాలు ఎన్డీయే వెనుక సంఘటితమయ్యాయి. అధికార కూటమినే వారు మరోసారి విశ్వసించారు. విపక్షాల్లో చీలికలు బీజేపీ కూటమిలో స్పష్టమైన ఐక్యమత్యం కనిపించగా, కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిలో చీలికలు బహిర్గతమయ్యాయి. చివరి నిమిషం వరకు సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు. కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీలు తప్పలేదు. పొత్తు ధర్మాన్ని విస్మరించి, కూటమి పారీ్టలే పరస్పరం పోటీకి దిగాయి. మరోవైపు ఓట్ల బదిలీ సైతం జరగలేదు. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యరి్థగా ప్రకటించడం కూటమిలో కొందరికి నచ్చలేదు. ప్రతిపక్షానికి ఒక ఉమ్మడి వ్యూహం లోపించింది. ఎవరికి వారే అన్నట్లుగా ప్రవర్తించారు. మహాగఠ్బంధన్ను బలహీన కూటమిగా ప్రజలు భావించారు. దాంతో ఎన్డీయేకు ఎదురే లేకుండాపోయింది. మొత్తానికి ప్రతిపక్షం స్వీయ తప్పిదాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చీలిన ముస్లిం ఓట్లుకాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ప్రధాన బలం ముస్లిం–యాదవ్ ఓట్లే. కానీ, ఈసారి ముస్లింలు, యాదవులు ఆ కూటమిని అంతగా ఆదరించలేదు. ఈ రెండు వర్గాలను అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉండడం మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. ముస్లింల ఓట్లు భారీగా చీలిపోయాయి. రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) బలమైన యాదవుల్లోనూ చీలికలు కనిపించాయి. యాదవుల్లో ఓ వర్గం ఎన్డీయేకు అండగా నిలిచింది. గెలిస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ ఆర్జేడీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. ఎన్నికల మేనేజ్మెంట్ చురుకైన ఎన్నికల మేనేజ్మెంట్ ఎన్డీయేకు బలంగా మారింది. 2020 నాటి ఎన్నికల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లను ఆ కూటమి సరిచేసుకుంది. ఈసారి కూటమి పక్షాల మధ్య సమన్వయం బాగా పెరిగింది. వాటి మధ్య చక్కటి సహకారం కనిపించింది. బూత్–స్థాయి మేనేజ్మెంట్ బాగా పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో కూటమి పారీ్టలన్నీ కలిసికట్టుగా పాల్గొన్నాయి. అంతర్గతంగా అక్కడక్కడా అభిప్రాయభేదాలున్నా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాయి. బీజేపీ, జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేశారు. వారంతా నిత్యం ప్రజల్లో ఉండడం, ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడం ఎన్డీయే విజయ తీరాలకు చేర్చింది. కొంపముంచిన ‘జంగిల్‌రాజ్’ జంగిల్‌రాజ్ అనగానే గుర్తొచ్చే పేరు బిహార్. ఆర్జేడీ హయాంలో ఆటవిక పాలన కొనసాగిందని, ప్రతిపక్షానికి ఓటేస్తే ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ వస్తుందని ఎన్డీయే నేతలు పదేపదే హెచ్చరించారు. జంగిల్‌రాజ్ రోజులను జనం ఇప్పటికీ మర్చిపోలేదు. మహాగఠ్‌బంధన్‌కు ఓటేస్తే జరిగేదేమిటో ఊహించుకొని మరోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. అభివృద్ధి కావాలి తప్ప ఆటవిక రాజ్యం వద్దని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవినీతిపరుడు కాకపోయినప్పటికీ అవకాశవాది అనే ముద్ర ఉంది. అధికారం కోసం సులువుగా కూటములు మార్చేస్తారన్న విమర్శలున్నాయి. అయినా సరే ఓటర్లు ఆయన పరిపాలనను ఆదరించారు. నితీశ్ నాయకత్వం, పాలనా సామర్థ్యం కూడా ఎన్డీయేకు అనుకూలంగా మారింది. ఉచిత విద్యుత్.. మధ్యతరగతికి భరోసా రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత పథకాన్ని ఎన్నికల ముందే అమలు చేయడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుంది. సుమారు 5 కోట్ల మంది ఓటర్లు ఈ పథకంతో లబ్ధి పొందారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామంటూ విపక్ష కూటమి హామీ ఇచి్చనా, ’ఇప్పటికే వస్తున్న’ప్రయోజనం ముందు ఆ హామీ నిలవలేకపోయింది. వృద్ధులు, ఆశ్రితులకు ఆదరణ సామాజిక భద్రతా పెన్షన్‌ను రూ.400 నుంచి ఏకంగా రూ.1100కి పెంచడం 1.11 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నేరుగా ప్రయోజనం చేకూర్చింది. ఇది వారి కుటుంబాల్లో ఎన్డీయే పట్ల బలమైన సానుకూలతను నింపింది. యువత, విద్యార్థుల మద్దతు నిరుద్యోగ భృతి(7.6 లక్షల మందికి), స్టూడెంట్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ మాఫీ (4 లక్షల మందికి) పథకాలు యువతను, విద్యార్థులను ఎన్డీయే వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి. సోషల్ ఇంజనీరింగ్ సూపర్ హిట్ గత ఎన్నికల్లో దూరమైన చిరాగ్ పాశ్వాన్, ఉపేంద్ర కుశ్వాహాలను తిరిగి కూటమిలోకి తీసుకురావడం నితీశ్–బీజేపీల రాజకీయ వ్యూహానికి పరాకాష్ట. వీరితోపాటు జీతన్ రామ్ మాంఝీని నిలబెట్టుకోవడం ద్వారా దళిత, అత్యంత వెనుకబడిన, కుశ్వాహా ఓట్లను ఎన్డీయే గంపగుత్తగా సాధించింది. ఈ ముగ్గురూ తమ వర్గాల ఓట్లను ఎన్డీయేకు బదిలీ చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించారు. అభివృద్ధి, హిందుత్వ ఒకవైపు పూరి్ణయా విమానాశ్రయం, బెగుసరాయ్ వంతెన వంటి అభివృద్ధి పనులను చూపిస్తూనే, మరోవైపు సీతామఢిలో జానకీ ఆలయ(సీతాదేవి) నిర్మాణానికి అమిత్ షా, నితీశ్ కుమార్‌లు భూమి పూజ చేయడంతో హిందుత్వ ఓటు బ్యాంకు కూడా బీజేపీని బలపర్చింది. ప్రచారంలో మోదీ స్వయంగా రంగంలోకి దిగడం ఎన్డీయేకు కొండంత బలాన్నిచి్చంది. 16 రోజుల్లో 14 కీలక జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. -
ఎదురులేని ఎన్డీయే
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. మొత్తం 243 స్థానాలకు గాను ఏకంగా 202 స్థానాలు దక్కించుకొని డబుల్ సెంచరీ కొట్టేసింది. తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచీ చివరిదాకా బీజేపీ–జేడీ(యూ) కూటమి ప్రభంజనమే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందించిన సుపరిపాలన కూటమి విజయానికి బాటలు వేశాయి. 89 సీట్లలో జయకేతనం ఎగురవేసిన బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మిత్రపక్షమైన జేడీ(యూ)ను వెనక్కి నెట్టి, కూటమి పెద్దన్నగా మారింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠ్‌బంధన్ పూర్తిగా కుదేలయ్యింది. కేవలం 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ గుండుసున్నా చుట్టేసింది. ఘోర పరాజయం పాలయ్యింది. కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయింది. సీట్లు సాధించడంలో విఫలమైన జన సురాజ్ పార్టీ చాలా స్థానాల్లో మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. బిహార్ విజయంతో ఊపుమీదున్న బీజేపీ ఇక బెంగాల్ కోటపై కాషాయ జెండా పాతడానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. బిహార్ విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జంగిల్‌రాజ్ ఇక అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుపరిపాలన, వికాసానిదే విజయంబిహార్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో సుపరిపాలన, వికాసం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానిదే విజయం అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన సాధించడంపై శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘సుపరిపాలన గెలిచింది. అభివృద్ధి గెలిచింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి గెలిచింది. సామాజిక న్యాయం గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను చరిత్రాత్మకమైన, అపూర్వమైన విజయంతో ఆశీర్వదించినందుకు బిహార్‌లోని నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫలితాల అనంతరం ప్రధాని మోదీని సన్మానిస్తున్న రాజ్‌నాథ్ సింగ్, నడ్డా, అమిత్ షా ఈ అఖండ తీర్పు బిహార్ కోసం ప్రజలకు సేవ చేయడానికి నూతన సంకల్పంతో పనిచేయడానికి మాకు శక్తినిస్తుంది. అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు నా కృతజ్ఞతలు. వారు మా అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల ప్రతి అబద్ధాన్ని గట్టిగా తిప్పికొట్టారు. రాబోయే కాలంలో, బిహార్‌లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపును తీసుకువచ్చేందుకు మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం. యువ శక్తి, నారీశక్తికి సుసంపన్న జీవితం అందజేస్తాం’’అని పేర్కొన్నారు. బిహార్‌లో గెలిచిన ప్రముఖులుసాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేక సంచలనాలకు, ఆసక్తికరమైన గెలుపోటములకు వేదికగా ని లిచాయి. ఎన్డీఏ ప్రభంజనంలో కొందరు అగ్రనాయకులు, సి నీతారలు అనూహ్యంగా గెలిచి తమ పట్టు నిరూపించుకోగా, మరికొందరు అగ్రశ్రేణినేతలు, ముఖ్యంగా ’యాదవ్’ కుటుంబం, భోజ్‌పురి స్టార్లు తీవ్ర పరాజయాన్ని చవిచూశారు. శివానీ శుక్లా (ఆర్జేడీ): బాహుబలి నేత మున్నా శుక్లా కుమార్తె శివానీ, లాల్గంజ్ నుంచి గెలిచి రాజకీయ అరంగేట్రం చేశారు. మైథిలీ ఠాకూర్ (బీజేపీ – గాయని): ఈ ఎన్నికల్లో అతిపెద్ద సెలబ్రిటీ విన్నర్. రాజకీయ అరంగేట్రంలోనే అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ కంచుకోటను బద్దలుకొట్టి చరిత్రాత్మక విజయం సాధించారు. శ్రేయసి సింగ్ (బీజేపీ – షూటర్): కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, షూటర్ శ్రేయసి సింగ్ జమూయ్ స్థానం నుంచి 20,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో రెండోసారి గెలుపొందారు. వినయ్ బిహారీ (బీజేపీ – గాయకుడు/నటుడు): ప్రముఖ భోజ్‌పురి గాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వినయ్ బిహారీ లౌరియా స్థానం నుంచి మరోసారి సులభంగా గెలుపొందారు. ప్రభావం చూపని వామపక్షాలు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ముస్లిం మైనార్టీల ప్రాబల్యం కలిగిన సీమాంచల్‌లో 29 సీట్లలో పోటీ చేసి, ఐదు సీట్లు సాధించింది. ఆ పార్టీ ఏ కూటమిలోనూ చేరకుండా ఒంటరిగానే బరిలోకి దిగడం విశేషం. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జేపీ(రామ్‌విలాస్) 19 సీట్లు సొంతం చేసుకుంది. హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్) 5 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా 4 సీట్లు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 2 సీట్లు, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ ఒక స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. మరోవైపు ఈ ఎన్నికలు కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి చేదు అనుభవం మిగిల్చాయి. గత ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకున్న ఆర్జేడీ ప్రస్థానం ఇప్పుడు 25 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ సంఖ్యాబలం 19 నుంచి ఆరుకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఆర్జేడీ, కాంగ్రెస్ బలం భారీగా తగ్గిపోయింది. సీఎం నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించి మళ్లీ గెలుపు బావుటా ఎగురవేశారు. ముస్లింల ప్రభావం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ కూటమికి మంచి ఫలితాలు లభించాయి. మైనార్టీ ఓటర్ల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. విపక్ష కూటమిలో భాగమైన వామపక్షాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బహుజన సమాజ్ పార్టీ ఒక స్థానం, సీపీఎం ఒక స్థానం గెల్చుకున్నాయి. మరోవైపు బిహార్ విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే కష్టపడి పనిచేస్తామని తేల్చిచెప్పాయి. ఇదిలా ఉండగా, బిహార్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నితీశ్ కుమార్‌కు మరోసారి అవకాశం దక్కకపోవచ్చని, బీజేపీ నాయకుడే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది. దీనిపై బీజేపీ గానీ, జేడీ(యూ) గానీ ఇంకా స్పందించలేదు. పెరిగిన ఎన్డీయే ఓట్ల శాతం బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) తమ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. 2020 ఎన్నికల్లో 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 19.46 శాతం ఓట్లు సాధించగా, ప్రస్తుతం 101 స్థానాల్లో పోటీకి దిగి 20.08 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీ(యూ) 2020లో 115 సీట్లలో పోటీ చేసి, 15.39 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. ఇప్పటి ఎన్నికల్లో 101 సీట్లలో పోటీ చేసి, 19.25 శాతం ఓట్లు పొందింది. ఆర్జేడీ ఓట్ల శాతం 23.11 నుంచి 23 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్లశాతం 9.48 నుంచి 8.71 శాతానికి తగ్గిపోయింది. ఎంఐఎం ఓట్ల శాతం 1.24 నుంచి 1.85 శాతానికి పెరిగింది. ఈ ఎన్నికలతో విపక్ష కూటమి బలహీనతలు బయటపడ్డాయి. ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను జనం విశ్వసించలేదని తేటతెల్లమవుతోంది. ‘జంగిల్‌రాజ్’ వద్దనుకొని, అభివృద్ధి, సుపరిపాలనకు ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. తేజస్వీ అతికష్టం మీద ఎన్నిక మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ అతికష్టం మీద గట్టెక్కారు. రాఘోపూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల తేడాతో గెలిచారు. తొలుత వెనుకంజలో ఉన్న తేజస్వీ చివరి రౌండ్లలో పుంజుకున్నారు. విపక్ష కూటమిలో మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహెబ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి సందీప్ గౌరవ్ గెలిచారు. ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు ప్రేమ్ కుమార్, మహేశ్వర్ హజారీ, సంజయ్ సరోగీ మరోసారి విజయం సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యరి్థగా తొలిసారి పోటీ చేసిన యువ గాయకురాలు మైథిలీ ఠాకూర్ గెలిచారు. ఆమె అలీనగర్ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల తేడాతో నెగ్గారు. -
విపక్ష కూటమికి బి‘హారర్’
అయిదేళ్ల క్రితం బిహార్‌లో అంతంతమాత్రంగా గెలిచి అధికారంలోకొచ్చిన ఎన్డీయే కూటమి ఈసారి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటున్న దాఖలా కనబడుతోంది. శుక్రవారం ఉదయం ఈవీఎంలు తెరిచినప్పటినుంచి ఆ కూటమి అప్రతిహతంగా పురోగ మించటం తప్ప వెనుకంజ లేదు. దాని ధాటికి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విపక్షాల కంచుకోటలనుకున్నవి కుప్పకూలుతున్నాయి. అంగప్రదేశ్, భోజ్‌పూర్, మగద్, మిథిలాంచల్, సీమాంచల్, తిరుత్ తదితర ప్రాంతాలన్నిటా ఎన్డీయే కూటమి విపక్షాలకు అందనంత దూరంలో ఉందంటే... విపక్ష మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ)కి సారథ్యం వహించిన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవే తన స్థానాన్ని నిలుపుకోవటానికి యాతన పడ్డారంటే ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? గత ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరువైంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్యలో కొన్నాళ్లు కూటమికి దూరమై... వెనక్కొచ్చినా ఎన్డీయేపై దాని ప్రభావం లేకపోవటం గమనించదగ్గది. 243 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 200 స్థానాలకు ఎగబాకే దిశగా అది దూసుకెళ్తుండగా కనీసం 40 అయినా వస్తాయా అనే సందిగ్ధంలో ఎంజీబీ పడింది. తన ప్రాభవం గతించి దశాబ్దాలవుతుండగా ఎన్నిక లొచ్చి నప్పుడల్లా ‘తగుదునమ్మా...’ అంటూ అధిక స్థానాల కోసం పట్టుబట్టే కాంగ్రెస్ షరా మామూలుగా 61 తీసుకుని బొక్కబోర్లా పడింది. కూటమికి తాను పెద్ద గుదిబండనని రుజువు చేసుకుంది. గతంలో 70 సీట్లు తీసుకుని కేవలం 19 గెల్చుకున్న కాంగ్రెస్... ఇప్పుడు కేవలం 6తో సరిపెట్టుకునేలా కనబడుతోంది. సీమాంచల్‌లో ఎంఐఎం గతంలో గెల్చుకున్న అయిదు స్థానాలూ నిలుపుకోవటమేకాక రీ కౌంటింగ్ సాగుతున్న ఆరో స్థానంలోనూ నువ్వానేనా అన్నట్టుంది. వామపక్షాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే(సర్) పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) ఆదరాబాదరాగా మొదలెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు ఎంత హడావుడి చేసినా, సుప్రీంకోర్టుకెక్కినా... కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఓట్ చోరీ ప్రచారం చేసినా ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఫలితాల సరళి చెబుతోంది. అంతేకాదు... కుటుంబాని కొక సర్కారీ ఉద్యోగమిస్తామని ఆర్జేడీ చేసిన వాగ్దానం ఎన్డీయే నగదు బదిలీ ముందు వెలవెలబోయింది. 75 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే మహిళా రోజ్‌గార్ యోజన ద్వారా యేటా రూ. 10,000 ఇస్తామని చెప్పటమే కాక సెప్టెంబర్ 26న తొలి వాయిదాను అందించటం జనానికి నచ్చింది. బాగా వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొన్నా 2020 నాటి తన 37.23 శాతం ఓట్లనూ పెంచుకోవటంలో ఎంజీబీ విఫలమైంది. అదే సమయంలో ఎన్డీయే గతం కన్నా పది శాతం మేర పెంచుకుంది. గతం కన్నా మహిళలు ఎన్డీయే వైపు మొగ్గటం,గతంలో అలిగి విడిగా పోటీచేసిన ఎల్జేపీ తిరిగి వెనక్కురావటం బాగా కలిసొచ్చింది. పెద్దమాటలు చెబుతూ వచ్చిన ప్రశాంత్ కిశోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి విపక్షాలను దెబ్బతీశారు.ఆధిపత్య కులాల్లో ఓటు బ్యాంకును నిలుపుకొంటూనే బాగా వెనకబడిన ఎంబీసీ కులాలు, మహాదళిత్‌ల ఆదరణ పొందటం ఎన్డీయేకు లాభించింది. ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలకు తగినన్ని సీట్లివ్వటమే ఇందుకు కారణం. దీని ముందు ఆర్జేడీ ముస్లిం–యాదవ్ కలయిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 87 స్థానాల్లో దాదాపు 20 శాతం మించి ముస్లిం ఓట్లున్నా అందుకు దీటుగా సీట్లు కేటాయించటంలో ఆర్జేడీ విఫలమైంది. కొద్దోగొప్పో సీమాంచల్‌లో ఇచ్చినా ముస్లింలు ‘గెలిచే సత్తా’ ఉన్న అభ్య ర్థుల వైపే మొగ్గారు. ఈ ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి కూడా అధికార పక్షానికి కొంతమేర లాభించింది. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయిదేళ్లుగా ఉన్న పథకాలను సైతం ఎన్నికల ముందు నిలిపేసిన ఈసీ... పెద్ద మనసు చేసుకుని బిహార్‌లో సరికొత్త మహిళా రోజ్‌గార్ యోజన జోలికి పోలేదు. ఎన్డీయే నెగ్గితే మళ్లీ నితీశ్ సీఎం అవుతారా లేదా అన్న సంశయం మొదట్లో ఉన్నా, ఫలితాల సరళి చూస్తే ఆ విషయంలో బీజేపీ పట్టుబట్టక పోవచ్చు. ఏదేమైనా ఇది ప్రధాని నరేంద్ర మోదీ, ‘సుశాసన్ బాబు’ నితీశ్ కుమార్ కలిసి సాధించిన ఘన విజయం. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎంఐఎం
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 200 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం.. కాంగ్రెస్ కంటే ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం.సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం హవాబిహార్లో ఎంఐఎం 25 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో ఎక్కువ భాగం సీమాంచల్ జిల్లా నియోజకవర్గాల్లోని అరరియా, కటిహార్, కిషన్‌గంజ్, పూర్నియా జిల్లాలు ఉన్నాయి. మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ ప్రాంతం ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో ఏఐఎంఐఎం ఇక్కడ తన బలాన్ని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ ఎంఐఎం అభ్యర్థులు చేసిన విస్తృత ప్రచారం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. ఫలితంగా జేడీయూకి ఆధిక్యం లభించింది. సాయంత్రం 6.30గంటల సమయానికి ఎంఐఎం నాలుగు స్థానాల్లో గెలుపొందగా ఒక స్థానంలో లీడింగ్‌లో ఉంది. ఓటు శాతం ఆర్జేడీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఓటింగ్ శాతం23గా ఉంది. కాగా ఇది 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన 22.6% కంటే స్వల్పంగా పెరిగింది. కాంగ్రెస్ ఓటు శాతం 9.4% (2024 లోక్‌సభ) నుంచి 7.9% (2025 అసెంబ్లీ)కి పడిపోయింది. మహాఘట్బంధన్ మొత్తం ఓటు శాతం 36.9%, ఇది గత ఎన్నికల 40.1% కంటే 3 శాతం తగ్గింది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) వంటి చిన్న పార్టీల ఓటు శాతం కూడా గణనీయంగా తగ్గింది. #WATCH हैदराबाद, तेलंगाना: AIMIM अध्यक्ष असदुद्दीन औवेसी ने कहा, "मैं बिहार की जनता का धन्यवाद करूंगा कि उन्होंने AIMIM के उम्मीदवारों को जिताया... बिहार में जो नतीजा है वह आवामी नतीजा है। हम उसे स्वीकार करते हैं। हमारी पार्टी की ओर से कोशिश होगी कि बिहार के साथ-साथ सीमांचल में… pic.twitter.com/AL6shpQeyk— ANI_HindiNews (@AHindinews) November 14, 2025 -
జేడీయూ హవా : ప్రశాంత్ కిషోర్ రాజకీయ సన్యాసం?
Bihar Election 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా లీడ్‌లో కొన సాగుతోంది. మరోవైపు ప్రఖ్యాత పోల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ఇపుడు చర్చల్లో నిలిచాడు. ఒకవైపు ఎన్నికల అరంగేట్రంలో పెద్ద ఎదురు దెబ్బ, మరోవైపు జేడీయూ 25 కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్న పీకే చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశ మవుతున్నాయి.రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ (Nitish Kumar)జేడీయూ (JDU) 25 సీట్లు దాటితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అలాగే సీఎంగా నితీష్ కుమార్ కుర్చీపై కూర్చోరని కిషోర్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు కూడా. కానీ ఆయన అంచనాలన్నీ తల్లకిందులై, కూటమి భారీ మెజార్టీ దిశగా సాగుతోంది. మరి తాజా ఫలితాల నేపథ్యంలో పీకే తన వాగ్దానానికి కట్టుబడి ఉండి రాజకీయాలను వదిలివేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.(బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్)అయితే ఆకాశంలో లేదంటే నేల మీద ఒక సమయంలో, 243 సీట్ల శాసనసభలో JSP "10 కంటే తక్కువ లేదా 150 కంటే ఎక్కువ అని కూడాజోస్యం చెప్పారు. అటు ఆయన పార్టీ జాన్ సూరాజ్ (జేఎస్పీ) ఖాతా తెరవలేకపోయింది తన పార్టీ అయితే ఆకాశంలో లేదంటే నేలపై ఉంటుందని కూడా అంచనా వేశారు.కాగా బిహార్ శాసనసభలోని 243 సీట్ల కోసం నవంబర్ 6 ,నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో జరిగాయి. రెండు దశల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 67.13 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత రాష్ట్రంలో అత్యధిక ఓటర్ల పోలింగ్ ఇదే. ఇదే ఎన్టీయే కూటమికి బాగా కలిసి వచ్చింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.ఇదీ చదవండి: వాడే నాకు కరెక్ట్ : చాట్‌జీపీటీ వరుడొచ్చేశాడు! -
బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బిహార్‌లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బిహార్ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బిహార్ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.బిహార్‌లో ఎన్డీఏ సునామీ సృష్టించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు. Good governance has won. Development has won. Pro-people spirit has won. Social justice has won. Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…— Narendra Modi (@narendramodi) November 14, 2025 -
బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అత్యధిక శాతం ఓట్లు సాధించింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన బీజేపీ, జేడీయూ కంటే ఆర్జేడీకి ఎక్కువ పోలైయ్యాయి. ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్ తాజా డేటా ప్రకారం.. ఆర్జేడీకి 22.75 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ 20.67, జేడీయూ 18.89 శాతం ఓట్లు సాధించాయి. బీజేపీతో పోలిస్తే ఆర్జేడీకి 2.08 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. జేడీయూ కంటే తేజస్వీ పార్టీ 3.86 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది.243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో 143 స్థానాల్లో ఆర్జేడీ (RJD) పోటీ చేసింది. బీజేపీ- జేడీయూ చెరో 121 స్థానాల్లో బరిలోకి దిగాయి. 28 స్థానాల్లో అభ్యర్థులను నిలిపిన ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి (రామ్ విలాస్) 5.03 శాతం ఓట్లు దక్కించుకుంది.2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించిన ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఆ ఎన్నికల్లో ఆర్జేడీకి 23.11 శాతం ఓట్లు వచ్చాయి. 19.46 శాతం ఓట్లతో బీజేపీ 74 స్థానాలు దక్కించుకుంది. జేడీయూ 15.39 శాతం ఓట్లు తెచ్చుకుని 43 స్థానాలను సొంతం చేసుకుంది. 9.48 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమికి 37 శాతం, మహాగఠ్‌బంధన్‌కు 36 శాతం ఓట్లు వచ్చాయి.చదవండి: జేడీయూ హవా : ప్రశాంత్ కిషోర్ రాజకీయ సన్యాసం ?తాజా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఇప్పుడు 27 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 48 సీట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీకి 17 స్థానాలు జమ అయ్యాయి. జేడీయూ కూడా బాగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి ఏకంగా 35 స్థానాలు అదనంగా సాధించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. హస్తం పార్టీ 14 స్థానాలను కోల్పోయింది. 2020 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 1.19, జేడీయూ 3.5 శాతం అదనంగా ఓట్లు దక్కించుకున్నాయి. చదవండి: నితీశ్ కుమార్ నియోజకవర్గం ఏదీ? -
బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్'
Bihar Election Results 2025 ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ఫలితాల్లోకి మారితే, నితీష్ కుమార్ (Nitish Kumar) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఎన్డీయే అధికారికంగా సీఎం అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించనప్పటికీ, JD(U) నాయకులు ఆయనే సీఎం అని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఎన్డీయే విజయభేరి వెనుక రహస్యం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారిgది.నవంబర్ 14న జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మెజారిటీ మార్కును దాటింది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకనుగుణంగా నితీశ్ కుమార్ నాయకత్వానికే ప్రజలు మొగ్గు చూపారు. కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్కు ఘోర పరాభవం తప్పలేదు. బిహార్ సీఎంకోసం తేజస్వి కలలు కల్లలయ్యాయ.రికార్డ్ ఓటింగ్ బిహార్ ఈసారి ఓటింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సారి నమోదైన రికార్డ్ఓటింగ్ను ఎన్డీయే విజయానికి మార్గం సుగమం చేసింది. 60 శాతం అధిక పోలింగ్ శాతం ఉంది. చిన్న పోలింగ్ కేంద్రాలు, సవరించిన ఎన్నికల జాబితా యాక్సెస్ ఓటింగ్ శాతాన్ని పెంచిందంటున్నారు అధికారులు. అలాగే ముఖ్యంగా బలమైన స్థానిక సంబంధాలు ఉన్న అభ్యర్థుల ఎంపిక కూడా అధిక ఓటింగ్‌కు కారణమని భావిస్తున్నారు. మహిళా సంక్షేమం, యువకులు King Makersమహిళలు యువ ఓటర్ల బలమైన భాగస్వామ్యం కీలక ఫలితాలను నిర్ణయించడంలో కీలకమైనదని, ఇదే రాబోయేప్రభుత్వ విధాన ప్రాధాన్యతలను రూపొందిస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 'దశజారీ' ముఖ్యమంత్రి మహిళా రోజ్గర్ యోజన (MMRY) పథకం ప్రకటించిన తర్వాత మహిళలు భారీ సంఖ్యలో ఓటు వేశారు. వివిధ ప్రాంతాలలో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. పురుషుల కంటే 5 లక్షల మంది మహిళలు ఓటు వేయడంరికార్డు స్థాయిలో ఓటింగ్‌కు దారితీసింది.మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.4 కోట్ల మహిళలకు రూ. 10,000 నగదు, ఉచిత సైకిల్ పథకం, పంచాయతీల్లో 50శాతం రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35శాతం రిజర్వేషన్, ఉచిత విద్యుత్ లాంటి వాటితోపాటు, మహిళా సంక్షేమ పథకాల కింద రూ.2 లక్షల సాయం లాంటి హామీలు భారీ ప్రభావాన్ని చూపాయని అంచనా. చదవండి: బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్అలాగే కుల సమీకరణాల్లో ఎన్డీయే ఆధిపత్యాన్ని చాటుకుంది. అగ్ర కులాలలో 10శాతం కుష్వాహాలలో 4శాతంకంటే ఎక్కువ, పాశ్వాన్లలో 5శాతం కంటే ఎక్కువ, ముసాహర్లలో 3శాతం కంటే ఎక్కువ,మల్లాలలో 2.6శాతం వంటి విభిన్న వర్గాల మద్దతును కూడగట్టింది.ఎస్ఐఆర్ వివాదం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలపై గందరగోళం, సామూహిక తొలగింపు ఆరోపణలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం, సజావుగా జరిగిన ఓటింగ్ ఈ ప్రభావ పెద్దగా లేదని తెలిపింది. అలాగు కేంద్రం బిహార్‌కు కేటాయించిన 1.62 లక్షల కోట్ల అభివృద్ధి ప్యాకేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, మౌలిక సదుపాయాల మెరుగుదల లాంటివాటిని బాగా ప్రచారంలో పెట్టుకోవడంతో ఇది బాగా కలిసి వచ్చింది.'మోదీ హనుమాన్' చిరాగ్ చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని LJP- రామ్ విలాస్ పార్టీ 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంచలనంగా చెప్పవచ్చు. 2020లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుని ఒకప్పుడు రద్దైన ఆపార్టీ, అనూహ్యంగా ఈఎన్నికల్లో పుంజుకుంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది.ఇదీ చదవండి: వాడే నాకు కరెక్ట్ : చాట్‌జీపీటీ వరుడొచ్చేశాడు!మోదీ మ్యాజిక్ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చార్మ్, చాణక్యం అప్రతిహతంగా కొనసాగుతోంది. అసాధారణమైన 2024 లోక్‌సభ ఎన్నికలు మొదలు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలను కైవసం చేసుకునే మోదీ హవా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇపుడు బిహార్ మరో ప్రధాన విజయంగా మారనుంది. ఫోనిక్స్ సీఎం నితీశ్ రాజకీయాలు సంక్షేమం ఈ ఎన్నికలను నిర్వచించింది. ఓటర్లు తాజా వాగ్దానాల కంటే వారు ఇప్పటికే అనుభవించిన పథకాలను -రుణ బదిలీలు, పెన్షన్లు, మహిళా కేంద్రీకృత మద్దతు లాంటి పథకాలు వారిని మెప్పించాయి. సంక్షేమ విశ్వసనీయత, స్థిరమైన ప్రభుత్వంగా నితీష్ ప్రభుత్వాన్ని విశ్విసించడంతో ప్రభుత్వ వ్యతిరేకత బలహీనపడి, విజయభేరీ దిశగా నడిపించింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఒక విధంగా లిట్మస్ పరీక్ష. అయితే, గత 20 సంవత్సరాలుగా ప్రతి బిహార్ ఎన్నికలలోనూ నితీష్ కుమార్ శాశ్వత ప్రజాదరణ స్పష్టమైన అభివృద్ధి ,సమ్మిళిత వృద్ధిపై ఆయన దృష్టి ఫలించింది. నితీష్ పాలనా శైలి రెండు దశాబ్దాలకు పైగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సహాయపడింది. అభివృద్ధి, కలుపుగోలుతనం ఆయనను బీహార్ రాజకీయాల్లో ఒక బలీయమైన శక్తిగా మార్చింది. -
అంధకారం నుంచి ‘చిరాగ్’ వెలుగులు!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం దాదాపు ఖాయం. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూనే మరో యువనేత చిరాగ్ పాశ్వాన్ గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి హవా మామూలుగా లేదు, రాబోయే కాలమంతా చిరాగ్దే అన్నంతంగా చాటిచెప్పాయి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో 29 సీట్లను పట్టుబట్టి తీసుకున్న ఆయన.. ఏకంగా 19 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తున్నారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు తగ్గ తనయుడిగా తనదైన ముద్రను వేశారు చిరాగ్ పాశ్వాన్. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలోనూ విజయం సాధించిన చిరాగ్ పాశ్వాన్.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన పార్టీ ప్రభావం ఏమిటో చెప్పకనే చెప్పేశారు. ఫీనిక్స్‌లా పుంజుకుని..చిరాగ్ పాశ్వాన్ తిరిగి పుంజుకున తీరు ఫీనిక్స్ పక్షిని గుర్తు చేస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాశ్వాన్ రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళమే. జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో విభేదాల వల్ల ఆ సమయంలో ఒంటరిగానే పోటీకి సిద్దమయ్యారు. 130కి పైగా స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్.. కేవలం ఒక్క సీటును మాత్రమే సాధించారు. దాంతో ఆయన రాజకీయ అంధకారంగా కనిపించింది. అదే సమయంలో చిరాగ్ అవమానాలను సైతం ఎదుర్కొన్నాడు. అందకారం నుంచి ఆకాశమంత వెలుగు..ఆపై 2021లో సొంత బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పార్టీని చీల్చి, రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పుడు చిరాగ్ రాజకీయ భవిష్యత్ అంతా అంధకారంగానే కనిపించింది. బిహార్ రాజకీయాల్లో ఓ శక్తిగా వెలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే లక్షణాలు చిరాగ్‌లో లేవనే విమర్శలు వినిపించాయి. తండ్రిలో ఉన్న చరిష్మా చిరాగ్‌లో లేదని విమర్శకులు అభిప్రాయాపడ్డారు. అయితే ఐదేళ్ల వ్యవధిలోనే ఎంతలా పుంజుకున్నారో తాజాగా ఆయన తన అభ్యర్థులను ముందువరుసలో నిలిపిన తీరే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వంద శాతం స్తైక్రేట్ సాధించిన చిరాగ్.. ఇప్పుడు కూడా అదే జోరుతో ముందుకు సాగుతున్నారు. #WATCH | पटना: केंद्रीय मंत्री और LJP(रामविलास) के राष्ट्रीय अध्यक्ष चिराग पासवान ने NDA के बहुमत का आंकड़ा पार करने पर कहा, "बिहार की जनता ने जिस तरह से NDA को प्रचंड बहुमत दिया है और अगले पांच साल बिहार को विकास की ओर ले जाने का फैसला किया है, उसके लिए मैं विशेष रूप से उन्हें… pic.twitter.com/Lz5lWpDYuA— ANI_HindiNews (@AHindinews) November 14, 2025 చిరాగ్ అంటే కాగడా అని అర్థం.. ఇప్పుడు బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఎన్డీఏ కూటమిలో కాగడా మాదిరి మారి మరింత వెలుగు నింపారు. అదే సమయంలో ఆయన రాజకీయ జీవితాన్ని అంధకారం నుంచి ఆకాశమంత వెలుగుల వరకూ తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు చిరాగ్. ఇక బిహార్‌లో అంతా చిరాగ్ శకమే అన్నంత గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారాయన. -
బిహార్ సీఎం నితీశ్ కాదా! హింట్ ఇచ్చిన జేడీయూ ??
