తెలంగాణ రాష్ట్ర ఐకానిక్ గీతం "జయ జయ హే తెలంగాణ" రచయిత, ప్రఖ్యాత కవి అందె శ్రీ (Ande Sri )ఆకస్మిక మరణంపై ప్రధానమంత్ర నరేంద్ర మోదీ ( Narendra Modi) సంతాపం వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.
‘‘అందెశ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను, సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అంటూ ట్వీట్ చేశారు.
(Ande Sri: చివరి కోరిక తీరకుండానే.. వెళ్లిపోయావా ఎల్లన్నా!)
అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే…
— Narendra Modi (@narendramodi) November 10, 2025
కాగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో అనారోగ్యానికి గురైన అందెశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తెలంగాణకు ఇది విచారకరమైన రోజు అంటూ పలువురు సాహిత్య, సంగీత అభిమానులు సంతాపం తెలిపారు. శక్తివంతమైన మాటల ద్వారా తెలంగాణకు ఆత్మీయ స్వరాన్ని అందించిన కవి అందేశ్రీ మరణం పట్లపై పలువురురాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు తరతరాలుగా స్ఫూర్తినిస్తాయంటూ అందెశ్రీ కుటుంబానికి, అభిమానులకు హృదయపూర్వక సంతాపం తెలిపారు.


