పట్నా: తండ్రి నుంచి కుమారులకు ఆస్తిపాస్తులు వారసత్వంగా వస్తుంటాయి. కానీ బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు తండ్రి పరిపాలనాకాలం నాటి ఆటవికపాలన తాలూకు మాయని మచ్చలు అలాగే అంటుకుపోయాయి. జంగిల్‌రాజ్‌గా పేరుమోసిన లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనాకాలంనాటి చేదు జ్ఞాపకాలు చివరకు తేజస్వీయాదవ్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశాయి.
ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఆటవికపాలనకు ఆవాహన పలికినట్లేనని ఎన్‌డీఏ కూటమి చేసిన ప్రచారం బాగా పనిచేసి అది చివరకు మహాగఠ్‌బంధన్ కూటమికి ఓట్లు రాలకుండా చేసింది. దీంతో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కల కలగానే మిగిలిపోయింది. స్నేహితుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీతో కలిసి చేసిన జంట భారీ ర్యాలీలు సైతం జనాల మనసులను మార్చలేకపోయాయి.
బిహార్ కీలకనేత కుమారునిగా రాజకీయ అరంగేట్రం అత్యంత సులభంగా జరిగినా ఎన్నికల రణరంగంలో గెలవడం అంతతేలికకాదని తేజస్వీకి శుక్రవారం నాటి ఫలితాలు రుచిచూపించాయి. మహాగఠ్‌బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యరి్థగా తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించినప్పుడే కూటమిలోని కొందరు నేతలకు ఈ నిర్ణయం రుచించలేదు. సీఎం అభ్యర్థికి వ్యక్తిగత కరిష్మా తోడవ్వాల్సిందిపోయి కుటుంబ అప్రతిష్ట ఈయన గెలుపునకు అవరోధంగా మారొచ్చనే అనుమానాలకు ఆనాడే బీజాలు పడ్డాయి. ఇవి ఇప్పుడు నిజమయ్యాయని కొందరు రాజకీయనేతలు విశ్లేíÙస్తున్నారు.
క్రికెట్‌కు గుడ్‌బై.. ఎన్నికల్లో కొత్త ఇన్నింగ్స్
రాష్ట్రవాళీ క్రికెటర్ అయిన తేజస్వీ పదేళ్ల క్రితం తనకిష్టమైన ఆటకు స్వస్తిపలికారు. తన అసలైన రాజకీయ వారసుడు తేజస్వీ అని భావించిన మరుక్షణమే లాలూ ఈయనతో రాజకీయరంగ ప్రవేశం చేయించారు. మిత్రధర్మం పాటించి కాలంలో జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు నితీశ్ సర్కార్‌లో తేజస్వీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే కేంద్రంలో యూపీఏ–1 పరిపాలనాకాలంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్
యాదవ్ భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు
ఇచ్చాడనే కేసులో తేజస్వీ పేరు సైతం జతకూడడంతో తేజస్వీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. విచిత్రంగా ఆ అవకతవకల నాటికి తేజస్వీ ఇంకా టీనేజీ పిల్లాడు కావడం గమనార్హం. అయితే తర్వాత తేజస్వీ రాజకీయాల్లో అడుగుపెట్టడం 2020 బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఏకంగా 75 సీట్లు సాధించంతో ఈయన పేరు మార్మోగిపోయింది. ఆ హవాను తాజా ఎన్నికల్లో తేజస్వీ కొనసాగించలేకపోయారు. ఆర్జేడీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి వస్తే జంగిల్‌రాజ్ పునరావృతమవుతుందన్న బీజేపీ ప్రచారాన్ని తేజస్వీ బలంగా తిప్పికొట్టలేకపోయారు.