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీయే కూటమి 200 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ 32 స్థానాలకే పరిమితమైంది. ఈ క్రమంలో తదుపురి బిహార్ సీఎం ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొనగా.. నితీశ్ కుమారే 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందురూ అనుకున్నారు.ఈ క్రమంలో అనూహ్యం బిహార్ సీఎం నితీశ్ కాదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిదే విజయం అంటూ అంబరాన్నింటిన సంబరాల వేళ.. నీతీశ్ ప్రభుత్వం రాబోతోందని, అందుకు బిహార్ సిద్ధంగా ఉందంటూ జేడీయూ వరుస పోస్టులు పెట్టింది. ఈ విజయం అపూర్వమైనది. సాటిలేనిది. నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనే సీఎంగా కొనసాగుతారు అని జేడీ(యు) శుక్రవారం ట్వీట్ చేసింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత ఆ పోస్ట్‌ను తొలగించింది. దీంతో బిహార్ సీఎం ఎవరు? అనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అనూహ్య విజయం తర్వాత నితీశ్ కుమార్ భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు, నితీష్ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బీజేపీ స్పష్టం చేసినప్పటికీ రికార్డు స్థాయిలో 10వ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న జేడీ(యు)అధినేత నితీషే సీఎం పదవిని అధిష్టిస్తారని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో బిహార్ సీఎం పోస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?మరోవైపు మహారాష్ట్ర తరహా పాలిటిక్స్‌ను బిహార్‌లో అప్లయి చేయాలని కమలం పెద్దలు చూస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్లగా.. కాషాయ పార్టీ ఆధిపత్య ప్రదర్శన తర్వాత ఆ పదవి చివరికి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కట్టబెట్టింది. అదే విధంగా ఇక్కడ (బీహార్) ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరికి సీఎం పగ్గాలు అప్పగించే యోచనలో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జేడీయూ సోషల్ మీడియా పోస్టులు డిలీట్ చేసిన తర్వాత బిహార్ సీఎంగా సామ్రాట్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. మరి ప్రచారంలో వాస్తవమెంత? బిహార్ సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు? అనే అంశంపై బిహార్ ఎన్డీయే కూటమి పెద్దలు అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంది. విశ్వసనీయత కోల్పోయిన నితీశ్గెలుపు,ఆధిక్యం పక్కనబెడితే..నితీశ్ కుమార్ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేకపోవచ్చనే వాదన సైతం వినిపిస్తోంది. తరచూ మారుతున్న రాజకీయ కూటముల కారణంగా నితీశ్ ప్రజా విశ్వసనీయతను కోల్పోవడంతో పాటు ఇతరాత్ర కారణాలున్నా మాట సర్వత్రా వినిపిస్తోంది.‘అధికార దాహం’ ఉన్న నేతగాగత దశాబ్ద కాలంలో ఆయన పలుమార్లు బీజేపీతో, ఆ తర్వాత ఆర్జేడీతో జతకట్టి, తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ఆయనపై ప్రజల్లో ఒక రకమైన తేలికభావం ఏర్పడింది. ఒకప్పుడు ‘సుపరిపాలన బాబు’గా గుర్తింపు పొందిన నితీశ్ ఇప్పుడు కేవలం ‘అధికార దాహం’ ఉన్న నేతగా ముద్రపడ్డారు. పదే పదే పార్టీలు మారే నితీష్ వైఖరి ఆయన సొంత పార్టీ జేడీయూ (జేడీయూ)బలాన్ని సైతం గణనీయంగా తగ్గించింది, ఫలితంగా నితీష్ తన సొంత శక్తిపై మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశం లేకుండా పోయింది.కేంద్ర రాజకీయాల్లోకి నితీశ్ప్రస్తుతం దేశంలోని రాజకీయ సమీకరణాలలో ప్రధాని మోదీ సారధ్యంలోని బీజేపీ వ్యూహం అత్యంత కీలకమైనది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచేందుకు.. ప్రతిపక్షాల ఐక్యతా వేదిక ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు.. బీజేపీ సీఎం నితీశ్‌ను ఒక ఉపకరణంగా మాత్రమే వాడుకుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. బిహార్‌లో తమకు నమ్మకమైన మెజారిటీని సాధించిన తర్వాత, నితీశ్ నాయకత్వాన్ని కొనసాగించడం కంటే,రాష్ట్రంలో బీజేపీ బలం కలిగిన నేతను తెరపైకి తేవాలని, లేదా నితీశ్‌కు గౌరవప్రదమైన పదవి ఇచ్చి, కేంద్ర రాజకీయాలకు పంపాలని బీజేపీ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.మరోవైపు బీహార్ రాజకీయాల్లో యువ నాయకత్వం దూసుకొస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) వంటి యువ నాయకులు తమ బలాన్ని పెంచుకుంటూ, ప్రజల్లో ఆశలను పెంచుతున్నారు. ముఖ్యంగా నితీశ్ కుమార్ పాలనలో సరైన ఉద్యోగ అవకాశాలు లభించలేదనే భావన యువతలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ స్థానంలో మార్పును కోరుకునే ఓటర్ల సంఖ్య పెరిగిందనేవారూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ యువ నాయకత్వ ఆకర్షణ నితీశ్ రాజకీయ జీవితానికి పెద్ద సవాలుగా మారనుంది.ముగింపు దశకు నితీశ్ కుమార్ శకంనితీశ్ కుమార్ తిరిగి బీజేపీతో చేతులు కలపడం అనేది ఆయన ముఖ్యమంత్రి పదవీ కాలంపై మరింత అనిశ్చితిని పెంచింది. ప్రస్తుతం బీజేపీ మద్దతుపై ఆధారపడిన నితీశ్ , గత లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ షరతులకు లోబడి ఉండవలసి వచ్చింది. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే, నితీశ్‌ను పక్కన పెట్టి, తమ సొంత ముఖ్యమంత్రిని ప్రకటించడానికి బీజేపీ ప్లాన్ చేసివుండవచ్చనేవారూ ఉన్నారు. అంతేకాకుండా, అనారోగ్య కారణాలు లేదా వయోభారం వంటి వ్యక్తిగత కారణాలను చూపుతూ బీజేపీ.. నితీష్‌ను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేలా ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఈ కారణాలన్నింటినీ కలిపి చూస్తే, బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ శకం ముగింపు దశకు చేరుకుందని, భవిష్యత్తులో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కాకపోవచ్చనే అంచనాలున్నాయి. -
Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?
పట్నా: బీహార్‌లోని చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్లు అగ్రశ్రేణి పోటీదారులెవరనేది వెల్లడించాయి. తాజా డేటా ప్రకారం బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్ 30,290 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ 28,719 ఓట్లు సాధించారు. మనీష్ కశ్యప్‌గా పేరొందిన ప్రముఖ యూట్యూబర్ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.యూట్యూబర్ నుండి రాజకీయ నేత మారిన త్రిపురారి కుమార్ తివారీ(మనీష్ కశ్యప్) ప్రస్తుతం 12,081 ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన జన్ సురాజ్ అభ్యర్థిగా పోటీకి దిగారు. చాన్పాటియా అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ చంపారన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2020లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఉమాకాంత్ సింగ్ కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ రంజన్‌ను 13,469 ఓట్ల తేడాతో ఓడించి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.సోషల్ మీడియాలో ప్రాంతీయ సమస్యను ప్రస్తావిస్తూ ప్రజాదరణ పొందిన మనీష్ కశ్యప్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగారు. తన డిజిటల్ ప్రజాదరణతో ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశించారు. కాగా బీహార్ వలసదారులపై దాడులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో 2023లో తమిళనాడు పోలీసులు యూట్యూబర్ మనీష్ కశ్యప్‌ను అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మనీష్ 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ తరువాత బీజేపీని వీడి జన్ సురాజ్‌లో చేరారు. -
Punjab ByPoll: తార్న్ తరణ్‌లో ఆప్ ముందంజ
అమృత్సర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు నేడు(శుక్రవారం) కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లా తార్న్ తరణ్ ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఆప్’ ముందంజలో ఉంది. ఈ ఫలితాల తీర్పు పంజాబ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కీలక సూచికగా పరిగణిస్తున్నారు. తార్న్ తరణ్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఆప్‌నకు చెందిన హర్మీత్ సింగ్ సంధు, బీజేపీకి చెందిన హర్జిత్ సింగ్ సంధు, ఎస్ఏడీకి చెందిన సుఖ్విందర్ కౌర్ రాంధావా, కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ నిలిచారు. వీరంతా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. -
అమిత్ షా చెప్పిందే జరిగింది..
-
జమ్ముకశ్మీర్: నగ్రోటాలో బీజేపీ విజయం
నగ్రోటా: జమ్ముకశ్మీర్‌లోని నగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి చెందిన దేవయాని రాణా 42,350 ఓట్లతో విజయం సాధించారు. జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్ 17,703 ఓట్లతో ఆమె చేతిలో ఓడిపోయారు. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షమీమ్ బేగం 10,872 ఓట్లు దక్కించుకున్నారు. జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ మెహదీ బుడ్గాం అసెంబ్లీ ఉప ఎన్నికలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గండేర్బల్ స్థానాన్ని నిలుపుకునే ఉద్దేశంతో రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. -
ఇది ముమ్మాటికీ ఆయన విక్టరీనే!
‘‘నితీశ్ కుమార్‌కు వయసు పైబడిపోయింది. ఆయన ఆరోగ్యమూ బాగోలేదు. ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జనాల్లో తిరిగే ఓపిక ఆయనకు ఉండడం లేదు. ఇక ఆయనకు విశ్రాంతి అవసరం. పైగా ఆయనకు అధికారంపైనే తప్ప ప్రజలపై మమకారం లేదు. బిహార్‌కు ఇప్పుడు కొత్త తరహా ఆలోచనలు అవసరం.’’.. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వినిపించిన విమర్శలు ఇవి. అయితే ఆ విమర్శలకు ఆయన గ్రాండ్ విక్టరీతోనే చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారు. నితీశ్ పాలనతో బిహారీలు విసిగిపోయారని.. అందుకే ఆయన్ని తప్పించాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ వేరుగా ర్యాలీలు నిర్వహించమే అందుకు నిదర్శనమని.. రాజకీయ ప్రచారం విస్తృతంగా సాగింది ఎన్నికల ప్రచారం సమయంలో. అయితే ఇలాంటి ప్రచారాలను, తనపై వచ్చిన విమర్శలను నితీశ్ కుమార్ ఏనాడూ తిప్పి కొట్టింది లేదు. అయితే.. 74 ఏళ్ల వయసులో ప్రచారంలో చురుకుగా పాల్గొనడం ద్వారా హుందాగా ఆయన వాళ్ల నోళ్లు మూయించారు. టైగర్ అబీ జిందా హై(పులి పని ఇంకా అయిపోలేదు).. తనను తక్కువ అంచనా వేయొద్దంటూ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ వచ్చారు. అంతేకాదు.. ప్రజలే నిజమైన తీర్పు ఇస్తారంటూ ఓ వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజేపీ వ్యవహారంలోనూ ఆయన ట్రిగ్ అయిన దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణం లేకపోలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ సాధించిన సీట్లు 43. బీజేపీ కంటే 31 సీట్లు తక్కువే. అయినప్పటికీ ప్రాంతీయత, అనుభవం పేరిట నితీశ్‌కుమార్‌కే సీఎం పగ్గాలు అప్పగించింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీకి కటీఫ్ చెప్పినా.. మళ్లీ కొంతకాలానికి జట్టు కట్టి సీఎం అయ్యారు. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని బీజేపీతో ఆయన స్నేహపూర్వకంగా మెదులుతూ వచ్చారు. బీజేపీ చివరిదాకా నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించపోయినా ఆయన నొచ్చుకోలేదు. ఈలోపు.. ఇటు బిహార్ ఓటర్లు మహాఘట్ బంధన్‌లో కీచులాటను సునిశితంగా గమనించారు. చివరకు సుదీర్ఘ నాయకత్వాన్ని గౌరవమిస్తూ ‘సుశాసన్ బాబు’కే ఓటు వేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 80 సీట్లు గెల్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు డబుల్ ఫలితం. తద్వారా పదో సారి ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణం చేయబోతున్నారు. అయితే.. JD(U) విజయానికి నితీశ్ కుమార్ తిప్పిన రాజకీయ చక్రం ప్రధాన శక్తిగా ఉన్నా.. పార్టీకి చెందిన ఇతర నేతలు, ఎన్డీయే భాగస్వాములు, సామాజిక సమీకరణలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలు కూడా విజయానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. -
Bihar Election: ఎన్డీఏని నిలబెడుతున్న ‘చిరాగ్’
పట్నా: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కి ప్రోత్సాహాన్నిచ్చే విధంగా, చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. పాశ్వాన్ పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో, 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు ఎన్డీఏకి బలమైన సహకార పార్టీలలో ఒకటిగా నిలిచింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తాజా ట్రెండ్లలో అధికార ఎప్డీఏ 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ చాలా వరకూ వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 82 సీట్లలో ఆధిక్యంతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుండగా, దాని కీలక మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 81 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఎఎం) సహా ఇతర ఎన్‌డిఎ భాగస్వాములు వరుసగా ఒకటి, నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు దశల ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు 38 జిల్లాల్లోని 46 కేంద్రాలలో ప్రారంభమైంది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో 243 సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 67.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది. -
బిహార్ మాదే.. ఇక బెంగాల్ వంతు : కేంద్రమంత్రి చాలెంజ్
పట్నా: పలు రాష్ట్రాల్లో వరుస విజయాలతో బీజేపీ తన హవాను కొనసాగుతోంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ప్రస్తుత ఓట్ల లెక్కింపులో బీజేపీ జోష్ మీద ఉంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నెక్ట్స్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని పేర్కొన్నారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) మెజారిటీ స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బిహార్‌లో అవినీతి, దోపిడీ,అరాకచక ప్రభుత్వానికి చోటు లేదని ప్రస్తుత ఆధిక్యం నిరూపి స్తోందని పేర్కొన్న గిరిరాజ్ సింగ్ రాష్ట్ర యువత తెలివైంది అంటూ ప్రశంసించారు. ఇది అభివృద్ధి సాధించిన విజయం. ప్రజలు శాంతి, న్యాయం,అభివృద్ధిని ఎంచుకున్నారు. నేటి యువత మునుపటి రోజులను చూడకపోయినా, వారి పెద్దలు చూశారు. వారినుంచి తెలుసుకున్నారు. అలాగే అరాచకంగా కొనసాగిన తేజస్వి యాదవ్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు చూశారని ఎద్దేశా చేశారు. బిహార్‌ను గెల్చుకున్నాం. ఇపుడిక బెంగాల్ వంతు అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద చాలెంజ్ విసిరారు. అక్కడున్నది అరాచక ప్రభుత్వం అంటూ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తాజా అంచనాల ప్రకారం 243 మంది సభ్యులు గల బిహార్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 122 సీట్ల మెజారిటీ మార్కునుఅధిగమించింది ప్రస్తుతం 160 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. పోల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జాన్ సూరాజ్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ వరుసగా ఐదోసారి తన పదవిని దక్కించుకుంటారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. ఇదే జోరు బిహార్‌లోనూ కనిపిస్తోంది. -
బీహార్ కా షేర్
-
మోదీ మాస్టర్ ప్లాన్.. బీహార్ సీఎం నితీష్ కాదు ?
-
పార్టీల వారీగా ఫలితాలు ఇలా..
దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించిన బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అధికార ఎన్డీఏ కూటమి జయభేరి మోగించింది. డబుల్ సెంచరీతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసేలా జయ కేతనం ఎగుర వేసింది. మహాగఠ్‌బంధన్ ఊహించని విధంగా ఘోర పరాజయం చవిచూసింది.ఎన్డీఏ కూటమి 202 స్థానాల్లో విజయం సాధించగా, మహాగఠ్‌బంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్‌పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం తన 5 స్థానాలను నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీఏ కూటమి విజయం సాధించడం విశేషం. యువనేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వంలోని లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ(ఆర్వీ) 28 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాగా, చిరాగ్ పాశ్వాన్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశముందని వార్తలు వ స్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం పార్టీల వారీగా ఫలితాలు ఇలా.. పార్టీ ఆధిక్యం1 భారతీయ జనతా పార్టీ -బీజేపీ892జనతాదళ్ (యునైటెడ్)- జేడీయూ853రాష్ట్రీయ జనతాదళ్- ఆర్జేడీ254లోక్ జనశక్తి (రామ్ విలాస్)195ఇండియన్ నేషనల్ కాంగ్రెస్66 ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 57 హిందుస్థానీ అవామ్ మోర్చా- హెచ్ఏఎంఎస్ 58రాష్ట్రీయ లోక్ మోర్చా- ఆర్ఎస్హెచ్టీఎల్కేఎం49సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్210ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ - ఐఐపీ111కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)112బహుజన సమాజ్ పార్టీ- బీఎస్పీ1 Total243 -
బిహార్ లో ఎన్డీయే హవా.. గెలుపుకి కారణం ఇదే!
-
Assembly ByPolls: ఎవరు ఆధిక్యం? వెనుకంజ ఎవరు?
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయ. పంజాబ్‌లోని తర్న్ తరణ్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన హర్మీత్ సింగ్ సంధు ఆధిక్యంలో ఉన్నారు. శిరోమణి అకాలీదళ్‌కు చెందిన సుఖ్విందర్ కౌర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ వెనుకబడి ఉన్నారు.ఒడిశాలోని నువాపాడ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన జై ధోలాకియా ముందస్తు ఆధిక్యంలో ఉన్నారని ఈసీఐ తెలిపింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ఘాసి రామ్ మాఝి, బిజు జనతాదళ్‌కు చెందిన స్నేహంగిని చురియా వెనుకబడి ఉన్నారు. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్-మోసావి.. బుద్గాంలో ముందస్తు ఆధిక్యంలో ఉన్నారని ఈసీఐ తెలిపింది. భారతీయ జనతా పార్టీకి చెందిన అగా సయ్యద్ మొహ్సిన్ మోస్వి వెనుకబడి ఉన్నారు.రాజస్థాన్‌లోని అంటా అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ భయా ముందస్తు ఆధిక్యంలో ఉన్నారని ఈసీఐ తెలిపింది. భారతీయ జనతా పార్టీ మోర్పాల్ సుమన్, స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా వెనుకంజలో ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సోమేష్ చంద్ర సోరెన్ ఘట్శిలా ఉప ఎన్నికలో తొలి ఆధిక్యంలో ఉన్నారని భారత ఎన్నికల సంఘం తెలిపింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుమారుడు, భారతీయ జనతా పార్టీకి చెందిన బాబు లాల్ సోరెన్ వెనుకబడి ఉన్నారు. -
బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఒకలా.. ఫైనల్స్ లో ఫలితాలు మరోలా
-
మహా కూటమికి ఘోర పరాభవం!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ప్రస్తుతం 190 ఫ్లస్ లీడ్‌తో హిస్టారికల్ విక్టరీ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ట్రెండ్స్ ప్రకారం.. మహాఘట్ బంధన్ ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. మరోవైపు.. అయితే ఘనవిజయం లేదంటే ఘోర పరాజయం అంచనా వేసిన ఎన్నికల మాజీ వ్యూహకర్త, జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ జోస్యం మాత్రం నిజం కాబోతోంది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్‌కు ఇది తొలి ఎన్నికలు. అయితే ఆశించిన విజయాన్ని అందుకోకున్నా.. ఈ పార్టీ ఎక్స్ఫ్యాక్టర్గా పని చేయొచ్చని విశ్లేషకులు భావించారు. ఎగ్జిట్‌పోల్స్ మాత్రం జేఎస్పీ ఘోరంగా విఫలమవుతుందని, ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశం అంతంత మాత్రంగా ఉందని అంచనా వేశాయి. కానీ, ఆ అంచనా కూడా తప్పేలా కనిపిస్తోంది.ఇవాళ్టి బిహార్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎం కౌంటింగ్‌లోనూ రెండు నుంచి 4 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది. ఆ తర్వాత నెమ్మదిగా సున్నాకే పరిమితమైంది. ఇప్పుడు ఒక్క స్థానం దక్కించుకోవడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది. చివర్లో ఎలాంటి ఫలితం దక్కించుకుంటోందో చూడాలి. ఎన్నికల వ్యూహకర్తగా నితీశ్ కుమార్ సహా పలువురి విజయాల్లో పీకే కీలక పాత్ర పోషించారు. అయితే.. సొంత పార్టీతో మూడేళ్లుగా చేస్తున్న ప్రచారం మాత్రం వర్కవుట్ కాలేదనే స్పష్టం చేస్తోంది.ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో జేడీయూ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా నితీశ్ పని అయిపోయిందని విపక్షాలు చేస్తున్న ప్రచారానికి ఈ ఫలితం పుల్‌స్టాప్ వేసిందని భావించొచ్చు. ఇక అధికార మిత్రపక్షం బీజేపీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. తుది ఫలితాలు వెల్లడయ్యేలోపు ఈ లెక్క కొంచెం మారే అవకాశం లేకపోలేదు. గత ఎన్నికల్లో ఆర్జేడీ(75), బీజేపీ(74), జేడీయూ(43), కాంగ్రెస్(19).. ఇలా ప్రధాన పార్టీలు సీట్లు దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీయే హవా చూస్తుంటే ఆర్జేడీ+కాంగ్రెస్+ఇతర పార్టీల కూటమి సగానికి పైగా స్థానాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడో విచిత్రం ఏంటంటే.. 200 స్థానాల్లో పీకే జేఎస్పీ డిపాజిట్లు కొల్పోయింది. విపక్ష కాంగ్రెస్ కంటే.. పీకే జేఎస్పీ ఓటు శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు(అంచనా మాత్రమే). మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పార్టీ ఈ ఎన్నికల్లో పూర్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ.. మహాఘట్ బంధన్ ఓట్లను చీల్చడం ద్వారా NDAకి లాభం చేకూర్చిందనే చర్చ మొదలైందక్కడ. -
విజయం వైపు దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి
-
Watch Live: బిహార్ ఎన్నికల ఫలితాలు
-
Assembly ByPolls: జేకేలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీదళ్ ముందంజ
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయ. ప్రారంభ ట్రెండ్లను పరిశీలిస్తే కీలక పార్టీలు తొలి ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని నగ్రోటా ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి దేవయాని రాణా ప్రస్తుతం 1,111 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన హర్ష్ దేవ్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షమీమ్ బేగం కంటే ఆయన ముందంజలో కొనసాగుతున్నారు.మరోవైపు జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్ మోసావి.. బుడ్గామ్‌లో 624 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మిజోరంలోని డంపా అసెంబ్లీ ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) తొలి ఆధిక్యంలో ఉంది. అభ్యర్థి డాక్టర్ ఆర్ లాల్తాంగ్లియానా 170 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం జోరాం పీపుల్స్ మూవ్మెంట్ వన్లాల్సైలోవా, బీజేపీకి చెందిన లాల్మింగ్తంగా కంటే ముందంజలో ఉన్నారు.పంజాబ్‌లోని తర్న్ తరన్ ఉప ఎన్నికలో, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అభ్యర్థి సుఖ్విందర్ కౌర్ 625 ఓట్ల ఆధిక్యంతో ఆధిక్యంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)హర్మీత్ సింగ్ సంధు.. కాంగ్రెస్ పార్టీ కరణ్‌బీర్ సింగ్ కంటే ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ (బుద్గాం, నగ్రోటా), రాజస్థాన్ (అంటా), జార్ఖండ్ (ఘట్శిల), తెలంగాణ (జూబ్లీ హిల్స్), పంజాబ్ (తర్న్ తరన్), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడా)లలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరిగాయి. -
Bihar Results: మహువాలో తేజ్ ప్రతాప్ వెనుకంజ
పట్నా: బీహార్‌లోని 243 నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. తొలి ట్రెండ్స్ వెల్లడవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకబడి ఉండగా, ఆర్జేడీ నేత ముఖేష్ కుమార్ రౌషన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఎ 100 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉండగా, ఎంజీబీ 67 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీహార్‌లోని కీలకమైన నియోజకవర్గాల్లో మహువా ఒకటి. ఇక్కడ తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ జనశక్తి జనతా దళ్ (జేజేడీ), ఎంజీబీ, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ), ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది. సుమారు ఆరేళ్ల క్రితం లాలూ పార్టీతో విడిపోయిన తేజ్ ప్రతాప్ తన సొంత పార్టీ జేజేడీని స్థాపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. తేజ్ ప్రతాప్ స్వయంగా మహువాలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. -
Bihar Election: మొదటి నుంచి తేజస్వీ ఆధిక్యం
రఘోపూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ప్రతిపక్షాల మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబపు కంచుకోట అయిన రఘోపూర్ నుండి పోటీకి దిగారు. కౌంటింగ్ తొలి దశలో ఆయన ముందంజలో ఉన్నారు. వైశాలిలోని రాఘోపూర్ స్థానం ఫలితాల మొదటి రౌండ్ కౌంటింగ్‌లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ 4,463 ఓట్లు సాధించగా, బీజేపీకి చెందిన సతీష్ రాయ్ 3,570 ఓట్లు సాధించారు. ఆర్జేడీకి బలమైన కోట అయిన ఈ నియోజకవర్గంలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం 893 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇది ప్రజా విజయం అని, మార్పు తప్పక వస్తుందని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రఘోపూర్ ఆర్జేడీకి బలమైన కోట. గతంలో తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్, అతని తల్లి రబ్రీ దేవి ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2015 నుండి తేజస్వి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో, ఆయన 38,000 ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈసారి బీజేపీ తన రఘోపూర్ అభ్యర్థిగా సతీష్ కుమార్ యాదవ్‌ను ఎన్నుకుంది. యాదవ్ 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి రబ్రీ దేవిని ఓడించారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కూడా రఘోపూర్‌లో తన అభ్యర్థిని నిలబెట్టింది. -
Bihar Election: సింగర్ మైథిలి ఠాకూర్ ముందంజ
అలీనగర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు రౌండ్ల వారీగా వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని జనరల్ నియోజకవర్గం అలీనగర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన జానపద గాయని, బీజేపీ సాంస్కృతిక రాయబారి మైథిలి ఠాకూర్ తొలి ఫలితాల్లో ముందంజలో ఉన్నారు.బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని అలీనగర్‌లో చాలా ఏళ్లుగా ఎన్నికల్లో హోరాహోరీ పోటీ ఏర్పడుతోంది. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన జానపద గాయని మైథిలి ఠాకూర్‌పై అందరి దృష్టి నిలిచింది. ఆమె అలీనగర్ నుండి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్‌ను ఎన్నికల బరిలోకి దింపడం ద్వారా బీజేపీ ఇక్కడ సునాయాస విజయం సాధించేందుకు ప్లాన్ చేసింది. మైథిలి ఠాకూర్‌పై ఆర్జేడికి చెందిన వినోద్ మిశ్రా పోటీ పడుతున్నారు. మైథిలి ఠాకూర్ తన ఎన్నికల అఫిడవిట్లో దాదాపు రూ.4 కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఆమె వార్షిక ఆదాయం ఐదు సంవత్సరాలలో రూ.12.02 లక్షల నుండి రూ.28.67 లక్షలకు పెరిగిందని తెలిపారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నవంబర్ 6, 11 తేదీలలో జరిగాయి. నేడు (నవంబర్ 14) కౌంటింగ్ జరుగుతోంది. -
జూబ్లీహిల్స్‌తో పాటు ఇక్కడా.. జోరుగా కౌంటింగ్
న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో ఈరోజు (శుక్రవారం, నవంబర్ 14) ఒక ప్రత్యేకమైన దినం. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. దీనితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఎనిమిది కీలక అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు కూడా నేడు వెల్లడికానున్నాయి. ఉప ఎన్నికలు జరిగిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది.తెలంగాణ: జూబ్లీహిల్స్తెలంగాణలోని జూబ్లీహిల్స్ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్, బీఆర్ఎస్ మహిళా నేత సునీత మధ్య గట్టి పోటీ ఉండనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లంకల దీపక్ రెడ్డిని బీజేపీ ఎన్నికల బరిలోకి దింపింది.జమ్ముకశ్మీర్: బుడ్గామ్, నగ్రోటాబుడ్గామ్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అభ్యర్థి అఘా మెహమూద్తో పీడీపీ నేత అగా సయ్యద్ ముంతాజీర్ తలపడ్డారు. ఒమర్ అబ్దుల్లా తన గండేర్బాల్ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని, బుడ్గామ్ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఎన్నిక అనివార్యమయ్యింది. నగ్రోటాలో బీజేపీ ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ ఎన్సీ నుంచి షమీమ్ బేగం, బీజేపీ నుంచి దేవయాని రాణి పోటీ చేస్తున్నారు.రాజస్థాన్: అంటరాజస్థాన్లోని అంట నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ జైన్ భయా, బీజేపీకి చెందిన మోర్పాల్ సుమన్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన కన్వర్ లాల్ మీనా తన స్థానాన్ని కోల్పోయిన దరిమిలా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.జార్ఖండ్: ఘట్శిలజార్ఖండ్లోని ఘట్శిల ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (బీజేపీ) కుమారుడు బాబులాల్ సోరెన్, మహాకూటమికి చెందిన సోమేష్ చంద్ర సోరెన్‌తో పోటీ పడుతున్నారు.ఒడిశా: నువాపాడఒడిశాలోని నువాపాడ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జే ధోలాకియా, బీజేడీకి చెందిన స్నేహంగిని చురియా కాంగ్రెస్‌కు చెందిన ఘసిరామ్ మాఝి మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది. స్థానిక కుల సమీకరణలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంటాయి.పంజాబ్: తర్న్ తరన్పంజాబ్లోని తర్న్ తరన్‌లో ఆప్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఉప ఎన్నిక జరిగింది. బీజేపీకి చెందిన హర్జీత్ సింగ్ సంధు, ఆప్‌కు చెందిన హర్మీత్ సింగ్ సంధు కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ ఇక్కడ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.మిజోరం: డంపాషెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన మిజోరంలోని డంపా నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. బీజేపీ లాల్హ్మింగ్తంగా సైలోను, కాంగ్రెస్ జాన్ రోట్లువాంగ్లియానాను నామినేట్ చేసింది. ఎంఎన్ఎఫ్ ఆర్. లాల్తాంగ్లియానాను ప్రతిపాదించింది. జెడ్పీఎంకు చెందిన వాన్లాల్సైలోవా ఈ రేసులో చేరారు. -
చెత్తలో వీవీపాట్ స్లిప్‌లు.. ఎన్నికల అధికారి సస్పెండ్
సమస్తీపూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో సమస్తీపూర్ జిల్లాలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపాట్ స్లిప్‌లు లభమయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.జిల్లాలోని సరైరంజన్ అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక కళాశాల సమీపంలో రోడ్డు పక్కన చెల్లాచెదురుగా వీవీపాట్ స్లిప్‌లు కనిపించాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టింది. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఈ ఉదంతంపై విచారణ జరపాలని ఆదేశించింది. స్థానికంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఈ విషయమై డీఎంకు సమాచారం అందించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్ఓను సస్పెండ్ చేశారని, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. -
Bihar Election Results: ఘన విజయంపై ప్రధాని మోదీ హర్షం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది?.. మరికొన్ని గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర పడనుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. -
Bihar Election: 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు
పట్నా: ఈరోజు(శుక్రవారం) వెలువడే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అధికార ఎన్‌న్డీఏ కూటమి విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ భాగస్వామ్యానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇప్పటికే సంబరాలను ప్రారంభించారు. రాజధాని పట్నాలో విజయోత్సవాలను జరుపుకునేందుకు 500 కేజీల లడ్డూలు, 5 లక్షల రసగుల్లాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. అలాగే భారీ విందు కోసం కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు కృష్ణ సింగ్ కల్లు మాట్లాడుతూ 500 కిలోల లడ్డూలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిత్రాలతో లడ్డూలు తయారు చేయిస్తున్నట్లు తెలిపారు.స్థానిక బీజేపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం ఈ విజయోత్సవాల కోసం ఐదు లక్షల రసగుల్లాలు, గులాబ్ జామూన్లను సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజున పలు ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలకు నేతలను, కార్యకర్తలను, మద్దతుదారులను ఆహ్వానించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ, మహాకూలమి మధ్య గట్టి పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. అధికార కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని పాట్నాలోని వేడుకల వాతావరణం ప్రతిబింబిస్తోంది. -
నేడే బిహార్ తీర్పు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇవ్వబోయే తీర్పు కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణ ముగిసే సమయం వచ్చేసింది. శుక్రవారమే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. సీనియర్ నేత, అనుభవజు్ఞడు నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? లేక యువ నాయకుడు తేజస్వీ యాదవ్ అధికార పీఠం అధిరోహిస్తారా? అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. బిహార్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయ్యింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. 38 జిల్లాల్లో మొత్తం 46 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఈసారి ఎన్నికల్లో ఏకంగా 2,616 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 6, 11న.. రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 67.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది. బిహార్ ఎన్నికల చరిత్రలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కేంద్ర పరిశీలకులు, అభ్యర్థుల తరపు ఏజెంట్ల సమక్షంలో మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ సెంటర్ల వద్ద రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఎన్డీయేకే పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్ బిహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ మధ్య పోటీ నెలకొంది. విజయం తమదేనని రెండు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడానికి సొంత భాష్యం చెబుతున్నాయి. తమ పాలన పట్ల ప్రజల్లో సానుకూలతకు ఇది నిదర్శనమని ఎన్డీయే వాదిస్తుండగా, నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారని మహాగఠ్‌బంధన్ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. మరోవైపు చివరి నిమిషంలో పారీ్టలన్నీ ఫలితాల లెక్కల్లో మునిగితేలాయి. గురువారం చర్చోపచర్చలు సాగించాయి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆర్జేడీ అగ్రనేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ విజ్ఞప్తిచేశారు. ఎవరైనా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపులో అవాంఛనీయ ఘటనలు జరిగితే, అధికార కూటమిని అక్రమాలకు పాల్పడితే నేపాల్ తరహాలో బిహార్ ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఆర్జేడీ నాయకుడు సుశీల్‌కుమార్ సింగ్ తేల్చిచెప్పారు. జనం ఈసారి మార్పు కోరుకున్నారని, తేజస్వీ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని తేల్చిచెప్పారు. ఓటర్లను కించపరుస్తున్నారు: బీజేపీ ఎన్నికల ఫలితంపై మహాగఠ్‌బంధన్ పెద్దలకు ఇప్పటికే స్పష్టత వచ్చేసిందని, వారంతా నిరాశలో మునిగిపోయి ఓటర్లను కించపరుస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీజేపీ బిహార్ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ విమర్శించారు. ఎన్డీయే జనరంజక పాలనకు మరోసారి పట్టం కట్టాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని స్పష్టంచేశారు. రెండు దశల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఓట్ల లెక్కింపు కూడా అదేవిధంగా సాగుతుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకొనేందుకు బిహార్ ప్రజలు కట్టబడి ఉన్నారని దిలీప్ జైస్వాల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఎన్డీయే మళ్లీ విజయం సాధించి, నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయితే సరికొత్త ఘనత సాధిస్తారు. బిహార్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి నాయకుడిగా రికార్డుకెక్కుతారు. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ సైతం ఈసారి పోటీకి దిగింది. ఉనికి చాటుకొనేందుకు బాగానే కష్టపడింది. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని, సున్నా నుంచి రెండు మూడు సీట్ల దాకా రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. -
Bihar Election: నితీష్ ఇంటి ముందు ‘టైగర్’ పోస్టర్
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏకు ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్లాయి. ఈ నేపధ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ డీజేడీయూలో అపరిమితమైన ఉత్సాహం తొణికిసలాడుతోంది. నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇంతలో ఫలితాలకు ముందే సీఎం నితీష్ ఇంటి బయట ‘టైగర్ అభీ జిందా హై’ అంటూ రాసిన ఒక పోస్టర్ వెలిసింది. నితీష్ కుమార్ పార్టీ గణనీయమైన సీట్లను గెలుచుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇది నితీష్ తన ముఖ్యమంత్రి తన పదవిని నిలబెట్టుకునేందుకు అవకాశాలను మరింత పెంచుతుందని అంటున్నారు. #WATCH | Poster featuring CM Nitish Kumar that reads "Tiger abhi zinda hain" put up outside JDU office in Patna, Bihar #BiharElection2025 pic.twitter.com/zZIggXeyJ5— ANI (@ANI) November 13, 2025పట్నాలో సీఎం ఇంటి ముంగిట వెలసినీ పోస్టర్‌కు సంబంధించిన వీడియోను బీహార్ మాజీ మంత్రి రంజిత్ సిన్హా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌పై ‘టైగర్ అభీ జిందా హై’ (పులి ఇంకా బతికే ఉంది) అని రాసివుంది. అలాగే దానిలో నితీష్ కుమార్‌ను.. ‘దళితులు, మహా దళితులు, వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు, అగ్రవర్ణాలు, మైనారిటీల రక్షకుడు’ అని రాశారు. ఈ సందేశం ద్వారా ముఖ్యమంత్రి నితీష్‌ను సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసే సంఘటిత వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నించారు.నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. తదుపరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీపాట్లు)కు రెండంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ భద్రతను పటిష్టం చేశారు.ఇది కూడా చదవండి: Bihar Election: రోహ్తాస్లో ఈవీఎంల మార్పిడి?.. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్తత -
Bihar Election: రోహ్తాస్లో ఈవీఎంల మార్పిడి?.. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్తత
రోహ్తాస్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ముగిసి, నవంబర్ 14న ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న సమయంలో రోహ్తాస్ జిల్లాలోని ససారంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఉంచిన మార్కెట్ కమిటీ ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్ బయట మహాఘట్బంధన్ (Grand Alliance) అభ్యర్థులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలు అకస్మాత్తుగా ఆగిపోయాయని, ఎటువంటి తనిఖీ లేకుండా ఒక ట్రక్కు ఆవరణలోకి ప్రవేశించిందని వారు ఆరోపిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ సీసీటీవీ కెమెరాలు ఆగిపోయిన వెంటనే, ఒక ట్రక్కు ఆవరణలోకి రావడం చూసి, దినారాకు చెందిన ఆర్జేడీ అభ్యర్థి రాజేష్ యాదవ్, ససారాం నేత సత్యేంద్ర సాహ్ తమ మద్దతుదారులతో ఆందోళనకు దిగారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈవీఎంలు ఉంచిన చోటుకు రాత్రిపూట ఖాళీ ట్రక్కు ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నిస్తూ, స్ట్రాంగ్ రూమ్ ముందు నిరసనకు దిగారు. ఓటమి భయంతోనే ఎన్డీఏ.. ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తోందని, రోహ్తాస్లోని ఏడు స్థానాల్లోనూ మహాఘట్బంధన్ గెలవడం ఖాయమని వారు అన్నారు.విషయం తెలియగానే, రోహ్తాస్ డీఎం ఉదితా సింగ్ ఎస్పీ రోషన్ కుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారులు ట్రక్కును తనిఖీ చేయగా, అందులో ఈవీఎంలను ఉంచేందుకు ఉద్దేశించిన ఖాళీ పెట్టెలు మాత్రమే ఉన్నాయని గుర్తించారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను తిరిగి ఉంచడానికి ఈ పెట్టెలను ఆలస్యంగా తీసుకువచ్చినట్లు ఎస్డీఎం అశుతోష్ రంజన్ వివరించారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే, సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా చూపిస్తామని డీఎం ఉదితా సింగ్ హామీ ఇచ్చారు. అయితే.. పెట్టెలు ఖాళీగా ఉంటే, వాటిని రాత్రిపూట ఎందుకు తీసుకువచ్చారు? అని నిరసనకారులు అని ప్రశ్నించారు, పోలీసుల అప్రమత్తతపై సందేహాలు వ్యక్తం చేశారు.నవంబర్ 14న జరగబోయే ఓట్ల లెక్కింపుకు ముందే రోహ్తాస్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మహాఘట్బంధన్ నేతలు దీనిని ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా యంత్రాంగం కౌంటింగ్ కేంద్రం చుట్టూ 144 సెక్షన్ విధించాలని, అదనపు భద్రతా బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఇది కూడా చదవండి: ‘యూనస్ ఉగ్రవాదుల ఫ్రంట్‌మన్’.. హసీనా ఆగ్రహం -
స్వీట్ వార్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే పార్టీలన్నీ పండగ వాతావరణంలో మునిగిపోయాయి! ఫలితం అధికారికంగా రాకముందే, గెలుపు సంబరాల కోసం బీజేపీ ఏకంగా 501 కేజీల లడ్డూలు ఆర్డర్ చేసిందట. ఇదెక్కడి ఓవర్ కాని్ఫడెన్స్ అనుకుంటున్నారా? ఖుషీఖుషీగా కమలదళం ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకే పట్టం కట్టడంతో, కమలదళం నాయకులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘కౌంటింగ్ రోజు మాకు హోలీ, దసరా, దీపావళి, ఈద్.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చేస్తాయి!’.. అంటూ బీజేపీ కార్యకర్త కృష్ణ కుమార్ కల్లూ తెగ సంబరపడుతున్నారు. ఈ భారీ లడ్డూల ఆర్డర్ రావడం నిజమేనని పట్నాలోని మిఠాయి కొట్టు యజమాని కూడా ధ్రువీకరించారు. ఏకంగా 501 కేజీల లడ్డూలను నవంబర్ 14 ఉదయం డెలివరీ చేయాల్సి ఉందట. అంటే.. బీజేపీ కార్యాలయాలు మిఠాయి దుకాణలను తలపించబోతున్నాయన్నమాట! మర్డర్ కేసు అభ్యర్థి ’మాంసం’ విందు! ఇదొక్కటే కాదు.. ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న మరో కీలక అభ్యర్థి సంబరం ఇంకాస్త ’గట్టిగా’ ఉంది. జేడీ(యూ)కి చెందిన మోకామా అభ్యర్థి అనంత్ సింగ్, ఒక హత్య కేసులో జైలులో ఉన్నప్పటికీ, తన విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంత్ సింగ్‌కు ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. అందుకే, ఆయన ఈసారి తన మద్దతుదారులు, ఓటర్ల కోసం నవంబర్ 14న పటా్నలో భారీ విందు ఏర్పాటు చేశారు. అంతా ఊహించినట్టే జరిగితే, ఆ రోజు అక్కడ పెద్ద మటన్ బిర్యానీ పార్టీ జరిగే అవకాశం ఉంది! ‘లడ్డూలు వెర్సెస్ మటన్’ వార్ మొత్తానికి, ఓట్ల లెక్కింపు ముందే బిహార్‌లో ’లడ్డూలు వెర్సెస్ మటన్’ వార్ మొదలైందన్నమాట! ఈ అతి విశ్వాసాన్ని చూసి ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ నవ్వుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ అత్యున్నత నాయకత్వం కనుసన్నల్లోనే వస్తున్నాయని కొట్టిపారేస్తున్నారు! నవంబర్ 14న కౌంటింగ్ తర్వాత ఈ 501 కేజీల లడ్డూలు అందరి నోరు తీపి చేస్తాయో లేక ఈ భారీ ’స్వీట్’ ఆర్డర్ చూసి మిగిలిన పార్టీలు కన్నీరు పెట్టుకుంటాయో చూడాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Axis My India Exit Poll: బిహార్‌లో గెలుపు ఎవరిందంటే?
ఢిల్లీ: యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ ఎన్డీఏకే బిహార్ ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు వెల్లడైంది. బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించిన ఆ సంస్థ.. ఎన్డీఏ కూటమికి 121 నుంచి 140 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రెండు విడతల్లో జరిగిన బిహార్ ఎన్నికల పోలింగ్ రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది.యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎక్కువ మంది మహిళలు ఏన్డీఏకి ఓటు వేయగా.. మొదటిసారి ఓటు వేస్తున్న యువత మహాఘాట్‌బంధన్‌ను ఓటు వేసినట్లు వెల్లడైంది. బిహార్ అధికార పీఠం మరోసారి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కే దక్కబోతున్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.ఎన్డీఏ కూటమి- 121 నుంచి 140 స్థానాలుఇండియా కూటమి-98 నుంచి 118 స్థానాలుజన్ స్వరాజ్ పార్టీ- 0 నుంచి 2ఇతరులు- ఒకటి నుంచి ఏడు స్థానాలుపార్టీల వారీగా..బీజేపీ 50 నుంచి 56 జెడియు 56 నుంచి 62 ఎల్ జె పి 11 నుంచి 16 ఇతరులు నాలుగు నుంచి ఏడుమహాఘాట్ బంధన్ఆర్జేడీ 67 నుంచి 76 కాంగ్రెస్ 17 నుంచి 21 విఐపీ 3 నుంచి 5ఇతరులు 10 నుంచి 1 -
యువ బిహారీ.. చాన్స్ ఉందా మరీ!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై ఉంది. ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ కూటముల్లో అధికారం ఏ పక్షానికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో (Exit Polls Predict) కొంత స్పష్టత వచ్చింది. ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా కట్టాయి. అయితే ఊహించినట్టుగానే ఫలితాలు వస్తాయా, మరేదైనా అద్భుతం జరుగుతుందా అనేది శుక్రవారం (నవంబర్ 14) తెలుస్తుంది.ఇదిలావుంటే ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి ఎన్ని సీట్లు దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. యువనేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నాయకత్వ పటిమకు ఈ ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి. సొంత రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలని భావించిన చిరాగ్.. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమకు బిహార్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పదేపదే చెబుతూ ఎన్నికల ప్రచారం సాగించారు. కేంద్ర మంత్రి పదవిలో ఉన్నప్పటికీ బిహార్ ఎన్నికలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరాగ్ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఎన్డీఏ (NDA) కూటమిలో మిత్రపక్షంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీకి సీట్ల పంపిణీలో 29 స్థానాలు దక్కాయి. అయితే ఆ పార్టీ 28 స్థానాల్లో మాత్రమే పోటీకి దిగింది. ఎల్జేపీ అభ్యర్థులు 29 స్థానాల్లో నామినేషన్లు వేసినప్పటికీ ఒక నియోజకవర్గంలో నామినేషన్ తిరస్కణకు గురైంది. దీంతో 28 స్థానాల్లో పోటీకి పరిమితమైంది. ఈసారి ఎల్జేపీకి ఫలితాలు ఆశాజనకంగానే ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గరిష్టంగా 19 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థలు ప్రకటించాయి.ఎగ్జిట్ పోల్స్ అంచనాచిరాగ్ పాశ్వాన్ పార్టీకి 14 నుంచి 19 సీట్లు దక్కే అవకాశముందని చాణక్య సంస్థ వెల్లడించింది. 12 నుంచి 16 స్థానాల్లో ఎల్జేపీ గెలుస్తుందని పోల్ డైరీ అనే సంస్థ అంచనా వేసింది. టీఐఎఫ్ రీసెర్చ్ సర్వేలో 12 నుంచి 14 సీట్లు వస్తాయని తేలింది. పోల్‌స్ట్రాట్ ప్రకారం.. 9 నుంచి 12 స్థానాల్లో ఎల్జేపీ విజయం సాధిస్తుంది. మ్యాట్రిజ్-ఐఎఎన్ఎస్ సర్వే మాత్రం 7 నుంచి 9 స్థానాలకే పరిమితం చేసింది.డిప్యూటీ సీఎం అవుతారా?దివంగత రాజకీయ నేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడైన చిరాగ్.. బిహార్ రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగా 137 స్థానాల్లో పోటీ చేసి చేదు అనుభవాన్ని చవిచూసింది. తన తండ్రి స్థాపించిన పార్టీ నుంచి తనను దూరం చేసే పరిస్థితి రావడంతో 2021లో ఎల్జేపీ (ఆర్వీ) పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 5 ఎంపీ స్థానాలు సాధించడంతో.. మూడోసారి ఎంపీగా గెలిచిన చిరాగ్‌కు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. ఎక్కువ స్థానాలు గెలిస్తే.. ఎన్డీఏలో చిరాగ్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. డిప్యూటీ సీఎం అయ్యే చాన్స్ కూడా రావొచ్చు!చదవండి: బిహార్‌లో పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభం?తనను తాను యువ బిహారీగా (Yuva Bihari) చెప్పుకునే 43 ఏళ్ల చిరాగ్.. ముఖ్యమంత్రి పదవికి మూడవ ఎంపిక అని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే వెల్లడించాయి. తేజస్వీ యాదవ్ సీఎం కావాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. సీఎం నితీశ్ కుమార్ రెండో స్థానంలో నిలిచినట్టు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కాగా, డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ చేయడానికి అవసరమైన సీట్లు సాధించాలని చిరాగ్ కోరుకుంటున్నారు. ఎన్డీఏ సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి తర్వాత అతిపెద్ద పదవిని తమ పార్టీ అధిష్టించనుందని గతంలో చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా తాను ఎన్డీఏతోనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. చిరాగ్ పాశ్వాన్ రాజకీయ ప్రస్థానం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియాలంటే.. ఎన్నికల ఫలితాలు విడులయ్యే వరకు వేచి చూడాల్సిందే. -
Bihar: పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభం?
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. శుక్రవారం (నవంబర్ 14న) జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బిహార్‌లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించగా.. మొదటి దశలో 65.09 శాతం, రెండో దశలో దాదాపు 69 శాతం ఓట్లు పోలయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 66.91 శాతం పోలింగ్ నమోదయినట్టు ఈసీ ప్రకటించింది. 2020 ఎన్నికలతో ఇది 9.6 శాతం అధికం కావడం గమనార్హం.పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా ఓటర్లలో 71.6 శాతం మంది ఓటు వేయగా, పురుషుల్లో 62.8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి దశలో మొత్తం 3.75 కోట్ల మంది, రెండవ దశలో 3.70 కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం మీద 7.25 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. బిహార్‌లో పోలింగ్ శాతం పెరగడంపై అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంతో పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉంటుందని ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.మహిళలు మాకే ఓటేశారు సీఎం నితీశ్ కుమార్‌ను ఆశీర్వదించడానికే మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ (Neeraj Kumar) అన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ''ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ కచ్చితంగా అంచనా వేస్తాయని చెప్పలేం. కానీ బిహార్‌లో మరోసారి నితీశ్ కుమార్ నాయకత్వంలో NDA సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని పోలింగ్ ట్రెండ్‌ను బట్టి స్పష్టమవుతోంది. మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు. నితీశ్ కుమార్‌కు అత్యధికంగా తమ ఆశీస్సులు అందించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితిని మనం చూశామ''ని అన్నారు. నితీశ్‌ను విమర్శించే అర్హత ప్రతిపక్షాలకు లేదని, ప్రచారానికి దూరంగా పని చేసుకుని పోవడమే ఆయన నైజమన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైన వ్యక్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ.. తేజస్వీ యాదవ్‌ను పరోక్షంగా విమర్శించారు.తేజస్వీ సంతోషంఅసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తన మనసు ఆనందంతో నిండిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. "వృద్ధులు, మహిళలు, యువత, వ్యాపారులు, రైతులు, ప్రతి కులం, ప్రతి తరగతి ఈ గొప్ప ప్రజాస్వామ్య ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.గత మూడు ఎన్నికల నుంచి బిహార్‌లో మహిళల పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2020లో మహిళల ఓటింగ్ దాదాపు 59.6 శాతం కాగా, పురుషులు 54.45 శాతం మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. 2015లో, మహిళల ఓటింగ్ దాదాపు 60.48 శాతం కాగా, పురుషులు దాదాపు 53.32 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఈ పరిణామం సామాజిక మార్పు, రాజకీయ వ్యూహం రెండింటినీ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సీఎం నితీశ్ హయాంలో శాంతిభద్రతలు మెరుగవడం.. అలాగే పాలక, ప్రతిపక్షాలు మహిళల ఓట్ల కోసం ఆకర్షణీయ హామీలు గుప్పించడం కూడా.. మహిళా ఓట్ల శాతం కారణమని విశ్లేషిస్తున్నారు.పోటాపోటీగా హామీలుఉదాహరణకు.. జీవికా దీదీ కార్యక్రమం, లఖ్పతి దీదీ పథకం, ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు మహిళలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూడా బ్లాక్ మై-బెహన్-మాన్ పథకం, మహిళా యాజమాన్యంలోని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ఆకర్షణీయ హామీలతో మహిళా ఓటర్లకు గాలం వేసింది. అధికార, విపక్ష కూటములు పోటాపోటీగా మహిళలకు హామీలిచ్చారు. ఎవరు వాగ్దానాలకు ఎన్నెన్ని ఓట్లు పడ్డాయనేది ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడవుతుంది.ఎన్డీఏవైపే మొగ్గు!మహిళా ఓటర్లు ఎన్డీఏ (NDA) కూటమివైపే మొగ్గు చూపినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇదే అంచనా వేశాయి. నితీశ్ కుమార్ సర్కారు అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, మహాగఠ్‌బంధన్‌కు నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే వీటికి భిన్నంగా ఫలితాలు వస్తాయని మహాగఠ్‌బంధన్ ఆశతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎన్డీఏ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. చూడాలి ఏమవుతుందో!ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరేమన్నారంటే..ఎగ్జిట్ పోల్ ఫలితాలపై అధికార, విపక్ష కూటమి నేతలు భిన్నంగా స్పందించారు. బిహార్ అంతటా ఓటర్లు 'ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్' అని నిర్ణయించుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే 'ఎగ్జాట్ పోల్స్'లో ఎన్డీఏకు ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయని బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల ఆధిక్యంతో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ అన్నారు. జేడీయూ నేతలు కూడా ఎన్డీఏ గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారు.బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అన్నారు. ''ఈ సారి ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ప్రజలు ఈ (నితీష్ కుమార్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈసారి మార్పు రాబోతోంది, ఎటువంటి సందేహాలకు అవకాశం లేద''ని తేజస్వీ యాదవ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయని ఆర్జేడీ నాయకుడు మృత్యుంజయ్ తివారీ (Mrityunjay Tiwari) పేర్కొన్నారు. చదవండి: బిహార్ ఎన్నికలు.. ఆసక్తికర విషయాలు -
Bihar Elections: ‘అవన్నీ ఫేక్.. అప్రమత్తంగా ఉండండి’: అఖిలేష్
లక్నో: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌ను సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు. అవి అధికార పార్టీ రూపొందించిన కల్పిత సర్వేలని అభివర్ణించారు. మార్పును కోరుతూ ఎన్నికల్లో ఓటువేసిన ఓటర్లను ఆయన అభినందించారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతూ, యువతకు ఉద్యోగాలను సృష్టించే ప్రగతిశీల ప్రభుత్వం బీహార్‌లో త్వరలో ఏర్పడబోతోందని అఖిలేష్ పేర్కొన్నారు.అఖిలేష్ తన ‘ఎక్స్’ పోస్టులో బీహార్‌లోని ప్రతి ఓటరకు అభినందనలు తెలిపారు. ఉద్యోగాలను సృష్టించే కొత్త ప్రగతిశీల ప్రభుత్వం ఏర్పడుతుందంటూ, ముందస్తు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ తప్పుదారి పట్టించే ఎగ్జిట్ పోల్స్‌ను రూపొందించిందని ఆయన విమర్శించారు. ఇవి ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపునకు అన్ని రోజులు తీసుకుంటే, ఈ ఛానెల్స్ కేవలం ఒక గంటలో ఫలితాలను ఎలా అందించగలవు? వారి తప్పుడు గ్రాఫిక్స్ కొన్ని రోజుల ముందుగానే తయారవుతాయి. వారు ‘వనరులు’ అందించే వారితో పొత్తు పెట్టుకుంటారు’ అని ఆరోపించారు.ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మేవారు ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలించాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. నాడు యూపీలో చాలా మంది ప్రముఖ బీజేపీ నేతలు ఓటమిని చవిచూశారన్నారు. బీహార్‌లో మహాకూటిమికి చెందిన చెందిన ప్రతి సభ్యుడు, అభ్యర్థి, మద్దతుదారుడు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అక్రమాలు జరిగితే వాటిని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ యంత్రాల స్థానాలను నిశితంగా పరిశీలించాలని, కౌంటింగ్ రోజున 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘మహాకూటమి గెలుస్తోంది. మీకు విజయ ధృవీకరణ పత్రం వచ్చే వరకు విశ్రాంతి తీసుకోకండి’ అని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని పేర్కొన్నాయి. ఇది కూడా చదవండి: Delhi blast: అయోధ్యలో స్లీపర్ సెల్? వారణాసిలో.. -
బిహార్ లో రికార్డు స్థాయి పోలింగ్
-
Bihar Elections: ప్రశాంత్ కిశోర్ ‘జీరో’?.. కారణాలివే?
న్యూఢిల్లీ/పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని ఎగ్టిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇప్పటివరకు ప్రధానంగా తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వాటిలోని దైనిక్ భాస్కర్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్సైట్, పీపుల్స్ పల్స్, జేవీసీ, పీ-మార్క్, చాణక్య స్ట్రాటజీస్, డీవి రీసెర్చ్, టీఐఎఫ్ రీసెర్చ్‌లు.. పాలక ఎన్డీఏకి స్పష్టమైన విజయాన్ని, ప్రతిపక్ష మహాకూటమికి ఓటమిని చూపాయి. రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం అయిన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ‘జన్ సురాజ్’కు షాక్‌నకు గురిచేసే ఫలితాలను అంచనావేశాయి.బీహార్‌లోని 243 నియోజకవర్గాలలో ‘జన్ సురాజ్’పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ ఖాతా తెరవడంలో విఫలం కావచ్చని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ 0-5 పరిధిని అంచనా వేయగా, దైనిక్ భాస్కర్ 0-3, పీపుల్స్ ఇన్సైట్ 0-2, మ్యాట్రిజ్ 0-2, జేవీసీ 0-1 మధ్య ‘జన్ సురాజ్’కు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. కాగా బీహార్‌లో రెండు దశల పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతాలు నమోదయ్యాయి. ఇది అధికార వ్యతిరేకతకు సూచన అంటూ మహాకూటమి, జన్ సూరాజ్లు ఆశాభావం వ్యక్తం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్, నిపుణుల అంచనా అందుకు భిన్నంగా ఉంది.జన్ సురాజ్ పార్టీ స్వల్ప ఓట్ల శాతాన్ని గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ ఓట్ల వాటాలో ఎక్కువ శాతం మహాకూటమి నుంచి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు ‘జన్ సురాజ్’కు పడే అవకాశాలు చాలా తక్కువేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీహార్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తక్కువగానే ఉందని, అది మహాకూటమి, ప్రశాంత్ కిషోర్ పార్టీ మధ్య చీలిపోయి, ప్రతిపక్షాలను దెబ్బతీసిందని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిశోర్ పార్టీ సంవత్సరం క్రితమే వచ్చిందని, అది నిలదొక్కుకునేందుకు చాలా కాలం పడుతుందని చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ‘భయంతో పేల్చేశారా?’.. నిఘా వర్గాలు -
వార్ వన్ సైడ్ తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్
-
బిహార్‌లో 69 శాతం ఓటింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్‌పై ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్న అత్యంత కీలకమైన రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైంది. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65.09 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి అంతకుమించి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సమయం పూర్తయిన తర్వాత కూడా బూత్‌ల వద్ద బారులు తీరి కనిపించారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.ముఖ్యంగా, ముస్లింల ప్రాబల్యమున్న కిషన్‌గంజ్‌లో ఏకంగా 76.26 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. పొరుగునున్న కటిహార్‌లో 75.23 శాతం, పుర్నియాలో 73.79 శాతం, అరారియాలో 67.79 శాతం నమోదైంది. అత్యల్పంగా నవాడాలో 57.31 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో 60 శాతం మార్కును దాటని ఏకైక జిల్లా కూడా ఇదే కావడం గమనార్హం. మొదటి విడతలో 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది అర్హులైన ఓటర్లకుగాను 65.09 శాతం మంది ఓటేశారు. ఈసారి 122 స్థానాల్లో 3.70 కోట్ల మంది ఓటర్లుండగా 1,302 మంది పోటీ చేస్తున్నారు.గతం కంటే 9 శాతం ఎక్కువరాష్ట్రంలో రెండో విడత పోలింగ్‌లో రికార్డుస్థాయిలో 68.79 శాతం ఓటింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. రెండు విడతల్లో కలిపి 66.91 శాతం మంది ఓటేసినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 1951 తర్వాత మొదటిసారిగా భారీ ఓటింగ్ నమోదైందని చెప్పారు. అదేవిధంగా, పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటేశారని చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 9.6 శాతం ఎక్కువని ఆయన వివరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 57.29 శాతం ఓటింగ్ నమోదైందని గుర్తు చేశారు.మరో 2 వేల పోలింగ్ స్టేషన్ల ఓటింగ్ వివరాలు అందాల్సి ఉన్నందున, ఓటింగ్‌శాతం పెరిగే అవకాశముందన్నారు. తాజా ఫలితాలపై ఇండియా కూటమి నేతలు..ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయడానికి ఇదే నిదర్శనమని పేర్కొనగా, గతంలోనూ ఇలాంటి సందర్భాల్లోనూ ప్రభుత్వాలు కొనసాగిన ఉదాహరణ లున్నాయని ఎన్డీయే నేతలంటున్నారు.మొదటి, రెండో విడత పోలింగ్ సందర్భంగా అత్యధికంగా 70 శాతానికి మించి ఓటింగ్ నమోదైన జిల్లాలు గంగా నది ఉత్తర ప్రాంతంలోని అత్యధిక జనసాంద్రత కలిగి, ఎన్డీయేకు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం విశేషం. అదే సమయంలో, ముస్లింలు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్, కటిహార్, పుర్నియా జిల్లాల్లో గత ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తున్నా రనేందుకు ఓటింగ్ శాతాలే తార్కాణమని వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేశారు.ఓటేసిన ప్రముఖులు..జేడీయూ యాక్టింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ రామ్, రాష్ట్రమంత్రి నితీశ్ మిశ్రా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బిహార్‌లో మళ్లీ ఎన్డీయేకే పట్టం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ)తో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) ముందంజలో ఉన్నట్లు యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన మహాగఠ్‌బంధన్ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుందని స్పష్టంచేసింది. ఎన్డీయేకు 121 నుంచి 141 వరకు, విపక్ష మహాగఠ్‌బంధన్‌కు 98 నుంచి 118 స్థానాలు వస్తాయని తెలియజేసింది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీకి సున్నా నుంచి రెండు స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. బిహార్ ఎన్నికలు మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలను బుధవారం ప్రకటించారు. పార్టీల పరంగా చూస్తే రాష్ర్టీయ జనతాదళ్(ఆర్జేడీ) 67 నుంచి 76 స్థానాలు గెల్చుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. జేడీ(యూ)కు 56 నుంచి 62 స్థానాలు, బీజేపీకి 50 నుంచి 56, కాంగ్రెస్‌కు 17 నుంచి 21, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి 3 నుంచి 5, వామపక్షాలకు 10 నుంచి 14 స్థానాలు దక్కుతాయని తెలియజేసింది. ఎన్డీయేకు 43 శాతం ఓట్లు, మహాగఠ్‌బంధన్‌కు 41 శాతం, జన సురాజ్ పార్టీకి కేవలం 4 శాతం ఓట్లు లభిస్తాయని వివరించింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని 34 శాతం మంది, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ మరోసారి సీఎం కావాలని 22 శాత మంది కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఎన్డీయేకు 41 శాతం పురుషుల ఓట్లు, 45 శాతం మహిళల ఓట్లు, మహాగఠ్‌బంధన్‌కు 42 శాతం పురుషుల ఓట్లు, 40 శాతం మహిళల ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. -
బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
-
గెలిచేదెవరంటే.!
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటిలో ఎన్డీఏ కూటమినే అధికారం చేపట్టబోతున్నట్లు మెజార్టీ సర్వేలు వెల్లడించాయి. పీపుల్స్ సర్వే, టైమ్స్ నౌ, ఆపరేషన్ చాణక్యలు ఎన్డీఏకే పట్టం కట్టాయి. 243 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమినే విజయం వరించినున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మంగళవారం(నవంబర్ 11వ తేదీ) జరిగిన బిహార్ మలి విడత పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి పలు సంస్థలు. పీపుల్స్ పల్స్బిహార్లో ఎన్డీఏకే మొగ్గు..బిహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.ఎన్డీయే కూటమి దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్‌గార్ యోజన పథకం కింద కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడింది. ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలు ఉంటాయి 243 స్థానాలు ఉన్న బిహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు వచ్చే అవకాశం ఉందిటైమ్స్ నౌఎన్డీయే 135-150 సీట్లుమహాఘట్ బంధన్ 83-105 సీట్లుజన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ పార్టీ)-1 సిటుఇతరులు 3-6 సీట్లుదైనిక్ భాస్కర్ ఎన్డీయే 145-160 సీట్లుమహాఘట్ బంధన్ 79-91 సీట్లుజన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ పార్టీ)-0 సిటుఇతరులు 5-10 సీట్లుఎస్ఏఎస్ గ్రూప్ఎన్డీయే 126-130 సీట్లుమహాఘట్ బంధన్ 106-110 సీట్లుజన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ పార్టీ)-7-10 సిట్లుఇతరులు 4-6 సీట్లుమాట్రిజ్ సర్వేఎన్డీఏ 147 -167 ఎంజీబీ 70- 90సిఎన్ఎన్ న్యూస్ 18ఫస్ట్ పేజ్ (121)ఎన్డీఏ 60 -70 ఇండియా కూటమి : 45-55 ఆత్మసాక్షి: ఎన్డీఏ 126-130, మహాఘట్బంధన్ 106-110,జేఎస్పీ 7-10ఆపరేషన్ చాణక్య: ఎన్డీఏ 140-147, మహాఘట్బంధన్ 86-92,జేఎస్పీ 2-4 -
20 ఏళ్లలో తొలిసారి.. బిహార్ లో రికార్డు స్థాయిలో పోలింగ్
-
Bihar polls: చివర్లో ఆర్జేడీకి వీఐపీ షాక్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నేడు(మంగళవారం) జరుగుతోంది. ఇంతలో వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీహెచ్‌పీ).. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి షాకిచ్చింది. బీహార్‌లోని ప్రతిపక్ష కూటమిలో వీఐపీ రెండవ దశ అసెంబ్లీ పోలింగ్‌కు ముందు కైమూర్ జిల్లాలోని నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థులకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.ఆదివారం భబువాలో ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించాక, చైన్పూర్ వీఐపీ అభ్యర్థికి మద్దతు పలికేందుకు ఆయన నిరాకరించిన దరిమిలా రాష్ట్ర జిల్లా వీహెచ్ చీఫ్ బాల్ గోవింద్ బింద్ ఈ ప్రకటన చేశారు. చైన్పూర్ (కైమూర్, గౌరా బౌరం (దర్భంగా) స్థానాల్లో ఆర్జేడీ, వీఐపీలు స్నేహపూర్వకంగా ఎన్నికల బరిలోకి దిగాయి. నవంబర్ 4న వీఐపీ చీఫ్ గౌరా బౌరం నుండి తన సోదరుడు సంతోష్ సాహ్ని అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని, అఫ్జల్ అలీ ఖాన్ (ఆర్జేడీ)కి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ముఖేష్ సాహ్ని.. తేజస్వీ యాదవ్ ఒక అవగాహనకు వచ్చారు.కాగా చైన్పూర్ బీజేపీ అభ్యర్థి బ్రిజ్ కిషోర్ బింద్‌ను బాల్ గోవింద్ బింద్‌కు అనుకూలంగా ఉపసంహరించుకునేందుకు ఆర్జేడీ అంగీకరించిందని వీఐపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం చైన్పూర్లో తమ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ముఖేష్ సాహ్ని దీనిని ధృవీకరించారు. దీంతో తేజస్వీ యాదవ్.. ఆర్జేడీ అభ్యర్థికి ఫోన్ చేసి, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే ఆయన అందుకు నిరాకరించారు.దీంతో తేజస్వీ యాదవ్ వీఐపీ చైన్పూర్ అభ్యర్థిని బ్లాక్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే వీఐపీ అభ్యర్థి చైన్పూర్లో తేజస్వీ యాదవ్ కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. అయితే తేజస్వీ యాదవ్ భబువాలో ర్యాలీ నిర్వహించి, ఆర్జేడీ అభ్యర్థికి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కైమూర్‌లో ఆర్జేడీ అభ్యర్థికి వీఐపీ మద్దతును ఉపసంహరించుకుంది. సోమవారం బాల్ గోవింద్ బింద్ మాట్లాడుతూ, కైమూర్‌లోని నాలుగు స్థానాలకు ఆర్జేడీతో పొత్తు ముగిసిందని ప్రకటించారు. దీనిపై ఆర్జేడీ స్పందించలేదు.ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: ఈ కష్టం పగవాడికి కూడా.. కండక్టర్ విషాదాంతం -
Bihar Polling: బిహార్‌లో రికార్డు పోలింగ్
పాట్నా: బిహార్‌లో మలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఐదుగంటల వరకు జరగ్గా.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బిహార్‌లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు 68.55 శాతం పోలింగ్ నమోదైంది. కస్బా అసెంబ్లీలో అత్యధికంగా 80.89 శాతం పోలింగ్ నమోదు కాగా.. నవాడా అసెంబ్లీలో అత్యల్పంగా 54.83 శాతంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి ఓటింగ్ శాతం ఇలా ఉన్నా.. ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ఎంత నమోదైందనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. కాగా, ఇవాళ జరిగిన రెండో విడుత ఎన్నికల్లో 1302మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మొదటి విడుతలో 66.46శాతం ఓటింగ్ నమోదుదైంది. రెండు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 14న జరగనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. .(Bihar Assembly Elections Phase 2 Polling Updates) బిహార్‌లో అత్యధిక శాతం నమోదైన ప్రాంతాలివేపశ్చిమ చంపారన్ లో 69.02 శాతం తూర్పు చంపారన్‌లో 69.31 శాతం షియోహర్‌లో67.31 శాతం సీతామర్హిలో 65.29 శాతం మధుబనిలో 61.79 శాతం సుపాల్‌లో 70.69 శాతం అరారియాలో 67.79 శాతం కిషన్ గంజ్‌లో 76.26 శాతం పుర్నియాలో 73.79 శాతం కతిహార్‌లో 75.23 శాతం భాగల్ పూర్లో 66.03 శాతం బంకాలో 68.91 శాతం కైమూర్ (భాబువా)లో 67.22 శాతం రోహ్తాస్లో 60.69 శాతం అర్వాల్లో 63.06 శాతం జెహానాబాద్‌లో 64.36 శాతం ఔరంగాబాద్‌లో 64.48 శాతం గయలో 67.50 శాతం నవాడాలో 57.11 శాతం జమూయిలో 67.81 శాతం67.14 శాతం పోలింగ్ నమోదుసాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు...బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్‌గా రికార్డుబిహార్లోముస్లిం మెజారిటీ కిషన్ గంజ్ లో అత్యధికంగా 76.26 శాతం పోలింగ్నవాడాలో అత్యల్పంగా 53.17 శాతం పోలింగ్ నవాడాలోని మిషన్ స్కూల్ బూత్ నంబర్ 351లో 105 ఏళ్ల వృద్ధురాలు అమలా ఖాతూన్ ఓటు వేశారు. ఎన్నికల సిబ్బంది ఆమెకు గులాబీతో స్వాగతం పలికారు.ఇరు వర్గాల మధ్య ఘర్షణజమూయిలో ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, ఇటుకలు, రాళ్లు విసిరారు. జమూయి అసెంబ్లీ నియోజకవర్గంలోని జుండన్ గ్రామంలో పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణ మరియు రాళ్లు రువ్వడానికి దారితీసింది. పోలింగ్ పార్టీ అధికారి పోలింగ్ స్టేషన్ల నంబర్ 381 మరియు 382 వద్ద డబ్బులు తీసుకున్నారని, ఆ తర్వాత గ్రామస్తులు అతన్ని బందీగా ఉంచడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అవతలి వర్గానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఘర్షణ మొదలైంది. రాళ్లు రువ్వడంలో విశాల్ కుమార్ అనే యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక సంఘం ఇంట్లోకి ప్రవేశించి దోచుకున్నారని మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్డీవో సౌరభ్ కుమార్, ఎస్డీపీవో సతీష్ సుమన్, ఖైరా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, బీడీవో తదితరులు బృందంతో కలిసి శిబిరాలు నిర్వహిస్తున్నారు. వృద్ధ ఓటర్ల ఉత్సాహంబిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశలో, వృద్ధ ఓటర్ల ఉత్సాహంతో ప్రజాస్వామ్య వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి. 111 ఏళ్ల నషిమా ఖాతున్ సుపాల్ జిల్లాలోని ఛత్తపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాధోపూర్ పంచాయతీలోని పోలింగ్ బూత్ నంబర్ 274కు వీల్ చైర్ పై చేరుకున్నారు. అదే సమయంలో రోహ్తాస్ జిల్లా కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గం బసుంధర గ్రామానికి చెందిన రామ్ చెలా యాదవ్ (95) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడం ప్రతి పౌరుడి కర్తవ్యం అనే సందేశాన్ని వారిద్దరూ తమ ఉత్సాహంతో అందించారు. అర్వాల్ లో ప్రిసైడింగ్ అధికారి కన్నుమూతప్రిసైడింగ్ అధికారి అరవింద్ కుమార్ అర్వాల్లో ఓటింగ్ సమయంలో గుండెపోటుతో మృతిబెట్టియా: డబ్బులు పంపిణీ చేసిన ఇద్దరు ఆర్జేడీ మద్దతుదారుల అరెస్ట్షియోహర్: పోలింగ్ బూత్‌ల్లో అవకతవకలు.. అదుపులో 13 మందిమోతిహారిలోని ఢాకాలో ముగ్గురు నకిలీ ఓటర్ల పట్టివేతమోతిహరి ఢాకా అసెంబ్లీ నియోజకవర్గంలోని కుండ్వాచైన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన హసీబుల్లా, సుల్తాన్ అహ్మద్, ఆసిఫ్ అన్వర్‌లను తమ అసలు గుర్తింపును దాచిపెట్టి మరొకరి పేరుతో నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.అరారియాలో బీజేపీ-కాంగ్రెస్ మద్దతుదారుల ఘర్షణఎన్నికల రోజున కాంగ్రెస్ అభ్యర్థి కారుపై పార్టీ లోగో ఉన్న స్టిక్కర్ ఉండగా, బీజేపీ అభ్యర్థి వ్యతిరేకించారుదీనిపై కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ఇప్పటి వరకు 60. 40 శాతం పోలింగ్ నమోదు:పశ్చిమ చంపారన్- 61.99 శాతంతూర్పు చంపారన్- 61.92 శాతంషియోహర్ -61.85 శాతంసీతామర్హి-58.32 శాతంమధుబని-55.53 శాతంసుపాల్-62.06 శాతంఅరారియా-59.80 శాతంకిషన్ గంజ్-66.10 శాతంపుర్నియా-64.22 శాతంకతిహార్-63.80 శాతంభాగల్ పూర్-58.37 శాతంబంకా-63.03 శాతంకైమూర్ (భాబువా)-62.26 శాతంరోహ్తాస్-55.92 శాతంఅర్వాల్-58.26 శాతంజెహానాబాద్-58.72 శాతంఔరంగాబాద్-60.59 శాతంగయ-62.74 శాతంనవాడా-53.17 శాతంజమూయి-63.33 శాతం పోలింగ్సొంత ఊరిలో ఓటేసిన పీకేఓటు హక్కు వినియోగించుకున్న జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్రోహ్తాస్ జిల్లా కర్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనార్ గ్రామంలోని ఓటేసిన పీకే బిహార్ లో మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపు ప్రతి ఓటు ముఖ్యమని, ప్రజలు ముందుకు వచ్చి తమ హక్కులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి పీకే వెంట కర్గహర్ అభ్యర్థి.. గాయకుడు రితేష్ పాండే జెహానాబాద్ పోలింగ్ సెంటర్ వద్ద ఘర్షణ జెహానాబాద్ ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గంలోని హర్దాస్ పూర్ గ్రామంలోని ఓ పోలింగ్ వద్ద రాజకీయ ఘర్షణ తన్నుకున్న ఇరు పార్టీల వర్గీయులు నలుగురికి గాయాలు పోలీసులు ఎంట్రీతో అదుపులోకి పరిస్థితి 11 గం. దాకా ఓటింగ్ శాతం 31.38కర్గహార్లో ఓటింగ్ బహిష్కరణరోహతాస్ జిల్లా కర్గహార్లో ఓటింగ్ బహిష్కరణ అఖోడి పంచాయతీలోని లడ్డుయి బిషన్పురా గ్రామంలో ఓటేయని ప్రజలు175, 176 బూత్ వద్ద కనిపించని ఓటర్ రంగంలోకి దిగి ఓటర్లను బతిమాలుతున్న అధికారులు కీలకంగా ముస్లిం ఓట్లుమలివిడత పోలింగ్ కీలకంగా మారనున్న సీమాంచల్ నాలుగు జిల్లాలు అరరియా, కిషన్‌గంజ్, కటిహార్, పూర్నియా ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ఆసక్తికర పోటీ బిహార్‌కు అలాంటి మోడల్ అవసరం: ఖర్గేబిహార్ ఓటర్లకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పిలుపుబిహార్కు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన మోడల్ అవసరమని వ్యాఖ్య నితీశ్ కుమార్ సర్కార్‌పై ఖర్గే ఫైర్మార్పునకు ఓటేయాలని ఓటర్లకు పిలుపునవాడాలో స్వల్ప ఉద్రిక్తతనవాడా జిల్లాలోని వారిసలిగంజ్ పోలింగ్ బూత్ వద్ద రాజకీయ పార్టీల ఘర్షణఅడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి అదుపులోకిబిహార్ పోలింగ్.. ప్రముఖ అభ్యర్థులు వీళ్లే..బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (JD-U) — సుపౌల్ నుంచి 8వ సారి పోటీ.ప్రీమ్ కుమార్ (BJP) — గయా టౌన్.తర్కీషోర్ ప్రసాద్ — కటిహార్.పార్టీ మారిన అభ్యర్థులు: సంగీతా కుమారి, విభా దేవి, మురారి గౌతమ్.బిహార్‌లో 9 గంటల సమయానికి 14.5శాతం పోలింగ్ఓటేసిన తర్వాతే టీ, టిఫిన్లుబిహార్ ఓట్లకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపు మొదట ఓటు వేయండి, తర్వాత అల్పాహారం చేయండి అంటూ ట్వీట్ ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా: నితీశ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.. ఇతరులను కూడా ఓటేసేలా ప్రేరేపించాలి: నితీశ్ బిహార్ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపుకొనసాగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బిహార్ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఓటింగ్ రికార్డు స్థాయిలో జరగాలి అని ప్రధాని మోదీ ఆకాంక్షనవంబర్ 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 65% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది.. ఇది ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన ఓటింగ్ ఈ సందేశం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని ప్రధాని పిలుపుబిహార్ చివరి విడత ఎన్నికల పోలింగ్ ఇలా.. 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్బరిలో ఉన్న 1302 మంది అభ్యర్థులుఓటు హక్కు వినియోగించుకోనున్న 3.7 కోట్ల మంది ఓటర్లు45 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘంచివరి విడత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో బిజెపి, 44 చోట్ల జెడియు, 15 చోట్ల ఎల్జెపి, హెచ్ ఎ ఎం 6, ఆర్ ఎల్ ఎం 4 సీట్లలో పోటీమహఘట్బందన్లో ఆర్జెడి 71, కాంగ్రెస్ 37, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ4, సిపిఎం 1 చోట పోటీకి పార్టీలుఆరు సీట్లలో స్నేహపూర్వకపోటీలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, సీపీఐ పార్టీలుసెకండ్ ఫేజ్‌లో..1,302 మంది అభ్యర్థులు బరిలో..పోటీలో.. 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు. ఒక ట్రాన్స్జెండర్ఓటర్లలో.. 1,95,44,041 మంది పురుషులు ఓటర్లలో.. 1,74,68,572 మంది మహిళలుపోలింగ్ ఏర్పాట్లు ఇలా.. ఎన్నికల సిబ్బంది 4 లక్షల మంది 45,399 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు సున్నిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయం కుదింపుకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.నేపాల్ సరిహద్దులు ఈ నెల 11వ తేదీ వరకూ మూసివేత595 పోలింగ్ బూత్‌లలో అందరూ మహిళా అధికారులే బాధ్యతలు316 మోడల్ పోలింగ్ బూత్‌ల ఏర్పాటుఇంటి వద్ద ఓటేయనున్న 63,373 మంది రెండో విడతలో ఏ పార్టీ ఎన్నిచోట్ల..ఎన్డీయేబీజేపీ: 53జేడీయూ: 44ఎల్జేపీ: 15ఆర్ఎల్ఎం: 4హెచ్ఏఎం: 6మహాఘట్బంధన్ఆర్జేడీ: 71కాంగ్రెస్: 37వీఐపీ: 7సీపీఐ: 4సీపీఐ (ఎంఎల్): 6సీపీఐ (ఎం): 1 -
చిన్న పార్టీలకు పెద్ద పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో మంగళవారం జరు గనున్న రెండో దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు పెద్ద పరీక్షను ఎదుర్కోనున్నాయి. ఎన్నికలు జరుగ నున్న 122 స్థానాలకు గాను చాలాచోట్ల వివిధ కూటముల్లోని చిన్న పార్టీలు సహా స్వతంత్రంగా పోటీ చేస్తున్న పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు ఏమాత్రం సత్తా చాటుతాయన్న దానిపైనే గెలుపోటములు ప్రభావితమై ఉన్నాయి. అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠరెండో దశలోని 122 నియోజకవర్గాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండగా, ఇందులో 101 జనరల్, 19 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. గత 2020 ఎన్నికల్లో 122 స్థానాల్లో బీజేపీ 42 గెలుచుకోగా, ఆర్జేడీ 28, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5, ఎంఐఎం 5 సీట్లను గెలుచుకున్నాయి. ఈ స్థానాల్లో ఎంఐఎం మినహా మిగతా చిన్న పార్టీలేవీ పెద్దగా గెలవలేదు. ఈసారి పరిస్థితి వేరేగా ఉంది. ఇండియా, మహాగఠ్‌బంధన్ కూటముల్లోని చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. ముఖ్యంగా ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ మొత్తంగా 28 స్థానాల్లో పోటీ చేస్తుండగా, రెండో దశ పోలింగ్ జరిగేవి అందులో 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఇక్కడ బీజేపీకి బలంగా ఉన్న రాజ్‌పుత్‌లు, జేడీయూకు మద్దతుగా నిలుస్తున్న ఓబీసీ. ఈబీసీ వర్గాలతో పాశ్వాన్ వర్గాన్ని కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే బీసీ వర్గాల్లో వచ్చిన చీలిక పాశ్వాన్‌కు ఏమాత్రం మద్దతిస్తాయన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇక జతిన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం) సైతం 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 4 రిజర్వుడ్ స్థానాలే ఉన్నాయి. ఇందులోనూ టెకారీ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ తన భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ స్థానంలో గెలిస్తే అనిల్‌కుమార్ మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. హెచ్ఏఎం పోటీచేస్తున్న అనేక స్థానాల్లో ఆయనకు పోటీగా మహాగఠ్బంధన్లోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. మాంఝీ వర్గాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా అన్ని రకాల ప్రణాళికలు వేశారు. ఆ పార్టీ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో ఆయన భార్య స్నేహలతను సైతం పోటీలో ఉంచారు. ఇక మహాగఠ్‌బంధన్‌లో ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) సైతం మొత్తం 12 సీట్లలో పోటీ చేస్తుండగా, రెండో దశలో 7 స్థానాలున్నాయి. ఇందులో 5 నియోజకవర్గాల్లో ‘మల్లా’కమ్యూనిటీకి చెందిన వారే అధికంగా ఉండటంతో ఇందులో కనీసంగా 5 స్థానాలు గెలుస్తామని కూటమి బలంగా నమ్ముతోంది. ఆర్జేడీ నమ్ముకున్న ముస్లిం–యాదవ్ ఫార్ములాకు మల్లాలు తోడైతే ఇక్కడ విజయం ఖాయమని భావిస్తోంది. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండో దశలో 100 చోట్ల పోటీలో నిలవగా, ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న 32 నియోజకవర్గాలనే ఆమె లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేశారు. కనీసంగా 2 నుంచి 5 స్థానాలు గెలుస్తామని బీఎస్పీ చెబుతోంది. ఇక సీమాంచల్‌లోని 24 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించిన ఎంఐఎం ఈసారి 11 స్థానాల్లో పోటీకి దిగింది. ఇక్కడ అర డజను సీట్లు గెలుస్తామని పార్టీ ధీమాతో ఉంది. ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ సైతం 110 చోట్ల పోటీలో ఉంది. ఆయన పార్టీ వైపు ఎక్కువగా యువత, మహిళలు ఆకర్షితులు కావడంతో చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. -
నేడు బిహార్‌లో రెండో దశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని డజను వరకు మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 122 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 3.70 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. నేపాల్‌తో సరిహద్దులు కలిగిన పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్‌గంజ్ జిల్లాల్లో జరిగే ఈ క్రతువు కోసం యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో అత్యధిక జిల్లాలు ముస్లింల ప్రాబల్యమున్న సీమాంచల్ ప్రాంతంలోనివి కావడం గమనార్హం. సంక్లిష్ట కుల, వర్గ సమీకరణాలతో తుది విడత పోలింగ్ అధికార ఎన్డీయేతోపాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారులు 45, 399 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనివే 40,073 ఉన్నాయి. 3.67 లక్షల ఓటర్లతో అతిపెద్ద నియోజకవర్గం నవాడా జిల్లాలోని హిసువా కాగా, లౌరియా, చన్‌పటియా, రక్జౌల్, త్రివేణిగంజ్, సుగౌలి, బన్మఖిల్లో అత్యధికంగా 22 మంది చొప్పున బరిలో ఉన్నారు. మొదటి దశ పోలింగ్‌లో అత్యధికంగా 65 శాతం మంది ఓటేయడం విశేషం.అత్యంత సమస్యాత్మకం.. 8,491రెండో దశ పోలింగ్‌ను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 4 లక్షల మంది భద్రతా సిబ్బందిని బందోబస్తు కోసం రంగంలోకి దించారు. 45, 399 పోలింగ్ స్టేషన్లలో 8,491 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటి వద్ద అదనంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే 50 వేల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించిన అధికారులు, ఎన్నికల రోజున మరో 50 వేల మందిని రప్పిస్తున్నారు. ఇప్పటికే 60వేల మంది బిహార్ పోలీసులు ఎన్నికల విదుల్లో ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గయాజీలో అత్యధికంగా అత్యంత సమస్యా త్మకమైన 1,084 పోలింగ్ స్టేషన్లు ఉన్నా యని వివరించారు. కిషన్‌గంజ్, పుర్నియా, సీతామర్హి, మోతిహరీల్లో అత్యంత సమస్యా త్మకమైన పోలింగ్ బూత్ ఒక్కటీ లేదన్నారు. అదేవిధంగా, 122 నియోజ కవర్గాల పరిధిలోని 13,651 శివారు గ్రామా లను సమస్యాత్మకంగా గుర్తించినట్లు వివరించారు. -
బిహార్ ఎన్నికల వేళ.. ఢిల్లీ పేలుడు కలకలం
పాట్నా: బిహార్‌లో మంగళవారం చివరి దశ ఎన్నికలు జరగనున్న వేళ న్యూఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ నెల 6న 121 నియోజకవర్గాలకు తొలిదశ ఎన్నికలు జరగ్గా.. మంగళవారం 122 నియోజకవర్గాలకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటకు 500 మీటర్ల దూరంలో ఉన్న మెట్రోస్టేషన్ వద్ద బాంబు పేలుడు ఘటన యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.తొలి దశ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విజయంపై వేటికవే ధీమా వ్యక్తం చేయగా.. రెండో దశ గెలుపోటములను శాసించనుంది. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన బాంబు పేలుడు ఘటన ఎన్నికలపై ప్రభావం చూపించే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బిహార్‌లోనే ఉన్నారు. దేశ రాజధానిలో బాంబు పేలుడు వార్త తెలియగానే.. ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఢిల్లీలో బాంబు పేలుడు, బిహార్‌లో ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దుల్లో నిఘాను పెంచగా.. తాజా ఘటనతో యూపీలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. -
బిహార్ ఎన్నికలు.. ఈ విషయాలు తెలుసా?
బిహార్ శాసనసభ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న (మంగళవారం) జరుగుతుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత ఎన్నికల పోలింగ్‌కు ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డాయి. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రధానంగా ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) కూటముల మధ్య జరుగుతోంది. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ ప్రధాన పార్టీలు. మహాగఠ్‌బంధన్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర చిన్న పార్టీలు కూడా రెండు కూటములతో జట్టు కట్టాయి. ఆయా కూటముల్లో ఏయే పార్టీలు ఉన్నాయనే దాని గురించి సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నెటిజనులు. చిన్న పార్టీలు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. మరోవైపు కొత్త పార్టీ జన్ సురాజ్ ఒంటరిగా బరిలోకి దిగింది. రాజకీయ నేతగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) ఈ పార్టీని స్థాపించారు.ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బిహార్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీకి దిగాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM), ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM).. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి.ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌లో ఏడు పార్టీలు పాలు పంచుకున్నాయి. కాంగ్రెస్‌తో సహా తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), ముఖేష్ సహానీకి చెందిన వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), ఇంద్రజీత్ ప్రసాద్ గుప్తా నాయకత్వంలోని ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ (ఐఐపీ) మహాగఠ్‌బంధన్ పేరుతో బిహార్ ఎన్నికల బరిలోకి దిగాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ (సీపీఐఎంఎల్-లిబరేషన్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPIM) వంటి వామపక్ష పార్టీలు కూడా ప్రతిపక్ష కూటమిలో భాగంగా ఉన్నాయి.ఎన్డీఏ కూటమి1. భారతీయ జనతా పార్టీ 2. జనతాదళ్ (యునైటెడ్)3. లోక్ జనశక్తి పార్టీ4. హిందుస్థానీ అవామ్ మోర్చా5. రాష్ట్రీయ లోక్ మోర్చామహాగఠ్బంధన్1. కాంగ్రెస్ పార్టీ2. రాష్ట్రీయ జనతాదళ్3. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ4. ఇండియన్ ఇన్‌క్లూజివ్ పార్టీ5. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా6. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్7. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ఎవరెవరికి ఎన్ని సీట్లు?ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేస్తున్నాయి. లోక్ జనశక్తి పార్టీ 29, హిందుస్థానీ అవామ్ మోర్చా 6, రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాల్లో బరిలో నిలిచాయి.మహాగఠ్‌బంధన్ విషయానికి వస్తే.. రాష్ట్రీయ జనతాదళ్ 145, కాంగ్రెస్ 45, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్ 19, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ 15, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 6, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో 12 చోట్ల మహాగఠ్బంధన్లోని పార్టీలు స్నేహపూర్వక పోటీకి దిగాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు1. బిహార్ ఎన్నికల 2025 ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు?నవంబర్ 14న ప్రకటించబడతాయి.2. బిహార్ ఎన్నికలు 2025లో ఎన్ని దశలు ఉన్నాయి?నవంబర్ 6, నవంబర్ 11న రెండు దశల్లో జరుగుతున్నాయి..3. బిహార్ శాసనసభలో సీట్లు ఎన్ని ?బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం.4. బిహార్ ఎన్నికలు 2025లో ఏ పార్టీలు పోటీ చేస్తున్నాయి?ప్రధాన పోటీ NDA (BJP, JD(U), HAM), మహాగఠ్‌బంధన్ (RJD, కాంగ్రెస్, లెఫ్ట్) మధ్య ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది.5. మొదటి దశలో పోలింగ్ ఎంత ?మొదటి దశలో 65.08% పోలింగ్ నమోదైంది. ఇది 2020, 2024 ఎన్నికల కంటే ఇది ఎక్కువ.5. బిహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?జేడీయూ పార్టీకి చెందిన నితీశ్ కుమార్. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.చదవండి: బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం -
బిహార్‌కు ప్రత్యేక బలగాలు.. డేగ కళ్లతో పకడ్బందీ నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నెల 11న జరిగే రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 122 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలి దశలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. రెండో దశ ఎన్నికల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించినట్లు తెలిసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 14 ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని(సీఏపీఎఫ్) రప్పించారు. పోలింగ్ రోజున బూత్‌ల వద్ద మూడు అంచెల భద్రత ఉంటుంది. ఆధునిక ఆయుధాలతో కూడిన సీఏపీఎఫ్ సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వహిస్తారు. డేగ కళ్లతో పకడ్బందీ నిఘా బిహార్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా మొత్తం 1,650 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ నుంచి 1,332 కంపెనీలు ఉన్నాయి. మిగిలిన 273 కంపెనీలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాయుధ పోలీసు దళాలకు చెందినవి. వీటిలో 208 కంపెనీలను 14 బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలించారు. ఇందులో 14,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ఈ దళాలు సీఏపీఎఫ్ కమాండ్ కింద పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతకు నాయకత్వం వహిస్తాయి. అలాగే.. పోలింగ్ బూత్‌లతో పాటు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రతి జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలు, వ్యక్తులపై డేగకళ్లతో నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద పటిష్ట భద్రత బిహార్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. పోలింగ్ బూత్‌ల వద్ద రెండు రకాల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. సీఏపీఎఫ్ సిబ్బందిని రెండు విభాగాలుగా మోహరిస్తారు. పెద్ద బూత్‌లలో పూర్తిస్థాయి విభాగం అంటే.. ఎనిమిది మంది సాయుధ సీఏపీఎఫ్ సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. ఇక తక్కువ మంది ఓటర్లు ఉన్న చిన్న బూత్‌లలో సగం విభాగం అంటే.. నలుగురు సిబ్బంది, ఒక అధికారి ఉంటారు. అదనంగా బిహార్ హోంగార్డ్లు, దాదాపు 19వేల మంది ట్రైనీ పోలీసు సిబ్బంది, స్థానిక వాచ్మెన్లను కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరించారు. వారిలో ఎవరినీ కూడా వారి సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియమించలేదు. సీఐఎస్ఎఫ్కు స్ట్రాంగ్ రూమ్‌ల బాధ్యత మొదటి దశ పోలింగ్ తర్వాత జిల్లా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంను భద్రపరిచారు. రెండో దశ పోలింగ్ తర్వాత కూడా ఇదే పద్ధతి ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత బాధ్యతలను సీఐఎస్ఎఫ్కు అప్పగించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే సమయంలో కూడా సీఐఎస్ఎఫ్ బలగాలే భద్రతను పర్యవేక్షిస్తాయి. బిహార్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని డీజీపీ కంట్రోల్ రూమ్ ఎన్నికలకు ప్రధాన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తోంది. ఇక్కడ పర్యవేక్షణ కోసం ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలను నియమించారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశ పోలింగ్ సమయంలో మొత్తం 121 స్థానాల్లో ఓటింగ్‌ను ఇక్కడి నుండే నిశితంగా పరిశీలించారు. నవంబర్ 11న జరిగే రెండో దశకు కూడా ఇదే విధానం కొనసాగుతుంది. మొదటి దశ పోలింగ్ ముగిసిన ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ భద్రత కోసం పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించగా, అత్యవసర వినియోగం కోసం ఐదు అదనపు కంపెనీలను రిజర్వ్‌లో ఉంచారు. -
సోషల్ మీడియాలో రచ్చ లేపిన RJD వీడియోలు
-
బిహార్ ప్రచారానికి తెర
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇన్నాళ్లూ రాజకీయ పారీ్టల నినాదాలు, ప్రసంగాలతో హోరెత్తిపోయిన గ్రామాలు, పట్టణాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరిదైన రెండో దశ పోలింగ్ ఈ నెల 11వ తేదీన 122 నియోజవర్గాల్లో జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో కీలక నేతలు పోటీపడుతున్నారు. బిహార్ ఎన్నికల చరిత్రలో 5 శాతానికి మించి ఓటింగ్ పెరిగిన ప్రతిసారీ.. అది అధికార మారి్పడికే దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈసారి భారీ ఓటింగ్ నమోదు కావడం తమకే అనుకూలమని ఇరుపక్షాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సమీకరణాల చదరంగం రెండో దశలో పోలింగ్ జరుగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కుల సమీకరణాలు, ఓట్ల చీలిక వంటి అంశాలే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్ అత్యంత కీలకం. కిషన్‌గంజ్, అరారియా, పూరి్ణయా, కతిహార్ వంటి జిల్లాలున్న ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువ. ఇది దశాబ్దాలుగా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. అయితే, 2020 నాటి ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకొని మహాగఠ్‌బంధన్ ఓట్లను చీల్చింది.మైనారిటీల ఓట్లను ఆకర్శించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎంఐఎం సైతం అదే ఓటు బ్యాంకుకు గాలం వేస్తోంది. ఈ ’ఓట్ల చీలిక’అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం–యాదవ్ సమ్మేళనం మహాగఠ్‌బంధన్‌కు ప్రాణవాయువు లాంటిది. ఆర్జేడీ అభ్యర్థులు పూర్తిగా ఈ ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలం ఈబీసీలు, మహాదళితులే. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంకు గత రెండు దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది. భూమిహార్, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి.ఓట్ల చీలికలతో తంటాలు ఈ ఎన్నికల్లో ‘ఓట్లను చీల్చే’పార్టీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడని ఓటర్లను ఆకర్శిస్తోంది. ఈ పారీ్టతో జేడీ(యూ), ఆర్జేడీలకు కొంత నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సన్ ఆఫ్ మల్లా’గా పిలుచుకునే ముకేశ్ సహానీ.. బిహార్ నిషాద్ (మత్స్యకార) వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉండటం ఆర్జేడీకి కలిసొచ్చే అంశం. సమస్యాత్మక ప్రాంతాలు రెండో దశలో పోలింగ్ జరగనున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ వంటి జిల్లాలు నేపాల్ సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు పెద్ద సవాల్. ఎన్నికలకు 72 గంటల ముందే నేపాల్ సరిహద్దును మూసివేశారు. అసాంఘీక శక్తులు సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సీమాంచల్ ప్రాంతం మతపరంగా అత్యంత సున్నితమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. -
బీహార్ స్ట్రాంగ్ రూమ్ కెమెరాలు ఆఫ్.. ఆర్జేడీ సంచలన వీడియో
పాట్నా: బీహార్‌లో ఏం జరుగుతోంది?. స్ట్రాంగ్ రూమ్ వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియా కూటమికి చెందిన ఆర్జేడీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా బీహార్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి భారీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ ఆర్జేడీ ఆరోపించింది. దీంతో, ఈ వీడియో సంచలనంగా మారింది. మరోవైపు.. ఆర్జేడీ ఆరోపణలను ఈసీఐ తీవ్రంగా ఖండించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఆర్జేడీ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ప్రకారం.. సమస్తిపూర్లోని మొహియుద్దీన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్ట్రాంగ్ రూమ్‌లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించడం కనిపించింది. వారంతా ఎవరు? స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏం చేస్తున్నారు?. అక్కడి పరిస్థితులపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్, అధికారులను ఆర్జేడీ డిమాండ్ చేసింది. బీహార్ నుండి ఓట్లను దొంగిలించడానికి కొంతమంది బీహార్ వ్యతిరేక వ్యక్తులతో కలిసి ఒక దొంగ పనిచేయాలనుకుంటున్నాడు అని సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో స్ట్రాంగ్ వద్ద భద్రత పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.समस्तीपुर के स्ट्रॉंग रूम में आधे घंटा बंद रहा CCTV कैमरा!चुनाव आयोग और स्थानीय प्रशासन भ्रष्टाचार ग्रसित फालतू बहाने जैसे बिजली कट गई, बैटरी डाउन हो गया, TV स्लीप मोड में चला गया, जेनरेटर नहीं था... नहीं बनाए!आप लोगों की विश्वसनीयता और शुचिता शून्य है!#VoteChori के हथकंडे बंद… pic.twitter.com/wlacKl4Ltv— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025మరో వీడియోలో.. ఆర్ఎన్ కాలేజీలో కౌంటింగ్ కోసం భద్రపరిచిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆర్జేడీ ఆరోపణలు చేసింది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మేనేజ్ చేస్తున్నారని.. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు అనుమానంగా ఉందని కామెంట్స్ చేసింది. మహ్నార్-129 అసెంబ్లీ స్థానంలో ఉన్న ఈ ఆర్ఎన్ కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో సీసీటీవీలను ఆఫ్ చేశారని అందుకు సంబంధించి ఆర్జేడీ నాయకులు వీడియో రిలీజ్ చేశారు.వైశాలి జిల్లాలోని హాజీపూర్‌లో స్ట్రాంగ్ రూమ్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయని మరో వీడియోలో తెలిపారు. రాత్రి వేళ పికప్ వ్యాన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ వ్యాన్ వెళ్లేటప్పుడు సీసీ టీవీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయినట్లు చూపిస్తోంది. అక్కడున్న పెద్ద సీసీకెమెరా ఆఫ్ అయి ఉంది. మిగతావి ఆన్‌లో ఉన్నాయి. ఇది అనుమానాలకు తావిస్తోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది.अब समस्तीपुर की मोहिउद्दीन नगर विधानसभा के स्ट्रांग रूम में घुसते कुछ संदिग्ध दिखे।@ECISVEEP @CEOBihar स्थिति स्पष्ट करे कि ब्रजगृह के अंदर ये संदिग्ध लोग कौन थे और क्या कर रहे थे? जागते रहो, सतर्क रहो। एक बाहरी वोट डकैत बीते कई दिनों से बिहार में बैठकर बिहार विरोधी कुछ… pic.twitter.com/DXprL4nPzW— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025కౌంటింగ్ ఏరియాలోకి వాహనాలు.. కౌంటింగ్ చేసేందుకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న స్థలంలోకి వెహికిల్స్ ఎందుకు వెళ్తున్నాయని వీడియో రికార్డు చేసిన వ్యక్తి ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో అధికార జేడీయూ-బీజేపీ కూటమి అక్రమ మార్గంలో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈసీ స్పందన.. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఫిర్యాదుపై ఈసీ స్పందిస్తూ ప్రాథమిక విచారణ నిర్వహించినట్లు తెలిపింది. కంట్రోల్ రూమ్‌లోని నుంచి స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఐదు అసెంబ్లీ విభాగాలలో ఒకటైన 129 మహానార్ వద్ద డిస్ప్లే స్క్రీన్ ఆటో టైమ్ అవుట్ కారణంగా కొంతకాలం ఆపివేయబడింది. త్వరగా పునఃప్రారంభించబడిందని పేర్కొంది. ఇది అంతరాయం లేకుండా జరిగాయని కమిషన్ స్పష్టం చేసింది. మహానార్ ప్రధాన కంట్రోల్ రూమ్ ఫీడ్ ఏమాత్రం ప్రభావితం కాలేదని కూడా తెలిపింది.పికప్ వ్యాన్ ఆరోపణలపై స్పందిస్తూ.. వాహనం స్ట్రాంగ్ రూమ్‌లో నియమించబడిన భద్రతా సిబ్బందికి చెందినది. వారు కళాశాల క్యాంపస్‌కు ఆలస్యంగా బెడ్డింగ్, సామాగ్రిని తీసుకువచ్చారని ఈసీఐ తెలిపింది. వాహనం 15 నిమిషాల్లోనే వెళ్లిపోయింది. దాన్ని ఎంట్రీ గార్డు రిజిస్టర్లో నమోదు చేశారు అని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్ మూడు అంచెల భద్రతా వ్యవస్థ కింద పనిచేస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. చివరగా.. నిరాధారమైన, తప్పుదారి పట్టించే పోస్ట్‌ను ఖండిస్తున్నట్టు ఈసీఐ తెలిపింది.ఇది కూడా చదవండి: చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు -
బిహార్ బరిలో ఫైనల్ రౌండ్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం తుది దశకు చేరుకుంది. రెండో దశలో ఈ నెల 11వ తేదీన 122 అసెంబ్లీ స్థానాలకు తుదిదశ పోలింగ్ జరగనుంది. ఇది సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, తేజస్వీ యాదవ్ సారథ్యంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ ఎత్తుగడలకు అసలు సిసలు పరీక్షగా మారింది. చంపారన్ కంచుకోటల నుంచి సీమాంచల్ సంక్లిష్ట సమీకరణాల వరకు అరడజనుకు పైగా మంత్రులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తం కానున్నాయి. తొలి దశ హోరాహోరీగా ముగియగా, ఈ ఫైనల్ రౌండ్లో గెలిచి గద్దెనెక్కేదెవరన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నడుస్తోంది. అందరి దృష్టి వీరిపైనే... రెండో దశ పోలింగ్ నితీశ్ కుమార్ కేబినెట్ సహచరులకు, మహాగఠ్‌బంధన్ ప్రభుత్వంలోని మాజీ మంత్రులకు చావోరేవోగా మారింది. వీరి గెలుపోటములు కూటముల భవిష్యత్తును శాసించనున్నాయి. అందరి దృష్టీ వీఐపీలపైనే ఉంది. వారెవరంటే..⇒ రేణు దేవి (బీజేపీ, బెట్టియా): రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమె పశ్చిమ చంపారన్‌లో బీజేపీకి అత్యంత కీలకమైన, బలమైన నాయకురాలు. ఈమె గెలుపు కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం.⇒ లేషి సింగ్ (జేడీయూ, ధమ్దాహా): నితీశ్ కేబినెట్లో ప్రస్తుత ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి. సీమాంచల్ ప్రాంతంలో జేడీయూకి బలమైన మహిళా నాయకురాలు. 2020లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన ఈమె, ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.⇒ లలిత్ కుమార్ యాదవ్ (ఆర్జేడీ, దర్భంగా గ్రామీణ): గత మహాగఠ్‌బంధన్ ప్రభుత్వంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ మంత్రి. దర్భంగా ప్రాంతంలో ఆర్జేడీకి బలమైన యాదవ నేతగా ఈమెను భావిస్తున్నారు.⇒ మదన్ సహాని (జేడీయూ, బహదూర్‌పూర్): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అత్యంత వెనుకబడిన వర్గాల (ఈబీసీ) నుంచి వచ్చిన బలమైన నాయకుడు. ఈయన గెలుపు ఎన్డీయేకు ముఖ్యం.⇒ సమీర్ కుమార్ మహాసేఠ్ (ఆర్జేడీ, మధుబని): గత మహాగఠ్‌బంధన్ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి. మిథిలాంచల్ ప్రాంతంలో, ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో మంచి పట్టున్న నేత.⇒ ప్రమోద్ కుమార్ (బీజేపీ, మోతిహరి): మోతిహరి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయన గెలుపు బీజేపీకి నల్లేరుపై నడకేనని భావిస్తున్నా, ఆర్జేడీ మాత్రం గట్టి పోటీ ఇస్తోంది.⇒ అక్తరుల్ ఇమాన్ (ఎంఐఎం, అమౌర్): ఈయన అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడం ద్వారా ఈయన మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చంపారన్ కోటలో హోరాహోరీ.. ఈ నాలుగింటిపైనే ఫోకస్! 2020 ఎన్నికల్లో చంపారన్ ప్రాంతం (తూర్పు, పశ్చిమ) ఎన్డీయేకు కంచుకోటగా నిలిచింది. ఈసారి ఈ కోటను బద్దలుకొట్టాలని మహాగఠ్‌బంధన్, నిలబెట్టుకోవాలని ఎన్డీయే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్త ఆసక్తిని రేపుతున్నాయి.⇒ బెట్టియా (పశ్చిమ చంపారన్): ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి (బీజేపీ) బరిలో ఉన్నారు. 2020లో 18 వేల మెజారిటీతో గెలిచిన ఈమెకు.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి వాషి అహ్మద్, జన్ సురాజ్ అభ్యర్థి అనిల్ కుమార్ సింగ్‌ల నుంచి త్రిముఖ పోటీ ఎదురవుతోంది. క్షేత్రస్థాయి సమస్యలు, నిరుద్యోగం ఇక్కడ ప్రభావం చూపే అంశాలు.⇒ మోతిహరి (తూర్పు చంపారన్): బీజేపీకి ఇది అత్యంత పటిష్టమైన కోట. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రమోద్ కుమార్ (బీజేపీ) మరోసారి ఆర్జేడీ అభ్యర్థి ఓం ప్రకాష్ చౌదరితో తలపడుతున్నారు. 70% గ్రామీణ ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ప్రమోద్ కుమార్ వ్యక్తిగత ఇమేజ్, బీజేపీ సంస్థాగత బలం ఎన్డీయేకు కొండంత అండగా నిలుస్తున్నాయి.⇒ నర్కటియాగంజ్ (పశ్చిమ చంపారన్): ఇక్కడ మహాగఠ్‌బంధన్ వ్యూహం బెడిసికొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిలో ఏకాభిప్రాయం కుదరక, ఆర్జేడీ (దీపక్ యాదవ్), కాంగ్రెస్ (శాశ్వత్ కేదార్) ఇద్దరూ బరిలో నిలిచారు. ఇది ’ఫ్రెండ్లీ ఫైట్’అని పైకి చెబుతున్నా, మహాగఠ్‌బంధన్ ఓటు బ్యాంకు స్పష్టంగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామం నేరుగా బీజేపీ (సంజయ్ పాండే) విజయానికి బాటలు వేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.⇒ వాల్మికి నగర్ (పశ్చిమ చంపారన్): ఇది జేడీయూకి బలమైన స్థానం. సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరేంద్ర ప్రతాప్ సింగ్ (జేడీయూ)కు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. 2015లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఈయనే, 2020లో జేడీయూ తరపున గెలిచారు. ఈసారి కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ స్వయంగా ప్రచారం చేసినా, ఇక్కడ జేడీయూ అభ్యరి్థదే పైచేయిగా కనిపిస్తోంది. -
చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు
సమస్తీపూర్: బిహార్‌లోని సమస్తీపూర్‌లో పెద్ద సంఖ్యలో వీవీప్యాట్(ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)స్లిప్పులను రోడ్డు పక్కన విసిరేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి తీవ్ర కలకలం రేపింది. శనివారం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరలవుతోంది. పార్టీ గుర్తులు ముద్రించి ఉన్న ఆ స్లిప్పులను జనం ఏరుతున్నట్లుగా అందులో కనిపిస్తోంది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ సీరియస్‌గా స్పందించింది. అవి ఈవీఎంల నుంచి పడేసిన స్లిప్పులేనని పేర్కొంది. అయితే, అవి పోలింగ్ ముందు రోజైన బుధవారం నిర్వహించిన మాక్ పోల్‌కు సంబంధించిన స్లిప్పులు మాత్రమేనని, వాస్తవ ఓటింగ్‌నకు సంబంధించినవి కావని జిల్లా యంత్రాంగం తెలిపింది.మాక్ పోల్ తర్వాత స్లిప్పులను కత్తిరించి బయటపడేశామని, అందులో కట్ కాని కొన్ని స్లిప్పులు స్థానికులు ఏరుకున్నారని డీఎం రోషన్ కుష్వాహా వివరించారు. తాము స్వయంగా ఘటనాస్థలికి వెళ్లి వాటిని పరిశీలించామన్నారు. వాటిపై ఉన్న ఈవీఎంల నంబర్ల ఆధారంగా బాధ్యులైన పోలింగ్ సిబ్బంది గుర్తించవచ్చని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. సంబంధిత నియోజకవర్గంలోని అభ్యర్థులకు ఈ విషయం తెలిపామన్నారు.ఇందుకు బాధ్యుడైన అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారి(ఏఆర్వో)పై కఠినచర్యలు తీసుకోవాలని ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించారు. సంబంధిత ఏఆర్వోను సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేస్తామన్నారు. ఘటనపై విచారణ చేపట్టి, సవివర నివేదిక అందజేయాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియపై ఈ ఘటన ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును పరిశీలించే ఉద్దేశంతో మాక్ పోల్ ప్రక్రియను చేపడతారు. అనంతరం, అందులోని ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను పూర్తిగా తొలగిస్తారు. -
‘బిహార్‌లో మళ్లీ వచ్చేది మేమే..’
పూర్నియా: బిహార్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టం చేశారు. ఈ రోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) బిహార్‌లో పూర్నియా నగరంలో ఎన్డేటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లో ఉన్న 243 సీట్లకు గాను 160 సీట్లను కచ్చితంగా గెలుస్తామన్నారు అమిత్ షా. ఇక్కడ చొరబాటు అనేది చాలా సీరియస్ అంశం. సీమాంచల్ ప్రాంతంలో అనేక సమస్యలున్నాయి. అందులో చొరబాటు అనేది అతి ప్రధానమైనది. ఇది బిహార్ రాష్ట్రంలో అత్యంత ప్రభావం చూపుతుంది. లా అండ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము ఇక్కడ కచ్చితంగా ఒకటి నిర్ణయించుకున్నాం. వచ్చే ఐదేళ్లలో చొరబాటు దారుల్ని నియంత్రించడంపైనే మా దృష్టి ఉంది. ఇక్కడ అక్రమ వ్యాపారాలు చేసే వారికి చోటు లేదు. ప్రతీ ఒక్క అక్రమ వలస దారుడ్ని ఒకరి తరువాత ఒకర్ని వెనక్కి పంపేస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
అసెంబ్లీ ఎన్నికల వేళ బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనశక్తి జనతాదళ్ (JJD) నేత తేజ్ ప్రతాప్ యాదవ్, బీజేపీ ఎంపీ రవి కిషన్ (BJP MP Ravi Kishan) ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఊహాగాహానాలు మొదలైపోయాయి. ఎన్డీఏ కూటమితో తేజ్ ప్రతాప్ చేతులు కలుపుతారనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల అనంతరం జరిగే పరిణామాలపై తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చాయి.రవి కిషన్‌ను తొలిసారి కలిశాపట్నా విమానాశ్రయంలో శుక్రవారం రవి కిషన్‌తో కలిసి కనిపించారు తేజ్ ప్రతాప్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తొలగించి యువతకు ఉపాధి కల్పించే వారితోనే తాను ఉంటానని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు రవి కిషన్‌ను తొలిసారిగా కలిసినట్టు చెప్పారు. ఆయన దేవుడి భక్తుడని, తాను కూడా భక్తుడినే అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికల తర్వాత పొత్తు గురించి ప్రశ్నించగా.. "ఆప్షన్లు తెరిచి ఉన్నాయి. వేల ఎంపికలు ఉన్నాయి. విజయం తర్వాత, అన్ని ఎంపికలు తెరిచే ఉంటాయిని జవాబిచ్చారు.ఇందులో రహస్యం లేదు: రవి కిషన్‌తేజ్ ప్రతాప్ మంచి మనసున్న వ్యక్తి, భోలేనాథ్ భక్తుడని ఎంపీ రవి కిషన్ ప్రశంసించారు. ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకునే వారి కోసం కాషాయ పార్టీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఇందులో ఎటువంటి రహస్యం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తేజ్ ప్రతాప్, రవి కిషన్ కలయిక బిహార్ రాజకీయాల్లో (Bihar Politics) అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తేజ్ ప్రతాప్, ఆయన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.చదవండి: బిహార్ ఎన్నికల్లో టాప్-10 ధనిక అభ్యర్థులు వీరేఆత్మగౌరవమే ముఖ్యంతేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నుంచి బహిష్కరణకు గురయ్యారు. 12 ఏళ్లుగా ఓ మహిళతో అనైతిక సంబంధం కొనసాగించారనే ఆరోపణలతో ఆయనను ఆర్జేడీ నుంచి బయటకు పంపించారు. అయితే ఈ ఆరోపణలను తేజ్ ప్రతాప్ తోసిపుచ్చారు. ప్రాణం పోయినా తిరిగి ఆర్జేడీలోకి వెళ్లబోనని ఆయన శపథం చేశారు. అధికారం పట్ల వ్యామోహం లేదని, ఆత్మగౌరవమే తనకు ముఖ్యమన్నారు. తర్వాత సొంతంగా జనశక్తి జనతాదళ్ పార్టీని సొంతంగా స్థాపించారు.ముగిసిన తొలి దశ పోలింగ్బిహార్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాలకు మొదటి దశ పోలింగ్ జరిగింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 65 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ పోటీ చేసిన మహువా నియోజకవర్గంలో పోలింగ్ పూర్తయింది. జనశక్తి జనతాదళ్ తరపున 22 మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టారు. వీరందరికీ బ్లాక్‌బోర్డ్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. -
మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు: మోదీ
సీతామర్హి: ‘‘మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు.. బిహార్‌కు తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు’’ అంటూ ఆర్జేడీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్‌లోని సీతామర్హిలో శనివారం.. ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. బీహార్‌కు స్టార్టప్‌లు అవసరం.. 'హ్యాండ్స్ అప్' గ్యాంగ్ కాదంటూ విమర్శలు గుప్పించారు.ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీల టార్గెట్‌గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. రాష్ట్ర యువతను గూండాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్డీఏ యువతకు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి అందిస్తుండగా.. ఆర్జేడీ మాత్రం తుపాకులు ఇవ్వాలనుకుంటోందంటూ మండిపడ్డారు.ఇవాళ్టి నాయకులు తమ పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలు చేయాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లలను మాత్రం గూండాలుగా తయారు చేయాలనుకుంటున్నారు. బీహార్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు. జంగిల్ రాజ్ అంటే ‘తుపాకులు, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’గా మోదీ అభివర్ణించారు. బిహార్‌లో నవంబర్ 11న రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ విమర్శల దాడి మరింత పెంచారు. ఆర్జేడీ ప్రచార గీతాలు, నినాదాలు వినగానే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ పార్టీ నాయకుల ప్రచారంలో బీహార్ పిల్లల కోసం వారు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్జేడీ వేదికలపై అమాయక పిల్లలను గ్యాంగ్స్టర్లుగా మారాలనుకుంటున్నట్లు చెప్పిస్తున్నారు’’ అంటూ మోదీ ఆరోపించారు. -
Bihar: ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వీడియో వైరల్
పట్నా: బీహార్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 6న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఆరోజు ఓటువేసిన ఎల్జేపీ(రామ్ విలాస్) ఎంపీ శాంభవి చౌదరికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటూ చర్చించుకుంటున్నారు.బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశలో ఓటు వేసిన తర్వాత ఎంపీ శాంభవి చౌదరి తన రెండు చేతి వేళ్లపై సిరా గుర్తులను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది డబుల్ ఓటింగ్, విధానపరమైన లోపాల ఆరోపణలకు ఆజ్యం పోసింది. పట్నాలోని బుద్ధ కాలనీలోని ఒక పోలింగ్ కేంద్రం వెలుపల చిత్రీకరించిన ఈ వీడియోలో ఎంపీ శాంభవి తన తండ్రి, జేడీయూ నేత అశోక్ చౌదరి, తల్లి నీతా చౌదరితో కలిసి కనిపిస్తున్నారు. #WATCH | Patna | JDU leader Ashok Chaudhary, his wife Nita Chaudhary, daughter and LJP Ram Vilas MP Shambhavi Chaudhary cast their vote at a polling booth at Buddha Colony’s ST Paul School pic.twitter.com/r8ts2SIQcB— ANI (@ANI) November 6, 2025వీడియోలో ముందుగా ఆమె తన వేలిపై సిరా గుర్తును చూపేందుకు తన కుడి చేతి వేలిని చూపిస్తారు. తరువాత ఎడమ చేతి వేలిని చూపిస్తారు. ఈ వేలిపై కూడా సిరా గుర్తు కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో పట్నా జిల్లా పరిపాలన అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సిరా గుర్తు వేయడానికి బాధ్యత వహించే పోలింగ్ సిబ్బంది పొరపాటున తొలుత కుడి చేతి వేలికి సిరాను పూసారని, అయితే ప్రిసైడింగ్ అధికారి జోక్యం చేసుకున్న తర్వాత, ఆమె ఎడమ చేతి వేలికి కూడా సిరాను రాశారని దానిలో స్పష్టం చేశారు. బుద్ధ కాలనీలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 61లోని ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ 275లో మాత్రమే శాంభవి తన ఓటును వేశారని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్: ‘ఇకపై 10కి ఆఫీసు’ -
బిహార్‌లో ఎక్కడా రీపోలింగ్ లేదు: ఈసీ
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ 45,000కుపైగా బూత్‌ల్లో ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రీపోలింగ్ కోసం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని శుక్రవారం వెల్లడించింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం రాలేదని పేర్కొంది. తొలి దశలో పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో సంబంధిత డాక్యుమెంట్ల సూక్ష్మపరిశీలన పూర్తయినట్లు తెలియజేసింది. ఎన్నికల నిర్వహణలో లోపాలు గానీ, అవకతవకలు గానీ జరిగినట్లు నిరూపణ కాలేదని స్పష్టంచేసింది. అందుకే రీపోలింగ్ కోసం ప్రతిపాదించలేదని ఎన్నికల సంఘం వివరించింది. -
‘నేను బిహార్‌లో ఓటేశా.. ఇక మీ వంతు..!’
పట్నా: ఆమెది పుణె. కాకపోతే బిహార్‌లో ఓటు వేసినట్లు ఆమెనే చెబుతోంది., మీరు కూడా బిహార్ వెళ్లి ఓటు వేయండి అని కూడా స్పష్టం చేసింది. ఆమె పేరు ఊర్మి. ఆమె ఒక న్యాయవాది. కాకపోతే బిహార్ తొలిదశ ఎన్నిక తర్వాత ఆమె షేర్ చేసిన ఫోటోపై రాజకీయ దుమారం రేగుతోంది. ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో అనేక ప్రశ్నలకు తావినిస్తోంది. నిజంగానే బిహార్‌లో ఆమె ఓటు వేసిందా?.. లేక ఇది డ్రామానా? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. మల్లీ స్టేట్ వోటింగ్ అనేది బీజేపీకి న్యూ స్టార్టప్‌నే కాదు.. కొత్త పెట్టుబడి దారు కూడా అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రేష్మ అలమ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఓటు వేసిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్‌లో ఓటు వేసిందని, ఇది ఓట్ చోరీ కాక మరేమిటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ ద్వజమెత్తారు. Voted for a Modi-fied India! 🇮🇳Jaai ke Vote daali, Bihar! pic.twitter.com/kkWMwShqSh— Urrmi (@Urrmi_) November 6, 2025 ఈ ఫోటోపై ఓటరు గుర్తింపు, నివాస ప్రమాణాలు, ఎన్నికల నిబంధనలు ప్రకారం విచారణ జరగవలసిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పలు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికకు సంబంధించి తాజా ఫోటో వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.लोकसभा में महाराष्ट्र में वोट करूंगी विधानसभा में बिहार में वोट करूंगी मोदी के लिए वोट चोरी करूंगी 🧐🧐 pic.twitter.com/xDrrLoXMbj— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 6, 2025ఇవీ కూడా చదవండి: ‘పిచ్చి పని’.. కంగుతిన్న మోడల్ఈసీపై రాహుల్ హైడ్రోజన్ బాంబు -
‘ఆ బీజేపీ నేతలు ఓటు దొంగలు’?: ‘ఆప్’ ఆరోపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నినదించిన ‘ఓట్ చోరీ’ ఇప్పడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లోనూ వినిపిస్తోంది. పలువురు బీజేపీ నేతలు అటు ఢిల్లీలో, ఇటు బీహార్‌లో.. రెండు చోట్లా ఓటు వేశారని ‘ఆప్’ ఆరోపించింది. ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కలకలానికి కారణంగా నిలిచింది. అయితే సదరు బీజేపీ నేతలు ‘ఆప్’ ఆరోపణలను ఖండిస్తూ, వివరణ ఇచ్చుకున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా భారతీయ జనతా పార్టీ నేతలు ‘ఓటు దొంగతనం’ చేశారని ఆరోపించింది. వారంతా ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లోనూ, ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లనూ ఓటు వేశారని ఆరోపించింది. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాలలో నకిలీని నిరోధించేందుకు ఉద్దేశించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డ్రైవ్ ఉన్నప్పటికీ ఇలా జరిగిందని ‘ఆప్’ పేర్కొంది. ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా, ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా అధ్యక్షుడు సంతోష్ ఓఝా, పార్టీ కార్యకర్త నాగేంద్ర కుమార్.. ఈ ముగ్గురూ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారని ఆరోపించారు.‘రివిజన్’ తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏ ఓటరూ నమోదు కాలేదని ఎన్నికల సంఘం తెలిపిందని, అయితే ఈ నేతలు బీహార్‌లో ఓటు ఎలా వేయగలిగారు? దీనిని చూస్తుంటే, దేశవ్యాప్తంగా ఓట్ల దొంగతనం ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించుకోవచ్చని భరద్వాజ్ అన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ యూనిట్ వ్యాఖ్యానించకపోయినా, బీజేపీ రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా వివరణ ఇచ్చుకున్నారు. తన ఓటును ఢిల్లీ నుండి తన స్వగ్రామమైన బీహార్‌లోని మన్సీర్పూర్ (బెగుసరాయ్)కి మార్చినట్లు ఆయన తెలిపారు. కాగా ‘ఆప్’ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇంతవరకూ స్పందించలేదు.ఇది కూడా చదవండి: Srinagar: భారీ ఉగ్రదాడి విఫలం -
బిహార్ పోరులో మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి దశ వరకు ఎక్కడా కనిపించని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి రెండో దశ ఎన్నికలకు శంఖారావం పూరించారు. తొలి దశ ఓటింగ్ జరిగిన గురువారం నుంచే ఆమె ఎన్నికల ప్రచారాన్ని కైమూర్ జిల్లా భబువా నుంచి ప్రారంభించారు. రెండో దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్‌ను ఆనుకుని ఉన్నవే. దీంతో ఈ ప్రాంతాలపై ఆమె దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరి గెలుపును అడ్డుకుంటుందో..? బిహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని అందరి కంటే ముందుగానే ప్రకటించిన బీఎస్పీ అందుకు తగ్గట్లుగానే అభ్యర్థులను కూడా ప్రకటించింది. కొన్ని చోట్ల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 190 చోట్ల ప్రస్తుతం బరిలో ఉంది. ఇందులో రెండో విడతలో ఎన్నికలు జరిగే 122 స్థానాలకు గానూ బీఎస్సీ వంద చోట్ల పోటీలో ఉంది. గత 20 ఏళ్లుగా బిహార్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నా రెండంకెల స్థానాలను ఎన్నడూ గెలుచుకోలేదు. 2000 ఎన్నికల్లో 5 స్థానాలను, 2020 ఎన్నికల్లో ఒక్క స్థానంలో విజయం సాధించింది. గడిచిన ఎన్నికల్లో ఎంఐఎం, రాష్ట్రీయ్ లోక్ సమతా పార్టీలతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ 1.49 శాతం ఓట్లనుు సాధించింది. బీఎస్పీ పోటీ చేసిన 78 స్థానాల్లో చాలా చోట్ల 4.5 శాతానికి పైగా ఓట్లు సాధించి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఓట్లకు గండి కొట్టింది. బీఎస్పీ పోటీ చేసిన స్థానాలన్నీ ఎస్సీలు, ముస్లింలు అధికంగా ఉన్న స్థానాలే కావడంతో అక్కడ ఓట్ల చీలిక ఆ పార్టీల గెలుపు అవకాశాలకు దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న బిహార్‌లోని సరన్, సివాన్, గోపాల్‌గంజ్, భోజ్‌పూర్, పశి్చమ చంపారన్, రోహ్తాస్, బక్సర్, కైమూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఈ జిల్లాల్లో భోజ్‌పురి మాండలికం, జీవనశైలి, సాంస్కృతిక రీతులు చాలావరకు ఒకే విధంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని కుల, రాజకీయ పరిస్థితులు సారూప్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తన తొలి ఎన్నికల ర్యాలీని కైమూర్ నుంచి మొదలుపెట్టారు. ఈ జిల్లాలోని భబువా, మోహానియా, రామ్‌గఢ్, చైన్పూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో చైన్పూర్లో రెండుసార్లు బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల కంటే బీఎస్పీ బలంగా ఉండటంతో ఇక్కడే రాజకీయ ర్యాలీకి మాయావతి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా బీఎస్పీకి తొలినుంచి అండగా నిలిచిన ఎస్సీ వర్గాలతో పాటు మైనార్టీలను కలుపుకునేలా బీఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో 15.5 శాతం ఎస్సీలు, 17.70శాతం ముస్లింలు కలిపి 32శాతం పైగా ఉండటంతో బీఎస్పీ వీరు అధికంగా ఉన్న సీట్లనే ఫోకస్ చేయనుంది. అదే జరిగితే ముస్లిం ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్, ఆర్జేడీల ఓట్లకు గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది. -
రికార్డు స్థాయిలో ఓటింగ్
పట్నా: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 64.66 శాతం ఓటింగ్ రికార్డు కావడం గమనార్హం. ఓటర్లు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరి కనిపించారు. తొలి దశలో భాగంగా 18 జిల్లాల్లోని మొత్తం 121 శాసనసభ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. 3.75 కోట్ల మంది ఓటర్లలో 64.66 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. పండుగ వాతావరణంలో తొలి దశ పోలింగ్ జరిగినట్లు పేర్కొంది. 45,341 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. అత్యధికంగా ముజఫర్‌పూర్ జిల్లాలో 70.96 శాతం, సమస్తీపూర్‌లో 70.63 శాతం, మాధేపురాలో 67.21 శాతం, వైశాలీలో 67.37 శాతం, సహర్సాలో 66.84 శాతం, ఖగారియాలో 66.36 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం పట్ల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు. బిహార్ ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సంఘం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ శాతంపై శుక్రవారం పూర్తి స్పష్టత రానుంది. తొలి దశలో భాగంగా మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హాతోపాటు పలువురు మంత్రులు తొలి దశ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఎస్ఐఆర్ తర్వాత ఎన్నికలు బిహార్‌లో 1951–52లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 42.6 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 62.57 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. 2020 నాటి ఎన్నికల్లో కోవిడ్–19 ప్రభావం వల్ల ఓటింగ్ శాతం 57.29కు పరిమితమైంది. ఈసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) పూర్తి చేసిన తర్వాత నిర్వహిస్తున్న ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి బిహార్‌పై కేంద్రీకృతమైంది. రెండో దశలో భాగంగా మిగిలిన 122 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ఈ నెల 11న జరుగనుంది. ఓటేసిన ప్రముఖులు తొలి దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తదితరులు ఓటు వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి తొలి దశ పోలింగ్ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. లఖీ సరాయ్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా కాన్వాయ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. బక్సర్, ఫతుహా, సూర్యగఢ్ తదితర ప్రాంతాల్లో కొన్ని కేంద్రాల్లో ఓటింగ్‌ను జనం బహిష్కరించారు. మరోవైపు మహాగఠ్‌బంధన్‌కు బలం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఉద్దేశపూర్వకంగా ఓటింగ్‌ను తగ్గించారని ఆర్జేడీ ఆరోపించింది. పెనంపై రొట్టెను తిరగేయకపోతే.. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిదే విజయమని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. తన కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పెనంపై రొట్టెను తిరగేయకపోతే మాడిపోతుందని తెలిపారు. ఎన్డీయే 20 ఏళ్లుగా అధికారంలో ఉందని గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. నూతన బిహార్ నిర్మాణానికి తేజస్వీ ప్రభుత్వం రావాల్సిందేనని తేలి్చచెప్పారు. -
వారిపై అంతప్రేమ ఎందుకు?
భాగల్పూర్: బిహార్‌లో ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రెండు పార్టీలు చొరబాటుదారులపై అంతులేని అనురాగం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శ్రీరాముడిని, ఛఠ్ పూజలను వ్యతిరేకిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకును సంతృప్తిపర్చడానికి మన సంప్రదాయాలను తూలనాడుతున్నారని విమర్శించారు. గురువారం బిహార్‌లోని భాగల్పూర్, అరారియా జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రతిపక్ష నాయకులు అయోధ్య రామాలయాన్ని ఇప్పటికీ దర్శించుకోలేదని గుర్తుచేశారు. నిశాద్రాజ్, మాత శబరి, మహర్షి వాల్మికికి సంబంధించిన పవిత్ర క్షేత్రాలకు కూడా వెళ్లలేదని అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులపై విపక్షాలు విద్వేషం చూపుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 15 ఏళ్ల జంగిల్‌రాజ్ పాలనలో జరిగిన అభివృద్ధి గుండు సున్నా అని దుయ్యబట్టారు. రహదారులు, వంతెనలు, ఉన్నత విద్యా సంస్థలు నిర్మించలేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుఆమర్ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించిందని చెప్పారు. ‘‘ఈరోజు బిహార్‌లో అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. జాతీయ రహదారులు, వంతెనలు నిర్మితమయ్యాయి. నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రగతి ప్రయాణం నిరాటంకంగా కొనసాగాలంటే ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే ప్రజలు ఆలోచించి ఓటువేయాలి. ఈ అభివృద్ధి వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రధానంగా చొరబాటుదారుల నుంచి పెద్ద సవాలు ఎదురయ్యింది. ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే చొరబాటుదారులకు ఘన స్వాగతం పలుకుతాయి. ప్రతిపక్షాలకు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం. కానీ, అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారితో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. స్థానికులు నష్టపోతున్నారు. మన పౌరుల ఆస్తుల్లో వాటా కావాలని చొరబాటుదారులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పరాయివాళ్ల కోసం మన ప్రజలను బలి చేయడం ఎంతవరకు న్యాయమో ప్రతిపక్ష నాయకులే చెప్పాలి’’ అని మోదీ ప్రశ్నించారు.ఒక్క ఓటు సైతం విలువైనదే బిహార్‌లో తొలి దశ పోలింగ్‌లో జనం చురుగ్గా పాల్గొనడం సంతోషం కలిగిస్తోంది. యువత, వృద్ధులు అనే తేడాలేకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహం ముందుకొస్తున్నారు. పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరుతున్నారు. మరోసారి జంగిల్‌రాజ్ అధికారంలోకి రాకుండా చూడాలన్న పట్టుదల మహిళల్లో కనిపిస్తోంది. ఒక్క ఓటు కూడా ఎంతో విలువైనది. ఓటు శక్తి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆర్జేడీ పాలనలో అరాచకం రాజ్యమేలిన సంగతి మర్చిపోవద్దు. ఇక కాంగ్రెస్ డిక్షనరీలో స్వదేశీ, అత్మనిర్భరత అనే పదాలే లేవు. స్వయం సమృద్ధి, స్వదేశీ ఉత్పత్తులతో పేదలు లబ్ధి పొందడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. విపక్ష కూటమికి సొంత కుటుంబాలు, సొంత ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం అంటే ఏమిటో కూడా తెలియదు. దేశంలో అత్యంత అవినీతి కుటుంబం కాంగ్రెస్‌దే. బిహార్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఆర్జేడీదే’’ అని ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. -
బిహార్ ఎన్నికలు.. టాప్-10 ధనిక అభ్యర్థులు వీరే
డబ్బుకు లోకం దాసోం.. వర్తమాన లోకరీతి. సొమ్ములున్న వారికే సకల భోగాలు నయా పోకడ. పాలిటిక్స్‌లోనూ పైసలు ఉన్నోదే రాజ్యం. రాజకీయాల్లోకి రావాలన్నా, నిలబడాలన్నా డబ్బు తప్పనిసరి. తాజాగా జరుగుతున్న బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిలో సంపన్నులు దండిగా ఉన్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తిపరులను అన్ని పార్టీలూ బరిలోకి దింపాయి. గెలుపోటముల మాట ఎలా ఉన్నా, ఎవరు ఎంత సంపన్నులనే అంశం బిహార్ ఓటర్లలో ఆసక్తి రేపుతోంది.2,616 మంది పోటీనామినేషన్ల సమయంలో అభ్యర్థులు స్వయంగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించి ప్రజలకు అందుబాటులోకి ఉంచింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,616 మంది అభ్యర్థులలో 2,600 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. మొత్తం అభ్యర్థులలో 431 మంది జాతీయ పార్టీలకు, 351 మంది రాష్ట్ర పార్టీలకు చెందినవారు. 908 మంది రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 926 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.సింగ్ ఈజ్ కింగ్!బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో వందల కోట్లకు పైబడిన సంపద కలిసిన వారు పలువురు ఉన్నట్టు ఏడీఆర్ వెల్లడించింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన రణ్ కౌశల్ ప్రతాప్ సింగ్ (Ran Kaushal Pratap Singh) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా ఆయన నిలిచారు. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ టికెట్‌పై లౌరియా నుంచి పోటీ చేస్తున్న సింగ్.. తన మొత్తం ఆస్తులు రూ.368 కోట్లని ప్రకటించారు. వీటిలో రూ.27 కోట్ల చరాస్తులు, రూ.341 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.రూ.250 కోట్ల సంపద కలిసిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ నేత నితీష్ కుమార్ (Nitish Kumar) రెండో సంపన్న అభ్యర్థి. గయా జిల్లాలోని గురువా నుంచి ఆయన పోటీలో నిలిచారు. ముంగేర్ జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ రూ.171 కోట్ల ఆస్తులతో మూడవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులలో రూ.1.34 కోట్ల చరాస్తులు, రూ.169 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.స్వతంత్రుల్లో గుప్తా టాప్స్వతంత్ర అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా రాజ్ కిషోర్ గుప్తా (Raj Kishor Gupta) నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తనకు రూ.1.48 కోట్ల చరాస్తులు, రూ.136 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు చూపారు. సివాన్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్న గుప్తా.. రూ.137 కోట్లతో సంపన్న అభ్యర్థుల్లో నాల్గవ స్థానంలో ఉన్నారు.పట్నా జిల్లాలోని మోకామా నుంచి పోటీ చేస్తున్న జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ రూ.100 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. వీటిలో రూ.39.7 కోట్ల చరాస్తులు, రూ.60.8 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. సంపన్న అభ్యర్థుల్లో ఆయన ఐదవ స్థానంలో నిలిచారు.షేక్‌పురాలోని బార్బిఘా నుంచి పోటీ చేస్తున్న జేడీ(యు) అభ్యర్థి డాక్టర్ కుమార్ పుష్పంజయ్ రూ.94 కోట్లు, ముంగేర్‌లోని తారాపూర్ ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్ రూ.83 కోట్లు, పాట్నా జిల్లాలోని మానేర్ జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి సందీప్ కుమార్ సింగ్ అలియాస్ గోపాల్ సందీప్ సింగ్ రూ.80 కోట్లు, గయా జిల్లాలోని బెలగంజ్ జేడీ(యు) అభ్యర్థి మనోర్మ దేవి రూ. 75 కోట్లు, పశ్చిమ చంపారన్‌లోని నర్కటియాగంజ్ ఆర్జేడీ అభ్యర్థి దీపక్ యాదవ్ రూ. 70 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు.చదవండి: బిహార్ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడిబిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) జరుగుతోంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 11న జరుగుతుంది. ఫలితాలు 14న వెలువడతాయి. -
బిహార్ ఎన్నికలు.. డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి
బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లఖిసరాయ్‌లో బీజేపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఆయన ఖోరియారి గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో విజయ్ కుమార్ సిన్హా కారును చుట్టుముట్టిన ఆర్జేడీ మద్దతు దారులు కాన్వాయ్‌పై చెప్పులు కూడా విసిరారు. ఆర్జేడీ మద్దతుదారులు తనపై దాడి చేశారంటూ విజయ్ సిన్హా మండిపడ్డారు. గూండాలు నన్ను గ్రామానికి వెళ్లనివ్వడం లేదు. నా పోలింగ్ ఏజెంట్‌ను గ్రామంలోకి అనుమతించలేదు. ఓటు వేయనివ్వలేదు. మా పోలింగ్ ఏజెంట్‌ను తరిమికొట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. అధికార ఎన్డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యం మొదటి దశలో తేలనుంది. 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.ఇవాళ ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పోటీచేస్తున్న నియోజకవ ర్గాల్లోనూ గురువారం తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది.#WATCH | #BiharElection2025 | RJD supporters surround Deputy CM and BJP candidate from Lakhisarai constituency, Vijay Kumar Sinha's car, hurl slippers and chant "Murdabad", forbidding him from going ahead. Police personnel present here. Visuals from Lakhisarai. pic.twitter.com/qthw0QWL7G— ANI (@ANI) November 6, 2025 -
భవితను నాశనం చేశారు: ప్రధాని మోదీ
పట్నా: ‘బిహార్‌లో 15 ఏళ్ల ఆటవిక పాలనలో.. ఎన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు?.. జీరో. కోసి నదిపై ఎన్ని వంతెనలు నిర్మించారు?.. జీరో. ఎన్ని పర్యాటక సర్క్యూట్లు అభివృద్ధి చేశారు?.. జీరో. యువతకు ఎన్ని క్రీడా సముదాయాలు నిర్మించారు?.. జీరో. ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయి?.. జీరో.. ఐఐటీ, ఐఐఎం కూడా జీరో’.. ఒక తరం భవిష్యత్తును ఆర్జేడీ నేతలు బుగ్గిపాలు చేశారు’.. అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం అరారియా(బీహార్)లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు.ఇప్పుడు బిహార్‌లోని అన్నివైపుల నుంచి ఒకే ఒక మాట వినిపిస్తున్నదని అది ‘మరోమారు ఎన్డీఏ సర్కార్’ అని అన్నారు. మొదటి దశ పోలింగ్‌లో బీహార్ ఓటర్లు అభివృద్ధి కోసం ఓటు వేస్తారని, చొరబాటుదారులను గుర్తించి, వెనుకను పంపుతారన్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి.. చొరబాటుదారులను అక్రమంగా భారత పౌరులుగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ప్రధాని ఆరోపించారు. ఆర్జేడీ జంగిల్ రాజ్.. బిహార్‌పై దాడి చేసిందని, జంగిల్ రాజ్ అంటే. పిస్టల్, క్రూరత్వం, అవినీతి దుర్మార్గపు పాలన అని అన్నారు.తొలి దశ ఓటింగ్ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు మూలల నుండి సోషల్ మీడియాలో పలు ఫొటోలు వస్తున్నాయని అన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు కనిపిస్తున్నాయని, మహిళలు ఓటు వేసేందుకుపెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు. బిహార్ యువతలో ఉత్సాహంతో ఉందన్నారు. ఓటర్లంతా ఓటు వేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: పోలింగ్ వేళ ‘బుర్కా’ వివాదం -
పోలింగ్ వేళ ‘బుర్కా’ వివాదం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ నేడు(గురువారం) ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. అయితే మోసపూరిత ఓటింగ్‌ను నిరోధించేందుకు బుర్ఖా ధరించిన ఓటర్ల విషయంలో కఠినమైన తనిఖీలు చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.గిరిరాజ్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో షరియా చట్టం అమలులో లేదని, ఇది పాకిస్తాన్.. బంగ్లాదేశ్ కాదని.. భారత్ అని అన్నారు. దేశంలో లౌకికవాదం ఉందని, దేశంలో గుర్తింపు తనిఖీలు తప్పనిసరిగా జరగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆధార్ నమోదు, విమానాశ్రయాల్లో తనిఖీల విషయంలో ఇప్పటికే ఈ తరహా ధృవీకరణ జరిగిందని అన్నారు.తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమిషన్ నియమాలు వర్తిస్తాయని అన్నారు. బుర్ఖా ధరించిన మహిళలు ఆధార్ కార్డు తీసుకునేందుకు వెళ్లినప్పుడు, విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, రిజర్వేషన్ పొందేందుకు వెళ్లినప్పుడు కూడా ఎందుకు ముసుగు తీయరని ప్రశ్నించారు. ఇది పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ కాదని.. ఇది ఇస్లామిక్ దేశమా లేక లౌకిక దేశమా? అని ప్రశ్నించారు. ఇది లౌకిక దేశమని, సందేహమొస్తే మేము వారి ముఖాన్ని చూపించేలా చేస్తామన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యకు కేంద్ర మంత్రి, ల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ, ఆయన అనవసరంగా హిందూ-ముస్లింల మధ్య వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)
-
బిహార్ తొలిదశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు తొలి దశ పోలింగ్ అప్డేట్స్.. -
లవ్–కుశ్ కోటకు బీటలు!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో కుల సమీకరణాలే తిరిగి ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. అజెండాలు, హామీల కంటే సామాజిక సమీకరణాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అధికార, విపక్ష కూటములు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు రాజకీయ బ్రహ్మాస్త్రంగా, అజేయశక్తిగా నిలిచిన ‘లవ్–కుశ్‘ సమీకరణం ఇప్పుడు నెమ్మదిగా నీరుగారిపోతోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒకప్పుడు నితీశ్ ఏకఛత్రాధిపత్యంలో ఉన్న ఈ బలమైన ఓటు బ్యాంకు నేడు బీజేపీ, ఆర్జేడీ, ఇతర పక్షాల ఎత్తుగడలతో ముక్కలవుతోంది. ఈ వర్గాల ఓట్ల చీలికే ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అసలు ఏమిటీ ‘లవ్–కుశ్’? ‘లవ్–కుశ్‘ అనేది బిహార్‌లోని రెండు ప్రధాన ఓబీసీ కులాల రాజకీయ కూటమికి పెట్టిన పేరు. ‘లవ్’ కుర్మి కులానికి ప్రతీక. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ కులానికి చెందిన నేత. ‘కుశ’ అనేది కుష్వాహా కులానికి గుర్తు. వీరిని కోయిరీ అని స్థానికంగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడి కుమారులు లవకుశులు. తాము వీరి వంశీయులమని ఈ లవ్, కుష్వాహా కులాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఈ పౌరాణిక బంధాన్నే 1990లలో నేతలు తమ రాజకీయ సమీకరణంగా విజయవంతంగా మలిచారు. 2023 కుల గణన నివేదిక ప్రకారం బిహార్ జనాభాలో కుర్మి కులస్తులు 2.87 శాతంకాగా కుష్వాహా వర్గీయులు 4.21 శాతం దాకా ఉన్నారు. మొత్తం కలిపితే వీరి జనాభా 7.08 శాతం. సంక్లిష్టమైన బిహార్ రాజకీయంలో ఈ 7 శాతం ఓటు బ్యాంక్ కూడా ఏ కూటమికైనా గెలుపు, ఓటములను నిర్దేశించగల ‘స్వింగ్‘ శక్తిగా ఎదిగింది. లాలూ ‘ముస్లిం–యాదవ్’ ఫార్ములాకి విరుగుడు1990లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్య మంత్రి అయ్యాక ఆయన ముస్లిం–యాదవ్ సమీకరణాన్ని పటిష్టం చేసుకున్నారు. రాష్ట్ర జనాభాలో 14.26 శాతమున్న యాదవులు, 17.7 శాతమున్న ముస్లిం వర్గాలను కలిపితే అది దాదాపు 32 శాతం బలమైన ఓటు బ్యాంకుగా మారింది. లాలూ పాలనలో యాదవులకే అగ్రతాంబూలం దక్కుతోందని, ఇతర వెనుకబడిన కులాలైన కుర్మి, కుష్వాహాలు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారనే అసంతృప్తి ఒక్కసారిగా ఎక్కువైంది. ఈ పరిణామాలను పసిగట్టి ఆనాడు జార్జ్ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీలో ఉన్న నితీశ్ కుమార్ వెనువెంటనే లాలూకు వ్యతిరేకంగా యాదవేతర ఓబీసీలను ఏకం చేయడం మొదలెట్టారు. ఇందులో భాగంగానే 1994లో పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీశ్ కుమార్ భారీ ‘కుర్మి చేతనా ర్యాలీ’ నిర్వహించారు. ఇది లాలూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కుర్మిల రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ర్యాలీతో కుర్మి (లవ్), కుష్వాహా (కు‹శ్) కులాల ఐక్యతకు గట్టి పునాది పడింది. నితీశ్ ‘అజేయ’ ప్రస్థానానికి బీటలునితీశ్ కుమార్ దాదాపు రెండు దశా బ్దాలుగా బిహార్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా కొనసాగడానికి ఈ 7 శాతం ‘లవ్–కుశ్’ ఓటు బ్యాంక్ సైతొ ఒక ప్రధాన కారణం. ఈ ‘లవ్–కుశ్’ పునాది పైనే నితీశ్ కుమార్ 36 శాతమున్న అతి వెనుకబడిన తరగతు (ఈబీసీ)లను, మహాదళితులను ఏకం చేసి ఒక బలమైన సామాజిక కూటమిని నిర్మించారు. బీజేపీ వంటి మిత్రపక్షాల మద్దతు దీనికి అదనపు బలంగా మారింది. నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నా, మహాగఠ్‌బంధన్‌లో ఉన్నా ఆయనతో ఈ రెండు కూటములు బేరసారాలు జరపడానికి ఈ ‘లవ్–కుశ్’‘ ఓట్లే కారణం. ఈ ఓట్లు తన వ్యక్తిగత చరి ష్మాకే బదిలీ అవుతాయి తప్ప కూటమిలోని బీజేపీ వంటి ఏ ఇతర పార్టీకీ బదిలీకావని ఆయన పలుమార్లు నిరూపించగలిగారు. గత దశాబ్ద కాలంగా ఈ పటిష్టమైన ఓటు బ్యాంకును చీల్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నా యి. ‘లవ్’ ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం అంటే దాదాపు 2.87 శాతం మంది ఓటర్లు ఇప్పటికీ నితీశ్ వైపే ఉన్నారు. కానీ సంఖ్యాపరంగా పెద్దదైన కుష్వాహా(4.21 శాతం) ఓటు బ్యాంకు కోసం ఇప్పుడు నలుగురు ప్రధాన నేతలు పోటీ పడుతు న్నారు. ‘లవ్–కుశ్’ ఓట్లపై నితీశ్ ఆధారప డటాన్ని తగ్గించడానికి బీజేపీ సొంతంగా పావులు కదిపింది. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్ చౌదరిని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, డెప్యూటీ సీఎంగా నియమించింది. ఇది ‘కుష్‘ ఓటు బ్యాంకును నితీశ్ నుంచి వేరు చేసి, నేరుగా బీజేపీ వైపు తిప్పుకోవాలనే స్పష్టమైన రాజకీయ వ్యూహంగా మారింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా తన తండ్రి ‘ముస్లిం–యాదవ్’ సమీకరణం దాటి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని నిర్ణయించుకున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జే డీ అనేక మంది కుష్వాహా, కుర్మి అభ్య ర్థులకు టికెట్లు ఇచ్చింది. నితీశ్‌పై అసంతప్తిగా ఉన్న ‘లవ్–కుశ్’ ఓట్లను ఆకర్షించి, తన ‘ముస్లిం–యాదవ్ ’కూటమికి జోడించుకోవాలని తేజస్వీ పెద్ద ప్రణాళిక వేశారు. ఆర్ఎల్ఎం నేత ఉపేంద్ర కుష్వాహా సైతం నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. నితీశ్‌తో విభేదించి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) స్థాపించడం, 2014లో ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి కావడం, తిరిగి 2021లో పార్టీని జేడీ(యూ)లో విలీనం చేయడం, మళ్లీ 2023లో రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) స్థాపించి ఎన్డీఏలో చేరడం.. ఇలా ఆయన ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కారాకాట్ నుంచి ఓడిపోవడం, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నామమాత్రపు సీట్లు కేటాయించడంతో ఆయన బలం తగ్గింది. కానీ ఆయనకు ఇప్పటికీ ‘కు‹శ్’ ఓట్లను కొంతమేర చీల్చగల శక్తియుక్తులు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ పరిణామాలు నితీశ్ బలాలను ఏ మేరకు దెబ్బకొడతాయో 14న ఎన్నికల ఫలితాలతో తేలిపోనుంది. -
నేడే బిహార్ తొలి దశ పోలింగ్
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో హోరాహోరీగా ప్రచారం జరగ్గా నేడు పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలుకానుంది. అధికార ఎన్డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. గురువారం మొత్తంగా 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణప్రాంతాల్లో ఉండటం గమనార్హం. గురువారం ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పోటీచేస్తున్న నియో జకవ ర్గాల్లోనూ గురువారం తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. రాఘోపూర్‌లో హ్యాట్రిక్ కోసం తేజస్వీ కన్నేయగా, 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్ కుమార్ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా డుతున్నా రు. రాఘోపూర్‌లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కంకణం కట్టుకున్నారు. పొరుగు నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకు న్నారు. జనసురాజ్ పార్టీ కార్యకర్త హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ పోటీచేస్తున్న మొఖానాలోనూ గురువారమే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆర్జేడీ తరఫున వీణాదేవి పోటీచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. 121 నియోజకవర్గాల్లో పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ షురూ అయ్యింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల ముఖ్యాంశాలుమొదటి దశ పోలింగ్ తేదీ: నవంబర్ 6, 2025ఓట్ల లెక్కింపు: నవంబర్ 14, 2025మొత్తం నియోజకవర్గాలు: 243మొదటి దశలో ఓటింగ్ జరిగే నియోజకవర్గాలు: 121జిల్లాల సంఖ్య: 18మొత్తం అభ్యర్థులు: 1,314ఓటు హక్కున్న ఓటర్లు : 7.4 కోట్ల మందిమొదటి సారి ఓటు వేయనున్న వారు: 14 లక్షల మంది ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్‌రాజ్‌ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ బిహార్ ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్ కుమార్ తన ‘ఈబీసీ, మహాదళిత్’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.అందరి కళ్లూ చిరాగ్పైనేఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్ ఫ్యాక్టర్’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ–రామ్ విలాస్).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ–రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. ప్రభావిత అంశాలు ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది. 15 ఏళ్ల నితీశ్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా యత్నించింది. ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్‌పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్‌తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. నితీశ్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్‌రాజ్’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు. నితీశ్ కుమార్ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి. -
కుల రాజకీయాలే.. పొలిటికల్ పార్టీలకు ఇంధనం..!
కుల వ్యవస్థ..! ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ట్యాగ్ భారత్‌కు మాత్రమే సొంతం..! ఇంకా చెప్పాలంటే.. భారత్‌లో ఓ వ్యక్తి పుట్టగానే.. అతనికి కులం అనే ట్యాగ్‌ని తగిలించేస్తారు..! కన్ను తెరిస్తే కులం.. కన్ను మూస్తే కులం.. జీవితమంతా కులం కులం కులం..! ఆ కులమే ఇప్పుడు రాజకీయాలకు మూలాధారమైంది. ముఖ్యంగా బిహార్ లాంటి కడు పేద రాష్ట్రాల్లో రాజకీయాలను సైతం కులం మాత్రమే శాసిస్తోంది. బిహార్ వెనకబాటుకు కారణం నిరుద్యోగితో.. పరిశ్రమల లేమి కారణం కాదు..! కేవలం కుల రాజకీయాలే ఆ రాష్ట్ర పరిస్థితికి కారణమనేది నిర్వివాదాంశం..! ప్రజలు కులాల వారీగా చీలిపోవడమే ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కారణం..! ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అని ఓ సినీ కవి అన్నాడు.. బిహార్‌లో మాత్రం ‘కులమేరా అన్నిటికీ మూలం’ అనే పరిస్థితులు ఉన్నాయి. కులగణన పేరుతో సర్వే నిర్వహించి చూపించిన తొట్టతొలి రాష్ట్రం కూడా బిహారే..! ఇక్కడ ప్రజలు కులం పేరుతో విడిపోతారు. రాజకీయనాయకులు కులం అనే అంశాన్ని ఓటు బ్యాంకుగా మలచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిహార్‌లో కులం అనేది ఒక పదం కాదు.. ప్రజల మధ్య ఒక గోడ. ఈ కులం ట్యాగ్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతే.. మరికొందరికి అవకాశాలను మూసివేస్తోంది. భారతదేశంలోనే కుల రాజకీయాలు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం బిహార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.2023లో బిహార్ కులగణన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు అయితే.. వీరిలో అత్యంత వెనుకబడిన వర్గాలు(EBC) 36%, ఇతర వెనుకబడిన వర్గాలు(OBC) 27%, ఎస్సీ ఎస్టీలు 19%, ముస్లింలు 17%, అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు, రాజ్‌పూత్‌లు, భూమిహార్లు, బనియాలు 15% ఉన్నట్లు తేలింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. బిహార్‌లో ప్రతీ 10 మంది ఓటర్లలో 8 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారే..! ఇప్పుడు ఊహించండి.. కులం ఓ బలమైన గోడగా ఉన్న బిహార్‌లో ఎన్నికలు ఎలా ఉంటాయో..? అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా.. నాయకుడు అయినా.. కులం అనే పజిల్ని అర్థం చేసుకోకపోతే.. విజయం కాదు కదా.. విజయపుటంచులను చేరడం కూడా అసాధ్యమే..! అందుకే.. బిహార్‌లో ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగం, ప్రతి కూటమి, అభ్యర్థులకు ఇచ్చే ప్రతి టికెట్ కుల సమీకరణల చుట్టే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!కలసికట్టుగా ఉన్నారా??బిహార్‌లో ఓబీసీలంతా కలసి కట్టుగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇదమిత్థంగా కూడా అవుననే సమాధానం చెప్పలేం. ఈబీసీల్లోనే 125 వేర్వేరు సమూహాలున్నాయి. దళితులు పాస్వాన్, ముసహార్, చమార్లుగా చీలిపోయారు. ఓబీసీలు కూడా యాదవ, కుర్మీ, కోయిరీ, ఈబీసీలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు. బిహార్‌లో కులాలంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు..! రాజకీయ ఆయుధం మాత్రమే!. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? ఎవరు గెలవాలి? ఎవరిని ఓడించాలి? అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నిక.. ప్రతి కూటమి.. ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ‘ఈ ప్రభుత్వం ఏం చేసింది?’ అనే ప్రశ్న ఉత్పన్నమైతే.. బిహార్‌లో మాత్రం.. ‘ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందినది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. భారత్‌లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నా.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందువు అయినా.. బిహార్‌లో మాత్రం కులమే అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీగా ఉంది.90వ దశకం నుంచి..బిహార్ కుల వ్యవస్థను.. కులాధిపత్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. 90వ దశకానికి, అంటే.. మండల్ కమిషన్ యుగానికి వెళ్లాల్సిందే..! అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డీఎన్ఏ మారిపోయినట్లయింది. వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించగానే.. ఓ విప్లవానికి కేంద్ర బిందువుగా బిహార్ మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ అణగారిన వర్గాల స్వరంగా ఎదిగారు. ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ‘ఎం-వై సమీకరణం’.. అంటే ముస్లింలు, యాదవులతో నిర్మించారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ వచ్చారు. ఆయన కుర్మీలు, ఇతర అత్యంత వెనకబడిన వర్గాల తరఫున మాట్లాడారు. 2023లో కులగణన చేయించింది కూడా ఆయన సర్కారే. కేంద్రం కులగణనను వ్యతిరేకిస్తే.. ఆయన స్వతంత్రంగా సర్వే నిర్వహించారు. దాంతో.. బిహార్‌లో ‘కుల గుర్తింపుల యుద్ధం’ మరింత ముదిరింది.కులాల వారీగా పార్టీలుబిహార్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ఉన్నాయి. కులగణనతో వచ్చిన లెక్కల ప్రకారం బిహార్ ఎన్నికల్లో ఎవరూ.. ఏ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కుల సమీకరణాలతో ముడిపడి ఉంటుంది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యాదవులు, ముస్లిం ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్తోంది. జనతాదళ్ (యూ) కుర్మీలు, ఈబీసీలపై ఆధారపడుతోంది. బీజేపీ అయితే.. అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంతాల్లోని హిందువులపై ఆధారపడి ఉంది. అంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. బిహార్‌లో మాత్రం రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను కాకుండా.. కులాలను నమ్ముకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల విశ్లేషకులు కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి కులాన్ని బట్టి గెలుపోటములను విశ్లేషిస్తారు. అంటే.. ఓటర్లు కూడా కులం ఆధారంగానే ఓట్లు వేస్తారే తప్ప.. పార్టీల సిద్ధాంతాలను బట్టి కాదని స్పష్టమవుతోంది. అంటే.. గ్రామంలో పరిస్థితులు.. బడుల్లో టీచర్ల నియామకాలు, భూవివాదాల పరిష్కారం వంటి అంశాలు కాకుండా.. తమ కులస్థుడు ఎమ్మెల్యే అయితే.. తమ మాట వింటాడనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. బిహార్‌లో రాజకీయ నాయకులు, పార్టీలు నియోజకవర్గాల వారీగా కులాల మ్యాప్‌ను అధ్యయనం చేయడం పరిపాటిగా మారింది. ఏ కులం వారు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు? ఏ అభ్యర్థి అయితే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలడు? అనే లెక్కలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటూ.. కూటములు కట్టడం ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించే నితీశ్‌కుమార్ తరచూ కూటములను మార్చడం వెనక కుల సమీకరణాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన అయితే ఆర్జేడీ.. లేదే బీజేపీ అన్నట్లుగా మిత్రపక్షాలను మార్చేస్తుంటారు. అంటే.. బిహార్‌లో సిద్ధాంతాలను కాకుండా.. కుల సమీకరణాలను నమ్ముకోవాలనే విషయాన్ని ఆయన చక్కగా ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కుల గణాంకాల చుట్టే తిరుగుతుండడం గమనార్హం..! అంటే.. అభ్యర్థి ప్రజాసేవకుడా? ప్రజలకు మంచి సేవ చేస్తూ.. పాలనను అందిస్తాడా? అనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం ఏది అనేదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది.ఆ నియోజకవర్గాల్లో మార్పు..!కుల రాజకీయాల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్నా, గయా, ముజఫర్‌పూర్ వంటి పట్టణాల్లో కొత్త ఓటర్లు తమ పంథాను మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెరగడం, యువ ఓటర్లు బిహార్ వెలుపల చదువుకున్న వారు కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో 40% యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెల్లడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఢిల్లీలో, తమిళనాడులో రోజుకూలీలుగా.. ముంబైలో రిక్షావాలాలా.. సూరత్‌లోని కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేస్తున్న యువత.. మార్పును కోరుకుంటోందని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. బిహార్ వెలుపల ఉన్నంత కాలం వారు కుల ఛట్రం నుంచి బయట ఉన్నా.. తిరిగి రాష్ట్రానికి వచ్చేసరికి వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. కులం అనేది బిహార్ వెలుపల అదృశ్యమైనా.. రాష్ట్రంలోకి వచ్చేసరికి తిరిగి పుంజుకుంటుందన్నట్లే..! అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ వర్గం.. ఇప్పుడు కులాలుగా విడిపోతుందా? సిద్ధాంతాలకు లోబడి ఓట్లు వేస్తుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.మార్పునకు నాంది పలుకుతున్న మహిళలు.. బిహార్ మహిళలు మాత్రం కులం విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా పరిణామాలు, గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. నితీశ్ కుమార్ సర్కారు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. మద్య నిషేధాన్ని అమలు చేసింది. దీని ఫలితంగా మహిళలు మాత్రం స్వతంత్రంగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ సారి మార్పు కనిపించే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ 60 శాతాన్ని దాటింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు కులం కోసం కాకుండా.. భద్రత, విద్య, సమాజంలో గౌరవం కల్పించే అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బిహార్ ఓటర్లు కులాల వలయంలో చిక్కుకుని, ఓటుహక్కును వినియోగించుకుంటారా? అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? విద్యావంతులు, యువత, మహిళలు, వలస కార్మికులు మార్పును తీసుకొస్తారా? ఈవీఎం బటన్ నొక్కడానికి ముందు ఒక ఆలోచన.. నొక్కేప్పుడు కులం ఆలోచనతో మళ్లీ వెనక్కి వెళ్తారా? కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అని బిహార్‌కు ఉన్న అపవాదును తొలగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే..! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి. - హెచ్.కమలాపతిరావు -
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమిత్ షా హెచ్చరిక
దర్భంగా: భారత్‌పై మరోసారి దాడికి దిగే సాహసం చేస్తే తూటాలకు ఫిరంగులతో సమాధానం చెప్తామని పాకిస్తాన్ ఉగ్రవాదులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పహల్గాంలో మన పౌరులపై దాడి చేసి, ఆడబిడ్డల నుదుటిపై సిందూరాన్ని తుడిచేసిన ముష్కరులపై 20 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు.అమిత్ షా మంగళవారం బీహార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఇక్కడ తయారయ్యే ఫిరంగులను పాక్ ముష్కర మూకలపై ఎక్కుపెట్టనున్నట్లు స్పష్టంచేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ భద్రతను నిర్లక్ష్యం చేశామని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ఓటు వేస్తే బీహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్ వస్తుందని ప్రజలను అమిత్ షా అప్రమత్తం చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ నేరగాళ్లను నీరాజనాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ‘షాబుద్దీన్ అమర్ రహే’అంటున్నారని ఆక్షేపించారు. జంగిల్‌రాజ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్ష నాయకులు ఆరాటపడుతున్నారని, ప్రజలు అందుకు అంగీకరించబోరని తేలి్చచెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంపైనున్న కమలం గుర్తుపై మీటను నొక్కితే సుపరిపాలన వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రను అమిత్ షా తప్పుపట్టారు. చొరబాటుదారులను కాపాడే ప్రయత్నాలు మానుకోవాలని రాహుల్‌కు హితవు పలికారు. -
రేపే బిహార్ తొలి పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ ప్రచార ఘట్టానికి తెరపడింది. తొలి దశలో భాగంగా గురువారం 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. తొలి దశ ఎన్నికలు జరిగే స్థానాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. చివరిరోజు ఇటు ఎన్డీయే, అటు మహాగఠ్‌బంధన్ అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ ముఖ్య నేతలు ఎన్డీయే తరఫున... ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మహా కూటమి తరఫున చివరి అ్రస్తాలను సంధించారు.తేజస్వీ యాదవ్ ‘10 లక్షల ఉద్యోగాల’ హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, నితీశ్ కుమార్ తనదైన శైలిలో జంగిల్‌రాజ్‌ను గుర్తుచేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. తలరాతను నిర్ణయించనున్న తొలి దశ బిహార్ ఎన్నికల్లో పారీ్టల భవితవ్యాన్ని తొలి దశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 121 స్థానాల్లోనే ఆర్జేడీ, జేడీ(యూ) బలాబలాలు పరీక్షకు నిలవనున్నాయి. ఆర్జేడీ తన ‘ముస్లిం–యాదవ్’ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో లేక నితీశ్ కుమార్ తన ‘ఈబీసీ, మహాదళిత్’ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి.అందరి కళ్లూ చిరాగ్పైనేఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం ‘చిరాగ్ ఫ్యాక్టర్’. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీకి జై కొడుతూనే సీఎం నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్(ఎల్జేపీ–రామ్ విలాస్).. ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీ(యూ) పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ–రామ్ విలాస్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ(యూ) ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠ్‌బంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. పోటాపోటీ ఇక్కడే తొలి దశలో నితీశ్ కేబినెట్లోని 8 మంది మంత్రులతో సహా పలువురు ఉద్ధండుల భవితవ్యం తేలనుంది. ⇒ ఇమామ్‌గంజ్: మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ (హిందూస్తానీ అవామ్ మోర్చా) భవితవ్యాన్ని తేల్చనున్న ప్రతిష్టాత్మక స్థానం. ⇒ జముయి: అంతర్జాతీయ షూటర్ శ్రేయసి సింగ్ (బీజేపీ) రాజకీయ అరంగేట్రం చేస్తున్న స్థానం.⇒ గయా టౌన్: బీజేపీ కంచుకోటలో మంత్రి ప్రేమ్ కుమార్ మరోసారి బరిలో ఉన్నారు.⇒ బాంకా: మంత్రి రామ్ నారాయణ్ మండల్ (బీజేపీ), మాజీ మంత్రి జైప్రకాశ్ నారాయణ్ యాదవ్ (ఆర్జేడీ) మధ్య ముఖాముఖి పోరు.ప్రభావిత అంశాలు ⇒ ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కలి్పస్తూ తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించడం కులాలకు అతీతంగా యువతను ఆకర్శిస్తోంది. ⇒ 15 ఏళ్ల నితీశ్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి విపక్ష కూటమి తీవ్రంగా యతి్నంచింది. ⇒ ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీశ్‌పై ఉన్న వ్యతిరేకతను మోదీ ఇమేజ్‌తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. ⇒ నితీశ్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించే ప్రస్తావించారు. రాష్ట్రానికి ‘జంగిల్‌రాజ్’ నుంచి విముక్తి కల్పించానని చెప్పారు. ప్రతి గ్రామానికీ విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించానని గుర్తుచేశారు. ⇒ నితీశ్ కుమార్ ‘అభివృద్ధి’ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రతిపక్షాలు ప్రాధాన్యం ఇచ్చాయి. రాష్ట్రంలోనే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఉంటే బిహార్ బిడ్డలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించాయి. -
రికార్డు స్థాయి విజయం తథ్యం
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఈసారి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. గత 20 ఏళ్లలో ఏన్నడూ లేనట్టి అద్భుతమైన విజయం ఈ ఎన్నికల్లో సాధించబోతున్నామని చెప్పారు. జంగిల్‌రాజ్ మనుషులకు ఘోరమైన పరాభవం తప్పదని పునరుద్ఘాటించారు. ఇద్దరు యువరాజులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల మద్దతు పొందడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన యువరాజు ఛఠ్ పూజలను అవమానించాడని మండిపడ్డారు.ప్రధాని మోదీ మంగళవారం బిహార్ బీజేపీ మహిళా కార్యకర్తలతో నమో యాప్ ద్వారా వర్చువ ల్గా సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం మహిళా కార్యకర్తలు కష్టపడి పని చేసు న్నారని ప్రశంసించారు. బిహార్‌లో ఇటీవల పలు బహిరంగ సభల్లో పాల్గొన్నా నని, మహి ళలు అత్యధికంగా హాజరయ్యారని చెప్పారు. ఒక సభకు మించి మరో సభ జరిగిందన్నారు. ఎన్డీయేకు మహిళల ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.ఎవరూ ఊహించలేని భారీ విజయం సాధించబోతున్నామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలు, దళితులు, మహా దళితులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వారి జీవనం మరింత సులభతరంగా మారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన, చట్టబద్ధమైన పాలన అమల్లో ఉన్నప్పుడే మహిళలు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయని వివరించారు. ఎన్డీయే పాలనలో ఆడబిడ్డల ప్రగతికి పెద్దపీట వేశామన్నారు. బిహార్ మహిళలు నేడు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసల వర్షం కురిపించారు. -
పెద్దపండక్కి రూ. 30 వేలు: తేజస్వి యాదవ్
పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తుండటంతో నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే నేపధ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ పార్టీ ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి రోజున ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2026 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీని కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలు అందిస్తామన్నారు.తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ అమలు చేయబోయే కీలక సంక్షేమ పథకాలను తేజస్వి యాదవ్ వివరించారు. రాష్ట్ర ఉద్యోగుల పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, పోలీసు సిబ్బందితో సహా అన్నిశాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియమించేలా చూస్తామన్నారు. వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే క్వింటాలుకు అదనంగా రూ. 300, గోధుమలకు క్వింటాలుకు రూ. 400 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌లో మార్పును ముందుకు నడిపించడంలో మహిళల మద్దతు కీలకమని పేర్కొన్నారు.ఇటీవల ‘మహాఘట్ బంధన్’ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని వివరాల ప్రకారం వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ ఒకటి నుండి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఐదేళ్ల పాటు మహిళలకు రూ.30 వేల వార్షిక చెల్లింపును కూడా మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. మకర సంక్రాంతి నాడు ఈ మొత్తాన్ని మహిళల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని తేజస్వి పేర్కొన్నారు. బీహార్‌లోని ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామని తేజస్వి యాదవ్ గతంలో హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడ్దాక 20 నెలల్లోపు బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం అంటూ ఉండదని తేజస్వి గతంలో పేర్కొన్నారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించాక ముందుగా క్యాబినెట్ సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై సంతకం చేస్తానని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు -
తేజస్వీకి ప్రతిష్ట.. నితీశ్‌కు పరీక్ష!
పట్నా గద్దె కోసం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రసకందాయంలో పడింది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతుండగా, విపక్షాల ‘మహాగఠ్‌బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ‘ఉద్యోగాల హామీ’తో దూసుకెళ్తున్నారు. ఈ మహా సంగ్రామంలో కీలక నియోజకవర్గాలు రాష్ట్ర భవిష్యత్తును శాసించనున్నాయి. ఇవి కేవలం అభ్యర్థుల గెలు పోటములను మాత్రమే కాదు తేజస్వీ ప్రతిష్టకు, నితీశ్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. ఈ 14 కీలక స్థానాల ను ఓసారి పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో కొందరు అగ్రనే తల భవితవ్యం కొన్ని ప్రత్యేక నియో జకవర్గాలతో ముడిపడి ఉంది. వారి గెలుపు కంటే, వారి ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఇక్కడ కీలకం.1.రాఘోపూర్: ఈ నియోజకవర్గం తేజస్వీ యాదవ్‌కు కంచుకోట. గత పదేళ్లుగా ఈయన ఇక్కడి నుంచే భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దీంతో ఈసారి మెజారిటీ ఎంత? అనే చర్చ సైతం ఇప్పటికే మొదలైంది. ఇక్కడ యాదవ–ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే. అయితే ఈసారి మెజారిటీ తగ్గొచ్చనే ప్రచారం మొదలైంది. 2020 ఎన్నికల్లో తేజస్వీతో తలపడిన బీజేపీ కీలకనేత సతీష్ కుమార్ యాదవ్ ఈసారి సైతం బరిలో దిగి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి తేజస్వీ గెలిచినా మెజారిటీ తగ్గితే అది తేజíస్వీకి ఇబ్బందే. 2. నలంద: ఇది ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా. నలంద ఆయన రాజకీయాలకు కేంద్ర స్థానం కూడా. ఇది ఆయన సామాజిక వర్గమైన కుర్మీ జనాభా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జేడీయూ అభ్యర్థి, మంత్రి శ్రవణ్ కుమార్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనను మహాగఠ్‌బంధన్ అభ్యర్థి, కాంగ్రెస్ నాయకుడు కౌశలేంద్ర కుమార్ ఢీకొంటున్నారు. నితీశ్ నేరుగా పోటీ చేయకపోయినా, ఇక్కడ జేడీయూ గెలుపు అనేది సీఎం నితీశ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. 3. జముయ్: లోక్‌జనశక్తి( ఎల్జేపీ– రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రాథినిధ్యంవహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో ఈ జముయ్ శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ పాశ్వాన్(దళిత) వర్గం ఓట్లు కీలకం. అధికార ఎన్డీఏ కూటమిలో సీఎం నితీశ్ కుమార్‌తో విభేదాల తర్వాత కూటమిలో చిరాగ్‌కు ఏ స్థాయిలో పరపతి ఉందనేది ఈ స్థానంలో గెలుపుతో తేలిపోనుంది. ఎన్డీఏ తరపున అంతర్జాతీయ షూటర్, బీజేపీ నేత శ్రేయసి సింగ్ మరోసారి పోటీలో నిలబడ్డారు. ఆర్జేడీ నుంచి షంషాద్ ఆలం బరిలో ఉన్నారు. నితీశ్‌పై కోపంతో చిరాగ్ సొంత కూటమి అభ్యర్థిని ఓడిస్తారా? లేదంటే మిత్రధర్మం పాటించి తమ ఓట్లు కూడా బీజేపీకి పడేలా చేస్తారా? చూడాలి!4. హసన్పూర్: లాలూ కుటుంబం లేకుండా.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2020లో ఈస్థానం నుంచి గెలిచారు. అయితే ఈసారి హసన్‌పూర్‌లో సమీకరణాలు పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తేజ్‌ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడం, ఆర్జేడీ కొత్తగా మాలా పుష్పంను బరిలోకి దించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ తేజ్ ప్రతాప్‌తో సంబంధంలేకుండా ఆర్జేడీ ఏ మేరకు విజయతీరాలను చేరుకుంటుందనేది ఆసక్తికరం. 5. కిషన్‌గంజ్: రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరు కిషన్‌గంజ్‌లో జరుగుతోంది. ఇక్కడ జనాభాలో దాదాపు 70 శాతం మంది ముస్లింలే. ‘లౌకిక’ ఓటు అనేది ఇక్కడ ప్రధానం. ఇక్కడ పోరు ఎన్డీఏ–మహాగఠ్‌బంధన్ మధ్య కాదు. మహాగఠ్‌బంధన్–ఎంఐఎం మధ్యే పోరులా ఉంది. 2020లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజాహరుల్ హుస్సేన్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ పోటీచేస్తున్నారు. ఎన్డీఏ తరఫున బీజేపీ నేత స్వీటీ సింగ్, ఎంఐఎం తరఫున షామ్స్ ఆగాజ్ పోటీ పడుతున్నారు. ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చితే 2020లో మాదిరిగానే బీజేపీ అనూహ్యంగా లబ్ధి పొందే అవకాశముంది.6.ఆరా: కుల సమీకరణాల యుద్ధభూమి భోజ్‌పూర్ ప్రాంతంలోని ఆరా నియోజకవర్గంలోనూ కుల రాజకీయాలు చాలా ఎక్కువ. ఇక్కడ చాన్నాళ్లుగా ఎన్డీఏ తరఫున రాజ్‌పుత్‌లు, ఆర్జేడీ తరఫున యాదవ్‌లు పోటీపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈబీసీ) ఓటర్లు ఇక్కడ ‘కింగ్‌మేకర్’గా మారనున్నారు.7.అగియావ్ (ఎస్సీ): అగియావ్ (ఎస్సీ) నియోజకవర్గం సీపీఐ–ఎంఎల్(లిబరేషన్) పార్టీకి కంచుకోట. 2020లో ఇక్కడ మనోజ్ మంజిల్ గెలిచారు. దళిత, పేద, భూమిలేని కార్మికులే ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున సీపీఎం నేత శివప్రకాశ్ రంజన్ పోటీ చేస్తుండగా ఎన్డీఏ తరఫున బీజేపీ నాయకుడు మహేష్ పాశ్వాన్ నిలబడ్డారు. 8. ముంగేర్: భూమిహార్ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం ముంగేర్. సాంప్రదాయంగా ఎన్డీఏకు మద్దతిచ్చే ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు తేజస్వీయాదవ్ ‘ఏ టు జెడ్’ నినాదమిచ్చారు. ఇక్కడ ఎన్డీఏ తరఫున బీజేపీ నేత కుమార్ ప్రణయ్ బరిలో నిల్చున్నారు. ఆర్జేడీ తరఫున ముఖేష్ యాదవ్ రంగంలోకి దిగారు. ఎంఐఎం అభ్యర్థి హసన్ సైతం ముందడుగు వేయడంతో ఇక్కడ త్రిముఖపోరు అనివార్యమైంది. 9. పట్నా సాహిబ్: రాజధానిలోని పట్నా సాహిబ్ నియోజకవర్గం బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇక్కడ వైశ్యులుసహా అగ్ర వర్ణాల ఓట్లు అధికం. మోదీ ఛరిష్మా, జాతీయవాదం ఇక్క డ చాలా బలంగా పనిచేస్తాయి. 2020లో బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయినాసరే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను మార్చేసి రత్నేష్ కుష్వాహాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. మహాగఠ్‌బంధన్ కూటమి నుంచి కాంగ్రెస్ నేత శశాంత్ శేఖర్ పోటీ చేస్తున్నారు. 10. గయా టౌన్: మగధ్ రాజధాని గయా టౌన్ కూడా బీజేపీకి మరో బలమైన కేంద్రం. ఇక్కడ వైశ్య, అగ్రవర్ణాల ఓట్లు కీలకం. బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఇక్కడ మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ తరపున మోహన్ శ్రీవాస్తవ బరిలో ఉన్నారు.11. ఝంఝార్పూర్: మిథిలాంచల్‌లోని ఝంఝార్పూర్ నితీశ్ కుమార్ అత్యంత వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకుకు అసలైన పరీక్ష. 2020లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి కూడా ఎన్డీఏ తరఫున బీజేపీ నేత, మంత్రి నితీశ్ మిశ్రా బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ఓడితే, అది నితీశ్ తన ప్రధాన ఓటు బ్యాంక్‌పై పట్టు కోల్పోతున్నారనడానికి సంకేతం.12. భాగల్పూర్: ‘సిల్క్ సిటీ’ భాగల్పూర్లో కాంగ్రెస్ ’స్ట్రైక్ రేట్’ పరీక్షకు నిలుస్తోంది. 2020లో మహాగఠ్‌బంధన్ ఓటమికి కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఒక కారణం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ శర్మ (కాంగ్రెస్)ను, 2020లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ నాయకుడు రోహిత్ పాండే ఢీకొట్టనున్నారు. ఆర్జేడీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కావడం ఇక్కడ కీలకం.13. పూర్ణియా: సీమాంచల్ రాజధాని పూర్ణియాలో మిశ్రమ జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం–యాదవ్ సమీకరణాలు పనిచేస్తాయి. వీరితోపాటు ఈబీసీ ఓటర్ల మద్దతు కూడగడితేనే అభ్యర్థి గెలుపు సాధ్యం. 14. బెట్టియా: పశ్చిమ చంపారన్‌లో ‘చెరకు బెల్ట్’గా పేరొందిన బెట్టియా నియోజకవర్గంలో రైతుల తీర్పు కీలకం కానుంది. చెరకు చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాస్త్రాలు. ఇక్కడ బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవితో కాంగ్రెస్ అభ్యర్థి వాసి అహ్మద్ పోటీ పడుతున్నారు. -
‘కూటమిలో పప్పు, తప్పు, అప్పు’: సీఎం యోగి
దర్భంగా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం బీహార్‌లోని దర్భంగాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, ఆర్జేడీల పనితీరును దుయ్యబట్టారు. వారి పాలనలో రాష్ట్రంలో ఏమి జరిగిందో గుర్తు చేశారు.ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిపై విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టిన సీఎం యోగి.. వారి గత పాలనలో పేదలకు ప్రాథమిక అవసరాలు, సంక్షేమ ప్రయోజనాలు అందకుండా పోయాయని ఆరోపించారు. 2005కి ముందు కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో రాష్ట్రంలోని పేదలు అనారోగ్యానికి గురైతే, వైద్య సదుపాయాలు లేక బాధపడుతూ చనిపోయేవారని అన్నారు. మహాత్మాగాంధీ చెప్పిన మూడు కోతులు కథను గుర్తు చేస్తూ, నేడు ఇండియా కూటమిలో పప్పు, తప్పు, అప్పు అనే మూడు కొత్త కోతులు ఉన్నాయన్నారు. వాటి గుణాలను వివరిస్తూ పప్పు నిజం మాట్లాడలేడని, తప్పు సరైనది చూడలేడని, అప్పు నిజం వినలేడని అన్నారు. ఈ నేతలు ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులను చూడలేరు, వినలేరు, మాట్లాడలేరని, అందుకే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని యోగి ఆరోపించారు.కశ్మీర్‌ను కాంగ్రెస్ వివాదాస్పదం చేసిందని, అయితే ప్రధాని మోదీ దానిని ఉగ్రవాదం నుండి విముక్తి చేశారని సీఎం యోగి పేర్కొన్నారు. హిందువులు కశ్మీర్‌ను విడిచి వెళ్లాల్సి రావడం వెనుక కాంగ్రెస్ తప్పిదముందని, ఇప్పుడు మిథిల, బీహార్ ప్రజలు కూడా అక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు రామునికి వ్యతిరేకం అని, హిందూ విశ్వాసాన్ని అగౌరవపరుస్తున్నాయని సీఎం ఆరోపించారు. రామ రథయాత్రను ఆపేందుకు ఆర్జేడీ ప్రయత్నించిందని, అయోధ్యలో రామ భక్తులపై కాల్పులు జరపాలని సమాజ్ వాదీ పార్టీ ఆదేశించిందని, పవిత్ర నగరాన్ని రక్తంతో ఎర్రగా మార్చారని యోగి ఆరోపించారు. ఆర్జేడీ పాలనలో బీహార్‌లో 70కి పైగా మారణహోమాలు జరిగాయన్నారు. ఈ పార్టీలు ప్రజలను కులాల వారీగా విభజించి, జాతీయ భద్రతను బలహీనపరుస్తున్నాయని ఆరోపించారు. ఇది కూడా చదవండి: యుద్ధంలోకి అమెరికా?.. వణికిపోతున్న ప్రపంచం -
ఉచితంగా బైక్ ఇచ్చిన రాహుల్.. ట్విస్ట్ ఇచ్చిన యువకుడు
ఒక చిన్న టీ కొట్టు యజమాని.. అతనికి సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వంటి పేరున్న నాయకుడు కలవడమే కల లాంటి విషయం. ఇక ఆయన నుంచి ఏకంగా రూ.1.50లక్షలు విలువ చేసే బైక్‌ను ఉచితంగా అందుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది?. అయినా సరే.. తన ఓటు కాంగ్రెస్‌కు వేయను అంటూ ఆ టీ కొట్టు యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే..గత ఆగస్టు 27న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు బీహార్‌లో 14 రోజుల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో ఉన్నప్పుడు ఈ కధ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన పార్టీ సహచరులు 52 కి.మీ దూరంలో ముజఫర్‌పూర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా జాతీయ రహదారి 27లోని మాబ్బి సమీపంలోని షాపూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న మా దుర్గా లైన్ హోటల్లో టీ తాగారు. ఆ తర్వాత, గాంధీ భద్రతా సిబ్బంది, హోటల్ యజమాని సుమన్ సౌరభ్ (21)కి చెందిన బజాజ్ పల్సర్ బైక్‌ను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలీదు కానీ దాంతో సౌరభ్ తన హనం కోసం తీవ్రంగా అన్వేషించాడు. ‘నా లైఫ్‌లైన్ అకస్మాత్తుగా తెగిపోయింది’ అని సౌరభ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బైక్ కోసం సాధ్యమైనంత వరకు ప్రతీ తలుపును తట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయాడు.తాను ఒక కారు అద్దెకు తీసుకుని దాదాపు 25,000 ఖర్చు చేసి తిరిగినట్టు చెప్పారు. స్థానిక కాంగ్రెస్, ఆర్జేడీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సభ్యులను సంప్రదించినా ఎవరి నుంచీ స్పష్టమైన స్పందన రాలేదని గుర్తు చేసుకున్నాడు. చివరకు స్థానిక మాబ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా సూచించారట. అయితే, తాను కొంతమంది స్థానిక సోషల్ మీడియా వ్యక్తులను సంప్రదించడంతో వారు తన కథను హైలైట్ చేశారని అది రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని సౌరభ్ చెప్పాడు.ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 1న గాంధీ యాత్ర ముగింపు వేడుక కోసం పాట్నా హోటల్లో క్యాంపెయిన్ చేస్తున్న ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ నుంచి సౌరభ్‌కి కాల్ వచ్చింది. ‘రాహుల్ గాంధీ నుంచి కొత్త మోటార్ సైకిల్ తాళం తీసుకోవడానికి సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నాకు రావాలని ఆయన కోరాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ ఆహ్వానం మేరకు సౌరభ్, మళ్ళీ కారు అద్దెకు తీసుకుని, తన తండ్రి అనిల్‌తో కలిసి పాట్నా చేరుకున్నారు, అక్కడ, పాట్నా హైకోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాహుల్.. అతడిని కలుసుకుని, రాష్ట్ర రాజధానిలోని బోరింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసి కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ తాళంను ఆయనకు అందజేశారు.‘ఓ కొత్త మోటార్ బైక్‌ను పొందడం అనేది నాకు ఊహించని విషయం. అది కూడా రాహుల్ గాంధీ వంటి పెద్ద రాజకీయ నాయకుడి నుంచి అందుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా ఆందోళనను అర్థం చేసుకున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. బైక్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువే. ఇది నాకు చాలా పెద్ద మొత్తం ’ అని సౌరభ్ అన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వీరిద్దరి సమావేశం వీడియోను షేర్ చేసింది. అయితే, దర్భంగా గ్రామీణ నియోజకవర్గంలో ఓటరుగా తన ప్రాధాన్యత గురించి మీడియా అడిగినప్పుడు ‘నేను ఆర్జేడీ అభ్యర్థికి ఓటు వేస్తాను’ అని సౌరభ్ నిర్మొహమాటంగా చెప్పాడు. తన కుటుంబం ఎల్లప్పుడూ ఆర్జేడీ ఓటర్లేనని సౌరభ్ స్పష్టం చేశాడు. బైక్ విషయంతో దానికి సంబంధం లేదన్నట్టుగా అతను తేల్చేశాడు. నవంబర్ ఆరో తేదీన జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో దర్భాంగా పోలింగ్‌కు వెళుతుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు.-సత్య. -
నా ప్రాణాలకు ప్రమాదముంది: తేజ్ ప్రతాప్
పట్నా: బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెరుగుతున్న నేరాలు, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న ఏర్పాట్లు సరిపోవంటూ ఆయన వ్యక్తిగత భద్రతను పెంచాలని ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్బంగా రాజకీయ శత్రువులు తనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. కేంద్రం, రాష్ట్ర యంత్రాంగం తన వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లను మరింత పెంచాలని, అప్పుడే నిర్భయంగా ప్రచారం చేయగలనన్నారు. అంతకుముందు ఆయన ఎన్నికల అధికారులను కలిశారు. సుపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సొంత పార్టీ అభ్యర్థిపైనే ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ అభ్యర్థి మహాగఠ్‌బంధన్ అభ్యర్థి మద్దతు కోరారని ఆరోపించారు.ఎన్నికల్లో హింసను సహించే ప్రసక్తే లేదు: సీఈసీ కాన్పూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఎన్నికల్లో హింసాత్మక చర్యలను సహించే ప్రసక్తే లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయొచ్చని సూచించారు. ఎన్నికలు పూర్తి శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. జ్ఞానేశ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంఘం ముందు అందరూ సమానమేనని తేలి్చచెప్పారు. ఎలాంటి పక్షపాతం గానీ, వివక్ష గానీ ఉండవని అన్నారు. ప్రజాస్వామ్యం పండుగలో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
లాలూ కొడుక్కి ఓటేస్తే.. హంతకులు, కిడ్నాపర్లే మంత్రులు
ముజఫర్‌పూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూప్రసాద్ యాదవ్ కొడుకు (తేజస్వీ యాదవ్) కోసం ఓట్లు వేస్తే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో హంతకులు, కిడ్నాపర్లు, దోపిడీరులే మంత్రులు అవుతారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ముఫరాబాద్, వైశాలిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయేను గెలిపిస్తే వరదల నియంత్రణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లాలూ కుటుంబంపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ‘ఒకవేళ లాలూ కుమారుడు (తేజస్వీ యాదవ్) బిహార్ ముఖ్యమంత్రి అయితే.. మూడు కొత్త మంత్రిత్వ శాఖలు పుట్టుకొస్తాయి. అవే హత్యలు, కిడ్నాపులు, దోపిడీల శాఖలు. ఎన్డీయేకు ఓటు వేస్తే ఆర్జేడీ జంగిల్ రాజ్ నుంచి బిహార్‌ను కాపాడుతాం. కొత్త ముఖాలతో మళ్లీ జంగిల్‌రాజ్‌ను తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాఘట్బంధన్లో సీట్ల కోసం కొట్టుకుంటుండగా, ఎన్డీయేలోని ఐదు భాగస్వామ్య పార్టీలు బిహార్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయతి్నస్తున్నాయి. ఎన్డీయేలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ), హెచ్ఏఎం, కుశ్వాహా పార్టీలు.. పంచపాండవులు’అని షా అభివర్ణించారు. ‘లాలూ కంపెనీ, రాహుల్ కంపెనీ రూ.12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి’అని ఆరోపించారు. ప్రాచీనకాలంలో లిచ్చవీ సామ్రాజ్యంలో విలసిల్లినట్లుగా వైశాలికి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైశాలిలో 1,243 ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడను నిర్మిస్తామని, దీని ద్వారా వేలమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నాడు ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టారు సోనియా, మన్మోహన్, లాలూ జమానాలో మనదేశంలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు బిర్యానీలు తినిపించారని, మోదీ జమానాలో ఉగ్రవాదులను అంతం చేసి, వారి నివాసాలను కూల్చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. దేశాన్ని ప్రధాని మోదీ సురక్షితంగా, సుసంపన్నంగా మార్చి అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించారని తెలిపారు. ముజఫర్‌పూర్‌లో రూ.20,000 కోట్లతో మెగా ఫుడ్‌పార్కును నెలకొల్పుతున్నామని చెప్పారు. -
పేరు వీఐపీ.. ‘ఇండియా’లో వీవీఐపీ
బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చల తర్వాత ఒక చిన్న పార్టీకి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం యావత్ దేశాన్ని అతని వైపు చూసేలా చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు ‘ఇండియా’ కూటమిలో ఉన్నప్పటికీ 44 ఏళ్ల యువనేతను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి ప్రస్తుతం 15 సీట్లలో మాత్రమే పోటీపడుతున్న పార్టీ నేత ఇప్పుడు ‘ఇండియా’ కూటమి ప్రచార కార్యాక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ. మల్లా (మత్య్సకార) వర్గానికి చెందిన సహానీ ప్రస్తుతం మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ‘మల్లా’లే అత్యంత కీలకం.. బిహార్‌లో మల్లా వర్గం వాళ్లు ప్రధానంగా పడవ నడిపడం, చేపలు పట్టడం వృత్తిలో కొనసాగుతారు. వీరినే నిషాద్, కేవత్ అని కూడా పిలుస్తారు. మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్‌పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామర్హి, షెయోహర్, కిషన్‌గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశి్చమ చంపారన్ జిల్లాల్లో ఈ వర్గం మత్స్యకారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జనాభాలో వీరు ఐదారు శాతం దాకా ఉంటారు. అత్యత వెనుకబడిన కులాల (ఈబీసీ) సమూహంలో వీరు అతి ముఖ్యమైన ఓటు బ్యాంక్‌గా ఎదిగారు. ముజఫర్‌పూర్ వంటి కొన్ని జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ వర్గం నేతలే ఎంపీలుగా గెలుస్తున్నారు. కీలక నేత జై నారాయణ్ ప్రసాద్ సైతం ఈ వర్గంవారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో పేరు, పలుకుబడి సాధించింది ముఖేశ్ సహానీ మాత్రమే. సహానీ తనను తాను ‘మల్లా కుమారుడు’గా ప్రకటించుకొని ఈ వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. సేల్స్‌మ్యాన్ నుంచి నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థి దాకా.. 1981లో దర్భంగా>లో ఒక మత్స్యకారుల కుటుంబంలో ముఖేష్ సహానీ జన్మించారు. ‘సన్ ఆఫ్ మల్లా’ అనే పేరుతో కొత్త క్రేజ్ సంపాదించుకున్నారు. 19 ఏళ్ల వయసులో బిహార్‌ను విడిచిపెట్టి, ముంబైలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేశాడు. అనంతరం బాలీవుడ్‌లోకి సెట్ డిజైనర్‌గా అడుగుపెట్టాడు. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్, సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలకు పనిచేశాడు . ముంబైలో ముఖేష్ సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపాడు. 2013లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బిహార్æ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న, దివంగత కర్పూరీ ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి ప్రేరణ పొందారు. బిహార్ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కోసం పోరాడటానికి సహానీ తిరిగి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. రాజకీయ కారణాలతో బీజేపీని వదిలి 2015లో నిషాద్ వికాస్ సంఘ్‌ను స్థాపించారు. ఇదే తర్వాత 2018లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీగా రూపాంతరం చెందింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేశ్ సమానీ నాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చాడు. కానీ తర్వాత అతనితో విడిపోయాడు. మల్లా సమాజానికి రిజర్వేషన్లు, సౌకర్యాలు ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత మోసం చేశారని ఆరోపణలు గుప్పిస్తూ నితీశ్ నుంచి తెగతెంపులు చేసుకున్నారు. కొంత కాలానికి మళ్లీ ఎన్డీఏలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేసి 4 సీట్లలో గెలిచారు. స్వయంగా సహానీ ఓటమిని చవిచూసినప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఒక ఏడాది తర్వాత ఆయన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు బీజేపీలో చేరారు. తర్వాత ఈయన 2024లో ఇండియా కూటమిలో చేరారు. కూటమిలో తనకు 40 స్థానాలు ఇవ్వాలని కోరినప్పటికీ అది సాధ్యపడకపోవడంతో 15 సీట్లు కేటాయించింది. అయితే ఆయన వర్గానికి ఉన్న ప్రాధాన్యత దష్ట్యా ఆయన్ను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.50–60 నియోజకవర్గాలపై ప్రభావంఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం సహానీ తన దూకుడు పెంచారు. తనను రాజకీయంగా అణచివేసిన నితీశ్ కుమార్, బీజేపీలే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. కేవలం 15 సీట్లలో పోటీ చేస్తున్న ఒక పార్టీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని ‘ఆఫర్’చేయడం వెనుక ‘ఇండియా’ కూటమి పక్కా వ్యూహం కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్జేడీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ (సుమారు 31 శాతం)కు అదనంగా, నితీశ్ కుమార్‌కు వెన్నెముకగా ఉన్న ఈబీసీ (అత్యంత వెనుకబడిన తరగతులు) ఓటు బ్యాంకును చీల్చడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 36% ఉన్న ఈబీసీలలో, 5–6% ఉన్న నిషాద్ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా, ఈబీసీలందరికీ ‘ఇండియా’ కూటమి బలమైన సందేశం పంపింది. సహానీ పోటీ చేస్తున్న 15 స్థానాల కంటే, ఆయన తన సామాజిక వర్గం బలంగా ఉన్న మిథిలాంచల్, సీమాంచల్, చంపారన్ ప్రాంతాల్లోని సుమారు 50–60 నియోజకవర్గాలపై చూపే ప్రభావమే కీలకం. ఆయన తన నిషాద్ ఓట్లను ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు బదిలీ చేయగలిగితే, అది ఎన్డీఏ, ముఖ్యంగా జేడీ(యూ) కోటను బద్దలు కొట్టగలదు. అందుకే ‘వీఐపీ’నేతగా ఉన్న సహానీ, ఇప్పుడు బిహార్ ఎన్నికల రాజకీయాల్లో ‘వీవీఐపీ’గా మారి, మొత్తం ఫలితాన్నే శాసించే కీలక నేతగా ఆవిర్భవించారు. -
బిహార్ రాజకీయాల్లో జార్ఖండ్ జోక్యం
బిహార్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. జార్ఖండ్ రాష్టానికి చెందిన నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప గెలుపు సాధ్యం కాదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. బిహార్, జార్ఖండ్ సరిహద్దుల వెంట రాజ్‌మహల్ కొండలు ఉన్నాయి. ఆ కొండల వెంట ఉండే కతియార్, భాగల్పూర్లోని కహాల్గావ్, బంకా, జముయ్ జిల్లాల్లోని ఎక్కువ భాగం ప్రజలు సంస్కృతి, భాష పరంగా జార్ఖండ్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో రాజకీయంగా తూర్పు బిహార్‌పై జార్ఖండ్ నేతల ప్రభావం ఉంటుందని స్వయంగా స్థానిక ఓటర్లే చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలోని గిరిజనుల ఓట్లే నేతల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. జార్ఖండ్ కేంద్రంగా వ్యూహ రచన చకై, బంకాలోని బెల్హార్, కటారియా కతిహార్‌లోని మణిపురి, భాగల్పూర్లోని కహాల్గావ్ అసెంబ్లీ స్థానాల్లో గిరిజనులు ఎక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గతంలో చకయి స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది. ఈ ప్రాంత వాసులు గత ఏడాది నవంబర్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జముయి జిల్లా ఖైరా బ్లాక్‌లోని గిరిజన ఫ్రైడే వేడుకకు రెండు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నేతలు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైతం ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. జార్ఖండ్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయతి్నస్తోంది. ఓట్లను రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇరు కూటములు కుల సమీకరణలను బేరీజు వేసుకుంటున్నాయి. చకయి చేజిక్కాలంటే.. జముయి జిల్లాలోని చకయి అసెంబ్లీ నియోజకవర్గం జార్ఖండ్‌లోని దేవరి సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ఓటర్లలో 20.8 శాతం మంది యాదవులు, 11.5 శాతం మంది ముస్లింలు, 8.4 శాతం మంది గిరిజనులు ఉన్నారు. వీళ్లే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. జేఎంఎం, జేడీయూ ఎన్నికల చిహ్నాలు దాదాపు ఒకే ఆకృతిలో ఉండటం జేడీయూ బాగా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఓట్లు జేడీయూకు పడుతున్నాయనే ఫిర్యాదులు గతంలోనే వెల్లువెత్తాయి. 2010లో జేఎంఎం టికెట్‌పై సుమిత్ సింగ్ 188 ఓట్ల తేడా గెలిచారు. 2020లో అతనే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యరి్థని 581 ఓట్లతో ఓడించారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. బెల్హార్ బలాబలాలు కీలకమే జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ సమీపంలోని బెల్హార్ సైతం జార్ఖండ్ మూలాలున్న నేతలతో ఇరు కూటములకు సవాల్‌గా మారింది. 2015 ఎన్నికల్లో కటోరియాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కిషోర్ ప్రసాద్ జేఎంఎం టికెట్‌పై పోటీ చేశారు. 2010 సురేంద్ర ప్రసాద్ గుప్తా జేఎంఎం నుంచి పోటీచేసి 11 వేల ఓట్లు సాధించారు. 2005 ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి శైలేంద్ర కుమార్ 3 వేల ఓట్లు సాధించారు. మొదట్నుంచీ ఇక్కడ జార్ఖండ్ మూలాలున్న నేతలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఎన్డీఏ, విపక్షాల ‘ఇండియా’ కూటమి జేఎంఎం నేతల ప్రసన్నం కోసం అనేక వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2020లో ఇక్కడ జేడీయూకు చెందిన మనోజ్ యాదవ్ సమీప అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు రామ్‌దేవ్ యాదవ్‌పై కేవలం రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆర్జేడీ హవా కొనసాగితే అధికార కూటమికి ఇక్కడ పరాభవం తప్పదుకహల్గావ్ కహానీ జార్ఖండ్‌లోని గొడ్డా ప్రాంతానికి అనుకుని ఉన్న కహల్గావ్ సీటు ఇక్కడ కీలకమైంది. ఈ స్థానం నుంచి తన కుమారుడిని అభ్యర్థిగా నిలపాలని జార్ఖండ్ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారు. గొడ్డా ఎమ్మెల్యే సంజయ్ జార్ఖండ్‌లో ఆర్జేడీ కోటా నుంచి మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు దీపికా పాండేసింగ్ సైతం తన సన్నిహితురాలు ప్రవీణ్ కుషా్వహాను ఈ స్థానం నుంచి పోటీకి నిలపాలని ప్రయతి్నంచారు. వీళ్లను ప్రసన్నం చేసుకుని తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గతంలోనే ప్రయతి్నంచారు. కహల్గావ్లోని గోరాదిహ్లో ఇటీవల సమావేశం నిర్వహించారు. అయితే అందరినీ కలుపుకొనిపోవడం ఆయనకు తలనొప్పిగానే మారింది. ఎన్డీఏ ఇక్కడ సమీకరణలపై ముమ్మర కసరత్తు చేస్తోంది. కటోరియాను ఆకట్టుకునేదెలా? కటోరియా స్థానంపై గత 35 సంవత్సరాలుగా జేఎంఎం పార్టీ కన్నేసింది. 2015, 2020లో జేఎంఎం బంకా జిల్లాలోని కటోరియా స్థానం నుంచి అంజలి హన్నాను నిలబెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రెండు సీట్లలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఏ పార్టీ తరఫున పోటీచేసినా సరే ఆ అభ్యరి్థకి జార్ఖండ్ నేతల ఆశీస్సులు కీలకం. ముఖ్యంగా జేఎంఎం మద్దతు అత్యంత ముఖ్యం. అనుకూలమైన అభ్యర్థులను రంగంలోకి దించిన పార్టీలు విజయావకాశాలకు పావులు కదుపుతున్నాయి. ‘మణి’హారం ఎవరిదో? ఎస్టీలకు కేటాయించిన కతిహార్‌లోని మణిహరి సీటును కైవసం చేసుకుంటామని జేఎంఎం ప్రకటించింది. గిరిజన ఓటు తమకు అనుకూలమని చెబుతోంది. గత ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో పార్టీల గెలుపు అంచనాలు తారుమారయ్యాయి. ఈసారి ఈ ఇబ్బంది రాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు జార్ఖండ్ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. చివరకు జేఎంఎం చించిన నేతలనే అన్ని పార్టీలూ బరిలోకి దించాయి. అయితే ఇక్కడ పడకేసిన అభివృద్ధి అనేదే ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే వీలుంది. -
అదానీ, అంబానీ చేతిలో మోదీ కీలుబొమ్మ
బెగూసరాయి/ఖగారియా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే భయపడి పాకిస్తాన్‌తో యుద్ధాన్ని విరమించారని ఎద్దేవా చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బెగూసరాయి, ఖగారియా జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘పెద్ద ఛాతీ ఉండగానే శక్తిమంతులు అయిపోరు. మహాత్మాగాందీని చూడండి. చూడటానికి పీలగా ఉండే ఆయన నాడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్‌వారిని ఎదిరించి పోరాడారు. కానీ, 56 ఇంచుల ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ట్రంప్ ఫోన్ చేయగానే వణికిపోయారు. పాకిస్తాన్‌పై చేపట్టిన సైనిక చర్యను రెండు రోజుల్లోనే విరమించారు. ట్రంప్‌ను చూసి భయపడటమే కాదు.. ఆయన అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా కూడా మారిపోయారు. ట్రంప్ చెప్పగానే మోదీ ఆపరేషన్ సిందూర్‌ను నిలిపేశారు’అని విమర్శించారు.డ్యాన్స్ చేయమన్నా చేస్తారు.. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలన్నీ దేశంలోని పెద్ద వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమేనని రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ ఏది చేసినా ఓట్ల కోసమే చేస్తారు. ఓట్లకోసం వేదికలపై డ్యాన్సులు కూడా చేస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తారు. బీజేపీ మీకు తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తుంది. దానితో మీరు రీల్స్ చూస్తారు.. చేస్తారని అన్నారు.చేపలు పట్టిన రాహుల్‌గాంధీ బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ కొద్దిసేపు చెరువులో చేపలు పట్టారు. బెగూసరాయి జిల్లాలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్దిదూరంలోని చెరువులో జాలర్లు చేపలు పట్టడాన్ని గమనించి వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేశ్ సాహ్నితో కలిసి ఆయన చిన్న పడవలో చెరువులోకి వెళ్లారు. జాలర్లతో మాట్లాడుతూనే.. పడవలో నుంచి ఛాతీవరకు నీళ్లున్న చెరువులోకి ఒక్కసారిగా దూకేశారు. ఇద్దరు నేతలు జాలర్లతో కలిసి కొద్దిసేపు చేపలు పట్టారు. రాహుల్ చేపలు పడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
‘ఆపరేషన్ సిందూర్‌తో కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీకి నిద్ర కరువైంది’
పాట్నా: పహల్గాంకు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైనిక దళాలు పీవోకే,పాకిస్తాన్లో ఉగ్రశిబిరాల్ని కూల్చేస్తుంటే కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీకి నిద్ర కరువైందని ఆరోపించారు. ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో నాలుగు రోజుల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. సభలో మోదీ మాట్లాడుతూ.. ‘ఇటీవలే మనం ‘ఆపరేషన్ సిందూర్' నిర్వహించాం. మనం హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన సైనికుల్ని ప్రతి భారతీయుడు గర్వించాలి. కానీ సైన్యం విజయం సాధించినా, కాంగ్రెస్, ఆర్జేడీ మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి’అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్లో ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ నిద్రపోలేకపోయింది. ఇప్పటికీ పాకిస్తాన్, కాంగ్రెస్ నామ్దార్లు 'ఆపరేషన్ సిందూర్' నుంచి కోలుకోలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీఏ మేనిఫెస్టోను ‘బిహార్ సమగ్ర అభివృద్ధికి హామీ’గా అభివర్ణించారు. మీ ఉత్సాహాన్ని చూస్తే ‘వికసిత బిహార్’ లక్ష్యం పట్ల నా సంకల్పం మరింత బలపడుతోందని వ్యాఖ్యానించారు. భారత్ ఉగ్రవాదాన్ని సహించదుపాక్ ఉగ్రవాదులు పహల్గామ్ టూరిస్టులపై దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ సిందూర్ పాక్,పీవోకేలో ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేసింది. వందల్లో ఉగ్రవాదుల్ని ముట్టుబెట్టింది. ప్రధాని మోదీ పలహల్గాం ఉగ్రదాడి ‘ఉగ్రవాదంలో అత్యంత క్రూరమైన రూపం’గా అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై భారత పోరాటంలో కొత్త అధ్యాయం. ఇకపై భారత్ ఉగ్రవాదాన్ని సహించదు’అని స్పష్టం చేశారు. -
Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మోకామా నియోజకవర్గంలో కలకలం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, బాహుబలి నేతగా పేరొందిన అనంత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జన్ సురాజ్ పార్టీ కార్యకర్త, ఆర్జేడీ మాజీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్‌ను బార్హ్‌లోని అతని నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టును పట్నా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్తికేయ శర్మ, పట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ ఎస్ఎమ్ మీడియా ముందు ధృవీకరించారు. అనంత్ సింగ్‌తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మణికాంత్ ఠాకూర్, రంజీత్ రాహలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.అసలేం జరిగింది?గ్యాంగ్‌స్టర్ నుండి రాజకీయ నేతగా మారిన దులార్ చంద్ యాదవ్, గురువారం నాడు మోకామాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా హత్యకు గురయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న తన మేనల్లుడు ప్రియదర్శి పియూష్ తరపున యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేత హత్యకు గురికావడం మోకామాలో ఉద్రిక్తతకు దారితీసింది.పోస్ట్‌మార్టం నివేదికపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దులార్ చంద్ యాదవ్ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. యాదవ్ మరణానికి కారణం అతని గుండె, ఊపిరితిత్తులకు గట్టి గాయాలు కావడం. ఫలితంగా కార్డియో-శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది. పోస్ట్‌మార్టం నివేదిక, ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నదని ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ తెలిపారు.అనంత్ సింగ్.. రాజకీయ వివాదాలుఅనంత్ సింగ్ బీహార్ రాజకీయాల్లో ‘బాహుబలి’నేతగా పేరొందారు. గతంలో ఆర్జేడీతో సంబంధాలు ఉన్న సింగ్, అనేక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ తరపున మోకామా నుండి గెలిచినప్పటికీ, ఆయుధాల అక్రమ నిల్వ కేసులో దోషిగా తేలడంతో 2022లో ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన భార్య నీలం దేవి మోకామా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ అరెస్టు రాబోయే బీహార్ ఎన్నికల పైన, ముఖ్యంగా మోకామాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది అసాధ్యం’.. ఖర్గేకు అమిత్‌షా కౌంటర్ -
బిహారీనని చెప్పుకోవడం గర్వకారణం
పాట్నా: బిహారీగా ఉండడం, బిహారీనని చెప్పుకోవడం ఇప్పుడు గర్వకారణమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి ఎన్డీయేను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ మేరకు నితీశ్ కుమార్ శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాను అధికారంలో ఉన్నప్పటికీ తన కుటుంబం కోసం ఏమీ చేయలేదని, ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కృషి చేశానని తెలిపారు. బిహార్ ప్రగతే ధ్యేయమని స్పష్టంచేశారు. 2005 నవంబర్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ పాలనలో శాంతి భద్రతలు చాలావరకు మెరుగుపడ్డాయని వివరించారు. చట్టబద్ధ పాలన తీసుకొచ్చామని, ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని ఉద్ఘాటించారు. మహిళలు, హిందువులు, ఉన్నత కులాలు, దళితులు, వెనుకబడిన తరగతులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఆర్జేడీకి అధికారం అప్పగిస్తే అరాచయ పాలన వస్తుందని నితీశ్ కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘వికసిత్ బిహార్’ తమ ధ్యేయమని అన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా మారుస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌లో ఈ నెల 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. -
పారాచూట్ నేతలతో పరేషాన్..!
పారాచూట్ నేతలు ఏమేరకు విజయా న్ని అందిస్తారనేది బిహార్‌లోని అన్ని పార్టీల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు అన్ని పార్టీల నేతలూ దీన్నో సమస్యగానే భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా అకస్మాత్తుగా పార్టీలో చేరిన వారికి(పారాచూట్ నేతలకు), టిక్కెట్ ఇచ్చి బరిలో దించడం చకచకా చేసేశాయి. దీంతో ఆ పార్టీలు జనంలోకి వెళ్లలేక, అప్పటి వరకూ జనంలోనే ఉన్న అసంతృప్తి నేతలకు సమాధానం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితులు విజ యావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతా యని విశ్లేషకులు అంటున్నారు. బిహార్ పీఠం చేజిక్కించుకోవడానికి ప్రతీ నియో జకవర్గమూ కీలకంగా మారింది. అందుకే ప్రతీ సీటుపైనా పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టిక్కెట్ చేజిక్కించుకున్న స్థానాల్లో విజయం సాధించాలంటే ప్రత్యేక వ్యూహ రచన తప్పదని భావిస్తున్నాయి.ఎవరిపై ‘జాలి’?దర్భంగా జిల్లా జాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రిషి మిశ్రా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయన తాత లలిత్ నారాయణ్ మిశ్రా రాజకీయ వారసత్వం టిక్కెట్ విషయంలో మలుపు తప్పింది. దీంతో తాజాగా పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆర్జేడీ అభ్యర్థి జబీర్ అన్సారీ ఇక్కడ ఎమ్మెల్యే. ముస్లిం, యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో అభ్యర్థి మార్పు కారణంగా ఓటు బదలాయింపు ఏమేర ఉంటుందనేది కాంగ్రెస్ వర్గాల్లోనూ సందేహంగానే ఉంది. అలీనగర్‌లో అల్లుకుపోతారా?గాయకుడు మైథిలీ ఠాకూర్‌ను బీజేపీ అలీనగర్ నుంచి పోటీకి దింపింది. ఇది బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఇంతకాలం కేడర్‌లో ఉంది. బ్రాహ్మణ ఓటర్లు ఎన్డీయే పక్షం వైపు ఉన్నారనే విశ్వాసమే దీనికి కారణం. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన మిశ్రీలాల్ యాదవ్ 2020లో కేవలం 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈయన ఎన్డీయే అభ్యర్థి అయినప్పటికీ ఈసారి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్లు చీలిపోతే కష్టమని, కొత్త అభ్యర్థి గెలుపు జాతీయ నాయకుల ప్రచారంపై ఆధారపడి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ ప్రయోగం సరికాదనే వాదన ఆ పార్టీ నుంచి విన్పిస్తోంది.‘ఔరా’అన్పించేదెవరు?ముజఫర్‌పూర్ జిల్లా ఔరై నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రాంతం. బీజేపీ అభ్యర్థి రామ్ సూరత్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే. 47 వేల ఓట్ల మెజారిటీతో గతంలో గెలిచారు. ఇప్పుడీ స్థానాన్ని రమా నిషాద్కు కేటాయించింది పార్టీ. ఇప్పటి వరకూ ఆమె పార్టీలో కూడా లేరు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకూ ఆమె దూరంగానే ఉన్నారు. కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకుంటున్నారు. పార్టీలో చేరడం, టిక్కెట్ ఇవ్వడం అన్నీ నాలుగు రోజుల్లోనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆమె ఎలా ప్రభావితం చేస్తారన్నది ప్రశ్నగానే మిగిలిపోయిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.ఆకట్టుకునేదెలా?పైన పేర్కొన్న చోట్లనే కాదు.. అనేక సీట్లలో ఇదే ప్రయోగం. దీన్ని మార్పు అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. స్థానిక అంశాలపై ప్రస్తుత అభ్యర్థిని ప్రజల అసంతృప్తికి దూరం చేయడమే వ్యూహమంటున్నాయి. టిక్కెట్ ఇవ్వడానికి ముందు జేడీయూలో ఉన్న కౌశల్ యాదవ్, పూర్తిమ యాదవ్‌ను నవాడ, గోవింద్పూర్ స్థానాలకు ఎంపిక చేయడం వ్యూహమేనని ఆర్జేడీ తెలిపింది. యాదవ్ ఓట్లకు గాలం వేయడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. శివహార్ నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఉన్న చేతన్ ఆనంద్‌ను జేడీయూ నైన్బీనగర్ నుంచి బరిలోకి దింపింది. రాజ్‌పుత్‌లను ఆకర్షించడానికి జేడీయూ కోమల్ సింగ్‌ను నామినేట్ చేసింది, ఆయన తల్లి వీణా దేవి ఎల్జేపీ ఎంపీ. బీజేపీకి చెందిన అజయ్ కుష్వాహా జేడీయూ కండువా కప్పుకున్న వెంటనే ఆ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఎల్జేపీ సీటు సాధించడంలో విఫలమైన సరితా పాశ్వాన్ జేడీయూలో చేరారు. దీంతో, ఆమె ఆ పార్టీ అభ్యర్థి అయిపోయారు. ఇలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు అన్ని పార్టీల్లో ఉన్నా విజయావకాశాలపై అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.వనం దుర్గాప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
‘చతుర్ముఖ’ వ్యూహాన్ని ఛేదిస్తేనే పీఠమెక్కేది..!
బిహార్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. మరోమారు పట్నా గద్దెనెక్కేందుకు నితీశ్ ఉవి్వళ్లూరుతుంటే ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఆయనను పడొగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. సమరంలో ఎవరు గట్టెక్కుతారో నిర్ణయించే గెలుపు వ్యూహాలు మాత్రం రాజధాని పాటలీపుత్రలో కాకుండా రాష్ట్రంలోని నాలుగు విభిన్న ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సమీకరణాల్లో దాగి ఉన్నాయి. సీమాంచల్‌లోని మతపరమైన ఓటు బ్యాంకు, మిథిలాంచల్‌లోని ఈబీసీల మద్దతు, మగద్లోని దళిత ఓటర్లు, భోజ్పుర్లోని గ్రామీణ–పట్టణ వ్యత్యాసాలు అనే ఈ 4 అంశాలపైనే అధికార, విపక్ష కూటముల భవిష్యత్ ఆధారపడి ఉంది. నితీశ్ పాలనపై తీర్పుతో పాటు కుల, ప్రాంతీయ అస్తిత్వాల మధ్య జరుగుతున్న ఈ పోరు అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములకు అసలుసిసలు పరీక్ష పెడుతోంది. కుల సమీకరణాల పునాదులపై జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో, ఎన్డీఏ ‘డబుల్ ఇంజిన్’నినాదం, మహాగఠ్‌బంధన్ ‘సామాజిక న్యాయం’హామీ రెండూ పదునైన అ్రస్తాలే.సీమాంచల్: మహాగఠ్‌బంధన్ కోటలో ‘చీలిక’గండం సీమాంచల్‌లో కిషన్‌గంజ్, అరేరియా, పూరి్నయా, కతిహార్ అనే నాలుగు ఉపప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 28 స్థానాలున్నాయి సీమాంచల్ అనేది బిహార్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతం. కిషన్‌గంజ్‌లో దాదాపు 70 శాతం జనాభా ముస్లింలు కాగా, ఇతర జిల్లాల్లో 35–45 శాతం వరకు ఉంటారు. ఇది సహజంగానే ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. ‘ముస్లిం –యాదవ్’సమీకరణంలో ‘ముస్లిం’ఓటు బ్యాంకు ఇక్కడ అత్యంత బలంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలను గెలుచుకుని, మహాగఠ్‌బంధన్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఈసారి 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాగఠ్‌బంధన్ ఓట్ల ఏకీకరణే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీని ఓడించాలంటే తమ కూటమికి పడే ఓట్లు చీలకుండా కాపాడుకోవాలని మహాగఠ్‌బంధన్ చూస్తోంది. ఎంఐఎం అనేది బీజేపీ ‘బీ–టీమ్’అని, ఓట్లు చీల్చడానికే వచ్చిందని ప్రచారం చేస్తూ, తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మహాగఠ్‌బంధన్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎన్డీఏ పూర్తిగా మహాగఠ్‌బంధన్ ఓట్లు ఎంత ఎక్కువగా చీలితే తమకు అంత లాభం చేకూరుతుందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు గాలమేస్తోంది. మిథిలాంచల్: నితీశ్‌కు అసలు సిసలు అగ్నిపరీక్ష మిథిలాంచల్‌లో ప్రధానంగా దర్భంగా, మధుబని, సమస్తిపూర్, సహర్సా, సుపాల్, మధేపుర ప్రాంతాలున్నాయి. మొత్తంగా ఇక్కడ దాదాపు 50–60 స్థానాలున్నాయి. ఇది అత్యంత సంక్లిష్టమైన సామాజిక సమీకరణాలున్న ప్రాంతం. బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు (బీజేపీ ఓటు బ్యాంకు), యాదవులు (ఆర్జేడీ బలం) ఇక్కడ బలంగా ఉన్నారు. అయితే, ఫలితాలను శాసించేది మాత్రం ఈబీసీ (అత్యంత వెనుకబడిన వర్గాలు). మల్లా, టెలీ, ధానుక్ వంటి అనేక చిన్న కులాలు సీఎం నితీశ్ కుమార్‌కు అండగా నిలుస్తున్నాయి. అయితే ‘సన్ ఆఫ్ మల్లా‘గా పిలుచుకునే ముఖేశ్ సహానీకి నిషాద్ కమ్యూనిటీపై గట్టి పట్టుంది. ఈయన ప్రస్తుతం మహాగఠ్‌బంధన్ కూటమిలో ఉండటం వారికి కలిసి రానుంది. ఈ ప్రాంతంలో ఎన్డీఏ తన సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈబీసీలను కలుపుతోంది. నితీశ్‌ను ముందు నిలిపి ఈబీసీ ఓట్లను, అగ్రవర్ణాల ఓట్లను కొల్లగొట్టాలని ఎన్డీఏ ఆశపడుతోంది. ఈ కూటమి 2020లో మెరుగైన ప్రదర్శన చేసి 34 సీట్లు గెలుచుకుంది. మహాగఠ్‌బంధన్ మాత్రం ’సహానీ’తో ఎన్డీఏ ఓట్లకు గండి కొట్టే ప్లాన్ చేస్తోంది. ముస్లిం, యాదవ్‌లతోపాటు ఈసారి మల్లాలను, వామపక్ష పారీ్టలకు దగ్గరగా ఉన్న శ్రామిక వర్గాలను ఏకం చేయాలని విపక్షపారీ్టలు ఆశిస్తున్నాయి. నితీశ్‌పై ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈబీసీ ఓట్లను తమ వైపు తిప్పుతుందని మహాగఠ్‌బంధన్ గట్టిగా నమ్ముతోంది. ఇది నితీశ్ విశ్వసనీయతకు అసలైన పరీక్ష.మగధ్: ‘లెఫ్ట్’జోరుకు కళ్లెం! మగధ్ ప్రాంతంలో గయా, జెహానాబాద్, ఔరంగాబాద్, నవాడా, అర్వాల్ అనేవి ముఖ్యమైనవి. ఇక్కడ సుమారు 28 స్థానాలున్నాయి. మగధ్ ప్రాంతం ఆర్జేడీ, వామపక్షాలకు కంచుకోట. ఇక్కడ యాదవులు, దళితులు/మహాదళితులు (ముసహర్, పాశ్వాన్), భూమిహార్ల జనాభా ఎక్కువ. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. 2020లో ఎన్డీఏ ఇక్కడ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ప్రాంతంలోని 26 స్థానాల్లో మహాగఠ్‌బంధన్(ముఖ్యంగా ఆర్జేడీ, సీపీఐ –ఎంఎల్) ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఎన్డీఏలోని జితన్ రాం మాంఝీ (హెచ్ఏఎం పారీ్ట), చిరాగ్ పాశ్వాన్ (లోక్‌జనశక్తి– పాశ్వాన్) గత కొంతకాలంగా బలాన్ని పుంజుకుంటున్నారు. ఈ దళిత మిత్రుల సాయంతో 2020 నాటి ఓటమికి బదులు తీర్చుకోవాలని ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. గయా ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ (ముసహర్ నేత), చిరాగ్ పాశ్వాన్ (పాశ్వాన్ నేత) ద్వారా విపక్షాల దళిత ఓటు బ్యాంకును చీల్చాలని ఎన్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. మహాగఠ్‌బంధన్ మాత్రం ‘ఆర్జేడీ (యాదవ్), సీపీఐ–ఎంఎల్ (అణగారిన వర్గాలు/దళితులు) అనే విజయవంతమైన ఫార్ములాను నమ్ముకుంది. ఈసారి కూడా తమను అదే ఫార్ములా విజయతీరాలకు చేర్చనుందని బలంగా నమ్ముతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మగధ్ ప్రాంతంలో తప్పనిసరిగా మోదీ మ్యాజిక్ పనిచేయాల్సిందే. 2020లో గెలిచిన ఆరు సీట్లను పెంచుకుని ఈసారి కనీసం 15 సీట్లలో విజయపతాక ఎగరేస్తేనే అధికారంపై ఆశలు బలపడతాయి.భోజ్‌పూర్: నగరాలపై ‘కమలం’ఆశ భోజ్‌పూర్ పరిధిలో పట్నా, భోజ్‌పుర్(ఆరా), రోహ్తాస్, బక్సర్, కైమూర్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ మొత్తంగా దాదాపు 46 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రాజ్‌పుత్‌ల గడ్డగా పిలుస్తారు. అగ్రవర్ణాలలో రాజ్‌పుత్‌ల ఆధిపత్యం ఎక్కువ. ఆర్జేడీకి మద్దతుగా నిలబడే యాదవ్, జేడీయూకు మద్దతుగా నిలిచే కుర్మీ–కోయిరీల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో అధికంగా ఉంటుంది. పటా్నలోని పట్టణ ఓటర్లు (కాయస్థులు, బనియాలు) బీజేపీకి మద్దతునిస్తున్నారు. 2020లో మగధ్ లాగే భోజ్‌పుర్ గ్రామీణ ప్రాంతాల్లో మహాగఠ్‌బంధన్ అద్భుతమైన ప్రదర్శన చేసి 43 స్థానాలకు గాను ఏకంగా 30 చోట్ల విజయం సాధించడం విశేషం. ఇక్కడ పట్టు సాధించేందుకు ఎన్డీఏ పట్టణ ఓటును, అగ్రవర్ణాలను ఏకీకరణ చేస్తూనే ఈబీసీ, ఓబీసీలను కలుపుకుపోయే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. మహాగఠ్‌బంధన్ మాత్రం గ్రామీణ పట్టు నిలుపుకునే యత్నం చేస్తోంది. ఈ చతుర్ముక పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే ఫలితాల వెల్లడిదాకా ఆగక తప్పదు. -
తలరాతలు మార్చేస్తామంటున్న రాజకీయ పార్టీలు..?
-
ఎంపీ రవి కిషన్‌కి హత్యా బెదిరింపులు.. చంపేస్తామంటూ..
గోరఖ్‌పూర్: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. తమ వర్గాన్ని అనుమానించేలా రవి కిషన్ మాట్లాడారంటూ నిందితుడు ఆవేశంతో రగిలిపోయాడు. అయితే, ఈ బెదిరింపులపై ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ ఇలాంటి ఫోన్ కాల్స్‌కు తాను భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో, బెదిరింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ ఘటనలో నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్.. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ద్వివేది స్పందిస్తూ.. ‘రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. ఎంపీకి సంబంధించి ప్రతీ కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బీహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’ అని హెచ్చరించాడు. ఇదే సమయంలో ఎంపీని ఉద్దేశిస్తూ నిందితుడు పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని తెలిపారు.ఇదిలా ఉండగా, రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు, ఈ బెదిరింపు ఫోన్ కాల్‌పై గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ స్పందిస్తూ..‘నన్ను ఫోన్లో దుర్భాషలాడారు, నా తల్లి గురించి కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేస్తామని బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటాను. ఇటువంటి వ్యక్తులే సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేస్తారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది నా రాజకీయ వ్యూహం. ఇది నా వ్యక్తిగత గౌరవంపై ప్రత్యక్ష దాడి మాత్రమే కాదు.. మనందరిపై దాడి’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎవరి తలరాత మారుస్తారో?
ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బిహార్‌లో ముస్లిం ఓటర్లు సైతం పారీ్టల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం–యాదవ్ ఫార్ములానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని తమ వర్గానికి ఇవ్వకపోవడంతో వారిలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం అగ్గిని రాజేయనున్నాయో తెలియాల్సి ఉంది. ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు తమను మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విన్నపాన్ని పెడచెవిన పెట్టడం ఇండియా కూటమికి పరీక్షగా మారింది. అదే సమయంలో, ముస్లింలలోని వెనకబడిన కులాల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. మైనారిటీ వంతెన దాటాల్సిందే.. బిహార్‌లోని మొత్తం 10.41 కోట్లు జనాభాలో 1.75 కోట్ల ముంది ముస్లింలు అంటే 17.7 «శాతం మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 87 చోట్ల 20 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లింలున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది. బిహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలన ఉన్న ’సీమాంచల్’ప్రాంతం గురించే. కిషన్‌గంజ్, అరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్‌గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70శాతం కాగా, అరియా, కతిహార్, పూరి్ణయా జిల్లాల్లో 30–45శాతం వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహాట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50–60శాతం పైగా వీరే ఉన్నారు. గత ఎన్నికలే గుణపాఠం 2020 ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠ్‌బంధన్ ఓట్లను చీలి్చంది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహాట్, బహదూర్‌గంజ్, కోచాధామన్‌లలో జెండా ఎగరేసింది. ఈ ఐదు స్థానాల నష్టమే తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరినా ఆర్జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో, తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవడంపై కాంగ్రెస్‌కు ఉన్న అయిష్టత మరో కారణం. ఏకీకరణను నమ్ముకున్న ఇండియా కూటమి సీమాంచల్ వెలుపల, మైనారిటీలు 15– 25 శాతం వరకు ఉండే అనేక ’స్వింగ్’నియోజకవర్గాలు ఉన్నాయి. దర్భంగా, మధుబని (మిథిలాంచల్), సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో వీరు ఒంటరిగా గెలిపించలేరు, కానీ వీరి ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారు. ఇక్కడే ఆర్జేడీ అజేయమైన ముస్లిం–యాదవ్ సమీకరణం బలంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 17.7 శాతం ముస్లింలు, 14 శాతం యాదవులు కలిస్తే, అది దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీతో కలిసి ఉన్నందున ముస్లింలు తమతో కలిసిరారన్న కారణంతో జేడీయూ గతంలో 10 సీట్ల సంఖ్యను 6కు తగ్గించింది. చీలికపై నితీశ్ ఆశలు..! నితీశ్ కుమార్ ‘మహాగఠ్‌బంధన్’లో ఉన్నంత వరకు మైనారిటీ ఓటర్లకు అది సురక్షితమైన కూటమి. ఆర్జేడీ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకుకు, నితీశ్ ‘ఈబీసీ’ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ, నితీశ్ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉండడంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీశ్ కుమార్, బీజేపీతో ఉన్నప్పటికీ, మైనారిటీలలోని అట్టడుగు వర్గా లైన ‘పస్మాందా’(వెనుకబడిన కులాలు) ముస్లింలను ఆకట్టుకునే ప్రయ త్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ‘ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ (అష్రాఫ్) ముస్లింలకే పెద్ద పీట వేసింది, పస్మాందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డాం’అనేది నితీశ్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ ‘పస్మాందా’కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5–10శాతం చీల్చగలిగినా, అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠ్‌బంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందిఎంఐఎం ఆత్మగౌరవ నినాదం ఒవైసీ పార్టీ ‘ఓటు బ్యాంకు’గా ఉండటానికి బదులు, ‘సొంత రాజకీయ నాయకత్వం’కోసం పిలుపునిస్తోంది. ‘మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మిమ్మల్ని వాడుకున్నాయి’అనే అసదుద్దీన్ ఒవైసీ నినాదం సీమాంచల్‌లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి, 10–15 శాతం ఓట్లు చీల్చగలిగితే..అది నేరుగా ఎన్డీయేకు లాభం చేకూరుస్తుంది. సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
బిహార్‌కు కోటి వరాలు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌కు వారం రోజుల ముందు అధికార ఎన్డీయే రాష్ట్ర ప్రజలకు ‘కోటి’ వరాలు ప్రకటించింది. సంకల్ప పత్రం పేరిట తమ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. వలసలకు పేరుగాంచిన బిహార్‌లో యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచి్చంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కోటి మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టంచేసింది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తామని వెల్లడించింది. ఉచిత రేషన్, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు, సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తామంటూ హామీలు గుప్పించింది. యువత, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకొనేలా వరాల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజధాని పటా్నలో సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ జనశక్తి(రామ్‌విలాస్) పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, జేడీ(యూ)తోపాటు కూటమి నేతలు పాల్గొన్నారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు → బిహార్ యువతకు కోటి ప్రభుత్వ ఉద్యో గాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు. → కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య → ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం పొందేలా కోటి మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడం. → మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం. → ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు(ఈబీసీ) రూ.10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు. → కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్(కేటీకేఎస్) నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.9 వేల చొప్పున పెట్టుబడి సాయం. ఈ మొత్తం ఏటా మూడు విడతల్లో చెల్లింపు. → బిహార్‌లో 7ఎక్స్‌ప్రెస్ రహదారుల నిర్మాణం, 4 నగరాల్లో మెట్రో రైలు సేవల ఏర్పాటు. → ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక పార్కుల స్థాపన. → పేదలకు 50 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం → రూ.5,000 కోట్లతో పాఠశాలల అభివృద్ధి → 100 ఎంఎస్ఎంఈ పార్కులు, 50 వేలకుపైగా కాటేజీ పరిశ్రమలు → ప్రతి డివిజన్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు → ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నెలకు రూ.2,000 చొప్పున సాయం → అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు గ్యారంటీ -
ఛఠ్ పూజలను కించపర్చారు
చాప్రా/ముజఫర్‌పూర్: బిహార్‌లో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బిహార్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకొనే ఛఠ్ పూజలను ఆ కూటమి కించపర్చిందని మండిపడ్డారు. అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మించడం విపక్ష నేతలకు ఇష్టం లేదన్నారు. ఓటు బ్యాంకు కోసం చొరబాటుదారులను కాపాడుతున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. బిహార్‌లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీఏను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఛఠ్ పూజకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచి్చందని ఆనందం వ్యక్తంచేశారు. పవిత్రమైన ఈ పండుగపై కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి విషం కక్కుతోందని, డ్రామా అంటూ నిందలేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదు మన విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిపక్ష నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారు తీరిక చేసుకొని విదేశాలకు యాత్రలకు వెళ్తుంటారు తప్ప అయోధ్యలో రామమందిరాన్ని ఏనాడూ దర్శించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. ఛాయ్ అమ్ముకొని బతికిన ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కావడం చూసి విపక్ష నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని విమర్శించారు. తాను అలాంటి వారి దయ వల్ల ప్రధానమంత్రిని కాలేదన్నారు. -
అక్టోబర్ 31.. రాష్ట్రీయ ఏక్తా దివస్
పట్నా: ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏటా రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ నిర్వహించినట్టుగానే రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున గుజరాత్‌లోని ఏక్తా నగర్లో భారీ పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. సర్దార్ వల్లబ్భాయి పటేల్ 150 జయంతి (అక్టోబర్ 31)ని పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి భారత్ పర్వ్–2025 ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరేడ్ జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుంది. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభిస్తున్న ఈ పరేడ్ ఏటా అక్టోబర్ 31న ఘనంగా జరుగుతుంది. ఈ పరేడ్ సర్దార్ పటేల్ సిద్ధాంతాలు, ఆయన సేవలను నేటి తరానికి తెలియజేసేలా ఉంటుంది. శుక్రవారం నిర్వహించే పరేడ్‌లో మహి ళా కంటింజెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు, పారా మిలిటరీ పరేడ్ల వంటివి ఉంటాయి’అని షా వెల్లడించారు. 15 రోజులు భారత్ పర్వ్ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత్ పర్వ్–2025 ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 1న ప్రారంభమై ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి రోజైన నవంబర్ 15 వరకు గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (పటేల్ భారీ విగ్రహం) వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్కడే పటేల్ 150వ జయంతి వేడుకలను కూడా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని వెల్లడించారు. -
రెబల్స్‌తో ట్రబుల్స్
అసంతృప్తుల బుజ్జగింపు బిహార్‌లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. తొలి దశ ఎన్నికలు జరిగే 121 స్థానాల్లో 24 చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులున్నారు. ఎన్డీయే, ఇండియా కూటములకు వీరు సవాలుగా మారారు. దీంతో, సంకీర్ణ పొత్తుల పోరాటంలో ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరుగుతుందనే ఆందోళన పార్టీలను వెంటాడుతూనే ఉంది. పొత్తుల కారణంగా సీట్లు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అన్ని పార్టీల నేతలకు వచ్చింది. అయితే దీన్ని వారు సానుకూలంగా తీసుకోవడం లేదు. తాము చేస్తున్నది స్నేహ పూర్వక పోటీ మాత్రమేనని కొంతమంది రెబల్స్ చెబుతున్నారు. 2020 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు సాధ్యమైంది. ఈ 11 స్థానాల్లో నూ తిరుగుబాటు అభ్యర్థులు 40 నుంచి 50 వేల ఓట్లు సాధించారు. వీరంతా ప్రధాన పార్టీలు టికెట్ నిరాకరించడంతో పోటీకి దిగిన వారే. సత్తా చూపేందుకేనా?సంకీర్ణ రాజకీయాలే బిహార్‌లో తిరుగుబాటు అభ్యర్థులకు తెగింపు నిస్తున్నాయనేది పట్నాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు జగదీవ్ పూరీ అభిప్రాయం. ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్పీ ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, వామపక్ష పార్టీలున్నాయి. ఇవి కాకుండా జన్‌సురాజ్, బీఎస్పీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలూ పోటీ చేస్తున్నాయి. కూటముల మధ్య పొత్తుల కారణంగా సీట్ల సర్ధుబాటు అనివార్యమైంది. దీంతో ఐదేళ్లుగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్న నేతలకు సీట్లు దక్కలేదు. మౌనంగా ఉండిపోతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారని ఎన్డీయే పక్షంలో సీటు రాని మధోల్ తెలిపారు. తమకు ప్రజాబలం ఉన్నప్పటికీ అగ్ర నేతలను ఆర్థికంగా లోబర్చుకున్నారనేది ఆయన ప్రత్యర్థులపై చేసే ఆరోపణ. అధిష్టానం బుజ్జగించినా రెబల్స్ వినేట్టు లేదని పలువురు నేతలు చెబుతున్నారు. బరి నుంచి తప్పుకున్నా, నష్టం చేయడానికి వారు మొగ్గు చూపడం పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవర పెడుతోంది. రెబల్స్ తాకిడి ఉన్న స్థానాలు→ మాంఝీ స్థానంలో బీజేపీ రెబల్ రాణా ప్రతాప్ డబ్ల్యూ సవాల్‌గా మారారు. జేడీయూ అభ్యర్థి రణధీర్ సింగ్‌ను ఓడించడం లక్ష్యంగా చెబుతున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సత్యేంద్ర యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు.→ గరౌలిలో ఆర్జేడీ దిలీప్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఆర్జేడీ అభ్యర్థి రేయాజుల్ హక్ రాజు టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు స్వరం విన్పిస్తున్నారు. → సతావ్పూర్ కమల్ నుంచి ఎల్జేపీ అభ్యర్థి సురేంద్ర వివేక్‌పై జేడీయూ నేత శశికుమార్ అలియాస్ అమర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే సంతానంద్ సంబుద్ధ పోటీలో ఉన్నారు.→ జమాల్‌పూర్‌లో మాజీ మంత్రి శైలేష్ కుమార్ జేడీయూను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీయూ నచికేత మండల్‌ను నామినేట్ చేసింది. వీఐపీకి చెందిన నరేంద్ర తంతి బరిలో ఉన్నారు.→ చరివవారియార్పూర్లో ఆర్జేడీ నేత రామ్సఖా మహతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ అభ్యర్థి సుశీల్ కుష్వాహాను ఎదుర్కొంటున్నారు. జేడీయూ అభ్యర్థి అభిషేక్ కుమార్ పోటీ చేస్తున్నారు.→ జాలే స్థానం నుంచి రిషి మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి. చివరి నిమిషంలో ఆర్జేడీ నుంచి కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. 2020లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మక్సూద్ అహ్మద్ ఉస్మానీ తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంత్రి, బీజేపీ నాయకుడు జీవేత్ ఇక్కడ పోటీ చేస్తున్నారు.→ బస్విధలో జేడీయూ ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్ పార్టీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జేడీయూ డాక్టర్ పుష్పంజయ్ కుమార్‌ను, కాంగ్రెస్ త్రిశుల్ధారి సింగ్‌ను బరిలోకి దించాయి.→ మహ్నార్లో ఆర్జేడీ స్విందర్ సింగ్‌ను బరిలోకి దింపింది. ఆర్జేడీకి చెందిన సంజయ్ రాయ్ రెబల్‌గా మారారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అచ్యుతానంద సింగ్ (కాంగ్రెస్‌ను వీడి) పరాస్‌కు చెందిన ఆర్ఎల్ఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.→ ఛప్రా నుంచి బీజేపీ అభ్యర్థి రాఖీ గుప్తా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఛోటీ కుమారికి పెద్ద సవాల్‌గా మారారు. ఆర్జేడీ నుంచి ఖేసరీ లాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.→ జగదీష్పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్ విష్ణు లోహియా కుమారుడు కిషోర్ కునాల్‌కు టికెట్ ఇచ్చారు. రాజీవ్ రంజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.→ గోపాల్‌గంజ్‌లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అనూప్లాల్ శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సుభాష్ సింగ్‌ను నిలబెట్టింది. → బచ్వారలో బీజేపీ నేత శత్రుఘ్న కుమార్ ఆ పార్టీ అభ్యర్థి సురేంద్ర మెహతాపై తిరుగుబాటుదారు. అతను ఇప్పుడు పార్టీ ఇబ్బందులను మరింత పెంచుతున్నాడు.→ సూర్యగఢలో ఎల్జేపీ ఆర్జేడీకి చెందిన అశోక్ సింగ్ అని పిలిచే రవిశంకర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన జేడీయూకి చెందిన రామానంద్ మండల్‌ను ఎదుర్కొంటారు. ఆర్జేడీ నుంచి ప్రేమ్ సాగర్ చౌదరి పోటీ చేస్తున్నారు. వనం దుర్గా ప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రతినిధి) -
రాహుల్ తన ఇటలీ మూలాలు బయటపెట్టారు: అమిత్ షా
నలంద/లఖీసరాయ్: బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీని బీజేపీ అగ్రనేత అమిత్ షా లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఛాత్ పండుగ వేళ ఛాత్మాతను ప్రారి్థస్తున్నట్లు ప్రధాని మోదీ నాటకం ఆడుతున్నారని రాహుల్ బాబా ఆరోపించారు. ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీకి భారతీయ సనాతన విశ్వాసాలను పొగిడేంత కనీసం అర్హత కూడా లేదు. గతంలోనూ మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు. ఈ అవమానాలకు బదులు తీర్చేకునేలా ఈవీఎం బటన్లపై ఎన్డీఏ గుర్తులున్న చోట్ల శక్తిమేరకు గట్టిగా ఒత్తండి. ఎంత బలంగా ఒత్తాలంటే ఆ ధాటికి ఇటలీలో భూప్రకంపనలు రావాలి’’అని అన్నారు. కాంగ్రెస్‌పైనా అమిత్ విమర్శలు గుప్పించారు. ‘‘ఐదు శతాబ్దాల అయోధ్య నిర్మాణ కలను కాంగ్రెస్ 70 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సుసాధ్యం చేయలేకపోయింది. నలందలో ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గతంలో మాదిరి ఆనాటి జ్ఞానభాండాగారాలను ఏ ముఖ్తియార్ ఖిల్జీ కూడా నాశనంచేయలేడు’’అని అమిత్ వ్యాఖ్యానించారు. తారాపూర్‌లో బీజేపీ అభ్యరి్థ, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి త్వరలో సీఎం అయ్యే అవకాశాలున్నాయని అమిత్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. ‘‘చౌదరికి ఓటేయండి. త్వరలో ప్రధాని మోదీ ఈయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు’’అని అన్నారు. -
యుద్ధం ఆపానన్న ట్రంప్‌తో మోదీ వాదనలో గెలవలేరు
షేక్‌పురా(బిహార్): ఆపరేషన్ సిందూర్ వేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వాదనలకు అడ్డుకట్ట వేసే ధైర్యం ప్రధాని మోదీకి అస్సలు లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా గురువారం నలంద, షేక్‌పురాలో సభలో రాహుల్ ప్రసంగిస్తూ మోదీపై విమర్శల వాగ్భాణాలు సంధించారు. ‘‘తన కారణంగానే భారత్, పాక్ యుద్ధం ఆగిందని ఇప్పటికే ఎన్నో సార్లు ట్రంప్ అంతర్జాతీయ వేదికలపై డప్పు కొట్టారు. ఆయన ప్రకటనలను ప్రధాని మోదీ కనీసం అడ్డుకునే సాహసం చేయట్లేరు. మీరు మాట్లాడేది అబద్ధం అని మాట వరసకు కూడా ట్రంప్‌కు చెప్పే ధైర్యం మోదీకి లేదు. ఇటీవల కాలంలో మోదీ అమెరికాకు వెళ్లాల్సింది. కానీ ట్రంప్ భయానికే ఆయన అమెరికా వైపు కన్నెత్తి చూడట్లేరు. నిజంగానే మోదీకి అంతటి ధైర్యం ఉంటే బిహార్ ఎన్నికల ర్యాలీల్లో యుద్ధం ఆపింది ట్రంప్ కానేకాదు అని మోదీ కరాఖండీగా ప్రకటించాలి’’అని రాహుల్సవాల్ విసిరారు. ధైర్యశాలి ప్రధాని అంటే మా నాన్నమ్మే ‘‘నిజానికి ప్రధాని అంటే ఎంతటి ధైర్యశాలిగా ఉండాలో మా నాన్నమ్మ, నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. 1971లో నాటి అమెరికా అధ్యక్షుడితో ఇందిర సూటిగా ‘మాకు మీరంటే ఏమాత్రం భయంలేదు’అని ముఖం మీదే చెప్పేశారు. ఆమె తెగింపు గల నాయకురాలు’’అని ఇందిరను రాహుల్ గుర్తుచేసుకున్నారు. బిహార్‌లో భూములు అందుబాటులో లేవన్న అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘బడా పారిశ్రామిక సంస్థకు చవగ్గా భూములు అమ్మేస్తూ పోతే ఇక భూముల లభ్యత ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు.


